board meeting
-
USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక
డల్లాస్: మాట (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) బోర్డు మీటింగ్ డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట 2025-26 పదవీకాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మాట అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దగి బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ గూడూరు, సెక్రటరీగా విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్‌గా శ్రీధర్ గూడాల నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు, శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, అడ్వైజరీ కౌన్సిల్ మెంబెర్ జితేందర్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ బోర్డు మీటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీ, సలహా మండలి, బోర్డు, గౌరవ సలహాదారులు సహా 250 మందికి పైగా మాట ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్ లక్ష్యాలను నూతన అధ్యక్షుడు వెల్లడించారు.ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కృతి, సమానత్వం ప్రధాన సూత్రాలుగా మాట సంస్థ ఏర్పడిందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా మాట తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన అడ్వైజరీ కౌన్సిల్ , న్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరక్టర్స్, స్టాడింగ్ కమిటీ మెంబర్స్, RVP’s, RC’s గౌరవ సలహాదారులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. -
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సాక్షి,తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సోమవారం(నవంబర్18) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పలు నిర్ణయాలను పాలకమండలి ఆమోదించింది.టీటీడీ కీలక నిర్ణయాలివే..శ్రీవాణి ట్రస్ట్ రద్దు..టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అనుసంధానం.సర్వదర్శనం భక్తులకు 2,3గంటల్లోనే శ్రీవారి దర్శనానికి చర్యలువిశాఖ శారదా పీఠం లీజు రద్దు.. పీఠం భవనం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయంటీటీడీ అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ లేదా ప్రభుత్వానికి అటాచ్టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయంతిరుపతి ఫ్లైఓవర్‌కు గరుడ వారధి పేరు పునరుద్ధరణతిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లు నిషేధంతిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు -
ఛార్లెట్‌లో గ్రాండ్‌గా టీటీఏ బోర్డ్ మీటింగ్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డు మీటింగ్ ఛార్లెట్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాదిలో జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వాషింగ్టన్ లోని సియాటెల్‌లో జరిగే టీటీఏ మహాసభల గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల జరిగిన సేవా డేస్ కార్యక్రమాలతో పాటు మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ గురించి చర్చించారు. అంతకుముందు టీటీఏ సభ్యులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. బోర్డు సమావేశానికి సంస్థ సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి హాజరైనా సంస్థ వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఇటీవల కన్నుమూసిన ప్రజాగాయకుడు గద్దర్‌కి టీటీఏ బోర్డు ఘన నివాళులు అర్పించింది. సంస్థ సభ్యులు గద్దర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. తన ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని, ప్రజాగాయకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. గద్దర్ ఆలపించిన పాటలు పాడి ఆయన్ను గుర్తు చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన టీటీఏ బోర్డు మీటింగ్‌లో సంస్థ వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. టిటిఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి బోర్డ్ ప్రారంభ సందేశం వివరించారు. సియాటెల్‌లో జరిగే టిటిఎ మెగా కన్వెన్షన్ 2024ను విజయవంతం చేయాలన్నారు. అలాగే నిధుల సమీకరణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంస్థ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి.. సమావేశానికి హాజరైన బోర్డు మరియు టిటిఎ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సియాటెల్‌లో జరగనున్న టిటిఎ మెగా కన్వెన్షన్ అప్డేట్లను అందించారు. నిధుల సేకరణ, సాంస్కృతిక కార్యక్రమాలపై తన విజన్‌ను పంచుకున్నారు. సియాటెల్‌లో జరిగే కన్వెన్షన్‌ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. సంస్థ ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ మల్లిపెద్ది, EC సభ్యులు టిటిఎ మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. టిటిఎ మెగా కన్వెన్షన్‌కు సంబంధించి సూచనలను, సలహాలను, కార్యాచరణ ప్రణాళికలను అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి తెలియజేశారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాలపై అన్ని టిటిఎ రాష్ట్ర చాప్టర్లు పనిచేయాలని కోరారు. అడ్వైజరీ కో-ఛైర్ మోహన్ పాటల్లోల, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి తదితరులు కన్వెన్షన్‌తో పాటు ఇటీవల జరిగిన సేవా డేస్ విశేషాలను అందరితో పంచుకున్నారు. ఇకసెక్రటరీ కవితారెడ్డి 2023 కార్యక్రమాలపై నివేదికలను అందజేశారు. బతుకమ్మను విజయవంతం చేసిన మహిళా నాయకులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్ కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కి విశేష స్పందన వచ్చింది. సమావేశాలకు అయ్యే ఖర్చులను దాతలు విరాళాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా 4లక్షల డాలర్ల నిధులను సేకరించినట్లు నిర్వహకులు తెలిపారు. విరాళాలు ప్రకటించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ ఈవెంట్‌ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందు, వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిభింభించేలా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. యూత్ డాన్స్ ప్రదర్శన ఆడియన్స్‌లో జోష్ నింపింది. ఛార్లెట్‌లో నిర్వహించిన ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అవ్వటం పట్ల నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ బోర్డ్ కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ కార్యక్రమానికి సహాయసహాకారాలు అందించి, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మే 24 నుంచి 26 వరకు వాషింగ్టన్ లోని సియాటెల్‌లో జరిగే టీటీఏ మహాసభలకు తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేశారు. -
బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్..!
బజాజ్ ఆటో షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ నెల 8న జరిగే బోర్డు సమావేశంలో చర్చించే అంశాల్లో ఇది ఒకటని పేర్కొంది. కంపెనీ అత్యున్నత అధికారులు, వీరి తరఫు బంధువులు సంస్థ సెక్యూరిటీలు, ఈక్విటీ షేర్లలో లావాదేవీలు నిర్వహించే విండోను ఈ నెల 1 నుంచి 26వరకూ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 6,989 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52 వారాల గరిష్టం రూ. 7,060 వరకూ ఎగసింది. -
సీటెల్‌లో ఘనంగా టీటీఏ బోర్డు సమావేశం!
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డ్ సమావేశం సీటెల్‌లో ఘనంగా జరిగింది. వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులు, సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల సీటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని మరణించిన జాహ్నవి కందుల మృతికి బోర్డ్ సభ్యులు సంతాపం తెలియజేశారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ వంశీ రెడ్డి అధ్యక్షతన 2024 మే 24 నుంచి 26 వరకు సియాటిల్ నగరంలో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 గురించి చర్చించారు. ఈ బోర్డు సమావేశంలో టీటీఏ కన్వెన్షన్ వెబ్సైట్, సరికొత్త లోగోను ప్రారంభించింది. ఈ సమావేశానికి టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ళ మల్లా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సలహా మండలి విజయపాల్ రెడ్డి, మోహన్ పటోళ్ల, భరత్ మాదాడి, అధ్యక్షుడు వంశీ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్, ప్రధాన కార్యదర్శి కవిత, EC, BoD, జాతీయ బృందం అంతా కలిసి వివిధ అంశాలఫై చర్చించారు. టిటిఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి బోర్డ్ ప్రారంభ సందేశం వివరించారు. సీటెల్ లో వచ్చే ఏడాది జరగనున్న 2024 మెగా కన్వెన్షన్ సక్సెస్ చేయాలని, అవసరమైన నిధుల సమీకరణకు బోర్డ్ సభ్యులు కృషి చేయాలని కోరారు. టిటిఏ 2024 మెగా కన్వెన్షన్ విజయవంతానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అడ్వైజరీ చైర్ డా. విజయపాల్ రెడ్డి తెలియజేశారు. అడ్వైజరీ కో-చైర్ మోహన్ పాటల్లోల, సభ్యుడు భరత్ మాదాడి 2023 డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సేవా దినోత్సవాలు, అలాగే కన్వెన్షన్ గురించి వివరాలను తెలియజేశారు. టిటిఏ 2024 మెగా కన్వెన్షన్ గురించి ప్రెసిడెంట్ వంశీ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని బోర్డు సభ్యులందరినీ కోరారు. ఈ బోర్డ్ మీటింగ్‌లో దాదాపు 1 మిలియన్ డాలర్లు నిధుల సేకరణకు హామీలు వచ్చాయి. అలాగే టీటీఏ మెగా కన్వెన్షన్ కు వేదికైన సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ ని బోర్డు సభ్యులు పరిశీలించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెద్ది, సెక్రటరీ కవితా రెడ్డితో పాటు టీమ్ సభ్యులు, పులువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని.. కన్వెన్షన్ విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ సభ్యులందరితో సాయంత్రం టీటీఏ కార్య నిర్వాహక వర్గం కలిసి సాంస్కృతిక కార్యక్రమములో పాల్గొన్నారు. విజ్ఞేశ్వర స్తుతితో మొదలైన ఈ కార్యక్రమము ఆద్యంతం ప్రేక్షకులకు స్వచ్చమైన తెలంగాణ సంప్రదాయముల మధ్య అంగ రంగ వైభవముగా జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన వంశీ రెడ్డి గారు సియాటెల్ వచ్చిన టీటీఏ ప్రతినిధులకి సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానిత అతిధులందరిని పేరు పేరునా వేదిక మీదకి ఆహ్వానించి శాలువాలతో సత్కరించినారు. అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్ కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. టీటీఏ విరాళాల రూపంలో ఒకే రోజులో 2 మిలియన్ డాలర్లను విజయవంతంగా సేకరించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు, సియాటిల్ నగరంలో ఇంత పెద్ద కన్వెన్షన్ జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేసి, తమ మద్దతు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ , APNRTS Regional Co ordinator దుష్యంత్ రెడ్డి, శ్రీనివాస్ అబ్బూరి , రామ్ పాలూరి, భాస్కర్ గంగిపాముల, తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ బోర్డ్ కృతజ్ఞతలు తెలిపింది. (చదవండి: భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..) -
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవే..!
-
జూలై ఒకటి నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూ: హిమాలయాల్లో కొలువైన అమర్నాథ్ ఆలయ వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి మొదలుకానుంది. ఆగస్ట్ 31 దాకా కొనసాగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఆలయ బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు అధికారులు చెప్పారు. యాత్రకు వివరాల కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. -
ప్రకంపనలు సృష్టిస్తోన్న TSPSC పేపర్ లీకేజ్ కేసు
-
డాలస్‌లో నాటా బోర్డు మీటింగ్: నిధుల సేకరణకు విశేష స్పందన
డాలస్: అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ (నాటా ) బోర్డు సమావేశం డాలస్‌లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి నాటా అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి ప్రత్యేక అతిధి గా విచ్చేయగా, ఈ కార్యక్రమంలో డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(అధ్యక్షులు), డాక్టర్ ఆదిశేషా రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్), డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(మాజీ అధ్యక్షులు), డాక్టర్ సంజీవ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), హరి వేల్కూర్(కాబోయే అధ్యక్షులు), ఆళ్ళ రామి రెడ్డి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి), శ్రీనివాస్ సోమవరపు(కోశాధికారి), మందపాటి శరత్ రెడ్డి(సంయుక్త కార్యదర్శి ), సతీష్ నరాల (సంయుక్త కోశాధికారి ) తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ మరియు రీజినల్ కోఆర్డినేటర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జూన్ 30, జులై 1-2 2023 లో డాలస్ లో జరిగే కన్వెన్షన్ గురించి వివరాలు తెలిపారు. బోర్డు సమావేశం తర్వాత సభ్యులు అందరూ డాలస్ కన్వెన్షన్ టూర్ కు వెళ్లి అక్కడ వేదికను పరిశీలించి నాటా మెగా కన్వెన్షన్‌కు రానున్న పదిహేను వేల మంది అతిధులకు కల్పించే సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత సాయంత్రం జరిగిన నిధుల సేకరణ విందు లో పాల్గొన్న ఏడు వందల పైగా పలువురు దాతలు కనీవిని ఎరుగని రీతిలో రెండు మిలియన్ల ఆరు వందల వేల డాలర్లు ($2,600,000) ఇస్తామని నాటా కు వచ్చిన హామీ అమెరికాలో సరిక్రొత్త రికార్డు సృష్టించింది. ఈ విధంగా నిధుల సేకరణకు విశేష కృషి చేసిన డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి గారిని నాటా కార్యవర్గం ప్రత్యేకం గా అభినందించింది. వివిధ రాష్టాల నుండి వచ్చిన నాటా కార్యవర్గ సభ్యులను గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి) నిధుల సేకరణ విందు లో పాల్గొన్న దాతలకు పరిచయం చేసినారు. ఈ కార్యక్రమాన్ని గిరీష్ రామిరెడ్డి (కన్వీనర్ ), బూచిపూడి రామి రెడ్డి (కోఆర్డినేటర్ ), కృష్ణ కోడూరు (కో కన్వీనర్), భాస్కర్ గండికోట(కో కోఆర్డినేటర్), రమణ రెడ్డి క్రిస్టపాటి(డిప్యూటీ కన్వీనర్), మల్లిక్ ఆవుల (డిప్యూటీ కోఆర్డినేటర్), రవీంద్ర అరిమండ (బోర్డు సభ్యుడు), వీరా రెడ్డి వేముల, దర్గా నాగిరెడ్డి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), పుట్లూరు రమణ(బోర్డు సభ్యుడు), చెన్నా రెడ్డి, మోహన్ రెడ్డి మల్లంపాటి, ప్రసాద్ చొప్ప ఇతరులు అతిధులకు సౌకర్యాలను కల్పించారు. ఈ నిధుల సేకరణ విందుకు హాజరై హామీ ఇచ్చిన దాతలు అందరిని నాటా కార్యవర్గం పేరు పేరున అభినందించింది. -
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
-
మైనారిటీ వాటాదారుల అభిప్రాయాలూ తెలుసుకోండి
ముంబై: వివిధ అంశాలు, సమస్యలపై చర్చకు జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మైనారిటీ వాటాదారు ఇన్వెస్కో చేసిన అభ్యర్థనకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ సానుకూలంగా స్పందించింది. బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)ను ఆదేశించింది. అమెరికాకు చెందిన ఇనెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్‌తో కలిగి జీ ఎంటర్టైన్మెంట్పై ఈ పిటిషన్ దాఖలు చేశాయి. బోర్డ్ సమావేశం ఏర్పాటు ద్వారా జీల్ సీఈవో, ఎండీ పునీత్ గోయెంకాసహా మరో ఇద్దరు డైరెక్టర్లను తొలగించాలని ఆశిస్తోంది. అలాగే కొత్తగా ఎంపిక చేసిన ఆరుగురు డైరెక్టర్లతో బోర్డును పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తోంది. బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను షేర్ హోల్డర్లందరికీ తగిన విధంగా తెలియజేయాలని కూడా జీ ఎంటర్టైన్మెంట్నుజీ ఎంటర్టైన్మెంట్, అత్యవసర వాటాదారుల సమావేశం, ఇన్వెస్కో , ఎన్సీఎల్టీ , బోర్డ్ సమావేశం ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఈ అంశాలపై తదుపరి విచారణను అక్టోబర్ 4న చేపట్టనున్నట్లు ఇద్దరు సభ్యుల బెంచ్ తెలియజేసింది. మరోపక్క ఈ అంశాలపై చట్ట ప్రకారం కేటాయించిన గడువులోగా బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జీల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వాటాలు ఇలా... ఈజీఎంను చేపట్టమంటూ సెప్టెంబర్ 11న జీల్‌ను అభ్యర్థించినట్లు ఇన్వెస్కో తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ ట్రిబ్యునల్‌కు తెలియజేశారు. వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణార్ధం ప్రస్తుత బోర్డు ఆధ్వర్యంలో కంపెనీ నిర్వహణ చేపట్టరాదంటూ పేర్కొన్నారు. కొత్త డైరెక్టర్లను నియమించుకోవడం ద్వారా బోర్డును తిరిగి నిర్మించాలని కోరారు. దీంతో 45 రోజుల్లోగా ఈజీఎంను చేపట్టవలసిందిగా జీల్‌ను ఆదేశించమంటూ ఎన్సీఎల్టీని వేడుకున్నారు. ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్‌తో కలిపి ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ జీల్లో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. సెపె్టంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో విలీనమయ్యేందుకు జీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో జీల్ షేరు 2 శాతం క్షీణించి రూ. 304 వద్ద ముగిసింది. -
‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని
ఇండియాలోనే అతి పెద్ద టీవీ, ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా చెప్పుకుంటున్న జీ - సోనీ విలీన ప్రక్రియలో మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్లు పట్టు వదిలేందుకు సిద్ధంగా లేరు. ఇన్వెస్కో లేఖ జీ లిమిటెడ్‌కి ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయోంకాను తొలగించడంతో పాటు ఆరుగురు డైరెక్టర్లను తొలగించాలంటూ జీలో మేజర్ షేర్‌హోల్డర్‌గా ఉన్న ఇన్వెస్కో జీ బోర్డును కోరింది. అందుకు గల కారణాలు వివరిస్తూ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. తెరపైకి విలీనం ఇన్వెస్కో నుంచి లేఖ వచ్చిన వెంటనే స్పందించిన జీ బోర్డు ఇద్దరు డైరెక్టర్లను తప్పించింది. అనంతరం సోనీతో చర్చలు ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో జీ విలీనం అవుతున్నట్టు భారీ డీల్‌ని సెప్టెంబరు 22న ప్రకటించింది. ఈ రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పడే సంస్థకు సైతం పునీత్ గోయెంకానే ఎండీగా ఉంటాడని ప్రకటించింది. దీంతో వివాదం సమసిపోతుందని జీ భావించింది. ఇన్వెస్కో కోరినట్టు అత్యవసర సమావేశం నిర్వహించలేదు. న్యాయ పోరాటం జీలో మేజర్ షేర్ హోల్డర్‌గా తాము అభ్యంతరం చెప్పిన విషయాలపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడమే కాకుండా విలీన ప్రక్రియ జరపడం, ఆ తర్వాత పునీత్ గోయెంకానే తిరిగి ఎండీగా నియమించడం పట్ల ఇన్వెస్కో అసంతృప్తిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతుంది. లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోనికి చిక్కులు జీని విలీనం చేసుకోవడం ద్వారా ఒకే సారి అర్బన్, రూరల్ మార్కెట్లతో పాటు హిందీ, రీజనల్ లాంగ్వెజ్లలో మరింతగా విస్తరించాలనుకున్న సోనికి ఇన్వెస్కో వ్యవహరం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. జీ అంతర్గత సమస్యలు ఇప్పుడు సోనిని కూడా చుట్టుముట్టాయి నామ్‌కే వాస్తే సుభాష్ చంద్ర స్థాపించిన జీ మీడియాలో ప్రస్తుతం ఆయన వాటా కేవలం 5 శాతమే. చాలా మంది ఆ కంపనీలో పెట్టుబడులు పెట్టారు. నిన్నా మొన్న సోనీతో విలీన ప్రక్రియ ముగిసే వరకు ఇన్వెస్కో సంస్థ జీలో మేజర్ పెట్టుబడిదారుగా ఉంది. చదవండి: సోనీకి ‘జీ’ హుజూర్! -
నిర్వాసితులపై ‘సింగరేణి’ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. సోమవారం భేటీ అయిన సింగరేణి బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. 2021-22 ఏడాదికి సీఎస్ఆర్ ఫండ్ కోసం రూ.61 కోట్లు కేటాయించింది. ఇక సింగరేణి నిర్వాసిత కాలనీలకు సంబంధించి 201 ప్లాట్ల కేటాయించాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంది. -
కశ్మీర్లో 18 నెలల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుమల: కశ్మీర్లో 18 నెలల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో 500 శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అదేవిధంగా వారణాసి, ముంబైలోనూ శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. గుడికో గోమాత కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. గత రెండేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నామని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎల్1 దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ చేశామని, కరోనా సమయంలో ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ధర్మప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. వరహస్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం పనులు చెస్తున్నామని తెలిపారు. స్వామివారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం సమర్పిస్తున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. చదవండి: AP: రేపు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్.. ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్లు -
నేడు టీటీడీ పాలక మండలి సమావేశం
-
నేడు టీటీడీ పాలక మండలి సమావేశం
సాక్షి, తిరుమల: నేడు(శనివారం) టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం టీటీడీ 85 అంశాలతో ఎజెండాను రూపొందించింది. ఈ సందర్భంగా.. గరుడ వారధిని అలిపిరి వరకు విస్తరణకు నిధుల కేటాయింపు, కల్యాణమస్తు, మారుమూల ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంపై చర్చించనున్నారు. దర్శన టికెట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయానికి ఔట్లెట్లు కేటాయింపుపై కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. తిరుమలలోని పవన విద్యుత్ కేంద్ర నిర్వహణను హైదరాబాద్‌కు చెందిన గ్రీన్కో సంస్థకు అప్పగించేందుకు ప్రతిపాదనలు పరిశీలించనున్నారు. పేరూరులోని వకులమాత ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు రూ.2.90 కోట్లను శ్రీవాణి ట్రస్ట్ నిధుల కేటాయింపు, తిరుమల భద్రతకు తలపెట్టిన కంచె నిర్మాణంలో మూడో దశ నిర్మాణ పనులకు రూ.7.37 కోట్లతో ప్రతిపాదనలు పరిశీలించనున్నారు. చదవండి: చెన్నైకి తెలుగుగంగ జలాలు -
ఎఫ్‌టీపీపై చర్చకే పరిమితం!
దుబాయ్: భవిష్యత్‌లో జరగబోయే టోర్నీల నిర్వహణ (ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్–ఎఫ్టీపీ), క్రికెట్‌ను మరిన్ని దేశాల్లో అభివృద్ధి చేసే అంశాలపై చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు నేడు సమావేశం కానుంది. టి20 ప్రపంచ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే ముందు తమకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీని కోరిన నేపథ్యంలో కీలక ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చు. జూలై 1 తర్వాత బీసీసీఐ వరల్డ్ కప్ విషయంలో స్పష్టతనిచ్చిన తర్వాతే ఐసీసీ స్పందించే అవకాశం ఉంది. కాబట్టి జూలై 18 నుంచి జరిగే ఐసీసీ తదుపరి సమావేశంలోనే వరల్డ్ కప్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఇతర అంశాలే అజెండాగా ఐసీసీ సమావేశం సాగవచ్చు. 2023–2031 మధ్య ఎనిమిది సంవత్సరాల కాలంలో నిర్వహించబోయే ఐసీసీ టోర్నీలతో పాటు తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కొనసాగింపు సాధ్యాసాధ్యాలపై కూడా చర్చ జరుగుతుంది. క్రికెట్‌ను కనీసం 104 దేశాలకు విస్తరించాలని భావిస్తున్న ఐసీసీ... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కూడా మహిళల క్రికెట్‌ను చేర్చేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించనుంది. -
రైట్స్ బైబ్యాక్‌కు.. రైట్‌రైట్
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రభుత్వ రంగ కంపెనీ.. రైట్స్(RITES) లిమిటెడ్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 265 ధర మించకుండా 9.69 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 257 కోట్లను వెచ్చించనున్నట్లు మినీరత్న కంపెనీ రైట్స్ తాజాగా వెల్లడించింది. 2018 జులైలో లిస్టయిన ఈ పీఎస్యూలో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 72 శాతానికిపైగా వాటా ఉంది. కంపెనీ ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉన్నట్లు రైట్స్ చైర్మన్, ఎండీ రాజీవ్ మెహ్రోత్రా తెలియజేశారు. అంతేకాకుండా రుణరహిత కంపెనీ కావడంతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసినట్లు వివరించారు. ఇది కంపెనీ వృద్ధి అవకాశాలు, పటిష్టతపట్ల యాజమాన్యానికున్న నమ్మకానికి నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా.. బైబ్యాక్‌కు ఈ నెల 30 రికార్డ్ డేట్‌గా బోర్డు నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా.. శుక్రవారం ఎన్ఎస్ఈలో రైట్స్ షేరు 0.8 శాతం పుంజుకుని రూ. 255 వద్ద స్థిరపడింది. ఎంఆర్‌పీఎల్ వారాంతాన జరిగిన వార్షిక సమావేశంలో భాగంగా రూ. 5,000 కోట్లవరకూ నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్(ఎంఆర్‌పీఎల్) తెలియజేసింది. ఇందుకు వీలుగా మార్పిడికి వీలుకాని డిబెంచర్లు(ఎన్సీడీలు), బాండ్లు తదితరాల జారీని చేపట్టే వీలున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఆర్‌పీఎల్ షేరు ఎన్ఎస్ఈలో శుక్రవారం దాదాపు యథాతథంగా రూ. 29 వద్ద ముగిసింది. -
బోర్డు మీటింగ్‌లోనే తమ్ముడిపై దాడి
సాక్షి, భావనగర్ : కంపెనీ బోర్డు మీటింగ్ లోనే షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. కంపెనీ బోర్డునుంచి తొలగించారన్న అక్కసుతో సొంత తమ్ముడిపైనే దాడికి దిగాడు. తండ్రి, ఇతర బోర్డు సమక్షంలోనే సోదరుడుపై కత్తితో దాడిచేసిన వైనం కలకలం రేపింది. భావనగర్‌లోని వర్తే గ్రామంలోని సిడ్సర్ రోడ్‌లోని తాంబోలి కాస్టింగ్స్ లిమిటెడ్ (టిసిఎల్)వద్ద ఈ సంఘటన జరిగింది. బాధితుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుజరాత్లో తంబోలి కాస్టింగ్స్ లిమిటెడ్ (టీసీఎల్) డైరెక్టర్లలో ఒకడైన మెహుల్ తంబోలిని తొలగించాలని కంపెనీ బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. స్వయంగా తండ్రి బిపిన్ తంబోలి (77) అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సస్పెన్షన్‌పై ఆగ్రహించిన మెహుల్ తమ్ముడు వైభవ్‌ను కత్తితో పొడిచి పొత్తికడుపులో పారిపోయాడు.వెంటనే బాధితుడు వైభవ్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు మొహుల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. 2004లో ఏర్పాటైన టీసీఎల్ బీఎస్ఇ లిస్టెడ్ సంస్థ. ఫెరారీ, ఫియట్, ఫోర్డ్, జనరల్ మోటార్స్, జాగ్వార్, జాన్ డీర్ వంటి ఆటోమోటివ్ కంపెనీలకు విడి భాగాలను సరఫరా చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా బిపిన్ తంబోలి ఉండగా, పిఎ సుబ్రమణియన్ వైస్ చైర్మన్‌గా, అన్నదమ్ములు మెహుల్, వైభవ్ ఇద్దరూ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఈ వివాదానికి గల కారణాలు, మెహుల్ ను ఎందుకు తొలగించారు తదితర వివరాలు వెలుగులోకి రాలేదు. -
భారత్‌లోనా...ఆస్ట్రేలియాలోనా...
దుబాయ్: కరోనా కారణంగా వాయిదా పడిన టి20 ప్రపంచకప్‌లను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాటి వేదికలను మాత్రం ఖరారు చేయలేదు. ఇప్పుడు దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు నేడు ఐసీసీ ఉన్నతస్థాయి అధికారుల బృందం సమావేశమవుతోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం 2021, 2022లలో రెండు టి20 వరల్డ్ కప్‌లు నిర్వహించాల్సి ఉంది. అయితే దేనిని ఎవరు నిర్వహించాలనేదానిపై స్పష్టత రాలేదు. తమ దేశంలో జరగాల్సిన 2020 టోర్నీ ఏడాది పాటు వాయిదా పడింది కాబట్టి వచ్చే ఏడాది అవకాశం తమకే ఇవ్వాలని ఆస్ట్రేలియా కోరుతుండగా... పాత షెడ్యూల్ ప్రకారం 2021 టి20 ప్రపంచకప్ అవకాశం తమకే ఇచ్చి 2022 కోసం ఆసీస్ ఆతిథ్యం ఇవ్వాలని భారత్ వాదిస్తోంది. 2023లో భారత్‌లో వన్డే వరల్డ్ కప్ కూడా జరగాల్సి ఉన్నందున సంవత్సరం వ్యవధిలో రెండు మెగా ఈవెంట్ల నిర్వహణ సమస్యలతో బీసీసీఐ తమ వాదనను ఐసీసీ ముందు ఉంచుతోంది. వరుసగా రెండేళ్లు రెండు పెద్ద టోర్నీల ఆతిథ్యం ఏమాత్రం బాగుండవని, ప్రేక్షకుల ఆసక్తే తగ్గడమే కాదు... బోర్డు నిర్వహణా శక్తికి కత్తిమీద సాములాంటిదేనని బీసీసీఐ చెబుతోంది. -
నేడు ICC కీలక సమావేశం
-
బోర్డ్ మీటింగ్స్ వీడియోలో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల బోర్డ్ మీటింగ్స్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించే వీలు కల్పించింది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ). దీంతో కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, అమాల్గమేషన్, నిధుల సమీకరణ వంటి కీలక నిర్ణయాల బోర్డ్ మీటింగ్స్‌లను వీడియో లేదా ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించుకోవచ్చు. జూన్ 30 వరకు వీడియో, ఆడియో ద్వారా సమావేశాలకు అనుమతి ఇస్తున్నట్టు సౌతీస్ట్ రీజియన్ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) తెలిపింది. ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్, అకౌంట్స్, బోర్డ్ రిపోర్ట్స్, మెర్జింగ్స్, రీ–స్ట్రక్చరింగ్ వంటి బోర్డ్ ఆమోదానికి వీడియో కాన్ఫరెన్స్ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కేవలం బోర్డ్ మీటింగ్స్‌కు మాత్రమే వీడియో, ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహణకు అనుమతి ఉంది. మిగిలిన వాటికి కంపెనీ డైరెక్టర్లు సంబంధిత కార్యాలయాలను ఫిజికల్‌గా కలవాల్సిందే. ప్రయాణ ఆంక్షలున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆర్వోసీ, ఎన్సీఎల్టీ, ఆర్డీ పరిధిలోని కాంపౌండింగ్ అప్లికేషన్స్ విచారణలను హైదరాబాద్‌లోని ఆర్డీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అధికారిక ఈ–మెయిల్, ఫ్యాక్స్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు ఆర్వోసీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, విజయవాడ ఆర్వోసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 80 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 20 వేల కంపెనీలున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రయాణ, గ్రూప్ సమావేశాలు వంటి వాటిపై ఆంక్షలున్న నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్లు మౌఖికంగా ఆయా కార్యాలయాలను సందర్శించడం శ్రేయస్కరం కాదు. అంతేకాకుండా చాలా కంపెనీల్లో విదేశీ డైరెక్టర్లు, ఇన్వెస్టర్లు ఉంటారు. వీళ్లు ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో మౌఖికంగా బోర్డ్ సమావేశంలో పాల్గొనలేరు. అందుకే కంపెనీల రోజు వారి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ (ఐసీఎల్ఎస్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే సంబంధిత బోర్డ్ మీటింగ్స్ తాలూకు వీడియో, ఆడియో కాన్ఫరెన్స్ కాపీలను భద్ర పర్చుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక ఫలితాల ప్రకటనల నేపథ్యంలో ఎంసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించదగినది అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 27 వరకూ ఎన్సీఎల్టీ ఫైలింగ్స్ బంద్ దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్‌లలో ఈ నెల 27 వరకు ఫైలింగ్ కౌంటర్ మూసివేయాలని ఢిల్లీలోని ఎన్సీఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్ నిర్ణయించింది. అన్ని ఎన్సీఎల్టీ బెంచ్‌ల ఫైలింగ్ కౌంటర్ల వద్ద ఎక్కువ మంది సభ్యులు సంచరిస్తున్నారని.. ఇది కోవిడ్ వ్యాప్తికి కారణమవుతుందని∙భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్సీఎల్టీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అమరావతి, జైపూర్ బెంచ్‌లలో మాత్రం అత్యవసర మ్యాటర్స్ విషయంలో ఆన్లైన్ ద్వారా ఫైలింగ్ చేసుకునే వీలు కల్పించారు. -
ప్రాజెక్టులపై పెత్తనమెవరికి?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవాలా? లేక రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలా అన్నది తేలే సమయం ఆసన్నమయింది. ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఇరు రాష్ట్రాల ఉద్యోగులూ బోర్డు అధీనంలోనే పని చేసేలా గతంలో రూపొందించిన వర్కింగ్ మాన్యువల్‌పై ఈ నెల 8న జరుగనున్న కృష్ణాబోర్డు భేటీలో కీలక చర్చ జరుగనుంది. ప్రాజెక్టుల నియంత్రణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో బోర్డు మెట్టు దిగుతుందా? లేదా? అన్నది ప్రశ్నగా ఉంది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డులు ఎప్పటినుంచో కోరుతోంది. దీంతో పాటే ఇప్పటికే నీటి వినియోగం జరుగుతున్న ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంటామని చెబుతోంది. తమ పరిధిలో ఉంటేనే పర్యవేక్షణ సులువవుతుందని అంటోంది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి బోర్డుపెత్తనమే మేలని చెబుతూ వస్తోంది. దీంతో రేపు జరిగే భేటీ కీలకం కానుంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య 34ః66గా ఉన్న నీటి వినియోగ వాటాను 50ః50గా చేయాలని తెలంగాణ కోరే అవకాశం ఉంది. దీనిపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
నేడు ఆర్బీఐ బోర్డు సభ్యులతో సీతారామన్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం(నేడు) రిజర్వ్ బ్యాంక్ కేంద్ర బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక అంశాలను ఈ సందర్భంగా ఆమె ఆర్బీఐకి వివరించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యం ఇందులో ప్రధానంగా చర్చకు రానుంది. ఈ ఏడాది(2019–20) ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తాజా పూర్తిస్థాయి బడ్జెట్లో తగ్గించిన సంగతి తెలిసిందే. మధ్యంతర బడ్జెట్లో అంచనాలతో పోలిస్తే నికరంగా రూ.6,000 కోట్లు ఖజానాకు అదనంగా సమకూరనుండటంతో ఇది సాధ్యమైంది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020–21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూడా జీడీపీలో 3 శాతానికి కట్టడి చేయడం, ప్రాథమిక లోటును పూర్తిగా తొలగించడం వంటి అంశాలతో రోడ్‌మ్యాప్‌ను సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటారు. అదేవిధంగా ద్రవ్యలోటు నుంచి కేంద్రం చెల్లించాల్సిన వడ్డీలను మినహానయిస్తే, మిగిలిన లోటును ప్రాథమిక లోటుగా వ్యవహరిస్తారు. ఇక ఆర్బీఐ మిగులు నిధుల విషయానికొస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.90,000 కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు అంచనా. గతేడాదితో పోలిస్తే(రూ.68,000 కోట్లు) ఇది 32 శాతం అదనం. అంతేకాదు ఇప్పటిదాకా ఆర్బీఐ నుంచి కేంద్రం అందుకున్న అత్యధిక డివిడెండ్‌గా కూడా ఇది నిలవనుంది. -
టీటీడీ పాలక మండలి సమావేశంపై విమర్శలు
-
సంక్షోభంలో జెట్ ఎయిర్వేస్
-
జెట్ ఎయిర్వేస్ మూతపడనుందా?
సాక్షి, ముంబై : జెట్ ఎయిర్వేస్ సంక్షోభానికి ఇంకా తెర పడలేదు. నిధుల లేమితో పాతాళానికి పడిపోయిన జెట్ ఎయిర్వేస్ కార్యకాలాపాలు మూడ పడనున్నాయని తెలుస్తోంది. మంగళవారం నాటి జెట్ ఎయిర్వేస్ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. ముంబైలో కొనసాగుతున్న బోర్డు సమావేశంలో ఆర్థిక సహాయం అందని కారణంగా జెట్ఎయిర్వేస్ను మూసివేతకు బోర్డు ప్రతిపాదించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మార్కెట్లో ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ షేర్ 18శాతం కుప్పకూలింది. మధ్యంతర నిధులను సమకూర్చేందుకు బ్యాంకుల మధ్య అంగీకారం కుదరలేదని ఈ రోజు సమావేశమైన జెట్ ఎయిర్వేస్ బోర్డు తెలిపింది. అలాగే సంస్థను గట్టెక్కించే నాధుడు ఇంకా వెలుగులోకి రాలేదు. జెట్ ఎయిర్వేస్ వాటాల కొనుగోలుకు దాఖలు చేయాల్సిన గడువును మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు బిడ్డర్లు తమ బిడ్స్ సమర్పించుకోవచ్చని కంపెనీ తాజాగా వెల్లడించింది. అలాగే సంస్థ మాజీ ఫౌండర నరేష్ గోయల్ కొనుగోలు రేస్ నుంచి తప్పుకున్నారు. ఈ తాజా పరిణామాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇది ఇలా వుంటే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ పరిణామాలను పరిశీలిస్తోందని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు అంతర్జాతీయ సర్వీసులన్నింటిని సోమవారం దాగా రద్దు చేసుకున్న సంస్థ మరోసారి ఈ గడువును పొడిగించింది. ఏప్రిల్ 18వరకు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు ఏప్రిల్ 18 వరకు జెట్ ఎయిర్వేస్కు ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఐవోసీ తెలిపింది. కాగా రూ. 3500 కోట్ల రుణ భారానికి తోడు, టికెట్ల కాన్సిలేషన్ ద్వారా ప్రయాణికులకు చెల్లించాల్సిన చార్జీల విలువ రూ.3500 కోట్లకు చేరింది. దీంతో జెట్ ఎయిర్వేస్ అప్పుల భారం మొత్తం రూ. 8500 కోట్లకు ఎగబాకింది. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం 7 విమానాలను నడుపుతోంది. ఈ వార్తలు నిజమైతే 16వేలమంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడిపోనుంది. Directed Secretary @MoCA_GoI to review issues related to Jet Airways, especially increasing fares, flight cancellations etc. Asked him to take necessary steps to protect passenger rights and safety; and to work with all stakeholders for their well being. — Chowkidar Suresh Prabhu (@sureshpprabhu) April 16, 2019 -
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం : కీలక పరిణామం
సాక్షి, ముంబై : ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సంస్థ ఫౌండర్, ప్రధాన ప్రమోటర్ నరేష్ గోయల్ సంస్థనుంచి వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది. నరేష్ గోయల్‌తోపాటు ఆయన భార్య అనితా గోయల్ కూడా బోర్డుకు రాజీనామా చేయనున్నారని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. జెట్‌ఎయిర్‌వేస్ సంక్షోభంపై చర్చించేందుకు బోర్డు ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇవాల్టి సమావేశంలో ఒక కొత్త తీర్మానాన్ని కూడా ఆమోదించనున్నారు. తద్వారా నరేష్ గోయల్ సొంతమైన 51 శాతం వాటాను కన్సా ర్షియం సొంతం చేసుకుంటుంది. కొత్త కొనుగోలుదదారుకోసం అన్వేషించనుంది. అలాగే ఎస్బీఐ మాజీ ఛైర్మన్ మాజీ సీవీసీ కమిషనర్ జానకి వల్లభ్‌ను జెట్ ఎయిర్వేస్ బోర్డులోకి ఆహ్వానించనున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న నరేష గోయల్ అక్కడినుంచే 23వేల ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం. ఈ వార్తలు వాస్తవరూపం దాలిస్తే దాదాపు పాతికేళ్లపాటు సంస్థను విజయపధంలో నడిపించిన నరేష్ గోయల్ ప్రస్థానం ముగియనుంది. మరోవైపు ఇప్పటికే పలువురు సీనియర్ ఉన్నతాధికారులు సంస్థను వీడగా, వేతన బకాయిలు చెల్లించకపోతే తాము కూడా రాజీనామా బాట పట్టక తప్పదని పైలట్లు హెచ్చరించారు. అటు అద్దె బకాయిలు చెల్లించలేక , పైలట్లులేక రోజు రోజుకు జెట్ ఎయిర్వేస్ రద్దవుతున్న విమానాల సంఖ్య పెరుగుతోంది. కాగా సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న జెట్ ఎయిర్వేస్ మరింత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతోపాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నేతృత్వంలో భారీ రుణాలిచ్చిన బ్యాంకులు సంస్థను గట్టెక్కించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలన సంస్థ మళ్లీ గాడిలో పడాలంటే నరేష్ గోయల్, ఆయన భార్య , మరో ఇద్దరు డైరెక్టర్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ సూచించిన సంగతి తెలిసిందే. -
కొనసాగుతున్న ఉత్కంఠ : రేపటి వరకు సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక బోర్డు సమావేశం సోమవారం ప్రారంభమైంది. ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులతో పాటు యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రస్తుత బోర్డు మీటింగ్‌లో ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం జరిగినట్టు తెలిసింది. అయితే ఇరువురికి సమ్మతమైన ఒక అంగీకారానికి రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మిగులు నిధుల బదిలీ, మొండి బకాయిల నిబంధనలను మార్చాలన్న డిమాండ్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా సాగుతున్న చర్చలు రేపు ఉదయం దాకా కొనసాగనుందని తెలుస్తోంది. కేంద్ర బ్యాంకుతో కేంద్రానికి గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్బీఐ వద్ద ఉన్న 9లక్షల కోట్లు రూపాయల నిధుల్లో మూడోవంతు నిల్వలను (దాదాపు రూ.3.6 లక్షల కోట్లు) ప్రభుత్వం కోరుతోంది. మొత్తం బోర్డు హాజరు మొత్తం 18మంది బోర్డు సభ్యులు ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం. మొత్తం 18మందిలో గవర్నర్ ఊర్జిత్ పటేల్, విశ్వనాథన్, విరాల్ ఆచార్య, బిపీ కనుంగో, ఎంకే జైన్ డిప్యూటీ గవర్నర్లుగా ఉండగా, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్సీ గార్గ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్, ఎస్ గురుమూర్తి, సతీష్ మరాథే తదితరులు ఇందులో ఉన్నారు. సామరస్యంగా కొనసాగుతున్న చర్చలు సమస్యలు పరిష్కరించుకునేందుకు అటు ఆర్బీఐ, ఇటు ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు బీజం పడిన సందర్భంలో ప్రధానంగా ఆర్బీఐ వద్ద ఉన్న మిగులు నిల్వలపై తీవ్ర చర్చ జరిగిందట. అయితే కీలక సమస్యలపై వివాదాలు జరిగినప్పటికీ ఎన్నికల ఏడాది కావడంతో చిన్న, మధ్యస్థాయి సంస్థ (ఎస్ఎంఈ) లకు ఇచ్చే రుణ నిబంధనలు సులభరం, సత్వర పరిష్కార సమితి( పీసీఏ) నిబంధలను సరళీకరణ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు(ఎన్బీఎఫ్సీ) ద్రవ్య లభ్యత తదితర అంశాలపై సానుకూలమైన పరిష్కారం లభించవచ్చని భావిస్తున్నారు. చర్చల్లో ఉన్న సమస్యలు ప్రధానంగా మిగులు నిధుల బదిలీ, మొండి బకాయిల నిబంధనల సరళీకరణ,షాడో బ్యాంకింగ్‌రంగంలో ద్రవ్యలభ్యత ఉండేలా చూడటం తదితర అంశాలపై చర్చలు భారీగా జరుగుతున్నట్టు సమాచారం. కేంద్రం ఆర్బీఐ మధ్య వివాదం ఎడతెగకుండా కొనసాగితే ఇండిపెండెంట్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఆర్బీఐకు స్వతంత్రత ఉండాలంటూ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య చేసిన వ్యాఖ్యలతో కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయన్న వార్తలు వ్యాపించాయి. ఆర్బీఐపై పట్టు సాధించేందుకు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్-7ను ఆయుధాన్ని వాడనుందన్న అంచనాలు కూడా భారీగా వ్యాపించాయి.కొత్తగా నియమితులైన స్వామినాథన్ గురుమూర్తి ఆర్బీఐ కేంద్రం సూచనల మేరకు నడుచుకోవాల్సిందేనంటూ వివాదస్పద వాఖ్యలు అగ్నికి అజ్యం పోసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా అవకాశాలున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రాజీనామా చేస్తారనే అంచనాల నేపథ్యంలో తాజా బోర్డు మీటింగులో వారిద్దరూ రాజీనామా సమర్పించకపోవడం, చర్చల్లో చురుకుగా పాల్గొనడం ఆహ్వానించదగ్గ పరిణామంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. -
అనారోగ్య కారణాలతో ఉర్జిత్ పటేల్ రాజీనామా?
సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది వారాలుగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కేంద్రం మద్య రగులుతున్న వివాదం సమసిపోయే లక్షణాలు కనిపించడంలేదు. తాజా అంచనాల ప్రకారం ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రభుత్వంతో భిన్నాభిప్రాయాల నేపథ్యం తన ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపనుందన్నకారణంతో ఆయన త్వరలోనే రాజీనామా చేయనున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. తదుపరి బోర్డు సమావేశంలో ఉర్జిత్ పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. నవంబరు 19న జరగనున్న ఆర్బీఐ బోర్డు సమావేశంలో అనారోగ్య కారణాల రీత్యా ఆయన తప్పుకోనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంతేకాదు ఊర్జిత్ పటేల్ రాజీనామా నిర్ణయం వాస్తవ రూపం దాలిస్తే, అటు డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కూడా అదే బాటలో పయనించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంతో విభేదించి అలసిపోవడమే కాక, వైరిపూరిత వాతావరణంలో పనిచేయడం వల్ల తన ఆరోగ్యం పాడవుతున్నదని పటేల్ తన సన్నిహితుల వద్ద మొరపెట్టుకుంటున్నారట. ముఖ్యంగా రిజర్వ్‌బ్యాంక్ చట్టంలోని సెక్షన్-7 కింద ప్రభుత్వం ఆదేశాలను జారీచేసేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో గవర్నర్ ఊర్జిత్ పటేల్ మరింత మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు సమాచారం. దీనికితోడు ఆర్బీఐ గవర్నర్ ఆర్ధిక ప్రాధాన్యతలను గుర్తించి, కేంద్రం ప్రతిపాదనలను ఆమోదించాలని, దీనిపై బోర్డు సభ్యులతో చర్చించాలని కోరుతున్నామని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు ఉర్జిత్పటేల్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటే, ఆయన తప్పుకోవడమే మంచిదని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో ఉర్జిత్ రాజీనామా ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. అయితే రానున్నఎన్నికలకు ముందు, అందునా ఆర్థిక సేవల రంగం వివిధ కుంభకోణాలతో సతమతమవుతున్న తరుణంలో రిజర్వ్‌బ్యాంక్ ఉన్నతాధికారులిద్దరు రాజీనామా చేయడం ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ దీర్ఘకాలిక పరిష్కారాలపై ఆలోచిస్తోంటే, కేంద్రం స్వల్పకాలిక పరిష్కారాలను అన్వేషిస్తోందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు భానుమూర్తి పేర్కొన్నారు. అయితే విభేదాలున్నప్పటికీ, ఇద్దరూ వారి భేదాలను పరిష్కరించకోదగినవే అన్నారు. కానీ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయవలసి వస్తే మాత్రం అది ఆర్ధిక వ్యవస్థకు ముప్పేనని వ్యాఖ్యానించారు. కాగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రిజర్వ్‌బ్యాంక్ స్వయంప్రతిపత్తికి ఎదురవుతున్న సవాళ్లపై చేసిన సంచలన వ్యాఖ్యలతో కేంద్రం, రిజర్వ్‌బ్యాంకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఆర్బీఐ గవర్నర్ పదవినుంచి తప్పుకోన్నారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆర్థికశాఖ స్పందించింది. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడుతామంటూ ప్రకటన జారీ చేసింది. మరోవైపు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ వివాదంపై తొలిసారిగా స్పందిస్తూ ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిందేనంటూ బహిరంగంగా ఆర్బీఐకి మద్దతు పలికారు. సీటు బెల్టులాంటి ఆర్బీఐని వాహనదారుడైన ప్రభుత్వం ధరించకపోతే ప్రమాదం చాలా తీవ్రంగానే ఉంటుందని సూచించిన సంగతి తెలిసిందే. -
శబరిమల తీర్పు : ఆలయ కమిటీ భేటీ
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు అనంతర పరిస్థితులు, వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న శబరిమల యాత్ర సీజన్ తదితర అంశాలపై చర్చించేందుకు ఆలయ నిర్వహణను పర్యవేక్షించే ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు (టీడీబీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై వివిధ వర్గాలతో చర్చలు జరిపేందుకు ఆలయ కమిటీ పండలం రాయల్ ఫ్యామిలీతో పాటు శబరిమల ఆలయ పూజారులు, పూజారుల సంఘ ప్రతినిధులు, హిందూ సంస్థల ప్రతినిధులను మంగళవారం జరిగే సమావేశానికి ఆహ్వానించింది. త్రివేండ్రంలోని దేవస్ధానం బోర్డు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని టీడీబీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్ పేర్కొన్నారు. అన్ని వయసుల స్ర్తీలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వుల అమలును వ్యతిరేకిస్తూ పలు హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ సమావేశంలో అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులను బోర్డు ఆహ్వానించింది. మరోవైపు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా తీర్పును అమలు చేయాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతవారం పండలంలో బీజేపీ చేపట్టిన లాంగ్‌మార్చ్ ఆదివారం తిరువనంతపురం చేరుకుంది. సర్వోన్నత న్యాయస్ధాన ఉత్తర్వులను లెఫ్ట్ ప్రభుత్వం అమలుచేస్తే ఈనెల 18న కేరళలో హర్తాళ్ చేపట్టాలని అంతరాష్ర్టీయ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపు ఇచ్చారు. -
డెట్రాయిట్లో ఆటా బోర్డు మీటింగ్
డెట్రాయిట్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) బోర్డు మీటింగ్ డెట్రాయిట్‌లోని సౌత్‌ఫీల్డ్ మారియట్ హోటల్లో జరిగింది. అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆటా ట్రస్టీలు, అడ్వైజర్లు, రీజినల్ కో ఆర్డినేటర్లు, వివిధ స్టాండింగ్ కమిటీ అధ్యక్షులతోపాటూ స్థానిక ఆటా సభ్యలు పాల్గొన్నారు. డెట్రాయిట్ ఆటా టీమ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్టీలు హరి లింగాల, మురళి బొమ్మనవేణి, అంతర్జాతీయ కో ఆర్డినేటర్ కోత కాశి, రీజినల్ అడ్వైజర్ సన్నీ రెడ్డి, సీఎమ్ఈ అధ్యక్షులు డా. అశోక్ కొండూరు, డా. హర్ష క్రిష్ణ, ఆర్సీలు చెంచురెడ్డి, సునీల్ మందుటి, ఎస్సీ అధ్యక్షులు వేణు సురపరాజులు ఆటా బోర్డు మీటింగ్ పనులను పర్యవేక్షించారు. త్వరలో రాబోయే ట్రస్టీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కమిటీ, ఎలక్షన్ కమిటీల నియామకాలను ఆటా నాయకులు చేపట్టారు. అమెరికాలోని తెలుగువారికి మరిన్ని సేవలు అందించడానికి చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఆటా వ్యవస్థాపక సభ్యులు, మాజీ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఆటా అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి, ఆటా ఎలక్ట్ ప్రెసిడెంట్ పరమేష్ భీమ్‌రెడ్డిలు ఆటా వివాహ పరిచయవేదిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. మాట్రిమోనియల్ కమిటీ సభ్యులు శంకర్ బండి, రామ క్రిష్ణా రెడ్డి ఆళ్ల, అజయ్ రెడ్డి, అనిల్ బోడిరెడ్డి, అరుంధతి కోడూరులు చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు డెట్రాయిల్ ఆటా టీమ్‌కు ఆటా బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. లాస్ వేగాస్‌లో 2019 జనవరిలో ఆటా మరుసటి బోర్టు మీటింగ్ జరగనుంది. -
దర్శనం గోవిందా
-
ఆరు రోజులపాటు వెంకన్న దర్శనం రద్దు
-
ఆరు రోజులపాటు శ్రీవారి దర్శనం రద్దు
సాక్షి, తిరుపతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఆరు రోజులపాటు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించలేకపోతున్నట్లు ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహణ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ శనివారం తెలిపారు. వచ్చే ఆగస్టు 11 నుంచి 16 వరకు నిర్వహించే ఈ క్రతువుపై చర్చించేందుకు తిరుమల అన్న మయ్య భవన్లో శనివారం పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం టీటీడీ చైర్మన్ ‘పుట్టా’మీడియాతో మాట్లాడుతూ.. మహాసంప్రోక్షణ నేపథ్యం లో ఆగస్టు 9వ తేదీ సా.6 గంటల నుంచి భక్తులను క్యూలైన్లు, వైకుంఠం కంపార్ట్మెంట్లలోకి అనుమతించబోమన్నారు. అప్పటివరకు క్యూలైన్లలో ఉన్న వారికే 10వ తేదీన శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. తిరిగి ఆగస్టు 17వ తేది ఉ.6 గంటల నుంచి భక్తులకు పునఃదర్శనం ప్రారంభమవుతుందన్నారు. ఆగస్టు 11న అంకురార్పణ 12 ఏళ్లకొకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఆగస్టు 11న అంకురార్పణతో ప్రారంభమవుతుందన్నారు. ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగే రోజులలో వైదిక కార్యక్రమాలు, శాంతి హోమాలకు ఎక్కువ ప్రాధాన్యత వుంటుందని చైర్మన్ చెప్పారు. ఈ సమయంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు కొన్ని గంటల సమయమే ఉండడంవల్ల ఆగస్టు 11 నుంచి 16 వరకు ఆరు రోజులపాటు శ్రీవారి దర్శనాన్ని రద్దుచేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించి ఆయా తేదీల్లో తిరుమల యాత్రను రద్దు చేసుకోవాలని కోరారు. కాగా, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా టీటీడీ అన్ని సేవలు రద్దుచేసింది. ఈ కార్యక్రమం ముగిసే వరకు ఎవరినీ జయవిజయలను దాటి అనుమతించరు. సన్నిధి సిబ్బందిని కూడా రాముల వారి మేడదాటి అనుమతించరు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసులరాజు, టీటీడీ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మహాసంప్రోక్షణ అంటే.. నదులకు ప్రతి పన్నెండేళ్లకోసారి పుష్కరాలు నిర్వహిస్తున్నట్లే.. తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలియజేశారు. మొట్టమొదటిసారిగా 1958లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిసారిగా 2006లో నిర్వహించగా.. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 12 నుంచి 16 వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. నిజానికి ఆలయంలో మరమ్మతు పనులను నిర్వహించేందుకు నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో 12ఏళ్లకొకసారి దీనిని నిర్వహిస్తారు. అక్కడ చేయాల్సిన మరమ్మతులను బట్టి మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఆగమ పండితులు నిర్ణయిస్తారు. కాగా, శ్రీవారి గర్భాలయంలోకి అర్చకులు, జీయ్యంగార్లు మినహా మరెవ్వరినీ అనుమతించరు. దీంతో అక్కడ జరిగే మరమ్మతులను వారే నిర్వహించాలి. ఇతర ఆలయాల్లో చేసే విధంగా ఇంజనీరింగ్ అధికారులను ఆలయంలోకి అనుమతించరు. మహా సంప్రోక్షణంలో మూలవిరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యన అష్టబంధనం కార్యక్రమాన్ని మాత్రమే నిర్వహిస్తున్నారు. మూడు విభాగాలుగా నిర్వహణ బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీవారి మూలవిరాట్‌లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణమండపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటుచేయనున్నారు. స్వామి వారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని ఇక్కడ ఉంచుతారు. మూలవిరాట్‌కు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. ఆఖరి రోజున మహా సంప్రోక్షణతో స్వామి వారి శక్తిని తిరిగి మూలవిరాట్లోకి ఆవాహన చేస్తారు. ఈ కార్యక్రమంతో తిరిగి మూలవిరాట్ని నూతనంగా నిర్మించినట్లే. ఆగస్టు 15న మహాశాంతి తిరుమంజనం, ఆగస్టు 16న ఉదయం 10.16 గంటలకు తులా లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. అష్టబంధనం అంటే.. శ్రీవారి మూలవిరాట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నింపటమే అష్టబంధన కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా 8 రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదాల కింద, మూలవిరాట్ సమీపంలో ఉంచుతారు. ఇందులో నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచక్కెర, లక్క, చెకుముకిరాయి, బెల్లం.. ఈ 8 రకాల వస్తువుల మిశ్రమాన్ని మూలవిరాట్‌తో పాటు ఆధార్పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పైభాగంలో గోడకు వున్న రంధ్రాలలో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాలక్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం.. రంగు మారడంవల్ల మూలవిరాట్‌లో శక్తి తగ్గిపోతుంది. తిరిగి ఆ శక్తిని పెంపొందించేందుకే ఈ మహోన్నత కార్యక్రమం. నాలుగు వేదాలు పఠిస్తాం మొదటిసారిగా కంకణభట్టార్‌గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా వుంది. ఈ ఐదు రోజులపాటు నాతో కలిపి 45 మంది రుత్వికులు, దాదాపు 100 మంది వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఐదు రోజులపాటు స్వామివారిని కుంభంలోకి ఆహ్వానించి దానిని యాగశాలలో శక్తిని నింపుతాం. అక్కడ రామాయణం, వేదపారాయణం, భగవద్గీత, నాలుగు వేదాలను పఠించి కుంభానికి శక్తిని నింపి ఆఖరు రోజున ఆ కుంభాన్ని తిరిగి స్వామివారిలోకి పంపుతాం. – వేణుగోపాల్ దీక్షితులు, ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు -
దర్శనం గోవిందా
-
టీటీడీ: తొమ్మిది రోజుల పాటు వెంకన్న దర్శనం రద్దు
-
టీటీడీ సంచలన నిర్ణయం
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. శనివారం టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఆలయ చైర్మన్ మాట్లాడుతూ.. ఆగస్టు 11న అంకురార్పణ ఉంటుందని, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంప్రోక్షణలో దాదాపు 30 వేల మంది భక్తులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ తొమ్మిది రోజుల పాటు కొండపైకి భక్తులను అనుమతించేది లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం ఉండదు. గత కొంత కాలంగా టీటీడీలో చెలరేగుతున్న వరుస వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలో ఆసక్తి రేకిత్తిస్తోంది. శ్రీవారి నగలు మాయం చేస్తున్నారంటూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఘాటు విమర్శలు చేస్తున్న సమయంలో, తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తూ పాలక మండలి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. -
శ్రీవారి దర్శనం రద్దు చేసే యోచనలో బోర్డు
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ నెల 14న అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. గత కొంత కాలంగా టీటీడీలో చెలరేగుతున్న వరుస వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలో ఆసక్తి రేకిత్తిస్తోంది. ఇక ఆగష్టు 12 నుంచి 16 వరకూ మహా సంప్రోక్షణ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ సమయంలో స్వామి వారి దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో పాలక మండలి ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీవారి నగలు మాయం చేస్తున్నారంటూ మాజీ టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఘాటు విమర్శలు చేస్తున్న సమయంలో, పాలక మండలి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
తిరుమలలో ఎల్లుండి టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం
-
చందా కొచర్‌కు బోర్డు షాక్ ఇవ్వనుందా?
-
చందా కొచర్‌కు ఉద్వాసన?
సాక్షి, ముంబై: వీడియోకాన్ రుణ వివాదంలో చిక్కుకున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్‌కు బోర్డు షాక్ ఇవ్వనుందా? బ్యాంకులో ఆమె భవితవ్యం నేడు తేలనుందా? ఈ కుంభకోణంపై విచారణ నేపథ్యంలో సీఈవో పదవినుంచి ఉద్వాసన పలకనున్నారా? నేడు జరగనున్న ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ కీలక ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. బ్యాంకు మేనేజ్మెంట్ పునర్వవస్థీకరణపై బోర్డు డైరెక్టర్లు చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్యాంకుకు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ వెంచర్ ప్రుడెన్షియల్ లైఫ్‌కు సీఈఓ సందీప్ బక్షిని ఐసీఐసీఐ బ్యాంకు తాత్కాలిక సీఈవోగా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఆరోపణలపై విచారణ పూర్తయ్యేంత వరకు నిరవధిక సెలవులో వెళ్లమని బోర్డు కోరనుందని భావిస్తున్నారు. అలాగే బీఎన్ కృష్ణ విచారణ ప్రతిపాదనకు ఆమోదం, తదుపరి కార్యాచరణపై సమగ్రంగా ఈ సమావేశం చర్చించనుంది. ఈ వార్తలపై బ్యాంకు బోర్డు అధికారికంగా స్పందించాల్సి ఉంది. 1986లో సందీప్ బక్షి ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 2010 నుంచి ఆగస్టు నుంచి ప్రుడెన్షియల్ లైఫ్‌కు సీఈఓగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2009-10 మధ్య కాలంలో బ్యాంకుకు చెందిన రిటైల్ సంస్థకు డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. కాగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచర్‌పై వచ్చిన ఆర్థిక అభియోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలోని స్వత్రంత కమిటీ విచారణకు ఆమోదం తెలిపారు. కొచర్ భర్త దీపక్ కంపెనీకి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విధంగా చందా కొచర్ వ్యవహరించారనే అభియోగాలొచ్చిన విషయం విదితమే. -
టీటీడీ అర్చకులు రమణదీక్షితులపై వేటు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ వెంటనే అమలులోకి తీసుకువచ్చింది. దాంతో శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సహా అర్చకులు నరసింహదీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణదీక్షితులపై వేటు పడింది. రమణ దీక్షితులు సహా నలుగురు ప్రధాన అర్చకులు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే టీటీడీ తీసుకున్నఈ నిర్ణయంపై అర్చకులు మండిపడుతున్నారు. కాగా, టీటీడీ నిర్ణయాలపై రమణదీక్షితులు మంగళవారం చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆచార వ్యవహారాలపై పలు విమర్శలు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది జరిగి 24 గంటలకు గడవక ముందే 65 ఏళ్ల పరిమితి సాకు చూపి రమణదీక్షితులపై పాలకమండలి వేటు వేసింది. అంతేకాకుండా రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరుతామని దేవస్థానం ఈవో సింఘాల్ తెలిపారు. -
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక
-
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక మరి కొద్దిసేపట్లో?
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్ గా ఎవరు అనే సస్పెన్స్ కు మరి కొద్ది పేపట్లో తెరపడనుంది. సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం నూతన చైర్మన్ ఎంపిక కసరత్తు ఈ రోజుతో ముగియనుంది. గురువారం అనుకోని బోర్డు సమావేశంలో ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది. సాయంత్రం 5 గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో మార్కెట్ వర్గాల్లో ప్రముఖమైన వ్యక్తినే ఈ పదవికి ఎంపిక చేసు అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే టాటా సన్స్ బోర్డు వైస్ ఛైర్మన్ అ భ్యర్థి ఎంపికను ఈ సమావేశంలోనే ఎంపిక చేయనున్నారు. కాగా గత ఏడాది అక్టోబర్ లో మిస్త్రీ తొలగింపు తర్వాత రతన్ టాటా మధ్యంతర ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. -
నేడు గోదావరి నది బోర్దు సమావేశం
-
ఆర్ కాం జియో కి షాకిస్తుందా?
ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎయిర్ సెల్ , ఆర్ కాం విలీనానికి రంగం సిధ్దమైంది. అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో మరో టెలీకాం సంస్థ ఎయిర్‌సెల్ సంస్థ విలీనంపై ఈ నెలలోనే అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియాలో వినియోగదారుల పరంగా టాప్-3 టెలికం సంస్థగా ఆవిర్భవించాలన్న కోరికతో ఉన్న అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. బుధవారం జరగబోయే ఆర్ కాం బోర్డ్ సమావేశం అనంతరం ఈ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు రూ. 14వేల కోట్ల వాటాల జారీ విధానం ద్వారా ఈ ఒప్పందం ఖరారు కానుంది. దీని ద్వారా 196 మిలియన్ల ఖాతాదారులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సమాచారం. ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు ఒక కొత్త బ్రాండ్ నేమ్ తో పనిచేయన్నాయి. ఎయిర్ సెల్,ఆర్ కాం సమాన భాగస్వామ్యంతో ఈ కొత్త సంస్థ పనిచేయనుంది. చెరి 580 మిలియన్ డాలర్ల పెట్టబడులతో 7600కోట్ల ఈక్విటీ పూల్ ను సాధించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొత్త కంపెనీ స్పెక్ట్రం లైసెన్స్ 800, 900,1800, 2100, 2300 ఎంహెచ్జె బాండ్ విడ్త్ తో ఉంటుందని అంచనా. అయితే ఈ వార్తలను ధృవీకరించడానికి ఇరు సంస్థలు నిరాకరించాయి. కాగా ఉచిత సేవలు, ఉచితరోమింగ్ అంటూ సంచలనంగా మార్కెట్ లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియోకి పోటీగా ఆర్ కాం తాజాగా 40రూపాయలకే ఫుల్ టాక్ టైం, 1 జీబీ డాటా ఉచితంగా అందించే ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మూడవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ ఏర్పాటుపై కన్నేసిన అనిల్ ఆధ్వర్యంలోని ఆర్ కాం సోదరుడు ముకేష్ సొంతమైన జియోకి షాకిస్తుందా అనే అభిప్రాయం మార్కెట్ లో నెలకొంది. -
ఖరీఫ్ నీటిపై ఏం తేలుస్తారో?
నేడే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద నీటి విడుదలపై చర్చలు 30 టీఎంసీలు కోరుతున్న తెలంగాణ 37 టీఎంసీలు కావాలంటున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద ఖరీఫ్ సాగు అవసరాల కోసం నీటి విడుదలే ఎజెండాగా శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. నీటిపారుదలశాఖ కార్యాలయంలోని జలసౌధలో జరిగే ఈ సమావేశానికి బోర్డు తాత్కాలిక చైర్మన్ రామ్‌శరణ్‌తోపాటు సభ్య కార్యదర్శి సమీరా చటర్జీ, ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీలు హాజరుకానున్నారు. ఇప్పటికే సాగర్ కింద రాష్ట్ర అవసరాలను పేర్కొంటూ ఈఎన్ సీ మురళీధర్ బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీకి లేఖ రాశారు. సాగర్ ఎడమ కాల్వ కింద సాగు అవసరాలకు 30 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) కింద తాగు అవసరాలకు 5 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. ఆవిరి నష్టాలు, సీపే జీ నష్టాలు ఉండే అవకాశాల దృష్ట్యా మరో 4 టీఎంసీలు అదనంగా విడుదల చేయాలని విన్నవించారు. శ్రీశైలంలో ప్రస్తుతం 165 టీఎంసీల మేర నీరు లభ్యతగా ఉందని, ఇందులో కనీస నీటిమట్టం 834 అడుగులకుపైన 118 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ, ఏపీలు ఇప్పటికే 19.5 టీఎంసీలు పంచుకోగా దాదాపు మరో 98 టీఎంసీల నీరు ఉందని, ఈ నీటిలోంచే తమకు 39 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందిం చిన బోర్డు తొలి విడతగా ఇప్పటికే 3 టీఎం సీల నీటి విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ నీటి విడుదల సైతం మొదలైంది. మిగతా నీటి విడుదలపై ఏపీతో చర్చించి బోర్డు నిర్ణయం చెప్పాల్సి ఉంది. మరోవైపు హంద్రీనీవా ద్వా రా రోజూ 2,020 క్యూసెక్కుల చొప్పున నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలిస్తోంది. దీనికితోడు పోతిరెడ్డిపాడు ద్వారా కొన్ని రోజుల నుంచి ఏకంగా ఒక టీఎంసీ చొప్పున నీటిని తీసుకుంటోంది. ముందస్తు సమాచారం లేకుండా ఏపీ సాగిస్తున్న నీటి మళ్లింపుపై తెలంగాణ ఇప్పటికే అభ్యంతరాలు లేవనెత్తింది. దీనిపై సైతం బోర్డు ఏపీతో చర్చిం చాల్సి ఉంది. ఇదే సమయంలో సాగర్ కుడి కాల్వ, కేసీ కెనాల్, తెలుగు గంగ కింద సాగు అవసరాల కోసం 37 టీఎంసీల నీటి కేటాయింపులు చేయాలని ఏపీ కోరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, సాగర్‌లో నీటి లభ్యత, నిల్వలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేయాల్సిన టెలీమెట్రీ విధానం అమలు, వాటికి బడ్జెట్ కేటాయింపు అంశాలపైనా బోర్డు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. -
బీసీసీఐ ఇక సూపర్ పవర్
బీసీసీఐని అన్నింటా ముందుండి నడిపిస్తున్న అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఇక మరో కీలక బాధ్యతను నిర్వర్తించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఐసీసీ బోర్డు తొలి చైర్మన్‌గా శ్రీని ఎంపికయ్యారు. వచ్చే జూలై నుంచి ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. సింగపూర్: ఎలాంటి సంచలనాలు లేవు. అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డుగా పేరు తెచ్చుకున్న బీసీసీఐ ఇక ఐసీసీలోనూ శక్తివంతం కానుంది. తాజా పునర్ నిర్మాణ ప్రతిపాదనలకు శనివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో ఐసీసీ నుంచి అధిక ఆదాయ వాటాతో పాటు పరిపాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం బోర్డుకు లభించినట్టయ్యింది. ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లకు కూడా సముచిత ప్రాధాన్యం లభించనుంది. ఈ వివాదాస్పద ప్రతిపాదనలను ప్రారంభం నుంచి దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయితే శనివారం సమావేశంలో అనూహ్యంగా దక్షిణాఫ్రికా కూడా మద్దతు ఇచ్చింది. దీంతో శ్రీలంక, పాక్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో ఎనిమిది శాశ్వత సభ్య దేశాలు ఐసీసీ పునర్ నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లయింది. వీటితో అన్ని దేశాలకు ఆర్థికపరంగా ప్రయోజనాలు కలుగుతాయని ఐసీసీ తెలిపింది. జూన్‌లో జరిగే తమ కౌన్సిల్ భేటీలో వీటికి మరోమారు లాంఛనంగా ఆమోదం తెలుపనున్నారు. దక్షిణాఫ్రికా అంగీకారం కీలకమైన ఓటింగ్‌కు ముందు హైడ్రామా నడిచింది. ఐసీసీలో బీసీసీఐ, సీఏ, ఈసీబీ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ)కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అయితే తాజా సవరణలు ఈ మూడింటికి అనుకూలంగా ఉన్నాయని, ఇవి అమల్లోకి వస్తే ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న తమకు తీరని నష్టమని సీఎస్ఏ వాదించిన విషయం తెలిసిందే. అటు శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు కూడా సీఎస్ఏకు వంత పాడాయి. అయితే బీసీసీఐ తాము అనుకున్నది సాధించాలంటే కనీసం ఎనిమిది సభ్య దేశాల మద్దతు అవసరం. దీంతో ఈ మూడింటిలో ఒకరిని బుజ్జగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ రంగంలోకి దిగారు. సీఎస్ఏ అధ్యక్షుడు క్రిస్ నెన్జానితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2015-23 మధ్య ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగేందుకు హామీ లభించింది. భారత్‌తో సిరీస్ అంటే కాసుల పంటే కాబట్టి సీఎస్ఏ మెత్తబడింది. అలాగే ఐసీసీతో తమకున్న అనుబంధం దృష్ట్యా ఇదే కాలంలో తమ దేశంలో ఓ మేజర్ ఈవెంట్ జరిగేలా చూడాలని నెన్‌జాని ఐసీసీని కోరారు. ఇవీ ఆమోదం పొందిన ప్రతిపాదనలు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఉండదు. దీని స్థానంలోనే ఇప్పటికే రద్దు చేద్దామనుకున్న చాంపియన్స్ ట్రోఫీని 2017, 2021లో నిర్వహిస్తారు. సంప్రదాయక టెస్టు ఫార్మాట్‌ను సంరక్షించుకునేందుకు టెస్టు క్రికెట్ నిధి ఏర్పాటు. బీసీసీఐ, సీఏ, ఈసీబీలకు మినహాయించి ఈ నిధిని టెస్టు ఆడే అన్ని దేశాలకు పంపిణీ చేస్తారు. అసోసియేట్ దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్న వాటికి టెస్టు హోదా దక్కే అవకాశాన్ని కూడా ఐసీసీ ఇవ్వనుంది. వచ్చే ఐసీసీ ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేత.. టెస్టు ర్యాంకుల్లో అట్టడుగున్న ఉన్న జట్టుతో ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంట్లో నెగ్గితే అసోసియేట్ జట్టుకు టెస్టు హోదా దక్కుతుంది. కొత్తగా ఐసీసీ చైర్మన్ పదవితో పాటు బోర్డుకు కీలక విషయాలపై నివేదిక ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కానుంది. సీఏ చైర్మన్ వాలీ ఎడ్వర్డ్స్ దీనికి నేతృత్వం వహించనున్నారు. ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీకి ఈసీబీ అధ్యక్షుడు గైల్స్ క్లార్క్ నేతృత్వం వహిస్తారు. ఈ రెండు కమిటీల్లో మూడు అగ్రబోర్డులతో పాటు రెండు ఇతర సభ్యదేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఇప్పటిదాకా కొనసాగిన భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ) స్థానంలో పరస్పర అంగీకార ద్వైపాక్షిక సిరీస్‌లు ఉంటాయి. ఆకర్షణీయ కొత్త హక్కుల ఒప్పందంలో అన్ని దేశాలకు అధిక ఆదాయం రానుంది.