సాక్షి, తిరుమల: కశ్మీర్‌లో 18 నెలల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో 500 శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అదేవిధంగా వారణాసి, ముంబైలోనూ శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. గుడికో గోమాత కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. గత రెండేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నామని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎల్1 దర్శనాలు రద్దు చేశామని తెలిపారు.
తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ చేశామని, కరోనా సమయంలో ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ధర్మప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. వరహస్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం పనులు చెస్తున్నామని తెలిపారు. స్వామివారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం సమర్పిస్తున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: AP: రేపు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్.. ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్లు
Comments
Please login to add a commentAdd a comment