డాలస్: అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ (నాటా ) బోర్డు సమావేశం డాలస్‌లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి నాటా అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి ప్రత్యేక అతిధి గా విచ్చేయగా, ఈ కార్యక్రమంలో డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(అధ్యక్షులు), డాక్టర్ ఆదిశేషా రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్), డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(మాజీ అధ్యక్షులు), డాక్టర్ సంజీవ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), హరి వేల్కూర్(కాబోయే అధ్యక్షులు), ఆళ్ళ రామి రెడ్డి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి), శ్రీనివాస్ సోమవరపు(కోశాధికారి), మందపాటి శరత్ రెడ్డి(సంయుక్త కార్యదర్శి ), సతీష్ నరాల (సంయుక్త కోశాధికారి ) తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ మరియు రీజినల్ కోఆర్డినేటర్స్ అందరూ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జూన్ 30, జులై 1-2 2023 లో డాలస్ లో జరిగే కన్వెన్షన్ గురించి వివరాలు తెలిపారు. బోర్డు సమావేశం తర్వాత సభ్యులు అందరూ డాలస్ కన్వెన్షన్ టూర్ కు వెళ్లి అక్కడ వేదికను పరిశీలించి నాటా మెగా కన్వెన్షన్‌కు రానున్న పదిహేను వేల మంది అతిధులకు కల్పించే సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.
ఆ తర్వాత సాయంత్రం జరిగిన నిధుల సేకరణ విందు లో పాల్గొన్న ఏడు వందల పైగా పలువురు దాతలు కనీవిని ఎరుగని రీతిలో రెండు మిలియన్ల ఆరు వందల వేల డాలర్లు ($2,600,000) ఇస్తామని నాటా కు వచ్చిన హామీ అమెరికాలో సరిక్రొత్త రికార్డు సృష్టించింది. ఈ విధంగా నిధుల సేకరణకు విశేష కృషి చేసిన డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి గారిని నాటా కార్యవర్గం ప్రత్యేకం గా అభినందించింది. వివిధ రాష్టాల నుండి వచ్చిన నాటా కార్యవర్గ సభ్యులను గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి) నిధుల సేకరణ విందు లో పాల్గొన్న దాతలకు పరిచయం చేసినారు. ఈ కార్యక్రమాన్ని గిరీష్ రామిరెడ్డి (కన్వీనర్ ), బూచిపూడి రామి రెడ్డి (కోఆర్డినేటర్ ), కృష్ణ కోడూరు (కో కన్వీనర్), భాస్కర్ గండికోట(కో కోఆర్డినేటర్), రమణ రెడ్డి క్రిస్టపాటి(డిప్యూటీ కన్వీనర్), మల్లిక్ ఆవుల (డిప్యూటీ కోఆర్డినేటర్), రవీంద్ర అరిమండ (బోర్డు సభ్యుడు), వీరా రెడ్డి వేముల, దర్గా నాగిరెడ్డి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), పుట్లూరు రమణ(బోర్డు సభ్యుడు), చెన్నా రెడ్డి, మోహన్ రెడ్డి మల్లంపాటి, ప్రసాద్ చొప్ప ఇతరులు అతిధులకు సౌకర్యాలను కల్పించారు. ఈ నిధుల సేకరణ విందుకు హాజరై హామీ ఇచ్చిన దాతలు అందరిని నాటా కార్యవర్గం పేరు పేరున అభినందించింది.
Comments
Please login to add a commentAdd a comment