ఆదిలాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ : విద్యాశాఖలో ఈ ఏడాది మే నెలలో సాధారణ ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించారు. మారుమూల మం డలాల్లో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు ఈ బదిలీలకు దరఖాస్తు చేసుకొని కో రుకున్న స్థానాలను ఎంచుకున్నారు. ఇంతవర కు బాగానే ఉంది. కానీ బదిలీలు జరిగి ఆ రు నెలలు గడిచినా దాదాపు వంద మంది ఉపాధ్యాయులను విద్యా శాఖ రిలీవ్ చేయలేదు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 50 శాతం ఉపాధ్యాయులను మాత్రమే రిలీవ్ చేశారు. ఈ లెక్కన నలుగురు, ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్న చోట ఇద్దరిని రిలీవ్ చేశారు. ఇద్దరు, ముగ్గురు ఉన్న చోట ఒకరిని మాత్రమే రిలీవ్ చేశారు. దీంతో బెజ్జూర్, దహెగాం, కౌటాల, కోటపల్లి, వేమనపల్లి, భీమిని, వాంకిడి మండలాల్లోని ఉపాధ్యాయులే అధికంగా పాత స్థానాల్లో కొనసాగుతున్నారు. దాదాపు వంద మంది ఉపాధ్యాయులు రిలీవ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ట్రిబ్యునల్ ఆశ్రయం
బదిలీల కోసం దరఖాస్తు చేసుకొని అందరు ఉపాధ్యాయులు లాగానే తాము కూడా బదిలీ అయినప్పటికీ విద్యా శాఖ అధికారులు తమ ను రిలీవ్ చేయడం లేదని 12 మంది ఉపాధ్యాయులు రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ వారిని వెంటనే రిలీవ్ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. రిలీవ్ కోసం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే ఉపాధ్యాయుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
‘డీఎస్సీ’ వరకు ఎదురుచూపులే..!
నిరుద్యోగ యువతతో పాటు బదిలీ అయిన ఉపాధ్యాయులు కూడా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ ద్వారానైనా పోస్టులు భర్తీ అయితే తమకు రిలీవర్ వచ్చే ఆస్కారం ఉందని భావిస్తున్నారు. మన జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తూ బదిలీ కోరుకున్న ఉపాధ్యాయులకు రిలీవ్ వచ్చేంత వరకు రిలీవ్ అయ్యే అవకాశం లేదు. అయితే తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమంతో డీఎస్సీ ప్రకటన ఆలస్యమవుతోంది.
కౌంటర్ దాఖలు చేశాం
- అక్రముల్లాఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి
ఏకోపాధ్యాయ పాఠశాలలు, విద్యార్థులు అధికంగా ఉన్న చోట రిలీవర్ వచ్చే వరకు వారు జీవో నంబర్ 33 ప్రకారం పాత స్థానాల్లోనే కొనసాగాలి. రిలీవ్ చేస్తే విద్యార్థుల చదువుకు ఆటంకం కలువచ్చు. కొంత మంది ఉపాధ్యాయులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి రిలీవ్ చేయాలని ట్రిబ్యునల్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనికి కౌంటర్ ఫైల్ దాఖలు చేశాం.
బదిలీలపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన టీచర్లు
Published Mon, Dec 30 2013 6:17 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement