న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ పరాయి దేశాల్లో భారత ప్రతిష్ట దిగజార్చడం ఆయనకు అలవాటని చేసిన విమర్శలకి గట్టి కౌంటర్ ఇస్తూ.. ఆ ట్రెండ్ మొదలు పెట్టింది ఎవరో తెలుసుకుని మాట్లాడమని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జైరాం రమేష్ అన్నారు.
ముందు తెలుసుకో..
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కాస్త ఘాటుగానే స్పదించారు. భారత దేశ రాజకీయ వ్యవహారాల గురించి ప్రపంచ వేదికల మీద మాట్లాడింది నీకు మంత్రి పదవినిచ్చిన పెద్దమనిషే. ఆ విషయం నీకు తెలిసినా కూడా ధైర్యంగా ఒప్పుకోలేవని ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు.
మీరేం చేసినా అధికారం మాదే..
రాహుల్ గాంధీ ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ దేశ రాజకీయాల గురించి ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. ప్రపంచమంతా మనవైపు చూస్తున్నప్పుడు వారేమి చూస్తున్నారనేది ముఖ్యం? ఎలక్షన్లు జరుగుతాయి, ఒకసారి ఒక పార్టీ గెలిస్తే మరోసారి మరో పార్టీ గెలుస్తుంది. ప్రజాస్వామ్యం లేకుంటే అటువంటి మార్పు జరగదు. 2024లో కూడా ఫలితమేమీ మారదు. దేశంలో ఆయన ఏమైనా చేయనీయండి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము. దేశ అంతర్గత వ్యవహారాలను దేశాంతరాలకు తీసుకెళ్లడాన్ని ప్రజలు సహించరని అన్నారు.
The man who started the practice of taking national politics outside the country is none other than the man who gave you your ministerial position. You know it but you cannot acknowledge it Dr. Minister. https://t.co/FE6nZAujM1
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 8, 2023
ఇది కూడా చదవండి: మిస్‌వరల్డ్ పోటీలకు వేదికగా భారత్.. ఎంపిక జరుగుతుందిలా..
Comments
Please login to add a commentAdd a comment