Tribunal
-
అనుసంధానం అడుగు పడేదెలా?
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఒక నదిలో మిగులు జలాలను లభ్యత తక్కువగా ఉన్న మరో నదికి మళ్లించడానికి.. ఆ నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన ఉన్న రాష్ట్రాలు అదనంగా నీటిని కేటాయించాలంటూ పట్టుబడుతున్నాయి. ఇందుకు గోదావరి, మహానది ట్రిబ్యునళ్ల అవార్డులను అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.దీంతో నదుల అనుసంధానం సాధ్యం కావడంలేదు. ఇది సాకారం కావాలంటే న్యాయపరంగా అడ్డంకులను తొలగించుకోవడంతోపాటు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. ఇదే పెద్ద సవాల్. గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోదావరి ట్రిబ్యునల్.. ఇందుకు బదులుగా కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకొనే వెసులుబాటు కల్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే కృష్ణా బేసిన్లో అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. ఈ నీటి వాడకానికి మహారాష్ట్ర, కర్ణాటక తొమ్మిదేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను విభజనానంతరం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఇటీవల బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. గోదావరి – కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ప్రాధాన్యతగా చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కృష్ణా నది మీదుగా ఈ అనుసంధానం చేపడుతున్నందున, కృష్ణా జలాల్లో తమకు అదనంగా కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబడుతున్నాయి. కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను మళ్లిస్తున్న నేపథ్యంలో కావేరి జలాల్లో అదనపు కోటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ పట్టుబడుతున్నాయి. దీన్ని కృష్ణా, కావేరి బేసిన్లో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో గోదావరి– కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయ సాధన సవాల్‌గా మారింది. ఇదొక్కటే కాదు.. ద్వీపకల్ప భారతదేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన 15 అనుసంధానాలపై ఏకాభిప్రాయ సాధన సాధ్యమయ్యే అవకాశమే లేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
‘కృష్ణా’పై కొత్తగా విధి విధానాలు చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి : కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయడం కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కొత్తగా విధి విధానాలు (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్) జారీ చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమంటూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు విధి విధానాలను ఇప్పటికే నిర్దేశించారని గుర్తు చేస్తూ.. మళ్లీ కొత్తగా విధి విధానాలు జారీ చేయడాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్యాయంగా, అక్రమంగా కొత్తగా జారీ చేసిన విధి విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. వాటిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ) దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని తెగేసి చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికమని.. దాని ద్వారా న్యాయబద్ధంగా హక్కుగా రాష్ట్రానికి దక్కిన ప్రతి నీటి బొట్టునూ రక్షించుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఇప్పటికే ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1976లో 811 టీఎంసీలు కేటాయించింది. ఆ జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించింది. ఈ కేటాయింపుల ఆధారంగా 2015 జూలై 18–19న ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ చేసిన తాత్కాలిక సర్దుబాటుపై రెండు రాష్ట్రాల సీఎస్‌లు సంతకాలు చేశారు. కృష్ణా నది జలాలను పంపిణీ చేయడానికి 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010లో తొలి నివేదిక, 2013లో తుది నివేదిక కేంద్రానికి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. ఆ రెండు నివేదికలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఎస్సెల్పీలు దాఖలు చేయడంతో వాటిపై స్టే ఇచ్చింది. దాంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను కేంద్రం నోటిఫై చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం కట్టబెడుతూ దాని గడువును పొడిగించింది. విభజన చట్టంలో సెక్షన్–89లో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాలలో ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే నియమావళిని రూపొందించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం విధి విధానాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కూడా విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకే నీటి పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2016 నుంచి విచారణ జరుపుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ కృషి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కృష్ణా జలాలను సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తే సీఎం వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన చుక్క నీటిని వదులుకోబోమని, అన్యాయంగా చుక్క నీటిని వాడుకోబోమని తేల్చి చెప్పారు. సెక్షన్–3 ప్రకారం నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జల్ శక్తి శాఖకు 2021లో లేఖ రాయగానే.. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి చట్టబద్ధంగా ట్రిబ్యునల్ కేటాయించిన జలాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు 2021 ఆగస్టు 17న.. ఆ తర్వాత 2022 జూన్ 25న సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ రాశారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీకి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కొత్త విధి విధానాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఈ నెల 4న ఆమోదం తెలపడం అశాస్త్రీయమని, దీని వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని.. అందువల్ల తదుపరి చర్యలను నిలిపేసి రాష్ట్ర హక్కులను పరిరక్షించాలని ఈ నెల 6న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అదే రోజున ఢిల్లీలో హోం శాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై ఇదే అంశాన్ని వివరించారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విధి విధానాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నిర్దేశిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నడుంబిగిస్తే.. నేడు సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పోరాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పై ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూ తప్పుడురాతలు అచ్చేస్తున్నారు. వారి విషపురాతలను ప్రజలు నమ్మరు. టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న విమర్శలను జనం పట్టించుకోరు. పవన్ కళ్యాణ్, లోకేశ్ పొలిటికల్ బఫూన్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు లోకేష్ లు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయా పార్టీల వారికే తెలియక జట్టు పీక్కుంటున్నారు. పెడనలో ఎన్డీయే నుంచి బయటకొచ్చానని ప్రకటించిన పవన్.. ముదినేపల్లికి వచ్చే సరికి మాట మార్చారు. జైలులో చంద్రబాబును ములాఖత్‌లో కలిసి బయటకొచ్చాక.. చంద్రబాబు అవినీతిని ఇంటింటా ప్రచారం చేస్తానని లోకే‹శ్ ప్రకటించారు. అందుకే వారిద్దరినీ పొలిటికల్ బఫూన్లుగా ప్రజలు చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభకోణాల ద్వారా ప్రజాధనాన్ని దోచుకున్నారని నిరూపితమైంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. అలా జైల్లో ఉన్న చంద్రబాబును కలిశాక టీడీపీతో పొత్తును పవన్ ప్రకటించారంటే.. ఆయన అవినీతిలో ఈయనకు వాటా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బలహీనపడ్డ టీడీపీ తన మద్దతుతో బలం పుంజుకుంటుందని పొత్తు పెట్టుకున్న జనసేన.. క్షేత్ర స్థాయిలోకి వచ్చే సరికి చతికిలపడింది. అవనిగడ్డ, పెడన, ముదినేపల్లిలలో పవన్ సభలు అట్టర్ ఫ్లాప్ కావడమే అందుకు నిదర్శనం. టీడీపీతో పొత్తు ప్రజలెవరికీ ఇష్టం లేకపోవడంతో జనసేన బలహీన పడిందన్న వాస్తవాన్ని పవన్ తెలుసుకోవాలి. -
సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం
కర్నూలు (లీగల్): సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం సాధ్యమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పనిచేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, తాజాగా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కూడా చేరిందని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని, న్యాయవాదులు దీనిని బాగా వినియోగించుకోవాలన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌కు జి.భూపాల్‌రెడ్డి చైర్మన్‌గా, ట్రిబ్యునల్ మెంబర్లుగా నాగేశ్వరరావు, అబ్దుల్ మజీద్ వ్యవహరిస్తారన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, ప్రశ్నలు, ఇతర విషయాలపై వక్ఫ్ ఆస్తుల నిర్ధారణ హక్కులు, ప్రయోజనాలను సమర్థించేందుకు ట్రిబ్యునల్ కోర్టు పని చేస్తుందని చెప్పారు. విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టులో 213 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ జి.సృజన, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రతిభాదేవి, జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కల్యాణి పాల్గొన్నారు. -
రూ.2 కోట్ల భారీ నష్టపరిహారం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రూ.2 కోట్లకు పైగా నష్టపరిహారం ఇవ్వాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. మనీష్ గౌతమ్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఢిల్లీలోని రోహిణి మార్గ్‌లో 2019 మే 31న రోడ్డు పక్కన నడుస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన గౌతమ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆ మర్నాడు జూన్ 1న మరణించారు. అయితే బాధితుడు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే నష్టపరిహారం ఇవ్వాల్సిన పని లేదని ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన వాదనలను ట్రిబ్యునల్ న్యాయమూర్తి తోసిపుచ్చారు. గౌతమ్ కుటుంబ సభ్యులకు 2 కోట్ల 50 వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఆదేశించారు. -
కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ సర్కారు పదే పదే తొండాట ఆడుతోంది. పరిష్కారమైన అంశాన్ని, అవాస్తవాలను వల్లె వేస్తూ వివాదాన్ని రాజేస్తోందని నీటి పారదుల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీలు (34 శాతం) కేటాయిస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు ఒప్పందం చేసింది. ఆనాటి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అమర్జీత్సింగ్ సమక్షంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను మళ్లీ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. ఈ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో సర్వ సభ్య సమావేశంలో చర్చించి తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం చెప్పింది. అయితే, తాత్కాలిక సర్దుబాటు ఒప్పందానికి అంగీకరించిన తెలంగాణ ఆ తర్వాత ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో కృష్ణా జలాల్లో సగ భాగం కావాలంటూ వివాదాన్ని రాజేస్తోంది. బుధవారం జరిగిన కృష్ణా బోర్డు 17వ సర్వ సభ్య సమావేశంలోనూ అదే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీవి విచారిస్తున్న క్రమంలో మార్చి 24న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీలో తమ పరిధి పరిమితమని చెప్పింది. నిర్దిష్టంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేసింది. ఇప్పటికే నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని సంకేతాలిచ్చింది. అంటే.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఉద్ఘాటించింది. తద్వారా నీటి లభ్యత 75 శాతం ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను మినహాయించి, 65 శాతం లభ్యత ఆధారంగా తాము అదనంగా కేటాయించిన 194 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపైనే విచారిస్తామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పేర్కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
మహానది– గోదావరి అనుసంధానానికి చిక్కులు
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి అనుసంధానానికి ప్రతిపాదన దశలోనే న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య మహానది జలాల వినియోగంలో వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇప్పటిదాకా తుది నివేదిక ఇవ్వలేదు. మహానది జలాల వినియోగం వివాదంపై ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే మహానది–గోదావరి అనుసంధానంపై ముందుకెళ్లాలని సోమవారం నిర్వహించిన 17వ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ఇదీ ప్రతిపాదన ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, వాటిని గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. తెగని మహానది జలాల వివాదం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి మూడేళ్ల గడువిచ్చింది. గడువులోగా విచారణ పూర్తి చేయలేదు. దాంతో 2021 మార్చి 11న గడువును మరో రెండేళ్లు పెంచింది. ఈ గడువు కూడా శుక్రవారంతో ముగిసింది. ఇప్పటికీ ట్రిబ్యునల్ కేంద్రానికి తుది నివేదిక ఇవ్వలేదు. మహానది టు కావేరి వయా గోదావరి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ 2021 ఏప్రిల్‌లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేసింది. గోదావరి నికర జలాల్లో మిగులే లేదని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మిగులు తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ, తెలంగాణ ఆదిలోనే స్పష్టం చేశాయి. దాంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించేలా డీపీఆర్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో దీనిపై చర్చించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని గోదావరి జలాలకు.. 230 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది – గోదావరి – కావేరిలను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులను అధిగమించవచ్చునని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. -
ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?
సాక్షి, అమరావతి: ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) రద్దు తరువాత అక్కడి ఉద్యోగులు డిప్యుటేషన్‌పై హైకోర్టులో పనిచేస్తుండగా, తమను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రయత్నించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. హైకోర్టులో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీఏటీ ఉద్యోగులను ఇతర శాఖలకు పంపాలనుకోవడం సరైన చర్యకాదని అభిప్రాయపడింది. వారు గతంలో కొద్దికాలం తమ వద్ద పనిచేశారని, కాబట్టి వారు తమ వద్దే పనిచేయడం సబబని తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. హైకోర్టును సంప్రదించకుండా ఏపీఏటీ ఉద్యోగుల బదిలీ విషయంలో లేఖ రాయడం తప్పేనన్నారు. ఇందుకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. ఆ లేఖను ఇప్పటికే ఉపసంహరించుకున్నామని ఆయన కోర్టుకు నివేదించారు. అయితే, ఏపీఏటీ ఉద్యోగులు హైకోర్టులో పనిచేయడానికి నిబంధనలు అంగీకరించవని, ఈ విషయంలో హైకోర్టుతో ప్రభుత్వాధికారులు చర్చలు జరుపుతున్నారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. కోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సిబ్బంది లేఖ రాయడం క్రమశిక్షణారాహిత్యం హైకోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులను వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనివల్ల హైకోర్టు కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయంటూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. హైకోర్టులో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులు తమను ఇతర శాఖల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి నేరుగా లేఖ రాయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇది క్రమశిక్షణారాహిత్యమేనని తెలిపింది. మరోవైపు.. హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఓ ఉద్యోగి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, ఆమె అక్కడే కొనసాగించేందుకు దయతో అనుమతినివ్వాలన్న ఆ ఉద్యోగిని తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తాము దయతో కాకుండా కేసులో ఉన్న దమ్మును బట్టి ఉత్తర్వులిస్తామంది. హైకోర్టులో చాలామంది ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్ వెళ్తున్నారని, జడ్జీలు కూడా వెళ్తున్నారని, ఇలా అందరూ హైదరాబాద్‌కు వెళ్తే విజయవాడలో ఎవరుంటారని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం హైకోర్టుతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. (చదవండి: ‘ఆపద్బాంధవి’ మరింత బలోపేతం.. మరిన్ని 108 అంబులెన్స్‌లు) -
ఎలక్ట్రిక్ వాహనాలు: హీరో మోటోకు భారీ ఊరట
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్స్‌కు భారీ ఊరట లభించింది. హీరో ట్రేడ్ మార్క్ వివాదంపై విజయం సాధించింది. తన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి 'హీరో' ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించుకోవచ్చని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కేసు తుది పరిశీలన చేసిన తర్వాత ట్రైబ్యునల్ తన నిర్ణయాన్ని ప్రకటించిందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ వాదనలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. ఈమేరకు హీరో గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా సమాచారమిచ్చింది. ట్రేడ్ మార్క్ వినియోగానికి సంబంధించి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, రిటైర్డ్ న్యాయమూర్తులు ఇందు మల్హోత్రా, ఇందర్మీత్ కౌర్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ అనుకూలంగా తీర్పునిచ్చిందని హీరో మోటో తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏథెర్ ఎనర్జీ వ్యాపారంపై హీరో మోటో కార్ప్ 400 కోట్ల పెట్టుబడులు, గత 10 ఏళ్లలో హీరో బ్రాండ్ గుడ్ విల్, రిపుటేషన్ బిల్డింగ్‌పై దాదాపు రూ. 7వేల కోట్ల వెచ్చించిన విషయాన్ని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉద్ఘాటించిందని కంపెనీ పేర్కొంది. అయితే హీరో ఎలక్ట్రిక్ ప్రమోషన్ కోసం నవీన్ ముంజాల్ గ్రూప్ రూ.65 కోట్లు పెట్టుబడి పెట్టిందట. 'హీరో' బ్రాండ్‌పై తమకే ప్రత్యేక యాజమాన్య హక్కులు ఉన్నాయని పేర్కొంటూ హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌తో న్యాయ పోరాటం చేస్తున్నారు నవీన్ ముంజాల్. ఈ క్రమంలోనే హీరో బ్రాండ్ నేమ్‌తో హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను వ్యతిరేకిస్తూ హీరో ఎలక్ట్రిక్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. నవీన్ ముంజాల్ నేతృత్వంలోని హీరో ఎలక్ట్రిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది. కాగా జూలైలో ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించాలనుక్ను హీరో మోటో కార్ప్ ఈ సంవత్సరం పండుగ సీజన్‌కు దీన్ని వాయిదా వేసింది. -
కర్నూలులో వద్దని ఏ చట్టంలోనైనా ఉందా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తేల్చిచెప్పింది. ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం కలగడం లేదంది. విశాఖపట్నం, అనంతపురం నుంచి హైకోర్టుకు వస్తున్నారని, అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు దారి తీసిన కారణంతో చిన్న అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని వక్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. జీవో 16ను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన మహ్మద్ ఫరూక్ షుబ్లీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ, సీఎం ఆదేశాల మేరకే కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పా టు జీవో వచ్చిందన్నారు. ఇది మైనారిటీల ప్రయోజనాలకు విరుద్ధమని చెప్పారు. దీనిని విజయవాడలో ఏర్పాటు చేస్తూ 2016లోనే జీవో జారీ అయిందన్నా రు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఇందులో జోక్యం చేసుకునే పరిధి తమకెక్కడిదని ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల పిటిషనర్‌కొచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించింది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ, కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటుకు స్పష్టమైన కారణాలున్నాయన్నారు. అత్యధిక ముస్లిం జనాభా కర్నూలులో ఉందన్నారు. ఇందులో ముఖ్యమంత్రి పేరు తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ వివరాలతో చిన్న అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. -
సహారాకి షాక్ ! సెబీకి రూ.2,000 కోట్లు డిపాజిట్ చేయండి!
న్యూఢిల్లీ: రెగ్యులేటరీ నిబంధనావళిని ఉల్లంఘించి దాదాపు రూ.14,000 కోట్ల వసూలు కేసులో సహారా గ్రూప్ సంస్థ, ఆ సంస్థ డైరెక్టర్లకు శాట్‌లోనూ పూర్తి ఊరట లభించలేదు. మార్కెట్ రెగ్యులేటర్– సెబీ ఎస్క్రో అకౌంట్లో రూ.2,000 కోట్లు డిపాజిట్ చేయాలని సహారా గ్రూప్ సంస్థ– సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ (ఎస్‌ఐసీసీఎల్), ఆ సంస్థ మాజీ డైరెక్టర్లను సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్) ఆదేశించింది. ఇందుకు నాలుగువారాల గడువు మంజూరు చేసింది. ఈ నిధుల డిపాజిట్ తర్వాతే గ్రూప్ కంపెనీ, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా సెబీ రికవరీ ఆఫీసర్ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. శాట్ ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్లలో గ్రూప్ చైర్మన్ సుబ్రతారాయ్ కూడా ఉన్నారు. ఆస్తుల వివరాలు అందజేయాలని స్పష్టీకరణ ఆస్తులు, తదితర వివరాలు కూడా సెబీకి సుబ్రతారాయ్ అఫిడవిట్ రూపంలో అందజేయాలని శాట్ ఆదేశించింది. ‘‘భారతదేశం, అలాగే విదేశాలలో ఉన్న అన్ని ఆస్తులు, అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్ ఖాతాల పూర్తి జాబితాను, మ్యూచువల్ ఫండ్స్/షేర్లు/సెక్యూరిటీలను (భౌతికంగా లేదా డీమ్యాట్ రూపంలో) సెబీకి నాలుగు వారాల్లోగా అందజేయాలని మేము మొదటి అప్పీలుదారు– సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్, రెండవ అప్పీలుదారు– సహారా ఇండియాలను ఆదేశిస్తున్నాము’’అని శాట్ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. ఇరువురికి ఊరట... కాగా, వృద్ధాప్యం, అత్యవసర వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కంపెనీ అప్పటి డైరెక్టర్లు ఇరువురు– ఏఎస్ రావు, రనోజ్ దాస్ గుప్తాలకు వ్యతిరేకంగా జారీ అయిన జప్తు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని సెబీ రికవరీ ఆఫీసర్‌ను శాట్ ఆదేశించింది. కేసు వివరాలు ఇవీ... ఎటువంటి రెగ్యులేటరీ నిబంధనలు పాటించకుండా దాదాపు 2 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి ఐచ్ఛిక పూర్తి కన్వర్టబుల్ డిబెంచర్ల (ఆప్షనల్లీ ఫుల్లీ కన్వెర్టబుల్ డిబెంచర్లు) ద్వారా 1998 నుంచి 2009 మధ్య ఎస్‌ఐసీసీఎల్ ఈ నిధులు సమీకరించిందన్నది ఈ కేసులో సహారా గ్రూప్ సంస్థ, కంపెనీ అప్పటి డైరెక్టర్లపై ఆరోపణ. కంపెనీ వసూలు చేసిన రూ.14,000 కోట్లను 15 శాతం వార్షిక వడ్డీతోసహా రిఫండ్ చేయాలని ఎస్‌ఐసీసీఎల్, ఆ కంపెనీ ఒకప్పటి డైరెక్టర్లను 2018 అక్టోబర్‌లో సెబీ ఆదేశించింది. అలాగే ఇతర సంస్థలతో భాగస్వామ్యాల నుంచి కూడా ఎస్‌ఐసీసీఎల్‌ను, ఆ సంస్థ డైరెక్టర్లను సెబీ నిషేధించింది. ఈ కేసుకు సంబంధించి 2021 ఏప్రిల్‌లో సెబీ రికవరీ ఆఫీసర్ ఎస్‌ఐసీసీఎల్‌కు, కంపెనీ అప్పటి డైరెక్టర్లకు డిమాండ్ నోటీస్ జారీ చేశారు. రూ.14,106 కోట్లు 15 రోజుల్లో డిపాజిట్ చేయకపోతే రికవరీ ప్రక్రియ తప్పదని స్పష్టం చేశారు. డబ్బు చెల్లించకపోవడంతో అక్టోబర్ 2021న జప్తు ఉత్తర్వులుజారీ చేశారు. బ్యాంక్ అకౌంట్లు, డీమ్యాట్ అకౌంట్లు తదితర వారి ఆస్తుల అన్నింటి జప్తునకు బ్యాంకులు తత్సబంధ అధికారులకు జప్తు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సహారా శాట్‌ను ఆశ్రయించింది. చదవండి: రెండు లక్షల కోట్ల రూపాయల ఐపీవో! భారీ పబ్లిక్ ఇష్యూ! -
కేంద్రం దృష్టికి కొత్త ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేలా చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. కృష్ణా జలాల విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయిన నేపథ్యం లో కొత్త ట్రిబ్యునల్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి, రాష్ట్రానికి న్యాయమైన నీటి హక్కులు దక్కేలా చూడాలని విన్నవించనుంది. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అందులో మరోమారు ప్రస్తావించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలిసారిగా 2014లోనే లేఖ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే 2014 జూలై 14న కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఒక లేఖ రాసింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, పంపకాల్లో అసమానతలను వివరిం చింది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఆయకట్టు 62.5 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటా యింపులు ఏమాత్రం సరిపోవు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో పరివాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం మాత్రమే ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎం సీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. పరివాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలని ఆ లేఖలో పేర్కొంది. స్పందించని కేంద్రం రాష్ట్రం చేసిన అభ్యర్థనపై చట్ట ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించాల్సి ఉన్నా ఉలుకూపలుకూ లేకపోవడంతో 2015లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలావుండగా గత ఏడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా ఈ అంశాన్ని మరోమారు లేవనెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్‌చే విచారణ చేయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలంగాణ డిమాండ్‌ను అంగీకరిస్తామంటూనే... సుప్రీం కోర్టులో తెలంగాణ పిటిషన్ వేసిఉన్న కారణంగా తాము ఎటువంటి చర్య తీసుకోలేక పోతున్నామన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం.. కేంద్రం గనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్టే పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామన్నారు. ఆ మేరకు రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు నాలుగు నెలల కిందట ప్రభుత్వం పిటిషన్ పెట్టుకుంది. సుప్రీం ఓకే చెప్పడంతో.. సుప్రీంకోర్టు బుధవారం ఉపసంహరణకు ఓకే చెప్పడంతో ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్రం నిర్ణయించింది. కొత్త ట్రిబ్యునల్‌ను త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు నిర్దిష్ట కాలపరిమితితో తుదితీర్పు వెలువడేలా చూడాలని లేఖలో కోరే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి కేటాయింపులు 500 టీఎంసీలకు పెరగాల్సి ఉందన్న విషయాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి. చదవండి: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై -
కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కసరత్తు తుది అంకానికి చేరింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కూడా అక్కడే ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వక్ఫ్ భూముల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న వక్ఫ్ ట్రిబ్యునల్ నుంచి ఏపీకి వాటాగా రావాల్సిన సిబ్బందిని కేటాయించాలని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో హైదరాబాద్ ట్రిబ్యునల్‌లో పనిచేస్తున్నవారిలో తెలంగాణకు 60 శాతం, ఏపీకి 40 శాతం చొప్పున కేటాయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ మరో 15 రోజుల్లో కొలిక్కి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే జిల్లా జడ్జిని న్యాయాధికారి (ప్రిసైడింగ్ ఆఫీసర్)గా నియమించడం ద్వారా ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుంది. ఇదంతా పూర్తి కావడానికి నెల నుంచి రెండు నెలలు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వక్ఫ్ భూముల వివాదాలకు త్వరితగతిన పరిష్కారం.. వక్ఫ్ భూములు, వాటి వివాదాలను త్వరితగతిన విచారించి పరిష్కరించడంలో ట్రిబ్యునల్ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు. చంద్రబాబు తన పాలనలో ఈ అంశంపై పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా హైదరాబాద్‌లోని వక్ఫ్ ట్రిబ్యునల్‌కే ఏపీ కేసులనూ పంపిస్తున్నారు. అయితే అక్కడ విచారణ వేగంగా జరగడం లేదు. ఫలితంగా ఏపీకి చెందిన వక్ఫ్ భూముల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇలా దాదాపు 400 నుంచి 450 కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పెండింగ్ కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇందుకు అవసరమైన చర్యలను మైనార్టీ సంక్షేమ శాఖ వేగవంతం చేసింది. -
అమెజాన్-ఫ్యూచర్-రిలయన్స్ కేసు! విచారణ వాయిదా ఎందుకంటే..
Amazon-Future-Reliance Case ఫ్యూచర్–రిలయన్స్ ఒప్పందంపై అమెజాన్ దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు ఈ నెల 20న విచారించనుంది. న్యూఢిల్లీ: ఫ్యూచర్–రిలయన్స్-అమెజాన్ కేసు విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారీమన్, కేఎం జోసెఫ్, బీఆర్ గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు గురువారం ఈ వివాదం విచారణకు వచ్చింది. అయితే ఇదే కేసుపై జూలై 12న నుంచీ సింగపూర్ ట్రిబ్యునల్ విచారణ జరపనుందని, ఈ పరిస్థితుల్లో వారం పాటు కేసు విచారణను వాయిదా వేయాలని ధర్మాసనానికి ఫ్యూచర్స్ తరఫు సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ విషయంలో తనకూ అభ్యంతరం ఏదీ లేదని అమెరికా ఈ కామర్స్ దిగ్గజం– అమెజాన్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియన్ కూడా పేర్కొనడంతో కేసు తదుపరి విచారణను 20కి వాయిదావేస్తూ బెంచ్ నిర్ణయం తీసుకుంది. వివాదంలో రూ.24,713 కోట్ల డీల్.. రిలయన్స్‌కు ఫ్యూచర్ రిటైల్ తన రిటైల్ అండ్ హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌ను విక్రయిస్తూ 2020లో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల డీల్‌పై అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. ఫ్యూచర్ అన్‌లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్ రిటైల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. అయితే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ నుంచి అమెజాన్‌కు వ్యతిరేక రూలింగ్స్ వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టును అమెజాన్ ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకుంది. ఇదే కేసు సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) కూడా విచారించనుంది. -
కొత్త ట్రిబ్యునల్‌పై న్యాయ సలహా కోరిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–3 ప్రకారం విచారించేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్ర జల శక్తి శాఖ న్యాయ శాఖ సలహా కోరినట్లు తెలిసింది. అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకున్న నేపథ్యంలో దీనిపై ఏవిధంగా ముందుకెళ్లాలో తెలపాలని న్యాయ శాఖ కార్యదర్శి అనూప్‌కుమార్‌కు జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ రాసినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర న్యాయ శాఖ ఇచ్చే సూచనల మేరకు జలశక్తి శాఖ ఈ విషయంలో ముందుకు వెళ్లనుంది. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను.. విభజన చట్టంలోని సెక్షన్–89 ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్–3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేసేలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని గత నెల 16న రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, న్యాయ నిపుణుల సలహాతో ట్రిబ్యునల్ ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకుంటామని అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇచ్చిన హామీని లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. -
డీమోనిటైజేషన్: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్) తర్వాత బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసిన గృహిణులకు సంబంధించి ఎటువంటి పరిశీలన అవసరం లేదని ఆదాయపన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీ ఏటీ) ఆగ్రా బెంచ్ స్పష్టం చేసింది. ఆ ఆదాయాన్ని అసెస్సీ ఆదాయంగా పరిగణించరాదని పేర్కొంది. ఈ ఆదేశాలు ఇదే మాదిరి అన్ని కేసులకూ వర్తిస్తుందని తేల్చింది. గ్వాలియర్‌కు చెందిన గృహిణి ఉమా అగర్వాల్ 2016–17 ఏడాదికి రూ.1,30,810 ఆదాయంగా పేర్కొం టూ ఐటీ రిటర్ను దాఖలు చేశారు. డీమోనిటైజేషన్ తర్వాత రూ.2,11,500 పెద్ద నోట్లను డిపాజిట్ చేశారు. దీంతో ఈ కేసును పరిశీలన కోసం ఆదాయపన్ను శాఖ తీసుకుంది. భర్త, పిల్లలు, బంధువులు ఇవ్వగా పొదుపు చేసుకున్న మొత్తం ఇదంటూ ఆమె ఆదాయపన్ను శాఖ పరిశీలన అధికారికి వివరించారు. కానీ, దీన్ని ఆదాయపన్ను శాఖ అంగీకరించలేదు. వివరణలేని ధనంగా తేల్చింది. దీనిపై అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆమె ఆశ్రయించారు. చదవండి: జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు?! -
వంశధార ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరం: సీఎం జగన్
-
జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: భూవివాదాల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూవివాదాలపై విచారణ జరిపి పరిష్కరించేందుకు ప్రతి జిల్లాకో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభ్యుడిగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. జిల్లా స్థాయిలో మూడంచెల్లో తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 16 వేల కేసులు పరిష్కారమయ్యే వరకు ఈ ట్రిబ్యునళ్లు పనిచేయనున్నాయి. ఆ తర్వాత అవసరాల మేరకు వీటి కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత సెప్టెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం–2020 తీసుకొచ్చింది. ఇనామ్‌తో పాటు రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం–1971 రద్దయిన నేపథ్యంలో వివిధ స్థాయిల్లోని రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 16,137 కేసులను ప్రభుత్వం అప్పట్లో సీసీఎల్ఏ (భూపరిపాలన ప్రధాన కమిషనర్)కు బదిలీ చేసింది. తాజాగా ఈ కేసులను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్లకు అప్పగించింది. బదిలీ చేసిన నెల రోజుల్లోగా అన్ని కేసులను పరిష్కరించాలని ట్రిబ్యునళ్లకు గడువు విధించింది. అదనపు కలెక్టర్(రెవెన్యూ) పోస్టు ఖాళీగా ఉంటే, ఆయన స్థానంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ట్రిబ్యునల్ సభ్యుడిగా.. ఆ రెండు పోస్టులు ఖాళీగా ఉన్న సమయంలో డీఆర్వో సభ్యుడి గా వ్యవహరిస్తారని స్పష్టం చేసింది. చివరకు కలెక్టర్లకే బాధ్యతలు రిటైర్డ్ జిల్లా జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో తాత్కాలిక రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైరైన ఐఏఎస్‌లతో ఈ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకున్న అవకాశాలను సైతం ప్రభుత్వం పరిశీలించింది. ఇలా కొంతమంది అధికారుల జాబితాలను సైతం ప్రభుత్వం సిద్ధం చేసింది. చివరకు జిల్లా కలెక్టర్లకే ఈ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రిబ్యునళ్ల ప్రత్యేకతలు.. జిల్లా కేంద్రంలోనే కాకుండా అవసరమైతే రెవెన్యూ డివిజనల్, మండల కేంద్రాల్లో కేసుల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ సమావేశం కావచ్చు. ట్రిబ్యునళ్ల కోసం జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండే ఉద్యోగుల సేవలనే వినియోగించుకోవాలి. ప్రతి కేసుకు సంబంధించిన తీర్పులను కంప్యూటరైజ్డ్ చేయాలి. కేసు పురోగతిని ట్రాక్ చేసి పరిష్కరించేందుకు వీలుగా కేసుకు సంబంధించిన మెటా డేటాను జాగ్రత్తపర్చాలి. సిస్టం ద్వారా ప్రతి కేసుకు నంబర్ కేటాయించాలి. తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం–2020లోని సెక్షన్ 13లో పేర్కొన్న అధికారాలన్నీ ట్రిబ్యునల్‌కు సంక్రమిస్తాయి. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ ట్రిబ్యునల్‌కు బదలాయించాలి. చట్టం మేరకు ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు అమలవుతాయి. కేసుల పరిష్కారం అనంతరం వీటికి సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టరేట్లో నిబంధనల ప్రకారం భద్రపర్చాలి. -
ట్రిబ్యునల్‌కు భూ పంచాయితీలు
ఎస్.శ్రీనివాస్ అనే వ్యక్తి సిరిసిల్ల నివాసి. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో 1.24 ఎకరాలు ఉందని, రెవెన్యూ అధికారులు తనకు తెలియకుండానే మరొకరి పేరిట పట్టాచేశారని ఫిర్యాదు చేశాడు. ఆర్డీవో కోర్టులో ఏడాదికి పైగా కేసు నడుస్తోంది. ఇరువర్గాల వాదనలు ఆర్డీవో విన్నారు. హియరింగ్ ముగిసింది. తీర్పు వస్తుందనే దశలో కరోనా లాక్డౌన్ వచ్చింది. కేసు వాయిదా పడింది. లాక్డౌన్ అనంతరం భూ వివాదం పరిష్కారం అవుతుందని ఇరువర్గాలు భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శ్రీనివాస్ కేసు ఆర్డీవో కోర్టులో అలాగే ఉంది. ఇలాంటి కేసులు జిల్లాలో దాదాపు 736వరకు ఉన్నాయి. వీటిల్లో జేసీకోర్టులో ఇటీవలే తీర్పులు వచ్చి హైకోర్టుకు వెళ్లిన కేసులు 20వరకు ఉన్నాయి. హియరింగ్‌లో 56 కేసులు ఉన్నాయి. ముస్తాబాద్(సిరిసిల్ల): ఏళ్లుగా కొనసాగుతున్న భూ పంచాయితీల సత్వర పరిష్కారానికి తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. రెవెన్యూకోర్టులో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తోంది. భూముల ధరలు పెరగడం, భూ పంచాయితీ సమస్యలతో దాడులు, హత్యలు వంటి ఘటనలు జరగకుండా ట్రిబ్యునల్ దోహదపడేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల కోర్టుల్లో 736కేసులు ఉన్నాయి. ఇవి సంవత్సరాలుగా హియరింగ్ జరగడం, వాయిదాల దశలో ఉన్నాయి. కొన్ని తుదితీర్పు దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకురావడం, అందులో భాగంగా భూ పంచాయితీలకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు. అధికారులకు తప్పనున్న పనిభారం ప్రోటోకాల్ అమలు, రెవెన్యూ సంబంధ పనులు, ఇతర బాధ్యతలతో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లు(ప్రస్తుత అడిషనల్ కలెక్టర్లు) బీజీగా ఉంటారు. భూ సేకరణ, మంత్రులు, అధికారుల పర్యటనలు, సమావేశాలతో ఒత్తిళ్లమధ్య విధులు నిర్వహిస్తుంటారు. దీంతో భూ సమస్యల పరిష్కారానికి వారికి సరైన సమయం, విచారణ చేసే అవకాశాలు తక్కువ. ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం లభిస్తుందని కక్షిదారులు ఆశిస్తున్నారు. రిటైర్డుజడ్జి ద్వారా ట్రిబ్యునల్ జిల్లాలో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ట్రిబ్యునల్‌కు బదలాయింపు చేస్తారు. నూతన రెవెన్యూ చట్టం ప్రకారం రిటైర్డు జడ్జిని నియమించి కేసుల పరిష్కారానికి కృషి చేయనున్నారు. ప్రతి వెయ్యి భూ పంచాయితీలకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. ఈ లెక్కన జిల్లాలో ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఫిర్యాదులు లేని భూ వివాదాలు జిల్లాలో ఫిర్యాదులు లేని భూ సమస్యలు చాలానే ఉన్నాయి. అన్నదమ్ముల భూ పంపిణీ వివాదాలు, సరిహద్దు పంచాయితీలు, ఒకరి పేరిటా ఉన్న భూమిని మరొకరి పేరుతో పట్టా చేయడం, ఆన్లైన్లో తప్పులు, రికార్డుల్లో తక్కువ భూమి నమోదు, సర్వే నంబర్లలో తప్పులు, 1బీ రికార్డుల్లో పేరు మార్పిడి, మ్యూటేషన్లు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో కొన్ని రెవెన్యూ కోర్టుల వరకు వెళ్తే.. ఊర్లో పెద్ద మనుషుల ద్వారా మరిన్ని పంచాయితీలు నడిచేవి ఉన్నాయి. వీటన్నింటికి ట్రిబ్యునల్ పరిష్కారం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
విశాఖలో ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని నగరం అయిన విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్‌ను ఏర్పాటు చేయవలసిందిగా రాజ్యసభ జీరో అవర్‌లో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో తలెత్తే వివాదాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 323 (ఏ) కింద ప్రతి రాష్ట్రంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ బెంచ్ ఏర్పాటు జరుగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో క్యాట్ ఏర్పాటు జరగలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 50 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో 60 శాతం మంది విశాఖపట్నంలోనే పని చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో క్యాట్ బెంచ్ లేనందున పిటిషనర్లు తమ వివాదాల పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్‌కు ప్రయాణం చే వస్తోంది. వ్యయ ప్రయాసలతో కూడిన ప్రయాణాల వలన ఉద్యోగులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. (భూ దోపిడీపై నిగ్గు తేల్చండి) విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్, కస్టమ్స్, పోర్టు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, రైల్వేస్, ఎయిర్పోర్ట్, హెచ్‌పీసీఎల్, ఎల్ఐసీ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందువలన ఉద్యోగుల సౌలభ్యం కోసం చైర్మన్, సభ్యులతో కూడిన క్యాట్ బెంచ్‌ను విశాఖపట్నంలో నెలకొల్పవలసిందిగా విజయసాయి రెడ్డి న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. (రాజ్యసభలో విశాఖ వాణి) విశాఖలో ట్రిపుల్ ఐటీని నెలకొల్పాలి అత్యధిక జనాభా కలిగి పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో ట్రిపుల్ ఐటీని నెలకొల్పాలని రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏయూలో తాత్కాలిక భవనాల్లో పనిచేస్తున్న ఐఐఎంకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. -
‘నేరడి’పై ట్రిబ్యునల్ కీలక ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: నేరడి బ్యారేజీ నిర్మాణ పనులకు మార్గం సుగమం చేసే దిశగా వంశధార నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టాక అంటే అక్టోబర్ ఆఖరు నుంచి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా సర్వే చేసి, ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా జనవరి 10, 2020న ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తాజా ఆదేశాలను రెండు నెలలపాటు నిలుపుదల చేయాలని ఒడిశా చేసిన విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ తిరస్కరించింది. వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ ముకుంద శర్మ నేతృత్వంలో సభ్యులు జస్టిస్ బీఎన్ చతుర్వేది, ప్రతిభారాణి, సీఎస్ విద్యానాథన్, డి.శ్రీనివాసన్, గుంటూరు ప్రభాకర్, గణేశన్ ఉమాపతి, వై.రాజగోపాలరావు, ఎమ్మెస్ అగర్వాల్, సుఖ్‌దేవ్ సారంగి, కటారి మోహన్, వసీం ఖాద్రీలతో కూడిన బృందం గతేడాది డిసెంబర్ 22 నుంచి 29 మధ్య శ్రీకాకుళంతో పాటు ఒడిశాలో వంశధార పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను పరిశీలించారు. తమ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా గతంలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న వంశధార ట్రిబ్యునల్.. సీడబ్ల్యూసీ నేతృత్వంలో నేరడి బ్యారేజీ వల్ల ఇరు రాష్ట్రాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలను సర్వే చేసి.. మ్యాపులు తయారీ చేసి జూన్ 30లోగా ఇవ్వాలని ఏప్రిల్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ముంపునకు గురయ్యే భూములను సర్వే చేయడానికి రూ. 15.68 లక్షలు, ఒడిశాలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించే పనులకు రూ. 5.91 లక్షల వ్యయంతో ఏపీ సర్కార్ టెండర్లు పిలిచింది. కానీ, ఒడిశా సర్కార్ సంయుక్త సర్వేకు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని సోమవారం ఏపీ సర్కార్ వంశధార ట్రిబ్యునల్‌కు వివరించింది. దాంతో.. వరదలు తగ్గాక అంటే అక్టోబర్ ఆఖరు నుంచి ఆరు వారాల్లోగా సర్వేను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని వంశధార ట్రిబ్యునల్ ఆదేశించింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది రాజగోపాల్, రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ విచారణకు హాజరయ్యారు. -
ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ కేఎం ధర్మాధికారి కమిషన్ తీసుకునే నిర్ణయం సరైంది కాదని భావిస్తే అప్పీల్‌కు రావచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కేడర్ విద్యుత్ ఉద్యోగుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఆప్షన్లు స్వీకరించి, వారి అభీష్టం మేరకే కేటాయింపులు జరపాలన్న ధర్మాధికారి కమిషన్ మార్గదర్శకాలపై స్పష్టత కోరుతూ తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఏపీ స్థానికత గల 1,157 మంది విద్యుత్ ఉద్యోగులను 2015 జూన్‌లో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేశాయి. అయితే రిలీవైన వారిని స్వీకరించడానికి ఏపీ విద్యుత్ సంస్థలు నిరాకరించడంతో ఈ వివాదం ప్రారంభమైంది. దీంతో ఈ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు గతంలో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏకసభ్య కమిషన్ నిర్ణయమే తుది నిర్ణయమని అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు తాజాగా సుప్రీంకోర్టు అనుమతించడంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఊరట లభించింది. వివాదానికి కారణమైన 1,157 మంది ఉద్యోగులకే పరిమితం చేయకుండా, మొత్తం విద్యుత్ ఉద్యోగుల విభజనను మళ్లీ జరపాలని ధర్మాధికారి ఇటీవల మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కేడర్ విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని రెండు రాష్ట్రాలను కోరారు. విద్యుత్ ఉద్యోగుల విభజనను రిలీవైన 1,157 మంది ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయాలా? అందరూ ఉద్యోగులకు వర్తింపజేయాలా? అన్న అంశంపై తెలంగాణ విద్యుత్ సంస్థలు స్పష్టత కోరుతూ పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు పైవిధంగా తీర్పు వెల్లడించింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ధర్మాధికారి కమిషన్ ఇంకా తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఆ లోగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండబోదని అధికార వర్గాలు తెలిపాయి. -
మీరు చెప్పిందేమిటి... జరిగిందేమిటి!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కేసులో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) బ్యాంకులకు అక్షింతలు వేసింది. అసెట్స్ అమ్మకం ద్వారా రూ. 37,000 కోట్లు రాబట్టేసుకుంటామంటూ ’తప్పుడు అభిప్రాయం’ కలిగించాయని, తీరా చూస్తే అమ్మకం జరగకపోగా.. రూ. 260 కోట్ల ఐటీ రీఫండ్‌ను రికవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయని వ్యాఖ్యానించింది. ‘రిలయన్స్ జియోకి అసెట్స్‌ను విక్రయించడం ద్వారా రూ. 37,000 కోట్లు వస్తాయని ఆర్‌కామ్ అంటే మీరంతా దానికి వంతపాడారు. భవిష్యత్ అంతా బంగారంగా ఉంటుందంటూ భ్రమలు కల్పించారు. కానీ అసలు అసెట్స్ అమ్మకమే జరగలేదు. మీరు విఫలమయ్యారు. జాయింట్ లెండర్స్ ఫోరమ్ విఫలమైంది. అసలు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పండి‘ అంటూ బ్యాంకులను.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య ఎన్సీఎల్ఏటీ బెంచ్ కడిగేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్ సంస్థకు బాకీలు కట్టుకోవడం కోసం ఐటీ రీఫండ్ నిధులను ఆర్‌కామ్ వినియోగించుకునేలా ఎందుకు అనుమతించరాదో చెప్పాలంటూ బ్యాంకులను ఆదేశించింది. దీనిపై రెండు పేజీల నోట్‌ను దాఖలు చేయాలని ఆదేశించిన ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. టెలికం పరికరాల సంస్థ ఎరిక్సన్కు రూ. 550 కోట్ల బాకీలు తీర్చకపోతే ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీతో పాటు ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుశిక్ష ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఐటీ రీఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్లను ఇందుకోసం ఉపయోగించుకునేలా తగు ఆదేశాలివ్వాలంటూ ఎన్సీఎల్ఏటీని ఆర్‌కామ్ ఆశ్రయించింది. -
పుంజులాయిడ్ దివాలాకు ఎన్సీఎల్టీ ఓకే!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగం కంపెనీ పుంజ్‌లాయిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ఆమోదించింది. రూ.853.83 కోట్ల రుణ బకాయిలను పుంజ్‌లాయిడ్ చెల్లించకపోవడంతో, ఐసీఐసీఐ బ్యాంకు ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్ అనుమతించింది. ఎన్సీఎల్టీ పూర్తి ఆదేశాల కాపీ తమకు అందాల్సి ఉందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పుంజ్‌లాయిడ్ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఐసీఐసీఐ బ్యాంకు గతేడాది జూన్‌లోనే పుంజ్‌లాయిడ్‌కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. అయితే, కంపెనీ నిర్వహణలో పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, రుణాల పునరుద్ధరణకు అనుకూలంగా ఉన్నట్టు ఎస్బీఐ, ఇతర రుణదాతలు ఐసీఐసీఐ పిటిషన్‌ను వ్యతిరేకించారు. పుంజ్‌లాయిడ్‌కు రూ.6,000 కోట్ల రుణ భారం ఉంది. ఇందు లో ఐసీఐసీఐ బకాయి మొత్తం రూ.854 కోట్లు. -
అమరావతిలో ఎన్సీఎల్టీ బెంచ్!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కేసుల భారం ప్రత్యేకించి ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ) 2016 కింద వివాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఒక అధికారిక ప్రకటనలో కేంద్రం తెలిపింది. ఈ బెంచ్‌ల ఏర్పాటుతో కేసుల సత్వర పరిష్కారం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ వివాదాలు అమరావతి బెంచ్ న్యాయపరిధిలోకి వస్తుండగా, మధ్యప్రదేశ్‌లోని దివాలా అంశాల న్యాయపరిధి ఇండోర్ బెంచ్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వివాదాలు హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ పరిధిలోకి వెళుతుండగా, మధ్యప్రదేశ్‌కు సంబంధించి దివాలా వివాదాలు అహ్మదాబాద్ బెంచ్ పరిధిలోకి వస్తున్నాయి. న్యూఢిల్లీలోని ప్రధాన బెంచ్ సహా దేశంలో ప్రస్తుతం 14 ఎన్సీఎల్టీ బెంచ్‌లు ఉన్నాయి. -
ఎస్సార్స్టీల్ ఇక ఆర్సెలర్ మిట్టల్‌దే!
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ దివాలా కేసు పురోగతిలో అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం తొలగించింది. దీంతో ఎస్సార్ స్టీల్ కోసం ఆర్సెలర్ మిట్టల్ తరఫున దాఖలైన అత్యధిక బిడ్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్ ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది. వివరాల్లోకి వెళితే... ఎస్సార్ స్టీల్ కోసం ఆర్సెలర్ మిట్టల్ దాఖలు చేసిన రూ.42,000 కోట్ల అత్యధిక బిడ్డింగ్‌పై ఈ నెల 11వ తేదీలోపు ఒక నిర్ణయం తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌ఏటీ) ఒక ఉత్తర్వు జారీ చేసింది. అయితే దీనిని 28 మంది ఆపరేషనల్ క్రెడిటార్స్ వ్యతిరేకించారు. ఎస్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వుకు స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్సీఎల్టీ తమ వాదనలు అందరివీ వేర్వేరుగా రోజూవారీ వినేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. అందరూ కలిసి ఒకే రిప్రజెంటేషన్ సమర్పించాలని ఎన్సీఎల్టీ ఆదేశించడం సరికాదని స్పష్టంచేశాయి. అయితే ఆపరేషనల్ క్రెడిటార్స్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేస్తూ, వారి ద్వారా ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లే దివాలా పక్రియను అడ్డుకుంటున్నట్లు పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంది. 270 రోజుల్లో దివాలా ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటికే 571 రోజులు గడిచిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఎన్సీఎల్ఏటీపై ఇక దృష్టి... కాగా ఆర్సెలర్ మిట్టల్ బిడ్డింగ్‌పై 11వ తేదీలోపు ఎన్సీఎల్టీ తుది నిర్ణయం ఇవ్వాలని లేదంటే 12వ తేదీన తానే ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఎన్సీఎల్ఏటీ గతంలో రూలింగ్ ఇచ్చింది. ఈ గడువు తీరడంతో ఇప్పుడు ఎన్సీఎల్ఏటీ చర్యలపై ఆసక్తి నెలకొంది.