సాక్షి, ఢిల్లీ: మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ ప్రారంభించారు. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్ సాగర్‌రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు.
డీకే శివకుమార్‌ను కలిసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. మంత్రి పదవి కోసం విజ్ఞప్తి చేశారు. ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే డీకేను కలిశానని, కాంగ్రెస్ అధిష్టానం మేరకు నడుచుకుంటామని తెలిపారు. మంత్రి పదవిని ఇస్తే తీసుకుంటా.. ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేశా.. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని శ్రీధర్‌బాబు తెలిపారు. అధిష్టానమే మంత్రి పదవుల్ని నిర్ణయిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు.
నిన్న సీఎం ప్రకటన తర్వాత సీనియర్లందరికీ న్యాయం జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాంగ్రెస్ నాయకులంతా కలిసి పని చేయాలని ఖర్గే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment