పట్టిసీమ వినియోగాన్ని పట్టించుకోం | krishna board said dont main on pattiseema water use | Sakshi
Sakshi News home page

పట్టిసీమ వినియోగాన్ని పట్టించుకోం

Published Sat, Dec 10 2016 2:44 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

పట్టిసీమ వినియోగాన్ని పట్టించుకోం - Sakshi

పట్టిసీమ వినియోగాన్ని పట్టించుకోం

కృష్ణా జలాల పంపిణీపై తేల్చి చెప్పిన బోర్డు 
దాన్ని ట్రిబ్యునల్‌గానీ, కేంద్రం నియమించిన కమిటీగానీ తేల్చాలని వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి మళ్లీ ఎదురుదెబ్బే తగిలింది. తొలి నుంచీ ఏపీ చెప్పినట్లుగా తలూపుతున్న కృష్ణా బోర్డు మళ్లీ వారి వాదననే సమర్థించింది. పట్టిసీమ నుంచి ఇప్పటివరకు ఏపీ చేసిన వినియోగాన్ని లెక్కలోకి తీసుకోలేమంది. గోదావరి నుంచి కృష్ణాకు తరలించే జలాలపై ఏ విధంగా వ్యవహరించాలన్న అంశాన్ని కృష్ణా వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 గానీ, కేంద్రం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీగానీ తేల్చాలంది. అప్పటివరకూ పట్టిసీమ విని యోగాన్ని పరిగణనలోకి తీసుకోలేమంటూ శుక్రవారం తెలంగాణకు రాసిన లేఖలో పే ర్కొంది. ఇదే జరిగితే ప్రస్తుత లభ్యత జలాల్లో తెలంగాణకు కేటారుుంపులు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది.

 52 టీఎంసీలు హాంఫట్..!
ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టు నీటి వినియోగంపై తొలి నుంచీ వివామే. ఆ నీటి వినియోగాన్ని లెక్కలోకి తీసుకోరాదని ఏపీ వాదిస్తోం టే... దాన్ని లెక్కలోకి తీసుకునే కేటారుుంపు లు చేయాలని తెలంగాణ కోరుతోంది. దీనిపై తెలంగాణ ఇటీవలే కృష్ణా బోర్డుకు స్పష్టత ఇచ్చింది కూడా. ఎక్కడి నుంచి వచ్చి అరుునా కృష్ణాలో కలిశాక అదంతా కృష్ణా నీరే అవుతుందంది. ఒక నది నుంచి మళ్లిస్తూ కృష్ణాలో కలిపిన నీటిని కృష్ణా నీటిగా కాకుండా వేరుగా పరిగణించలేమని పేర్కొంది. పట్టిసీమలో ఏపీ చేసిన 52 టీఎంసీల వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని నీటి కేటారుుంపులు చేయాలని కోరింది. కానీ రాష్ట్ర అభ్యర్థనను కృష్ణా బోర్డు పట్టించుకోలేదు.

ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు శుక్రవారం ఒక లేఖ రాసింది. ‘‘ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం పట్టిసీమ నీటి తరలింపు అంశం కేడబ్ల్యూడీటీ-2 తేల్చాల్సి ఉందని అభిప్రాయపడింది. బోర్డు 5వ సమావేశంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలు చూడాలని తెలంగాణ కోరింది. దీనిని కేంద్ర జల వనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనిపై తుది నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది.

ఈ దృష్ట్యా పట్టిసీమ ద్వారా తరలించి చేస్తున్న జలాల వినియోగాన్ని మేం పట్టించుకోబోం..’’అని బోర్డు అందులో పేర్కొంది. పట్టిసీమ వినియోగాన్ని లెక్కలోకి తీసుకుంటే ఏపీ వినియోగం 234.84 టీఎంసీలు, తెలంగాణ వినియోగం 74.19 టీఎంసీలు అని... కానీ తాము పట్టిసీమను పక్కన పెడుతున్నందున ఏపీ వినియోగాన్ని 186.31 టీఎంసీలుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. దీంతో 52 టీఎంసీలు కృష్ణార్పణం అరుుపోరుుంది.

‘మైనర్’లెక్కలు పక్కన పెడితే..
బోర్డు పేర్కొన్న ప్రకారం తెలంగాణ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే... రాష్ట్రానికి 56.30 టీఎంసీల మేర దక్కాల్సి ఉంది. అరుుతే మైనర్ ఇరిగేషన్‌పై భిన్న వాదనల నేపథ్యంలో వాటిని పూర్తిగా పక్కనపెట్టి వేసిన లెక్కల ప్రకారం తెలంగాణకు 43 టీఎంసీలు ఇస్తామని బోర్డు చెబుతోంది. దీంతో 13 టీఎంసీల మేర కోత పడుతోంది. అరుుతే తమ అభిప్రాయాలపై ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు పరిశీలన జరిపి, తమ ప్రభుత్వాలతో మాట్లాడి... ఓ అభిప్రాయానికి రావాలని కృష్ణా బోర్డు సూచించింది. 13వ తేదీలోగా ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే దానికే తాము మద్దతిస్తామని తెలిపింది. లేదంటే తగిన నిర్ణయాన్ని తామే ప్రకటిస్తామని పేర్కొంది.

వివిధ రకాల లెక్కలేసిన బోర్డు
కృష్ణా బేసిన్‌లోని మైనర్ ఇరిగేషన్ నీటి విని యోగంపై ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు చేస్తుండటంతో.. బోర్డు ఆ లెక్కలను పరిగణలోకి తీసుకుని పలురకాల లెక్కలను ఇరు రాష్ట్రాల ముందుంచింది. దాని ప్రకారం..

ఏపీ చెబుతున్నట్లుగా మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణ 89.15 టీఎంసీలు వాడి, పట్టిసీమ లెక్కలను పక్కనపెడితే... ప్రస్తుత లభ్యత నీటిలో ఏపీకి 110.62 టీఎంసీలు, తెలంగాణకు 19.33 టీఎంసీలు దక్కుతారుు.

ఆవిరి నష్టాలు, ‘మైనర్’కింద సరాసరి లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 93.68 టీఎంసీలు, తెలంగాణకు 36.28 టీఎంసీలు దక్కుతారుు.

ఆవిరి నష్టాలు, ‘మైనర్’కింద తెలంగాణ లెక్కలను పరిగణిస్తే ఏపీకి 73.65 టీఎంసీలు, తెలంగాణకు 56.30 టీఎంసీలు దక్కుతారుు.

మరో ప్రత్యామ్నాయం కింద ఆవిరి నష్టాలు, ‘మైనర్’వినియోగాన్ని పక్కన పెడితే ఏపీకి 87 టీఎంసీలు, తెలంగాణకు 43 టీఎంసీలు దక్కుతారుు.

పులిచింతల, జూరాలను సైతం కలుపుకొంటే ఏపీకి 93.33 టీఎంసీలు, తెలంగాణకు 45.65 టీఎంసీలు దక్కుతారుు.

ప్రస్తుత వాటర్ ఇయర్ సగానికి వచ్చినందున ఆవిరి నష్టాలు, మైనర్ వినియోగం పక్కన పెడుతూ వేసిన లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటామని బోర్డు పేర్కొంది. వచ్చే ఏడాది మాత్రం ఈ విధానం ఉండదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement