సాక్షి, ముంబై : జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభానికి ఇంకా తెర పడలేదు. నిధుల లేమితో పాతాళానికి పడిపోయిన జెట్ ఎయిర్‌వేస్ కార్యకాలాపాలు మూడ పడనున్నాయని తెలుస్తోంది. మంగళవారం నాటి జెట్ ఎయిర్‌వేస్ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. ముంబైలో కొనసాగుతున్న బోర్డు సమావేశంలో ఆర్థిక సహాయం అందని కారణంగా జెట్‌ఎయిర్‌వేస్‌ను మూసివేతకు బోర్డు ప్రతిపాదించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో ఇన్వెస‍్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో జెట్ ఎయిర్‌వేస్ షేర్ 18శాతం కుప్పకూలింది.
మధ్యంతర నిధులను సమకూర్చేందుకు బ్యాంకుల మధ్య అంగీకారం కుదరలేదని ఈ రోజు సమావేశమైన జెట్ ఎయిర్‌వేస్ బోర్డు తెలిపింది. అలాగే సంస్థను గట్టెక్కించే నాధుడు ఇంకా వెలుగులోకి రాలేదు. జెట్ ఎయిర్‌వేస్ వాటాల కొనుగోలుకు దాఖలు చేయాల్సిన గడువును మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు బిడ్డర్లు తమ బిడ్స్ సమర్పించుకోవచ్చని కంపెనీ తాజాగా వెల్లడించింది. అలాగే సంస్థ మాజీ ఫౌండర నరేష్ గోయల్ కొనుగోలు రేస్ నుంచి తప్పుకున్నారు. ఈ తాజా పరిణామాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇది ఇలా వుంటే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ పరిణామాలను పరిశీలిస్తోందని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు.
మరోవైపు అంతర్జాతీయ సర్వీసులన్నింటిని సోమవారం దాగా రద్దు చేసుకున్న సంస్థ మరోసారి ఈ గడువును పొడిగించింది. ఏప్రిల్ 18వరకు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్‌వేస్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు ఏప్రిల్ 18 వరకు జెట్ ఎయిర్‌వేస్‌కు ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఐవోసీ తెలిపింది.
కాగా రూ. 3500 కోట్ల రుణ భారానికి తోడు, టికెట్ల కాన్సిలేషన్ ద్వారా ప్రయాణికులకు చెల్లించాల్సిన చార్జీల విలువ రూ.3500 కోట్లకు చేరింది. దీంతో జెట్ ఎయిర్‌వేస్ అప్పుల భారం మొత్తం రూ. 8500 కోట్లకు ఎగబాకింది. జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం 7 విమానాలను నడుపుతోంది. ఈ వార్తలు నిజమైతే 16వేలమంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడిపోనుంది.
Directed Secretary @MoCA_GoI to review issues related to Jet Airways, especially increasing fares, flight cancellations etc. Asked him to take necessary steps to protect passenger rights and safety; and to work with all stakeholders for their well being.
— Chowkidar Suresh Prabhu (@sureshpprabhu) April 16, 2019
Comments
Please login to add a commentAdd a comment