ట్రిబ్యునల్ ఏర్పాటుకు కృషి : ఏజేసీ
నల్లగొండ టౌన్ః
వృద్ధుల రక్షణ చట్టం అమలు నిమిత్తం రెవెన్యూ డివిజన్ అధికారులతో సంప్రదించి ట్రిబ్యునల్ ఏర్పాటుకు కృషిచేస్తామని ఏజేసీ వెంకట్రావ్ అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ భవన్‌లో జరిగిన సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 12 వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంఘానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అభినందనీయమన్నారు. వృద్దుల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతూ 2014 నుంచి సుమారు 40 కేసులను పరిష్కరించి వృద్ధులకు రక్షణ కల్పించామన్నారు. ప్రతి మంగళవారం సంతానం నుంచి ఆపదలను ఎదుర్కొంటున్న వారికి అవగాహన కల్పిస్తామన్నారు.కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ ప్రతినిధి శ్యాంప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల మల్లికార్జున్, కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ఎండి.రియాజ్‌అలి, విద్యాసాగర్, మట్టపల్లి, యాదయ ఎల్లయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు.