టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక | Tata Sons appoints N Chandrasekaran as Chairman | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 12 2017 7:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

టాటా- మిస్త్రీ బోర్డ్ వార్ అనంతరం కీలక పరిణామం చేసుకుంది. టాటా సన్స్ బోర్డ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం గురువారం టాటా సన్స్ బోర్డ్ కొత్త ఛైర్మన్‌ ఎంపిక కోసం బోర్డ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీసీఎస్ చీఫ్ నటరాజన్ చంద్రశేఖరన్ ను టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా ఎంపిక చేశారు. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై టాటా గ్రూపు అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ చీఫ్ గా రాజేష్ గోపీనాథ్ ను ఎంపిక ఖాయమైనట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement