ముడుపులు.. సిఫార్సులకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా సుమారు 1,000 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసింది. సిఫార్సులకే బదిలీల్లో పెద్దపీట వేశారు. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారిందని సమాచారం. బదిలీల ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలపడంతో.. జాబితాను సోమవారం జిల్లాలకు పంపించారు. మొదటి నుంచీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తి గోప్యతను పాటిం చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలతో పాటు భారీగా సొమ్ము ముట్టజెప్పిన వారికే బదిలీలు అయ్యాయని.. నిజంగా అనారోగ్య కారణాలు, కుటుంబ సమస్యలున్న వారి విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వెంటనే నిలిపివేయాలి: యూటీఎఫ్
టీచర్ల అక్రమ బదిలీలను వెంటనే నిలిపివేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి, వైద్యుల ప్రోత్సాహకాలకు హెల్త్‌కార్డుల ప్యాకేజీ వ్యయంలో 55% కేటాయించడం అన్యాయమని విమర్శించింది. ఉద్యోగుల సొమ్మును నూరు శాతం చికిత్సకే కేటాయించాలని కోరింది.
గుట్టుచప్పుడు కాకుండా టీచర్ల బదిలీలు..
Published Tue, Feb 4 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
Advertisement