సాక్షి, నిజామాబాద్ : ఎన్నికల నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి ఒకే పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్‌హెచ్‌ఓలకు ఎన్నికల ముందు స్థానచలనం తప్పనిసరి. దీనికి తోడు జిల్లాలో పనిచేస్తున్న 25 మంది ఎస్‌ఐల ప్రొబెషనరీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది. వీరికి పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. దీంతో జిల్లాలో ఎస్‌ఐల బదిలీలు అనివార్యం కానున్నాయి. ఎస్‌పీ తరుణ్ జోషి ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ బదిలీల్లో మంచి పోస్టింగ్‌ల కోసం కొందరు ఎస్‌ఐలు పైరవీ లు షురూ చేశారు. వీరు అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు జిల్లాలో పలువురు ఎస్‌ఐల పనితీరుపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు లేని ఎస్‌ఐలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. కొందరిపై ఎస్‌పీ స్థాయిలో ఫిర్యాదులుంటే, మరికొందరిపై డీజీపీ స్థాయి లో ఉన్నాయి. నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలున్న పలువురు ఎస్‌ఐలపై ఎస్‌పీ చర్యలు తీసుకుం టారా అన్నది తేలాల్సి ఉంది. అయితే పనితీరు సరిగాలేని సిబ్బందికి ఎస్‌పీ మెమోలివ్వడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.
కాసులు కురిపించే స్థానాలకోసం
జిల్లాలో కాసులు కురిపించే పలు స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం పలువురు ఎస్‌ఐలు తహతహలాడుతున్నారు. నిజామాబాద్ వన్‌టౌన్, నిజామాబాద్ రూరల్, డిచ్‌పల్లి, నందిపేట్, ఆర్మూ ర్, బాల్కొండ, భీంగల్, కామారెడ్డి, దేవునిపల్లి, భిక్కనూరు, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బీర్కూర్, బోధన్ తదితర స్టేషన్లలో పోస్టింగ్‌లకు డిమాండ్ ఎక్కువ. గతంలో పలుమార్లు జరిగిన బదిలీల్లో కాసులు కురిపించే స్టేషన్లలో పోస్టింగ్ కోసం నేతలకు లక్షల రూపాయలు సమర్పించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఎస్‌ఐల బదిలీ లు కూడా నేతల కనుసన్నల్లో జరిగినట్లు విమర్శలొచ్చాయి. సిఫార్సులను పక్కన బెట్టి జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను సైతం పోలీసు బాసు లు వెనక్కి తీసుకున్న దాఖలాలున్నాయి. దీంతో ఈసారి బదిలీల ప్రక్రియపై పోలీసుల్లో చర్చ జరుగుతోంది. ఎస్‌పీ ఒత్తిడులకు తలొగ్గుతారా? లేక పారదర్శకంగా బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.
పైరవీలు షురూ
Published Mon, Dec 23 2013 3:12 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM
Advertisement
Advertisement