Teachers transfer
-
టీచర్లందరికీ బదిలీ చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులందరికీ బదిలీ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ప్రారంభమైన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. 317 జీవో ద్వారా కొంతకాలం క్రితం కొత్త జిల్లాలకు వెళ్లిన దాదాపు 25 వేలమంది టీచర్లు ఈ నెల 12 నుంచి 14 వరకూ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ గత నెల 27న విడుదలైంది. ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న స్కూల్లో కనీసం రెండేళ్ల సర్వీసు ఉంటేనే బదిలీకి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో 59 వేల మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరి ధ్రువపత్రాలను డీఈవోలు పరిశీలించారు. సీనియారిటీ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే 317 జీవో ద్వారా బదిలీ అయి న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వడంతో బదిలీల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లు ఉమ్మడి జిల్లాల్లో పనిచేసిన సర్వీసును కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పైరవీ టీచర్లలో గుబులు బదిలీల్లో ఉన్న కొన్ని ఆప్షన్లను ఉపయోగించుకుని అడ్డగోలుగా పైరవీ బేరాలు కుదుర్చుకున్న కొంత మంది టీచర్లలో తాజా పరిణామాలు గుబులు పుట్టిస్తున్నాయి. టీచర్లు లేదా వారి కుటుంబంలోని వారికి దీర్ఘకాలిక వ్యాధులుంటే వైద్య సేవల కోసం కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకునే వెసులుబాటు మార్గదర్శకాల్లో పొందుపరిచారు. వాస్తవానికి అనేక మంది ఈ కోటాను దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అనారోగ్య కోటా కింద దరఖాస్తు చేసిన వారికి కూడా సీనియారిటీని బట్టి ప్రాధాన్యతనిస్తారు. ఈ ప్రక్రియలో కొంతమంది తప్పుడు సర్టిఫికెట్లతో పైరవీలు చేయించుకున్నట్టు, దీని కోసం మధ్యవర్తులకు రూ. లక్షల్లో ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా 317 జీవో టీచర్లకు కూడా అనారోగ్య కోటా వర్తించనుంది. దీంతో ఈ కోటాలో తమ సీనియారిటీ మారుతుందేమోననే ఆందోళన పైరవీలు చేసుకున్న ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. అలా చేస్తే క్రెడిట్ మనకే వచ్చేదిగా.. బదిలీల మార్గదర్శకాల్లో జీరో సర్వీసు నిబంధన ఉండాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. కానీ పాఠశాల విద్యా డైరెక్టర్ ఇందుకు అడ్డుపడ్డారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశం మంత్రి వద్ద మంగళవారం చర్చకు వచ్చినట్టు తెలిసింది. మనమే జీరో సర్వీస్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని మంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో అమలు చేస్తున్నారు తప్ప, ప్రభుత్వం ఔదార్యంతో వ్యవహరించిందనే క్రెడిట్ రాదు కదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
పైరవీ ‘సార్ల’దే రాజ్యం!
►కరీంనగర్ నుంచి మేడ్చల్‌లోని ఓ స్కూల్‌కు ఓ టీచర్‌ను పైరవీతో బదిలీ చేశారు. నిజానికి ఆ టీచర్ సోషల్ సబ్జెక్టు చెప్పే టీచర్. కానీ ఆ స్కూల్లో ఆ సబ్జెక్టులో ఖాళీల్లేవు. ఇలాంటప్పుడు ఖాళీల్లేవని తిప్పి పంపాలి. కానీ ఖాళీ ఉన్న ఇంగ్లిష్ పోస్టులో ఇరికించేశారు. ఇదే జిల్లాలో మరో రెండు బడుల్లో సోషల్ సబ్జెక్టు పోస్టుల్లో ఇతర సబ్జెక్టు టీచర్లను తెచ్చారు. ►బదిలీల షెడ్యూల్ వెలువడకుండానే రంగారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన టీచర్‌ను హయత్ నగర్ మండలానికి బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో రూ.10 లక్షలు చేతులు మారినట్టు తెలిసింది. మరో టీచర్ నారాయణ పేట నుంచి మేడ్చల్ జిల్లాకు రూ.8 లక్షలు మధ్యవర్తి ద్వారా ఇచ్చి బదిలీ చేయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: బదిలీల్లో ఇలా పైరవీలకు పెద్దపీట వేయడం టీచర్లలో కలకలం రేపుతోంది. ఒకవైపు షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తూనే, మరోవైపు అడ్డగోలుగా పోస్టింగ్‌లు ఇవ్వడంపై గగ్గోలు పెడుతున్నారు. ఇది ప్రక్రియను ఆపహా స్యం చేయడమేనని టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటివరకూ దాదాపు 200 మందిని నిబంధనలకు విరుద్ధంగా వాళ్లు కోరుకున్న స్కూళ్లకు పోస్టింగ్ ఇచ్చినట్టు సంఘాల నేతలు చెబుతున్నారు. నేరుగా ప్రభుత్వపెద్దల నుంచే సిఫార్సు లు వస్తున్నాయని, వాటిని ఉన్నతాధికారులు సంబంధిత డీఈవోలకు పంపుతున్నారని అంటున్నారు. డీఈవోలు ఏకంగా పోస్టింగ్ ఆర్డర్లే ఇచ్చేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై అనేక ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలాఉండగా, పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలోకి ఉపాధ్యాయ సంఘాల నేతలతోపాటు ఇతరులెవరినీ అనుమతించడం లేదు. ఇందుకేనా 317 జీవో... ప్రభుత్వం 317 జీవో ద్వారా దాదాపు 25 వేల మందిని మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా వారికి అన్యాయం జరిగినట్టు చెబుతున్నారు. స్థానికత ఎంపిక సందర్భంగా కొత్త జిల్లాల్లో అర్బన్ ప్రాంతాల్లో పోస్టులను చూపించకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం వాటిని చూపించినా సీనియారిటీ ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లను కొంతమంది టీచర్లు ఎంచుకునే వీలుంది. ఇప్పుడు బదిలీకి ఏ స్కూల్లోనైనా రెండేళ్లు పనిచేసి ఉండాలి. కాబట్టి 317 జీవో ద్వారా మారుమూల ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగొచ్చే అవకాశమే లేదు. పట్టణ ప్రాంతాల్లో బడులను బ్లాక్ చేయడంతో తిరిగి ఇప్పుడు నచ్చినవారికి పోస్టులు ఇచ్చుకునే వీలుకలుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. గణతంత్ర దినోత్సవాన కూడా... ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో నిమగ్నమై ఉన్న రోజు కూడా ఏకంగా ఏడు పైరవీ బదిలీలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. వీళ్లంతా పట్టుమని 30 కి.మీ. దూరం కూడా లేని బడుల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. మంత్రులు, ఎమ్మెల్సీల పైరవీలతో ఇవన్నీ జరిగినట్టు చెబుతున్నారు. దీంతో తామేమీ చేయలేకపోతున్నామని విద్యా శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ వ్యవహారంలో అధికారులకూ ముడుపులు ముడుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ బదిలీలను రద్దు చేయాలి: చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైరవీలతో బదిలీలు చేయడమంటే ప్రక్రియను అపహాస్యం చేయడమే. నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు, ఎమ్మెల్సీల పైరవీలను అనుమతిస్తే ఉపాధ్యాయ వృత్తికే కళంకం ఏర్పడుతుంది. ఈ బదిలీలను రద్దు చేయాలి. లక్షల్లో బేరసారాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో పోస్టింగుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇదే అదునుగా మధ్యవర్తులు టీచర్లతో బేరాలు కుదుర్చుకుని ఒక్కో పోస్టుకు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బేరం కుదిరిన వెంటనే టీచర్లకు మాత్రం కోరు కున్న ప్రాంతాల్లో పోస్టింగ్‌లు వస్తున్నాయని అంటున్నారు. వాస్తవానికి బదిలీ కోసం దర ఖాస్తు చేసుకునే ప్రక్రియ బుధవారంతో ముగుస్తుంది. కానీ కొంతమందికి షెడ్యూల్ విడుదల కాకముందే పోస్టింగ్‌లు వస్తే... మరికొంత మందికి బదిలీలకు దరఖాస్తు గడువు ముగియకుండానే పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇప్పుడు బదిలీ చేసినా ఏప్రిల్ తర్వాతే రిలీవ్ చేస్తామని షెడ్యూల్లో స్పష్టంచేసినా... పైరవీల టీచర్లు మాత్రం కొత్త ప్రాంతాల్లో చేరిపోతున్నారు. -
టీచర్ల బదిలీల దరఖాస్తుకు మరికొంత గడువు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. వాస్తవానికి ఈ గడువు సోమవారంతో ముగిసింది. అయితే ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 1వ తేదీ వరకు గడువును పెంచారు. షెడ్యూల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. టీచర్లు దరఖాస్తు చేసిన తర్వాత హెచ్ఎంలు.. వాటిని డీఈ వోలకు సమర్పించే మూడు రోజుల కాలపరిమితిని కుదించనున్నారు. ఈ నెల 28 నుంచి బదిలీల ప్రక్రియ మొదలైనా, తొలి రోజు పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇబ్బందుల వల్ల టీచర్లు తికమక పడ్డారు. కొన్ని ఆప్షన్లు తెరుచుకోలేదు. మరికొన్ని అప్‌గ్రేడ్ కాలేదు. మారు మూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలూ ఎదురైనట్టు వార్త లు వచ్చాయి. దీంతో దరఖాస్తు గడువును పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఇప్పటికి 55 వేల మంది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 55,479 మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువగా నల్లగొండ (3,423), రంగారెడ్డి (3,034), నిజామాబాద్ (3,247), సంగారెడ్డి (3,042) దరఖాస్తులు అందినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అత్యల్పంగా దరఖాస్తులు అందిన జిల్లాల్లో హనుమకొండ (635), జయశంకర్ భూపాలపల్లి (500), ములుగు (379) ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో 20 వేల వరకూ అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు, సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్జీటీ స్పౌజ్‌ల సంగతి ఆఖరునే వివిధ జిల్లాల్లో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ దంపతుల (ఎస్జీటీ స్పౌజ్‌లు) బదిలీ విషయాన్ని ఆఖరులో పరిశీలించే వీలుందని అధికారులు చెబుతున్నారు. 317 జీవో కారణంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన టీచర్లు రెండు వేలకు పైగా ఉన్నారు. వీరిలో 615 మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీకి అవకాశం కల్పించారు. కాగా, హెచ్ఎంల పదోన్నతి, స్కూల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఎస్జీటీల బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అవసరమైతే డిప్యూటేషన్ ఇచ్చైనా సరే వారి ప్రాంతాలకు పంపాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. -
50,000 మంది టీచర్లకు బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఈ అంశంపై అధికారులతో చర్చించారు. శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె సమీక్షించారు. మరోవైపు పదోన్నతులకు వీలుగా ఖాళీలను లెక్క తేల్చే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది టీచర్లకు స్థాన చలనం కలగనుంది. ఒకేచోట 8 ఏళ్ల సర్వీసు నిండి అనివార్యంగా బదిలీ అవ్వాల్సిన వాళ్లు 25 వేల మంది ఉంటే..ఐదేళ్లుగా ఒకే స్కూల్లో పనిచేస్తున్న 25 వేల మంది కూడా బదిలీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదిలావుండగా పలు ఉపాద్యాయ సంఘాలు బదిలీలు ప్రహసనంగా మారాయని, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లుకు కోరిన ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధికారులను నిలదీస్తే పైనుంచే పైరవీలు వస్తున్నాయని వారు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని, దీనిపై ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి. సొంత జిల్లాల్లో ఖాళీలన్నీ స్పౌజ్లతోనే భర్తీ! భార్యాభర్తల (స్పౌజ్) బదిలీలకు ప్రభుత్వం అనుమతించడం టీచర్ల పదోన్నతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్పౌజ్‌ల్లో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వీళ్లంతా స్కూల్ అసిస్టెంట్లు. 317 జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు బదిలీ అయ్యారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో 70 శాతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జీటీలు) పదోన్నతులు ఇవ్వడం ద్వారా, 30 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రస్తుతం దాదాపు 427 మంది స్పౌజ్‌లను సొంత ప్రాంతాలకు పంపుతున్నారు. ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ స్థానాల్లో ముందుగా వీరిని నియమిస్తారు. ఫలితంగా 13 జిల్లాల్లో ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్స్‌గా పదోన్నతి పొందేందుకు ఉన్న ఖాళీల సంఖ్య తగ్గే అవకాశం కన్పిస్తోంది. ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టుల్లో పదోన్నతులకు ఎక్కడా అవకాశం లేకుండా పోతోంది. దీనిపై ఎస్జీటీలు మండిపడుతున్నారు. మరోవైపు స్పౌజ్‌లు తిరిగి తమ జిల్లాలకు రావడంతో, వారు ఇప్పటివరకు పనిచేసిన 19 జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో తక్కువ సీనియారిటీ ఉన్న ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం వస్తోంది. ప్రక్రియ మొదలుకాక ముందే బదిలీలు! బదిలీల ప్రక్రియ మొదలవ్వక ముందే దాదాపు 120 మందిని కోరుకున్న ప్రాంతాలకు పంపుతూ ఉత్తర్వులు వెలువడటం తీవ్ర దుమారం రేపుతోంది. మరో 200 వరకు ఇదే విధమైన సిఫారసులు వచ్చినట్టు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై ఉపాధ్యాయ నేతలు మంత్రి సబిత వద్ద తీవ్ర నిరసన తెలిపారు. మరోవైపు పైరవీల జోరు పెరగడంతో టీచర్లు కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నేతలను, రాజకీయ ప్రముఖులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది మధ్యవర్తులు పుటుకొస్తున్నారు. పైనుంచి బదిలీ ఆదేశాలు తెప్పిస్తామని చెబుతూ రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నేటి నుంచి నిరసనలు: యూటీఎఫ్ బదిలీల్లో పైరవీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి నిరసనలు చేపట్టాలని ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చినట్లు టీఎస్ యూటీఎఫ్ నేత చావా రవి తెలిపారు. ప్రభుత్వమే పైరవీలకు తెరలేపడం టీచర్లలో అంశాంతి కల్గిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లందరికీ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. 29న డైరెక్టరేట్ ముట్టడి: టీఎస్పీటీఏ స్పౌజ్ టీచర్లు 2,200 మంది వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే ఓటు హక్కు ఉండే 625 మంది స్కూల్ అసిస్టెంట్లకే బదిలీకి కల్పించడం అన్యాయమని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ అన్నారు. మిగతా స్పౌజ్‌ల సంగతి తేల్చకుంటే 29న పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. బారులు తీరిన టీచర్లు ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించి నల్లగొండలో ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలనకు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం (డైట్) వద్ద బారులుదీరారు. – నల్లగొండ -
టీచర్లకు అంతర్ జిల్లా బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాల వారీగా అంతర్ జిల్లా బదిలీలు కోరుకునే వారికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు సూచించింది. బదిలీలు కోరుకునే అర్హులైన ఉపాధ్యాయులు నిర్ణీత షెడ్యూల్లో ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈఏపీ.జీవోవీ.ఐఎన్’ ద్వారా జూన్ 30 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు.. ► ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, హెడ్మాస్టర్లు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు ► ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలో జూన్ 30 నాటికి రెండేళ్ల సర్వీస్ పూర్తిచేసి ఉండాలి. ► స్పౌజ్ కేటగిరీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట పబ్లిక్ సెక్టార్ సంస్థలు, యూనివర్సిటీలు, హెచ్‌వోడీ కార్యాలయాలు, సెక్రటేరియేట్, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ► స్పౌజ్ కేటగిరీకి సంబంధించి హెచ్‌వోడీ కార్యాలయాలు, సెక్రటేరియేట్‌లో పనిచేస్తున్న వారు కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ► మ్యూచువల్ కేటగిరీలో కేటగిరీ, మేనేజ్మెంట్ ఒక్కటే అయి ఉంటేనే అనుమతిస్తారు. ► మ్యూచువల్ బదిలీల్లో టీచర్ల సమ్మతి(కన్సెంట్)తో పాటు ఎంఈవో, డిప్యుటీ డీఈవో సమ్మతి ఇస్తూ కౌంటర్ సైన్ చేయాలి. ► ఒక టీచర్ ఒక టీచర్‌కు మాత్రమే కన్సెంట్ ఇవ్వాలి. ► అనధికారిక గైర్హాజరు, సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు ఎదుర్కొంటున్న వారు, సస్పెన్షన్‌లో ఉన్న వారు దరఖాస్తుకు అనర్హులు ► ఆన్లైన్ దరఖాస్తులనే స్వీకరిస్తారు. ఒకసారి దరఖాస్తు చేస్తే అదే అంతిమం అవుతుంది. గతంలో అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాలి. ► ఆన్లైన్ దరఖాస్తు చేశాక వాటిని డౌన్లోడ్ చేసి ఎంఈవో సంతకానికి సమర్పించాలి. ఎంఈవో, హెచ్ఎం, డిప్యూటీ డీఈవోలు రికార్డులను పరిశీలించి సంతృప్తి చెందిన అనంతరం డీఈవోలకు సమర్పించాలి. బదిలీల షెడ్యూల్ ఇలా ► ఆన్లైన్ దరఖాస్తు, ఎంఈవోకు సమర్పణ: జూన్ 30 నుంచి జూలై 6 వరకు ► పరిశీలించిన దరఖాస్తులను ఎంఈవో, డీఈవోలకు సమర్పణ: జూలై 7 నుంచి 11 వరకు ► డీఈవోలు దరఖాస్తుల పరిశీలన: జూలై 12 నుంచి జూలై 17 వరకు ► డీఈవోలు పాఠశాల విద్య కమిషనర్ పరిశీలనకు జాబితా సమర్పణ : జూలై 19 ► కమిషనర్ పరిశీలన అనంతరం తుది జాబితా : జూలై 20 నుంచి 26 వరకు ► ప్రభుత్వానికి ఆ ప్రతిపాదనల సమర్పణ: జూలై 29 కమిషనర్ ప్రతిపాదనల సమర్పణ అనంతరం సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖల ఆమోదం అనంతరం టీచర్లకు అంతర్ జిల్లా బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఆ తేదీలను తర్వాత వెల్లడిస్తారు -
రేపు అర్ధరాత్రి వరకు వెబ్ఆప్షన్లకు గడువు..
-
ఉపాధ్యాయుల బదిలీలతో మీకేం సంబంధం?
సాక్షి, అమరావతి : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఫలానా విధంగా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన ఏపీ బీసీ సంక్షేమ సంఘంపై హైకోర్టు మండిపడింది. ఉపాధ్యాయుల బదిలీలకు, మీ సంఘానికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. గత విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిచేసి బదిలీల ప్రక్రియ చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బి.చిరంజీవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.నాగేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది నవంబర్ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను బదిలీ చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఉపాధ్యాయుల బదిలీలతో పిటిషనర్‌కు ఏంపని అని ప్రశ్నించింది. బదిలీల సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని, అభ్యంతరాలుంటే టీచర్లే కోర్టుకొచ్చి పోరాడే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది. బదిలీలతో సంబంధం లేని బీసీ సంక్షేమ సంఘం పిల్ దాఖలు చేయడం పరిధి దాటి వ్యవహరించడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. బీసీ సంక్షేమ సంఘం పేరుతో ప్రతి వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. దీంతో పిటిషనర్ న్యాయవాది పిల్‌ను ఉపసంహరించుకున్నారు. -
మాయ‘రోగుల’పై సస్పెన్షన్ వేటు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీచర్ల బదిలీల్లో అడ్డదారిలో అనారోగ్యం పేరిట ప్రిఫరెన్షియల్ పాయింట్లు పొందేందుకు ప్రయత్నించిన 17 మంది టీచర్లను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సస్పెండ్ చేశారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు జారీచేసిన నలుగురు ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీచర్ల బదిలీల మార్గదర్శకాలతో కూడిన జీవో 16ను ప్రభుత్వం ఈ నెల 6న విడుదల చేసింది. పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో 8,269 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా సీనియార్టీ జాబితా రూపొందించారు. అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ 195 మంది టీచర్లు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అదనపు ఎన్టైటిల్మెంట్ పాయింట్లు కోరుతూ ఆన్లైన్లో మెడికల్ సర్టిఫికెట్లు దరఖాస్తుతో సమర్పించారు. పరిశీలనకు కలెక్టర్ ఆదేశం.. జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్లపై ఫిర్యాదులు రావడంతో సంగారెడ్డి కలెక్టర్ పరిశీలనకు ఆదేశించారు. ఈ నెల 16, 18ల్లో 195 మంది టీచర్లు సమర్పించిన సర్టిఫికెట్లను కమిటీ పరిశీలించింది. çపరిశీలనకు 8 మంది టీచర్లు గైర్హాజరు కాగా, 14 మంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. దీనిపై పరిశీలన జరిపిన సంగారెడ్డి డీఈఓ విజయలక్ష్మి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన 11 మందితో పాటు, పరిశీలనకు గైర్హాజరైన ఆరుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేసిన నలుగురు ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో సంగారెడ్డి జిల్లా పరిధిలో ఆరుగురు, మెదక్ జిల్లా పరిధిలో ఏడుగురు, సిద్దిపేట జిల్లా పరిధిలో నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తూ, దురుద్దేశ పూర్వకంగా తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించినందునే ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి వెల్లడించారు. -
టీచర్ల బదిలీలపై షాకిచ్చిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం ముగిసినా ఇంతవరకు ఏపీ సర్కార్ ఉపాధ్యాయ బదిలీల వ్యవహారంపై ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి ఇవ్వడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే చోట విధులు నిర్వహించిన వారికి బదిలీలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, దివ్యాంగులు, వితంతువులు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆయా టీచర్లను బదిలీ చేయనున్నారు. ఈ బదిలీ ప్రక్రియ మే 5వ తేదీ నుంచి జూన్ 4 వరకు నెల రోజులపాటు కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండో టెట్‌ను మే 4న, జూలై 6న డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ ఖాళీగా ఉన్న 10,351 టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించనున్న ఏపీ సర్కార్.. టెట్ పరీక్షలను ఆగస్టు 23 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. -
పండిట్ల కౌన్సెలింగ్ నేటికి వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్: పండిట్ల బదిలీ కౌన్సెలింగ్ శనివారం నాటికి వాయిదా పడింది. కౌన్సెలింగ్ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సైన్స్ సెంటర్లో శుక్రవారం అన్ని ఏర్పాట్లూ చేశారు. సీనియార్టీ జాబితా మేరకు తెలుగు, హిందీ పండిట్లు ఉదయాన్నే చేరుకున్నారు. అయితే ముందురోజు జరిగిన పదోన్నతుల నేపథ్యంలో సీనియార్టీ, ఖాళీల జాబితాల్లో మార్పులు చేసేందుకు అధికారులు ఆన్లైన్లో ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాయిదా వేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. ఇదిలా ఉండగా సాయంత్రం ఆన్లైన్లో ఆప్షన్ ఇచ్చారు. దీంతో తుది సీనియార్టీ జాబితా కూడా తయారవుతుందని శనివారం ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని డీఈఓ తెలిపారు. -
టీచర్ల కౌన్సెలింగ్ సమాప్తం
7,041 మంది ఉపాధ్యాయుల బదిలీ – ఊపిరి పీల్చుకున్న విద్యాశాఖ – ఇప్పటికే కొత్త స్కూళ్లలో చేరిపోయిన ఎస్ఏలు – నేడు ఎస్జీటీలకు ఉత్తర్వులు అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల కౌన్సెలింగ్ ముగియడంతో విద్యా శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రెండు నెలల పాటు విద్యా శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేసిన టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ బుధవారం నాటితో ముగిసింది. వేల సంఖ్యల్లో టీచర్లు దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం బదిలీలపై పలుమార్లు జీఓలు, రోజుకో నిబంధన మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి తీవ్ర గందరగోళానికి గురి చేసింది. బదిలీల సమయంలోనూ పలు మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా ఖాళీల విషయంలో కొందరు టీచర్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. జూలై 22 నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్ బుధవారంతో ముగిసింది. అయితే పండిట్లకు రీకౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అన్ని కేడర్ల ఉపాధ్యాయులు మొత్తం 10,113 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6,181 మంది తప్పనిసరి.. 3,932 మంది రెక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొత్తం 7,041 మంది టీచర్లు బదిలీ అయ్యారు. బుధవారం ఎస్జీటీ తెలుగు 3,301 నుంచి చివరి వరకు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 800 మందికి పైగా ఉండగా.. వీరిలో అధికశాతం మంది అనుకూలమైన స్కూళ్లు లేకపోవడంతో ‘నాట్ఆప్టెడ్’ ఇచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు కౌన్సెలింగ్ ముగిసింది. జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ, పరిశీలకులు, రాయచోటి డైట్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య పర్యవేక్షణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇదిలా ఉండగా బదిలీ అయిన అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లు ఇప్పటికే కొత్త స్కూళ్లలో చేరిపోయారు. ప్రధానోపాధ్యాయులు గురువారం రిలీవ్ అయి శుక్రవారం కొత్త స్కూళ్లలో చేరనున్నారు. అలాగే ఎస్జీటీలకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు గురువారం జనరేట్ కానుండగా.. అదేరోజు రిలీవ్ అయి శుక్రవారం కొత్త స్కూళ్లలో చేరే అవకాశముంది. డీఈఓ, పరిశీలకుడికి సన్మానం కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో చివరిరోజు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, పరిశీలకులు చంద్రయ్యను ఉపాధ్యాయ సంఘాల నాయకులు సన్మానించారు. వేలాదిమంది టీచర్ల బదిలీలను షెడ్యూలు మేరకే పూర్తి చేశారంటూ నాయకులు కొనియాడారు. సన్మానం చేసిన వారిలో ఏడీ చంద్రలీలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు రామసుబ్బారెడ్డి, అధ్యక్షుడు రజనీకాంత్‌రెడ్డి, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్‌ఎల్‌టీఏ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి శివానందరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆదిశేషయ్య, ప్రధానకార్యదర్శి వేణుగోపాల్, ఆర్థిక కార్యదర్శి సలీం తదితరులు పాల్గొన్నారు. -
అవే తప్పులు
- మొద్దునిద్రలో విద్యాశాఖ - కొనసాగుతున్న బది‘లీలలు’ - లబోదిబోమంటున్న గురువులు - ఇదీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ తీరు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో తప్పుమీద తప్పులు జరుగుతున్నాయి. అయినా అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడడం లేదు. మరోవైపు గుర్తించిన తప్పిదాలనూ సరిదిద్దలేదు. దీంతో కొత్త సమస్యలు ప్రతి కేడర్‌లోనూ ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. కొందరు అనర్హులు మంచి స్థానాలు దక్కించుకుంటుండగా, నిబంధనలు పాటిస్తున్న టీచర్లకు అన్యాయం జరుగుతోంది. దీనికితోడు విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం టీచర్ల పాలిట శాపంగా మారుతోంది. రేషనలైజేషన్‌తో అనంతపురం రూరల్ కందుకూరు జిల్లా పరిçషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న రెండు గణితం పోస్టుల్లో ఒక పోస్టు రద్దయ్యింది. దీంతో ఇక్కడ పని చేస్తున్న హేమలత అనే టీచరు తప్పనిసరి బదిలీ కారణంగా బొమ్మనహాల్ స్కూల్‌ను ఆప్ట్ చేసుకుంది. కందుకూరు స్కూల్ పోసుట బ్లాక్ చేయని కారణంగా అరైజింగ్ వేకెన్సీ కనబడడంతో పామిడి మండలం పాళ్యం స్కూల్ టీచరు మాలతీ ఆప్ట్ చేసుకొని ఇబ్బందులు కొనితెచ్చుకుంది. ఇదే పరిస్థితి శుక్రవారం జరగనున్న పండిట్లు, సోషల్ టీచర్ల బదిలీల్లోనూ తలెత్తనుంది. కూడేరు మండలం జల్లిపల్లి స్కూల్లో : రేషనలైజేషన్‌తో కూడేరు మండలం జల్లిపల్లి జెడ్పీహెచ్ఎస్లో సోషల్ పోస్టు రద్దయ్యింది. ఇక్కడ పని చేస్తున్న హనుమంతచారి కాశమ్మకు మూడు రేషనలైజేషన్ పాయింట్లు వచ్చాయి. అయితే సీనియార్టీ జాబితా(సీనియార్టీ నంబర్ 251)లో మాత్రం కాశమ్మ రేషనలైజేషన్ ప్రభావంతో వెళ్లడం లేదని కనిపిస్తోంది. బత్తలపల్లి బాలికల పాఠశాలలోనూ సోషల్ పోస్టు రద్దయ్యింది. ఇక్కడ పని చేస్తున్న పుల్లారెడ్డికి మూడు పాయింట్లు కూడా కేటాయించారు. కానీ జాబితా (సీనియార్టీ నంబర్ 504)లో మాత్రం రేషనలేజేషన్ ఎఫెక్ట్ కాలేదని డిస్ప్లే అవుతోంది. తెలుగు పండిట్ జాబితాలో: ఇక తెలుగు పండిట్ల జాబితాలోనూ ఈ మాయ కనిపిస్తోంది. సీనియార్టీ నంబర్ 3లో ఉన్న ఎస్.ఈశ్వరయ్య కూడేరు మండలం కరుట్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్నాడు. అలాగే 395 నంబర్లో ఉన్న పి.సబిత గుడిబండ మండలం ఎస్. రాయాపురం జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తోంది. 418 నంబర్లో ఉన్న దూదేకుల సిద్ధయ్య బొమ్మనహాల్ మండలం డి.హొన్నూరు జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్నాడు. 465 నంబర్లో ఉన్న నాగమణి అమరాపురం మండలం బసవనపల్లి జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తోంది. ఈ నలుగురి పోస్టులూ రేషనలేజేషన్‌తో రద్దయ్యాయి. వీరికి మూడేసి పాయింట్లు కూడా కేటాయించారు. కానీ జాబితాలో మాత్రం రేషనలేజేషన్ ఎఫెక్ట్ కాలేదని డిస్ప్లే అవుతోంది. అంటే వీరందరూ ఇతర స్కూళ్లకు వెళ్లగానే ప్రస్తుతం పని చేస్తున్న స్థానాలు ఆటోమేటిక్‌గా అరైజింగ్ వేకెన్సీ కానున్నాయి. తెలుగు, గణితం మిక్సింగ్ జాబితా: విద్యాశాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో తెలుగు, గణితం మిక్సింగ్ సీనియార్టీ జాబితా తయారైంది. ఈ జాబితాను చూసిన అయ్యవార్లు కంగుతింటున్నారు. తెలుగు పండిట్లకు సంబంధించి 510 వరకు సీనియార్టీ జాబితా ఉంది. అయితే ఇదే జాబితాకు కొనసాగింపుగా 837 సీనియార్టీ నంబర్ వరకు ఉంది. వీరందరూ గణితం టీచర్లు. తెలుగు పండిట్ల సీనియార్టీ జాబితాలోకి గణితం టీచర్లను చేర్చేశారు. -
మాయ‘రోగం’!
– బదిలీ కోసం అయ్యవార్ల అడ్డదారులు - లేని రోగానికి ధ్రువపత్రాలు - మిస్సెస్‌లు కూడా ‘మిస్’గా దరఖాస్తు – ప్రత్యేక కమిటీతో విచారణ చేయిస్తే వెలుగులోకి అక్రమాలు – బోగస్ పత్రాలపై మెడికల్ బోర్డుకు సిఫార్సు చేస్తామన్న డీఈఓ అయ్యవార్లకు మాయ‘రోగం’ పట్టుకుంది. అన్నీ సవ్యంగా ఉండీ...ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తమకు దీర్ఘకాలిక రోగం ఉందంటూ ధ్రువీకరణ పత్రాలు తెస్తున్నారు. మరికొందరు వికలత్వ శాతం భారీగా పెంచి సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారు. బదిలీల వేళ కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు అడ్డదార్లన్నీ తొక్కుతున్నారు. ధ్రువీకరణ పత్రం నకిలీదని తెలిసినా అమ్యామ్యాలతో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈఓలు వాటిని ధ్రువీకరిస్తూ దీపం ఉండగానే ఇళ్లు సర్దుకుంటున్నారు. - అనంతపురం ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రిపరెన్షియల్ కేటగిరీ (వివిధ రోగాలతో బాధపడుతున్న వారు, దివ్యాంగులు) వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. వీరికి పాయింట్లతో సంబంధం లేకుండా ముందుగా కౌన్సెలింగ్ నిర్వహించి ఉన్న ఖాళీల్లో అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకున్న అయ్యవార్లు మంచి స్థానాలకు వెళ్లేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. లేనిరోగం ఉన్నట్లు...కాస్తాకూస్తో ఉన్న అంగవైక్యల్యం శాతాన్ని 70కి పైగా ఉన్నట్లు బోగస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. తాము కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు ఇలా ప్రణాళిక రూపొందించారు. అనుకూలమైన స్కూళ్లకు వెళ్లాలని... ఒకసారి బదిలీ జరిగితే టీచర్లు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్లపాటు అదే స్థానంలో ఉండొచ్చు. ఇన్నేళ్లు పని చేయాలంటే అన్ని అనుకూలంగా ఉన్న స్కూళ్లకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఆశే కొందరిని తప్పుదారి పట్టిస్తోంది. మంచి స్థానాలు దక్కించుకునేందుకు అక్రమాలకు తెరతీశారు. కొందరు మెడికల్ బోర్డు ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు పొంది తాము దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నామని, మరి కొందరు టీచర్లు తక్కువ శాతం అంగవైకల్యం ఉన్నా... 70 శాతానికి పైగా ఉన్నట్లు ధ్రువపత్రాలు పొందారు. లీలలెన్నో... బుక్కరాయసముద్రం మండలంలో ఓ ఉపాధ్యాయురాలు ఎలాంటి రోగం లేకపోయినా కేన్సర్ ఉన్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. అలాగే మరికొందరు తల్లిదండ్రులకు బాగలేదంటూ సర్టిఫికెట్లు పెట్టి ప్రిపరెన్షియల్ కేటగిరీకి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే జువైనల్ డయాబెటీస్‌లోనూ ఇదే పరిస్థితి. పిల్లలకు షుగర్ వ్యాధి లేకపోయినా ఉన్నట్లు ఇంకొందరు తప్పుడు ధ్రువీకరణపత్రాలు సమర్పించారు. పిల్లలు థలసేమియా వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా కొందరు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఇక కొందరు మహిళా టీచర్లయితే ఏకంగా పెళ్లయినా పెళ్లికాలేదని దరఖాస్తు చేసినట్లు సమాచారం. చేతులు మారుతున్న డబ్బులు ఇదే అదనుగా కొందరు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు ‘లెక్క’లు సరి చేసుకుంటున్నారు. ఎవరైనా దొంగ సర్టిఫికెట్లతో పాయింట్లు, ప్రిపరెన్షియల్ కేటగిరీకి దరఖాస్తు చేసుకుంటున్నారో వారి నుంచి బాగా ఆశిస్తున్నారు. ఓ ఎంఈఓ అయితే తన వాటా ఇస్తేనే దరఖాస్తు పంపుతానని, లేకుంటే పంపేది లేదని ఓ మహిళా టీచరు భర్తకు తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో సదరు టీచరు భర్త బేరం ఆడి చివరకు ఎంఈఓకు కొంత మొత్తం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని కొందరు అధికారులు బాగా ఒంటæ పట్టించుకున్నారు. ప్రత్యేక కమిటీతో విచారణ చేయించాలి నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులు మంచి స్థానాలు దక్కించుకుంటుంటే... నిజాయతీగా దరఖాస్తు చేసుకున్న టీచర్లకు అన్యాయం జరుగుతోందని పలువురు టీచర్లు వాపోతున్నారు. ప్రిపరెన్షియల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న టీచర్ల సర్టిఫికెట్లపై ప్రత్యేక కమిటీతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయని చెబుతున్నారు. ఇక్కడ పని చేసి ప్రస్తుతం గుంటూరు కలెక్టర్‌గా పని చేస్తున్న కోన శశిధర్ ఆ జిల్లాలో ప్రత్యేక బృందాన్ని నియమించి వెరిఫికేషన్ చేయిస్తున్నారనీ, అదే తరహాలో మన జిల్లాలోనే తనిఖీలు చేయిస్తే దొంగ సర్టిఫికెట్ల బండారం బయట పడుతుందంటున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ప్రిపరెన్షియల్ కేటగిరీకి అర్హులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా లేని రోగాలు ఉన్నట్లు చూపినా...అంగవైకల్యం శాతం ఎక్కువ ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణపత్రాలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి సర్టిఫికెట్లన్నింటినీ మెడికల్ బోర్డుకు పంపి విచారణ చేయిస్తాం. బోగస్ అని తేలితే ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలాగే వాటిని ధ్రువీకరించిన హెచ్ఎంలు, ఎంఈఓలపైనే కఠిన చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనారాయణ, డీఈఓ -
నేడు బదిలీ టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం ఎడ్యుకేషన్ : బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సోమవారం స్థానిక సైట్స్ సెంటర్లో ప్రారంభం కానుంది. ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు నమోదు చేసుకున్న వివిధ పాయింట్లకు సంబంధించిన సర్టిఫికెట్లను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. రీజనరేట్ అయిన పాయింట్లకు సంబంధించి తప్పనిసరిగా సర్టిఫికెట్లు ఉండాలని డీఈఓ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మండల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అర్హత ఉండి పాయింట్లు రీజనరేట్ కాని టీచర్లు నేరుగా డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఫిర్యాదులు చేయొచ్చన్నారు. కమిషనర్ కార్యాలయానికి పంపి సమస్య పరిష్కరిస్తామని డీఈఓ తెలిపారు. తక్కిన టీచర్లకు పాయింట్లు పడి తమకు రాలేదనే టీచర్లు మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుల ద్వారానే ఫిర్యాదు చేయాలి తప్ప నేరుగా సైన్స్ సెంటర్‌కు రాకూడదని డీఈఓ స్పష్టం చేశారు. అలా వస్తే పరిగణించబడదన్నారు. -
వెబ్‌డబ్
– వెంటాడుతున్న తప్పులు – టీచర్ల బదిలీ దరఖాస్తుకు బోలెడు సమస్యలు – రేపటి వరకు గడువు పెంపు – లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్ : పారదర్శకత అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ ప్రవేశ పెట్టింది. అయితే దరఖాస్తు మొదలుకొని స్కూల్‌కు బదిలీ అయ్యేవరకు వారిని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రారంభంలో సాంకేతిక లోపం కారణంగా చిన్నచిన్న సమస్యలు తలెత్తాయని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి మొదలు రాష్ట్రస్థాయిలో కమిషనర్ వరకు పలుమార్లు చెప్పారు. అయితే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునే గడువు సమీపిస్తున్న కొద్దీ కొత్తకొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి తప్ప పరిష్కారం కావడంలేదు. దరఖాస్తుకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో... తప్పులను సరిదిద్దే విషయంలో చిక్కుముడి వీడకపోతే వందలాది మంది ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరగనుంది. చక్రం తిప్పుతోన్న ఉద్యోగి రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించిన ప్రక్రియ సైన్స్ సెంటర్లో జరుగుతోంది. వచ్చిన సమస్యల్లో ప్రాధాన్యతను గుర్తించిæ పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కేవలం ఒక వర్గానికి చెందిన టీచర్ల సమస్యలను మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నారని తెలిసింది. ఈ ప్రక్రియలో కీలకంగా మారిన ఓ ఉద్యోగి చక్రం తిప్పుతున్నారు. ఓ మంత్రితో కొందరు ఎమ్మెల్యేల సిఫార్సుతో వచ్చిన వాటికే ఈయన ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు. కొన్ని స్కూళ్లలో పోస్టులు కాపాడటం, ఇంకొన్ని స్కూళ్లలో పోస్టులు తొలగించడంలో సదరు ఉద్యోగి పాత్ర అధికంగా ఉందని తెలిసింది. అధికారులు సైతం ఈయనపైనే ఆధారపడటంతో ఎవరూ నోరు మెదపడం లేదు. మారిన షెడ్యూలు బదిలీలకు సంబంధించిన షెడ్యూలు మారింది. ఈనెల 16వ తేదీన యాజమాన్యాలు, కేటగిరి, సబ్జెక్టులు, మీడియం వారిగా ఉపాధ్యాయుల ఖాళీలలను ప్రకటిస్తారు. 17 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని హార్డ్‌కాపీలను సంబంధిత ఎంఈఓ, డెప్యూటీ డీఈఓలకు అందజేయాలి. 18 వరకు ఎంఈఓలు, డెప్యూటీ డీఈఓలు వాటిని పరిశీలించి తయారు చేసిన సీనియార్టీ జాబితాను డీఈఓ స్వీకరిస్తారు. 19న పెర్ఫార్మెన్స్, ఎన్టైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా తయారు చేసిన ప్రొవిజనల్ జాబితాను ప్రకటిస్తారు. 20,21 తేదీల్లో అభ్యంతరాలు చెప్పొచ్చు. ఆధారాలను డీఈఓ కార్యాలయంలో అందజేయాలి. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి 22న డీఈఓ ఓకే చేస్తారు. 22, 23 తేదీల్లో హెచ్ఎంలు, టీచర్లు ఆన్లైన్ దరఖాస్తుకు నిర్ధారణ చేయాలి. 24న వెబ్సైట్లో సీనియార్టీ జాబితా ఉంచుతారు. 25 నుంచి 27 వరకు హెచ్ఎంలు, టీచర్లు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. 29న ప్రొవిజినల్ అలాట్మెంట్ స్థానాల జాబితా వెల్లడిస్తారు. దీనిపై అభ్యంతరాలను 30న స్వీకరిస్తారు. జూలై 1, 2 తేదీల్లో జిల్లా కమిటీ అభ్యంతరాలను పరిశీలిస్తుంది. 3న ఖాళీలకు సంబంధించి తుది జాబితా ప్రకటిస్తారు. 4, 5 తేదీల్లో వెబ్ ద్వారా బదిలీ అయిన వారి ఉత్తర్వులు వెల్లడిస్తారు. జూలై 6న కొత్త స్కూళ్లలో చేరాలి. ఈ సమస్యలకు పరిష్కారమేదీ? – సర్దుబాటు కింద డీఈఓ ఉత్తర్వుల మేరకు ఇతర స్కూళ్లలో పదో తరగతి బోధించి అక్కడ వందశాతం ఉత్తీర్ణత సాధించినా టీచర్లకు పాయింట్లు పడటం లేదు. – పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ (1938), ఏపీటీఎఫ్ (257), హెచ్ఎం అసోసియేషన్, ఆపస్... ఇవీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలు. వీటిని ధ్రువీకరిస్తూ స్వయంగా కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆన్లైన్లో మాత్రం మరో మూడు సంఘాల పేర్లు దర్శనమిస్తున్నాయి. – ఆన్లైన్లో నమోదు చేసిన సమయంలో అధికారులు చేసిన తప్పిదానికి టీచర్లు బలవుతున్నారు. ఉదాహరణకు కొత్తచెరువు మండలం బండ్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో సోషల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వెంకటాద్రి పుట్టిన తేదీ 4.8.1962. అయితే అధికారులు ఆన్లైన్లో 7.4.1962గా నమోదు చేశారు. ఈయన దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నిమార్లు ప్రయత్నించినా ‘డిటైల్స్ నాట్ ఫౌండ్’ అని వస్తోంది. ఇలాంటి బాధితులు వందలాది మంది ఉన్నారు. – బదిలీలకు అర్హత లేదంటూ రేషనలైజేషన్ ప్రభావంతో స్థానాలు కోల్పోయిన టీచర్లకు ఆన్లైన్లో దరఖాస్తు ఉంచలేదు. చేతులు దులుపుకొన్న ప్రభుత్వం - రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూలు ఇచ్చిన ప్రభుత్వం చేతులు దులుపుకొంది. క్షేత్రస్థాయిలో అనేక లోపాలున్నా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదు. దీంతో వేలాది మంది టీచర్లకు అన్యాయం జరుగుతోంది. ఆన్లైన్ విధానం వల్ల సామాన్య టీచర్లకు న్యాయం జరగాలి తప్ప అన్యాయం జరగకూడదు. అలాంటçప్పుడు ఈ వెబ్ కౌన్సెలింగ్ విధానం దండగే. -
అయోమయం
- కొలిక్కిరాని బదిలీలు, రేషనలైజేషన్ – జుట్టు పీక్కుంటున్న అధికారులు – ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ), ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అంధకారంగా మారింది. మార్గదర్శకాలపై జీఓలు, టీచర్ల బదిలీపై షెడ్యూలు ఇచ్చి చేతులు దులుపుకుంది. క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. షెడ్యూలు ప్రకారం రేషనలైజేషన్ ((హేతుబద్ధీకరణ) ప్రక్రియ ఈ నెల 8 నాటికి పూర్తి కావాల్సి ఉంది. శుక్రవారం నుంచి 12 వరకు అన్ని కేడర్లు టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే రేషనలైజేషన్ ప్రక్రియ కొలిక్కి రాలేదు. మరోవైపు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ పని చేయడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రేషనలైజేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వివిధ అంశాలు ప్రతిబంధకంగా మారాయి. హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయితే పలు పాఠశాలలు మూతపడనున్నాయి. ఉపాధ్యాయ పోస్టులను ఇతర పాఠశాలలకు బదలాయించనున్నారు. ముఖ్యంగా యూపీ స్కూళ్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదు. చాలా స్కూళ్ల నుంచి బయాలజీ టీచర్లు బయటకు రానున్నారు. వారిని ఎలా సర్దుతారనే దానిపై సమాచారం లేదు. హేతుబద్ధీకరణ పూర్తయితేనే టీచర్ల బదిలీల ప్రక్రియ ముందుకు సాగుతుంది. తలనొప్పిగా పాయింట్ల కేటాయింపు మరోవైపు టీచర్లకు వివిధ ప్రతిభ ఆధారిత పాయింట్లు కేటాయింపు తలనొప్పిగా మారింది. సంబంధిత ఉపాధ్యాయులు ఫలానా పాయింట్లు తనకు వర్తిస్తాయని ఎంఈఓలకు వినతులిచ్చారు. దీనిపై రికార్డులు పరిశీలించేందుకు స్కూళ్లు పునఃప్రారంభం కాలేదు. ఇదే అదనుగా అక్రమాలకు చోటు చేసుకునే వీలుంది. మండల విద్యాశాఖ అధికారులు, డెప్యూటీ డీఈఓలు ధ్రువీకరించే పాయింట్లపై కొందరు వ్యాపారం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. – పదో తరగతిలో 90–99.99 శాతం మంది ఉత్తీర్ణత సాధించి ఉంటే 5 పాయింట్లు, 80–89.99 శాతం మంది ఉత్తీర్ణత సాధించి ఉంటే 3 పాయింట్లు ఇస్తారు. ఇది కేవలం ఉన్నత పాఠశాలల టీచర్లకే మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే పదో తరగతి ఆ స్కూళ్లలో మాత్రమే ఉంటుంది. మరి ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల పరిస్థితి ఏమిటి? తాము స్కూల్ అసిస్టెంట్లు కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. – మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి 90 శాతం రోజుల్లో గడువులోగా ఆన్లైన్లో ఇండెంట్ వివరాలు పంపింటే 2 పాయింట్లు. 80–89.99 శాతం రోజుల్లో పంపింటే 1 పాయింటు కేటాయిస్తారు. వాస్తవానికి ఇండెంట్ దాదాపు ప్రతి మండలంలోనూ ఎమ్మార్సీ సిబ్బందే పంపుతున్నారు. మరి ఏస్కూల్లో ఏ టీచరుకు పాయింట్లు కేటాయిస్తారన్నది అంతుచిక్కడం లేదు. – స్పౌజ్ పాయింట్లు వినియోగించుకునేందుకు 8 ఏళ్లా లేక 8 ఏళ్లు పూర్తి కావాలా? దీనిపై స్పష్టత లేదు. – పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్ పోస్టుల్లో ఉన్న పండిట్లు, పీఈటీలు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో లేదు. స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీల ప్రక్రియ రేషనలైజేషన్ ప్రక్రియ ఇంకా తేలలేదు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీల ప్రక్రియ ముందుకు సాగుతుంది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం నుంచే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా...వెబ్సైట్ పని చేయడం లేదు. వివిధ పాయింట్లపై స్పష్టత కోసం ప్రభుత్వానికి రాశాం. -లక్ష్మీనారాయణ, డీఈఓ -
తర్జన భర్జన!
– కొలిక్కిరాని రేషనలైజేషన్ ప్రక్రియ – 55 స్కూళ్లకు అడ్డంకిగా మారిన ‘దూరం’ – ఎంఈఓలు, జీపీఎస్ జాబితాలో వ్యత్యాసం – రేపటి వరకు గడువు పొడిగింపు అనంతపురం ఎడ్యుకేషన్ : పాఠశాలల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ)కు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పలు పాఠశాలలు మూతపడనున్నాయి. ఉపాధ్యాయ పోస్టులను ఇతర పాఠశాలలకు బదలాయించనున్నారు. నిబంధనలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఆ మేరకు మండల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేసినా తుది దశకు చేరుకోవడం లేదు. 2016 డిసెంబర్ 31 తేదీ కటాఫ్‌గా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, మంజూరు పోస్టులు, స్కూళ్ల మధ్య దూరం తదితర వివరాలను మండల విద్యాశాఖ అధికారులు తేలాల్సి ఉంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ నుంచి ప్రొఫార్మాలు పంపారు. వాటిని భర్తీ చేసి జిల్లా విద్యాశాఖకు పంపితే వారు ఆన్లైన్లో భర్తీ చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు. ఇందుకోసం మంగళవారం నాటికే గడువు ముగిసింది. అయితే చాలా విషయాల్లో స్పష్టత రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ జూన్ 2 వరకు గడువు పొడిగిస్తున్నామని, ఆలోగా పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. 3న తుది వివరాలను వెల్లడించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 55 స్కూళ్లకు ‘దూరం’ సమస్య ముఖ్యంగా ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్‌కు ఉన్న దూరం ఆధారంగా చాలా స్కూళ్లు మూతపడే పరిస్థితి. స్కూళ్ల మధ్య దూరాన్ని ప్రభుత్వం ఆన్లైన్ జీపీఎస్ (గ్లోబల్ పొజిషినింగ్ సిస్టం) ద్వారా గుర్తించారు. అయితే క్షేత్రస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు గుర్తించిన దూరానికి వ్యత్యాసం వస్తోంది. జిల్లాలో సుమారు 55 స్కూళ్లకు ఈ సమస్య నెలకొంది. సీఆర్పీలతో జీపీఎస్ ద్వారా మరోసారి దూరాన్ని పరిశీలించి అమరావతి ఐటీ విభాగానికి పంపాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయా స్కూళ్లకు వెళ్లిన సీఆర్పీలు వివరాలను ఐటీ విభాగానికి పంపారు. ఇదిలా ఉండగా పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, డీ. హీరేహాల్ మండలం సోమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం విద్యార్థులను ఇంగ్లిష్ మీడియంలో చేర్చడంతో రెండు మీడియాల్లోనూ సంఖ్య తక్కువై మూతపడే ప్రమాదం నెలకొంది. అయితే యూడైస్‌లో తప్పుగా నమోదు చేశారని, వాస్తవానికి తెలుగు మీడియం విద్యార్థులు అధికంగా ఉన్నారని పొరబాటున ఆన్లైన్లో ఇలా నమోదు చేశారంటూ ఆయా పాఠశాలల హెచ్ఎంలు వాపోతున్నారు. ఇదే జరిగితే ఈ రెండు స్కూళ్లలోనూ ఒక మీడియం రద్దయి ఒక మీడియం కొనసాగే వీలుంటుంది. దీనిపై విద్యాశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. వీటిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాం = పగడాల లక్ష్మీనారాయణ, డీఈఓ ‘రేషనలైజేషన్ ప్రక్రియ ఈపాటికి పూర్తికావాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో నెలకొన్న చిన్న చిన్న సమస్యల వల్ల కాస్త ఆలస్యమైంది. ఈ నెల 2 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈలోగా పూర్తి చేస్తాం. జిల్లాలో కొన్ని స్కూళ్ల మధ్య ఉన్న దూరం, పరిగి, సోమలాపురం పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యపై స్పష్టత కోసం ప్రభుత్వానికి పంపాం. అక్కడి నుంచి రాగానే వాటిపై ఓ నిర్ణయం తీసుకుంటాం.’ -
టీచర్ల బదిలీలకు టీసర్కారు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : టీచర్ల బదిలీల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు రాత్రిలోగా బదిలీలకు సంబంధించిన విధివిధానాలు ఖరారుచేయనున్నట్లు సమాచారం. రాజకీయ జోక్యం లేకుండా బదిలీలు జరిగేలా టీఆర్ఎస్ సర్కారు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
టీచర్ల హేతుబద్ధీకరణ కష్టమే!
సర్కారు వద్ద పెండింగ్‌లో ఫైలు క్రమబద్ధీకరణ చేస్తే పదోన్నతులకు పట్టుబట్టనున్న టీచర్లు వాయిదా యోచనలో ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీలు ఈసా రి చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. హేతుబద్ధీకరణకు ప్రభుత్వం ఓకే చెబితే ఉపాధ్యాయులు, సంఘాలు.. పదోన్నతులు, బదిలీల కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. దీంతో ఈసారికి దీన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. టీచర్ల హేతుబద్ధీకరణపై ప్రభుత్వ ఆమోదం కోసం విద్యాశాఖ 2 నెలల కిందటే ఫైలు పంపినా, ఉపాధ్యాయ సంఘాలతో ఇటీవల చర్చించి ప్రతిపాదనల్ని పంపినా అవన్నీ ప్రభుత్వం వద్దే ఆగిపోయాయి. కాగా మరో 15 రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో బదిలీలు, పదోన్నతులు ఉంటాయా? లేదా? అన్న ఆందోళన టీచర్లలో నెలకొంది. స్కూళ్ల మూసివేత ఓ కారణమే! ప్రస్తుతం హేతుబద్ధీకరణ చేపట్టాలంటే గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు (జీవో నంబర్ 6) సవరణ చేయాలి. 19 మంది, అంతకంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక స్కూళ్లకు.. 75, అంతకంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్లకు టీచర్లను ఇవ్వబోమని; ఆ స్కూళ్లను పక్క పాఠశాలల్లో విలీనం చేసి, పిల్లలను సమీపంలోని స్కూళ్లలో చేర్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలా పక్క స్కూళ్లలో విలీనం చేస్తే 4 వేలకు పైగా స్కూళ్లు మూతపడతాయి. వాటిలో పోస్టులు రద్దు అవుతాయి. ఈ నిబంధనలను ఉపాధ్యాయ సంఘా లు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో స్కూళ్లను మూసేయమని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. మరోవైపు ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని, లేదా హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేషనలైజేషన్ చేస్తే 4 వేల స్కూళ్లు మూతపడతాయి. అదే జరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుం దని, అందుకే రేషనలైజేషన్ ప్రస్తుతానికి చేయొ ద్దనే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు సాధారణ బదిలీలకు ప్రభుత్వం ఓకే చెబితే తప్ప టీచర్ల బదిలీలకు అవకాశం లభించదు. దీంతో ప్రభు త్వ నిర్ణయం కోసం టీచర్లు ఎదురుచూస్తున్నా.. పరోక్షంగా రేషనలైజేషన్‌తోపాటు టీచర్ల బది లీలు, పదోన్నతులు అన్నింటినీ ఇప్పటికి పక్కనబెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే విద్యాశాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం లేదనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీలో టీచర్ల బదిలీ షెడ్యూల్ ఖరారు?
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీ విధివిధానాలు, షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. హేతుబద్ధత (రేషనలైజేషన్)తో ముడిపెట్టి బదిలీలు చేపట్టాల్సి ఉండడంతో విధివిధానాల ఖరారులో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. టీచర్ల రేషనలైజేషన్, బదిలీలు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో వాటిని సమన్వయం చేసుకుంటూ కొత్త మార్గదర్శకాల్ని రూపొందిస్తున్నారు. రేషనలైజేషన్ కింద విద్యార్ధులు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉంటే అవసరమైన పాఠశాలలకు బదిలీ చేస్తారు. పాఠశాల ల్లోని ఖాళీల జాబితాను ముందుగా ప్రకటించి వాటిపై జూన్ 6వరకు అభ్యంతరాల్ని స్వీకరిస్తారు. 7 నుంచి 14 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించి కౌన్సెలింగ్‌ను నిర్వహించే అవకాశముంది. మున్సిపల్ టీచర్ల బదిలీపై ఆ శాఖ కసరత్తు చేస్తోంది. ‘14 కల్లా పూర్తయ్యేలా చూడాలి’ టీచర్ల బదిలీల రేషనలైజేషన్‌ను వచ్చే నెల 14కల్లా పూర్తయ్యేలా చూడాలని రాష్ట్రోపాధాయ సంఘం అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జోసెఫ్ సుధీర్‌బాబులు పేర్కొన్నారు. విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్లను సోమవారం కలసి ఈ అంశంపై చర్చించామని, అందుకు వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
'కేంద్రం నుంచి లేఖ రాగానే డీఎస్సీ నోటిఫికేషన్'
హైదరాబాద్ : డీఎస్సీ నోటిఫికేషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోద ముద్ర వేయలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రం సాధ్యమైనంత త్వరలో ఆమోదముద్ర వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి కేంద్రం నుంచి లేఖ రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో గంటా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ,ఎన్ఐటీ, ఐఐఎస్ఈఏఆర్ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. ఆ సంస్థల ఏర్పాటు కోసం గురు, శుక్రవారాల్లో జాతీయ విద్యాసంస్థల కమిటీలు పర్యటిస్తాయని చెప్పారు. అందుకోసం కర్నూలు, తిరపతి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో స్థలాలను ఆ కమిటీలు పర్యటిస్తాయని తెలిపారు. టీచర్ల బదిలీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఓ విలేకర్లు అడిగిన ప్రశ్నకు గంటా సమాధానమిచ్చారు. -
పోతూ పోతూ సంతకం..
* 600 మంది టీచర్ల బదిలీ * రాజీనామాకు ఒక్కరోజు ముందు * ఫైలుపై సీఎం సంతకం * పరీక్షల ముందు విద్యార్థులకు చేటు * సెలవులో ఉన్న కార్యదర్శి * ఆదేశాలు ఇస్తారా లేదా ప్రశ్నార్థకం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాకు ముందు రోజు అంటే మంగళవారం రాత్రి ఒక్క సంతకంతో 600 మంది టీచర్లను బదిలీ చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను బదిలీ చేయకూడదనే నిబంధనలున్నా వాటికి పాతర వేసి మరీ ఒకేసారి 600 మంది టీచర్లను వారు కోరుకున్న చోటకు బదిలీ చేసేశారు. ఒక్కో బదిలీ వెనుక రూ.50 వేల నుంచి లక్ష దాకా చేతులు మారినట్లు సచివాలయం కోడై కూస్తోంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా విద్యా సంవత్సరం మధ్యలో ఇంత పెద్ద ఎత్తున బదిలీలు చేయలేదని అధికారులే పేర్కొనడం గమనార్హం. ఎన్నికల ముందు మరీ నిబంధనలను సడలించి విద్యా శాఖ, ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి తమకున్న విశేష అధికారాలతో ఈ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యా సంవత్సరం మధ్యలో అదీ వార్షిక పరీక్షల ముందు ఇంత పెద్ద ఎత్తున టీచర్లను బదిలీ చేయడం దారుణమని అధికార వర్గాలు వాపోతున్నాయి. మధ్యలో టీచర్ల బదిలీ వల్ల విద్యార్థులకు నష్టం చేకూరుతుందనే ఆలోచనతోనే ప్రతి ఏటా వేసవి సెలవుల్లో కౌన్సెలింగ్ ద్వారా బదిలీలకు అవకాశం కల్పిస్తున్నామని, ఇప్పుడు విద్యార్థుల గురించి ఆలోచించకుండా రాజకీయ బదిలీలు చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో కూడా 400 మందికి పైగా టీచర్లను ఇదే విధంగా బదిలీ చేసిన విషయాన్ని సాక్షి వెల్లడించిన విషయం తెలిసిందే. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఈ టీచర్ల బదిలీలు సాగాయి. ఇలా ఉండగా మంగళవారం ముఖ్యమంత్రి సంతకం చేయడంతో బుధవారం ఆ బదిలీల ఫైళ్లను ఆదేశాల జారీ కోసం మాధ్యమిక విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీకి పంపించారు. తివారీ ఈ నెల 24 వరకు సెలవులో ఉన్నారు. ఆయన సెలవు నుంచి వచ్చే వరకు ఆ బాధ్యతలను ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రాకు అప్పగించారు. అయితే అజయ్ మిశ్రా కూడా ముఖ్యమంత్రి రాజీనామా చేసినందున ఇప్పుడు బదిలీల ఆదేశాలు జారీ చేయడం ఎందుకనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తివారీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారనే అభిప్రాయం శాఖ అధికారుల్లో వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు ముందుకు వెళ్లాలనే ఆలోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నట్లు సమాచారం. -
భారీగా టీచర్ల బదిలీలు
జిల్లా విద్యాశాఖకు ప్రభుత్వ ఉత్తర్వులు జాబితాలో 45 మంది ఉపాధ్యాయులు అంతర్జిల్లా బదిలీల్లో ఇద్దరు త్వరలో మున్సిపల్ బదిలీల జాబితా? సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఉపాధ్యాయ బదిలీలు జోరందుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ, ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి పేషీ నుంచి వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ప్రత్యేక బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇందులో జిల్లాకు చెందిన 30 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, 8 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఐదుగురు ప్రధానోపాధ్యాయు(హెచ్ఎం)లు ఉన్నారు. అంతర్ జిల్లా బదిలీల్లో రాష్ట్రవ్యాప్తంగా తొలి జాబితాలో పది మంది ఉపాధ్యాయుల కు బదిలీకాగా.. విశాఖ జిల్లాకు శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వీరిలో ఎక్కువగా పరస్పర(మ్యూచువల్) కేటగిరీలోనే బదిలీ ఉత్తర్వులు పొందినట్టు తెలిసింది. వీరందరి వ్యక్తిగత ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖకు ఇప్పటికే అందాయి. ఇందుకు ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించినట్టు సమాచారం. హెచ్ఎం బదిలీల్లో కంగాళీ? : తాజా జాబితాలో కొందరు హెచ్ఎంలను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులొచ్చాయి. అయితే ఇవి ఆర్జేడీ(కాకినాడ) కార్యాలయానికి వెళ్లాయి. అక్కడి నుంచి జిల్లా విద్యాశాఖకు రావాల్సి ఉంది. వీరిలో ఇద్దరు పరస్పర బదిలీలు కోరుకున్నట్టు తెలిసింది. పెదమదీనా, మంగమారిపేట జెడ్పీ హైస్కూళ్ల హెచ్ఎంలు ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు మంగమారిపేట ప్రస్తుత హెచ్ఎం సెప్టెంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. చిట్టివలస హెచ్ఎం వాడపాలెం హైస్కూల్‌కు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే వాడపాలెంలో ప్రస్తుతం పనిచేస్తున్న హెచ్ఎంకు ఇంకా సర్వీసు మిగిలే ఉంది. దీంతో ఈ హెచ్ఎంను ఏం చేస్తారన్న సందేహాలున్నాయి. త్వరలో ‘మున్సిపల్’ జాబితా? జిల్లా పరిషత్ యాజమాన్యం నుంచి మున్సిపల్ యాజమాన్యంలోకి వచ్చేందుకు కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎనిమిది మందికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అయితే వీరికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఈ ఉత్తర్వుల్లో జాప్యం నెలకొన్నట్టు సమాచారం. ఈ వారంలోనే వీరికి కూడా వ్యక్తిగతంగా బదిలీ ఉత్తర్వులు రానున్నట్టు బోగట్టా. -
రాజకీయ బది‘లీలలు’
జిల్లాలో 33 మంది టీచర్లకు గ్రీన్‌సిగ్నల్ డీఈవో కార్యాలయానికి చేరిన ఉత్తర్వులు నేతల ‘హస్తం’ సాక్షి, మచిలీపట్నం : కోరుకున్నచోటు ఉంటుందో లేదో అన్న ఆందోళన.. రోజులతరబడి మానసిక ఒత్తిడి.. గంటల తరబడి నిరీక్షణ.. ఇదీ టీచర్లకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియలో వారు అనుభవించే వేదన. ఇటువంటి కష్టాలకు చెల్లుచీటీ రాస్తూ.. రాజకీయ నేతల అభయహస్తం ఉంటే చాలు అడ్డదారిలో కావాల్సినచోటకు బదిలీ చేయిచుకోవచ్చని పలువురు గురువులు రుజువు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గురుకులం (టీచర్ల కమ్యూనిటీ)లో కాస్త పట్టు సాధించడంతో పాటు నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని భావించిన అధికార పార్టీ నేతలు ఈ ప్రక్రియకు తెరతీశారు. దాదాపు మూడు నెలలుగా సాగిన ఉపాధ్యాయ బదిలీలకు సీఎం సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం జిల్లాకు చేరాయి. రాష్ట్రంలో సుమారు 600 మంది ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదముద్ర వేయగా జిల్లాలో 33 మంది ఉన్నారు. కోరుకున్న ప్రాంతాలకు బదిలీ... జిల్లాలో 33 మంది ఉపాధ్యాయులను వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేస్తూ వ్యక్తిగత ఉత్తర్వులు వచ్చాయి. జిల్లాలోని కాంగ్రెస్ నేతలు తమను ఆశ్రయించిన ఉపాధ్యాయులకు బదిలీలు చేయించుకున్నారు. జిల్లాలో బదిలీ అయిన 33 మంది టీచర్లలో స్కూల్ అసిస్టెంట్లు 20 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్డీటీ)లు ఐదుగురు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు ఐదుగురు, స్కూల్ అసిస్టెంట్లు (హిందీ) ముగ్గురు ఉన్నారు. ఉత్తర దక్షిణాలతో ప్రయత్నం సఫలం... అందరితో పోటీపడి కౌన్సెలింగ్‌కు వెళితే కావాల్సినచోటు ఉంటుందో లేదో అనుకునే ఉపాధ్యాయులు ఈసారి రాజకీయ అస్త్రాన్ని ఆశ్రయించారు. అందుకు వారు ఉత్తర దక్షిణా(సిఫారసు, డబ్బు)లను ప్రయోగించారు. కాంగ్రెస్ నేతల సిఫారసుతో పలువురు టీచర్లు తమకు కావాల్సినచోటుకు మార్పించుకునేందుకు ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు సమర్పించుకున్నట్టు సమాచారం. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో జరిగిన ఈ బదిలీలతో వేసవిలో జరిగే కౌన్సెలింగ్‌కు ఇబ్బందికరమేనని విద్యావేత్తలు అంటున్నారు. దీంతో వచ్చే వేసవిలో నిర్వహించే బదిలీల కౌన్సెలింగ్‌కు మిగిలే ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు లేని, మారుమూల పాఠశాలలే దిక్కని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులను అమలు చేస్తాం : డీఈవో జిల్లాలో 33 మంది ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాణీమోహన్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తున్నట్టు డీఈవో డి.దేవానందరెడ్డి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలకు వ్యక్తిగత ఉత్తర్వులు ఇచ్చినందున వారికి అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం వారికి కేటాయించిన పాఠశాలల్లో ఒకవేళ ఇటీవల భర్తీ అయ్యి ఖాళీ లేకపోతే పక్క మండలాల్లో నియమించేలా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని డీఈవో చెప్పారు. దీని ప్రకారం 33 మంది టీచర్లలో సుమారు నలుగురు వరకు వారు గతంలో కోరుకున్న పాఠశాలల్లో ఖాళీలు లేవని, వారికి పక్క మండలాల్లో కోరుకున్న పాఠశాలకు బదిలీ చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. -
గుట్టుచప్పుడు కాకుండా టీచర్ల బదిలీలు..
ముడుపులు.. సిఫార్సులకు పెద్దపీట సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా సుమారు 1,000 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసింది. సిఫార్సులకే బదిలీల్లో పెద్దపీట వేశారు. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారిందని సమాచారం. బదిలీల ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలపడంతో.. జాబితాను సోమవారం జిల్లాలకు పంపించారు. మొదటి నుంచీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తి గోప్యతను పాటిం చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలతో పాటు భారీగా సొమ్ము ముట్టజెప్పిన వారికే బదిలీలు అయ్యాయని.. నిజంగా అనారోగ్య కారణాలు, కుటుంబ సమస్యలున్న వారి విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే నిలిపివేయాలి: యూటీఎఫ్ టీచర్ల అక్రమ బదిలీలను వెంటనే నిలిపివేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి, వైద్యుల ప్రోత్సాహకాలకు హెల్త్‌కార్డుల ప్యాకేజీ వ్యయంలో 55% కేటాయించడం అన్యాయమని విమర్శించింది. ఉద్యోగుల సొమ్మును నూరు శాతం చికిత్సకే కేటాయించాలని కోరింది.