తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డ్ సమావేశం సీటెల్‌లో ఘనంగా జరిగింది. వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులు, సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల సీటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని మరణించిన జాహ్నవి కందుల మృతికి బోర్డ్ సభ్యులు సంతాపం తెలియజేశారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ వంశీ రెడ్డి అధ్యక్షతన 2024 మే 24 నుంచి 26 వరకు సియాటిల్ నగరంలో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 గురించి చర్చించారు. ఈ బోర్డు సమావేశంలో టీటీఏ కన్వెన్షన్ వెబ్‌సైట్, సరికొత్త లోగోను ప్రారంభించింది. ఈ సమావేశానికి టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ళ మల్లా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సలహా మండలి విజయపాల్ రెడ్డి, మోహన్ పటోళ్ల, భరత్ మాదాడి, అధ్యక్షుడు వంశీ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్, ప్రధాన కార్యదర్శి కవిత, EC, BoD, జాతీయ బృందం అంతా కలిసి వివిధ అంశాలఫై చర్చించారు.
టిటిఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి బోర్డ్ ప్రారంభ సందేశం వివరించారు. సీటెల్ లో వచ్చే ఏడాది జరగనున్న 2024 మెగా కన్వెన్షన్ సక్సెస్ చేయాలని, అవసరమైన నిధుల సమీకరణకు బోర్డ్ సభ్యులు కృషి చేయాలని కోరారు. టిటిఏ 2024 మెగా కన్వెన్షన్ విజయవంతానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అడ్వైజరీ చైర్ డా. విజయపాల్ రెడ్డి తెలియజేశారు. అడ్వైజరీ కో-చైర్ మోహన్ పాటల్లోల, సభ్యుడు భరత్ మాదాడి 2023 డిసెంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సేవా దినోత్సవాలు, అలాగే కన్వెన్షన్ గురించి వివరాలను తెలియజేశారు. టిటిఏ 2024 మెగా కన్వెన్షన్ గురించి ప్రెసిడెంట్ వంశీ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని బోర్డు సభ్యులందరినీ కోరారు. ఈ బోర్డ్ మీటింగ్‌లో దాదాపు 1 మిలియన్ డాలర్లు నిధుల సేకరణకు హామీలు వచ్చాయి.
అలాగే టీటీఏ మెగా కన్వెన్షన్ కు వేదికైన సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ ని బోర్డు సభ్యులు పరిశీలించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెద్ది, సెక్రటరీ కవితా రెడ్డితో పాటు టీమ్ సభ్యులు, పులువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని.. కన్వెన్షన్ విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ సభ్యులందరితో సాయంత్రం టీటీఏ కార్య నిర్వాహక వర్గం కలిసి సాంస్కృతిక కార్యక్రమములో పాల్గొన్నారు. విజ్ఞేశ్వర స్తుతితో మొదలైన ఈ కార్యక్రమము ఆద్యంతం ప్రేక్షకులకు స్వచ్చమైన తెలంగాణ సంప్రదాయముల మధ్య అంగ రంగ వైభవముగా జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన వంశీ రెడ్డి గారు సియాటెల్ వచ్చిన టీటీఏ ప్రతినిధులకి సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానిత అతిధులందరిని పేరు పేరునా వేదిక మీదకి ఆహ్వానించి శాలువాలతో సత్కరించినారు.
అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్ కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. టీటీఏ విరాళాల రూపంలో ఒకే రోజులో 2 మిలియన్ డాలర్లను విజయవంతంగా సేకరించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు, సియాటిల్ నగరంలో ఇంత పెద్ద కన్వెన్షన్ జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేసి, తమ మద్దతు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ , APNRTS Regional Co ordinator దుష్యంత్ రెడ్డి, శ్రీనివాస్ అబ్బూరి , రామ్ పాలూరి, భాస్కర్ గంగిపాముల, తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ బోర్డ్ కృతజ్ఞతలు తెలిపింది.
(చదవండి: భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..)
Comments
Please login to add a commentAdd a comment