ముంబై: వివిధ అంశాలు, సమస్యలపై చర్చకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ (జీల్) అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మైనారిటీ వాటాదారు ఇన్వెస్కో చేసిన అభ్యర్థనకు ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ సానుకూలంగా స్పందించింది. బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జీల్)ను ఆదేశించింది. అమెరికాకు చెందిన ఇనెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్, ఓఎఫ్‌ఐ గ్లోబల్ చైనా ఫండ్‌తో కలిగి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పిటిషన్ దాఖలు చేశాయి.
బోర్డ్ సమావేశం ఏర్పాటు ద్వారా జీల్ సీఈవో, ఎండీ పునీత్ గోయెంకాసహా మరో ఇద్దరు డైరెక్టర్లను తొలగించాలని ఆశిస్తోంది. అలాగే కొత్తగా ఎంపిక చేసిన ఆరుగురు డైరెక్టర్లతో బోర్డును పునర్‌నిర్మించాలని డిమాండ్ చేస్తోంది. బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను షేర్ హోల్డర్లందరికీ తగిన విధంగా తెలియజేయాలని కూడా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌నుజీ ఎంటర్‌టైన్‌మెంట్, అత్యవసర వాటాదారుల సమావేశం, ఇన్వెస్కో , ఎన్‌సీఎల్‌టీ , బోర్డ్ సమావేశం ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. ఈ అంశాలపై తదుపరి విచారణను అక్టోబర్ 4న చేపట్టనున్నట్లు ఇద్దరు సభ్యుల బెంచ్ తెలియజేసింది. మరోపక్క ఈ అంశాలపై చట్ట ప్రకారం కేటాయించిన గడువులోగా బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జీల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
వాటాలు ఇలా...
ఈజీఎంను చేపట్టమంటూ సెప్టెంబర్ 11న జీల్‌ను అభ్యర్థించినట్లు ఇన్వెస్కో తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ ట్రిబ్యునల్‌కు తెలియజేశారు. వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణార్ధం ప్రస్తుత బోర్డు ఆధ్వర్యంలో కంపెనీ నిర్వహణ చేపట్టరాదంటూ పేర్కొన్నారు. కొత్త డైరెక్టర్లను నియమించుకోవడం ద్వారా బోర్డును తిరిగి నిర్మించాలని కోరారు. దీంతో 45 రోజుల్లోగా ఈజీఎంను చేపట్టవలసిందిగా జీల్‌ను ఆదేశించమంటూ ఎన్‌సీఎల్‌టీని వేడుకున్నారు. ఓఎఫ్‌ఐ గ్లోబల్ చైనా ఫండ్‌తో కలిపి ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ జీల్‌లో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. సెపె్టంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాతో విలీనమయ్యేందుకు జీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో జీల్ షేరు 2 శాతం క్షీణించి రూ. 304 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment