సాక్షి, తిరుమల: నేడు(శనివారం) టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం టీటీడీ 85 అంశాలతో ఎజెండాను రూపొందించింది. ఈ సందర్భంగా.. గరుడ వారధిని అలిపిరి వరకు విస్తరణకు నిధుల కేటాయింపు, కల్యాణమస్తు, మారుమూల ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంపై చర్చించనున్నారు. దర్శన టికెట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయానికి ఔట్‌లెట్లు కేటాయింపుపై కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. తిరుమలలోని పవన విద్యుత్ కేంద్ర నిర్వహణను హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో సంస్థకు అప్పగించేందుకు ప్రతిపాదనలు పరిశీలించనున్నారు. పేరూరులోని వకులమాత ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు రూ.2.90 కోట్లను శ్రీవాణి ట్రస్ట్ నిధుల కేటాయింపు, తిరుమల భద్రతకు తలపెట్టిన కంచె నిర్మాణంలో మూడో దశ నిర్మాణ పనులకు రూ.7.37 కోట్లతో ప్రతిపాదనలు పరిశీలించనున్నారు.
చదవండి: చెన్నైకి తెలుగుగంగ జలాలు
Comments
Please login to add a commentAdd a comment