న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ట్రిబ్యునళ్లకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మధ్యంతర ఏర్పాట్లు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. ట్రిబ్యునళ్లలో జడ్జీల నియామకాలు, వారి పదవీకాలం తదితరాలకు సంబంధించిన ఆర్థిక చట్టం–2017 రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ వచ్చిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంలో విచారణ ఇంకా కొనసాగాల్సి ఉన్నందున ప్రస్తుతానికి ట్రిబ్యునళ్లలో న్యాయమూర్తుల నియామకాల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేయాలనీ, ఇందుకోసం సంబంధిత వర్గాలతో చర్చలు జరపాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం కోరింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదావేసింది.
Comments
Please login to add a commentAdd a comment