టాటా సన్స్‌పై న్యాయపోరాటంలో సైరస్ మిస్త్రీకి చుక్కెదురైంది. టాటా సన్స్‌కు వ్యతిరేకంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్‌లు దాఖలు చేయగా... అవి విచారించడానికి అర్హమైనవి కాదని ట్రిబ్యునల్ సోమవారం పేర్కొంది. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే విషయంలో అర్హత ప్రమాణాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. మిస్త్రీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్... టాటాసన్స్ చైర్మన్‌గా మిస్త్రీ తొలగింపును ట్రిబ్యునల్‌లో సవాల్ చేయడం తెలిసిందే.