
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్‌వేస్ విమాన సేవలు నిలిచిపోయిన కొన్ని రూట్లను టేకోవర్ చేసేందుకు ఎయిర్ ఇండియా సంసిద్ధమైంది. గతంలో జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు నడిచిన కొన్ని రూట్లలో తన బోయింగ్-777 విమానాలను నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్ సీఈవో కోరిన రూ 400 కోట్ల తక్షణ నిధులను చెల్లించేందుకు బ్యాంకర్లు నిరాకరించడంతో సంస్థ షట్‌డౌన్‌కు చేరువైన సంగతి తెలిసిందే.
కాగా జెట్ ఎయిర్‌వేస్ రూట్లలో తమ విమాన సేవలను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వని లోహని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌కు లేఖ రాశారు. జెట్ ఎయిర్‌వేస్ తాత్కాలికంగా మూతపడటంతో ఆయా రూట్లలో ప్రయాణీకుల అసౌకర్యాన్ని నివారించేందుకు తాము ఈ ప్రతిపాదన చేశామని లేఖలో పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఇండియా ప్రతిపాదనపై ఎస్‌బీఐ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment