Ministerial
-
ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు జరపలేదని చెబుతున్నారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే దానిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డామని, ఎంతో చేశామని తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. నేరుగా ఆయన్ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. లోకేశ్ చుట్టూ చక్కర్లు..చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్ పార్టీలో కీలకంగా ఉండడంతో అనేకమంది ముందు ఆయన్ను కలుస్తున్నారు. ఎన్నికలకు ముందు లోకేశ్ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వారంతా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. నిత్యం ఆయన్ను కలుస్తూ తమ గురించి ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అయితే, ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఎవరికీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. జనసేన, బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుండడం, టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఇంకా ఏమీ ఆలోచించలేదని సర్దిచెబుతున్నారు. తమ సంగతి చూడాలంటున్న సీనియర్లు..ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెడతారని చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని, ఈసారి ఎలాగైనా మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతలు ఈ కోవలో ఉన్నారు. సామాజికవర్గ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో పార్టీ కోసం పనిచేసిన తమకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఒత్తిడి తెస్తున్నారు.లోకేశ్‌పై ఆశలు పెట్టుకున్న జూనియర్లు..మరోవైపు.. లోకేశ్ అండతో పార్టీలో ఎదిగిన నేతలు, ఆయన ద్వారా సీటు దక్కించుకుని గెలిచిన జూనియర్లు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతుండడం చర్చనీయాంశమైంది. పెదకూరపాడు నుంచి గెలిచిన భాష్యం ప్రవీణ్ వంటి నేతల ఇలాంటి వారిలో ఉన్నారు. అయితే, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని చూస్తామని మాత్రమే లోకేశ్ చెబుతున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులకు సైతం ఇప్పటివరకు మంత్రి పదవుల హామీ లభించలేదు. సాధారణంగా అయితే చంద్రబాబు ఈపాటికి మంత్రి పదవుల కోసం అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణలు, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికగా కసరత్తు చేయాల్సి వుంది. కానీ, ఇప్పుడు అదేమీ లేకపోవడంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఆయన మనసులో ఏముందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీనియర్లు తమకు అవకాశం వస్తుందా? లేదా? అని చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారి నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రివర్గం, కీలక పదవుల గురించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడంతో పార్టీ నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు. -
జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జనసేన పార్టీకి నాలుగుకు తక్కువకాకుండా మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ఆ పార్టీకి చంద్రబాబు నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి దక్కే పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి కేటాయించే పదవులను బట్టి జనసేనకు ఐదో మంత్రి పదవి ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.నిజానికి.. కేంద్రమంత్రి పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలోనూ ఏ పార్టీకి ఎన్ని పదవులన్న దానిపై శనివారమే కొంత స్పష్టత వస్తుందని భావించినప్పటికీ.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇద్దరూ రాజకీయేతర కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఇరువురి మధ్య ఈ అంశం చర్చకు రాలేదని జనసేన వర్గాలు తెలిపాయి. మరోవైపు.. రాష్ట్ర కేబినెట్లో జనసేన నుంచి అధినేత పవన్‌కళ్యాణ్‌తో పాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పక ఉంటారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే, జనసేనలో మిగిలిన పదవులు ఎవరికన్నది టీడీపీలో మంత్రి పదవుల కేటాయింపుపై ఆధారపడి ఉంది. అయితే, పవన్ ఇప్పటివరకు ఎవరికీ మంత్రి పదవులపై హామీ ఇవ్వలేదని.. చంద్రబాబుతో భేటీ అనంతరమే ఆయన ఆ వివరాలు వెల్లడిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది.వీరే ఆశావహులు.. ఈ ఎన్నికల్లో జనసేన పోటీచేసిన మొత్తం 21 స్థానాల్లో 15 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోనే పోటీచేసింది. దీంతో.. పవన్, నాదెండ్లకు కాకుండా జనసేనకు ఇంకెన్ని మంత్రి పదవులు దక్కినా అవి ఆ మూడు జిల్లాలోని వారికే ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జనసేనకు ఐదో మంత్రి పదవి దక్కిన పక్షంలో విజయనగరం జిల్లా నెలిమర్ల నుంచి గెలిచిన లోకం నాగమాధవి లేదా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇక జనసేనలో కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, దేవవరప్రసాద్, కందుల దుర్గేష్, బొమ్మిడి నారాయణ నాయకర్ మంత్రి పదవుల రేసులో ఉన్నారు. -
TS: ఎవరికి వారే.. మంత్రి పదవుల కోసం ఢిల్లీలో లాబీయింగ్
సాక్షి, ఢిల్లీ: మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ ప్రారంభించారు. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్ సాగర్‌రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. డీకే శివకుమార్‌ను కలిసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. మంత్రి పదవి కోసం విజ్ఞప్తి చేశారు. ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే డీకేను కలిశానని, కాంగ్రెస్ అధిష్టానం మేరకు నడుచుకుంటామని తెలిపారు. మంత్రి పదవిని ఇస్తే తీసుకుంటా.. ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేశా.. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని శ్రీధర్‌బాబు తెలిపారు. అధిష్టానమే మంత్రి పదవుల్ని నిర్ణయిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. నిన్న సీఎం ప్రకటన తర్వాత సీనియర్లందరికీ న్యాయం జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాంగ్రెస్ నాయకులంతా కలిసి పని చేయాలని ఖర్గే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు -
మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే..
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ పరాయి దేశాల్లో భారత ప్రతిష్ట దిగజార్చడం ఆయనకు అలవాటని చేసిన విమర్శలకి గట్టి కౌంటర్ ఇస్తూ.. ఆ ట్రెండ్ మొదలు పెట్టింది ఎవరో తెలుసుకుని మాట్లాడమని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జైరాం రమేష్ అన్నారు. ముందు తెలుసుకో.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కాస్త ఘాటుగానే స్పదించారు. భారత దేశ రాజకీయ వ్యవహారాల గురించి ప్రపంచ వేదికల మీద మాట్లాడింది నీకు మంత్రి పదవినిచ్చిన పెద్దమనిషే. ఆ విషయం నీకు తెలిసినా కూడా ధైర్యంగా ఒప్పుకోలేవని ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. మీరేం చేసినా అధికారం మాదే.. రాహుల్ గాంధీ ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ దేశ రాజకీయాల గురించి ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. ప్రపంచమంతా మనవైపు చూస్తున్నప్పుడు వారేమి చూస్తున్నారనేది ముఖ్యం? ఎలక్షన్లు జరుగుతాయి, ఒకసారి ఒక పార్టీ గెలిస్తే మరోసారి మరో పార్టీ గెలుస్తుంది. ప్రజాస్వామ్యం లేకుంటే అటువంటి మార్పు జరగదు. 2024లో కూడా ఫలితమేమీ మారదు. దేశంలో ఆయన ఏమైనా చేయనీయండి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము. దేశ అంతర్గత వ్యవహారాలను దేశాంతరాలకు తీసుకెళ్లడాన్ని ప్రజలు సహించరని అన్నారు. The man who started the practice of taking national politics outside the country is none other than the man who gave you your ministerial position. You know it but you cannot acknowledge it Dr. Minister. https://t.co/FE6nZAujM1 — Jairam Ramesh (@Jairam_Ramesh) June 8, 2023 ఇది కూడా చదవండి: మిస్‌వరల్డ్ పోటీలకు వేదికగా భారత్.. ఎంపిక జరుగుతుందిలా.. -
మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి చకచక ఏర్పాట్లు