
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ నెల 14న అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. గత కొంత కాలంగా టీటీడీలో చెలరేగుతున్న వరుస వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలో ఆసక్తి రేకిత్తిస్తోంది. ఇక ఆగష్టు 12 నుంచి 16 వరకూ మహా సంప్రోక్షణ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇందుకోసం ఆ సమయంలో స్వామి వారి దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో పాలక మండలి ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీవారి నగలు మాయం చేస్తున్నారంటూ మాజీ టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఘాటు విమర్శలు చేస్తున్న సమయంలో, పాలక మండలి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.