new Chairman
-
సెబీకి త్వరలో కొత్త చీఫ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనుంది. ఇందుకు ఆర్థిక శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత చైర్‌పర్శన్ మాధవీపురీ బచ్ మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28న ముగియనుంది. సెబీకి కొత్త చీఫ్‌ను ఐదేళ్ల కాలానికి ఎంపిక చేయనున్నట్లు లేదా అభ్యర్థికి 65 ఏళ్ల వయసు(ఏది ముందయితే)వరకూ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ తెలియజేసింది. దరఖాస్తుల దాఖలుకు ఫిబ్రవరి 17 గడువుగా పేర్కొంది. ఈ నెలలో 60వ వసంతంలో అడుగు పెట్టనున్న బచ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. కొత్త చైర్మన్‌గా ఎంపికయ్యే వ్యక్తికి సెబీ నిర్వహణపై ప్రభావం చూపగల ఎలాంటి ఆర్థిక లేదా సంబంధిత వ్యవహారాలు ఉండకూడదని ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. 25ఏళ్లకు మించిన వృత్తి సంబంధ అనుభవంతోపాటు 50ఏళ్లకు మించిన వయసుగల వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చని వివరించింది. ఎంపికైన అభ్యర్థి ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో నెలకు రూ. 5,62,500 చొప్పున వేతనాన్ని పొందనున్నట్లు తెలియజేసింది. సాధారణంగా ప్రభుత్వం సెబీ చీఫ్‌ను తొలుత మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తుంది. తదుపరి మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగిస్తుంది. అయితే ఇంతక్రితం యూకే సిన్హా ఐదేళ్ల కాలానికి పదవిని స్వీకరించారు. తదుపరి మరో ఏడాది బాధ్యతలు నిర్వహించారు. -
చంద్రయాన్–4, గగన్‌యాన్‌పై ప్రత్యేక దృష్టి
తిరువనంతపురం/చెన్నై: చంద్రయాన్–4, గగన్‌యాన్ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు. ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను ఇస్రో చైర్మన్‌గా, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్’ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించారని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో తాను భాగస్వామి కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇస్రో చైర్మన్‌గా తన నియామకంపై తొలుత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు. అన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని, పీఎంఓ సమాచారం చేరవేస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో ఇస్రో చేపడుతున్న ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రయోగం గగన్‌యాన్ అని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్–02ను ప్రయోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అమెరికాకు చెందిన వాణిజ్యపరమైన ఉపగ్రహాన్ని ఇస్రో మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నామని, అలాగే గగన్‌యాన్‌లో భాగంగా రాకెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రయాన్–4లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించి తీసుకురావాలని సంకల్పించామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలైందని తెలిపారు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం మన లక్ష్యమని, ఇందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనుమతి మంజూరు చేశారని వి.నారాయణన్ చెప్పారు. ఈ స్పేస్ స్టేషన్లో ఐదు మాడ్యూల్స్ ఉంటాయని, ఇందులో మొదటి మాడ్యూల్‌ను 2028లో ప్రయోగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. నారాయణన్‌కు అభినందనల వెల్లువ ఇస్రో చైర్మన్‌గా నియమితులైన వి.నారాయణన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడులో సాధారణ కుటుంబంలో జన్మించిన నారాయణన్ ఇస్రోకు చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు. నారాయణన్ నేతృత్వంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నాలుగు దశాబ్దాల అనుభవం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని మేలకట్టు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో వి.నారాయణన్ జన్మించారు. తొమ్మిదో తరగతి వరకు ఆయనకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువులో రాణించారు. తమిళనాడులో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించారు. ఏఎంఐఈ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. 2021లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందారు. 1984లో ఇస్రోలో అడుగుపెట్టారు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో సేవలందించారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధికి కృషి చేశారు. ఎన్నో రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ రంగంలో నారాయణన్‌కు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రయాన్–3 విజయానికి దోహదపడిన జాతీయస్థాయి నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. ద్రవ, ఘన ఇంధన మోటార్లను రూపొందించడంలో నిపుణుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్పీఎస్సీ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 14న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. -
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌గా వి.రామసుబ్రమణియన్
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్1తో ముగియడంతో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. కొత్త చైర్పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్ 18న సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రపతి నియమించారు. చైర్మన్ రామసుబ్రమణియన్‌తోపాటు సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్)లను నియమిస్తున్నట్లు ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. కనూంగో గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్ పర్సన్‌గా పనిచేశారు. గతంలో హక్కుల సంఘానికి అధిపతులుగా పనిచేసిన మాజీ సీజేఐలలో హెచ్ఎల్ దత్తు, కేజీ బాలకృష్ణన్ ఉన్నారు. -
ఇండియన్ ఆయిల్ చైర్మన్‌గా అరవిందర్ సింగ్ సాహ్ని
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొత్త చైర్మన్‌గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 54 సంవత్సరాల సాహ్నీ ప్రస్తుతం ఐఓసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్– పెట్రోకెమికల్స్)గా విధులు నిర్వహిస్తున్నారు.ఆగస్టులోనే ఈ బాధ్యతలకు ఎంపికైన ఆయన, అటు తర్వాత కొద్ది నెలల్లోనే సంస్థ చైర్మన్‌గా నియమితులు కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా పదవీ విరమణ పొందే వరకూ లేదా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ (ఏది ముందైతే అది) సాహ్నీ ఐఓసీ చైర్మన్‌గా ఉంటారు. శ్రీకాంత్ మాధవ్ వైద్య తన పొడిగించిన పదవీకాలాన్ని ఈ ఏడాది ఆగస్టు 31న పూర్తి చేసుకున్న నాటి నుంచి ఈ ఫారŠూచ్యన్ 500 కంపెనీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. 2014 జూలైలో బీ అశోక్ తర్వాత బోర్డు అనుభవం లేకుండానే కంపెనీ ఉన్నత ఉద్యోగానికి పదోన్నది పొందిన రెండవ వ్యక్తి సాహ్ని. -
అత్యంత విలువైన సంస్థగా ఎస్బీఐ
న్యూఢిల్లీ: ఎస్బీఐ దేశంలోనే అత్యంత విలువైన ఆర్థిక సేవల సంస్థగా ఎదిగేందుకు కృషి చేస్తుందని, నికర లాభాలు పెంచుకుంటుందని కొత్త చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) ప్రకటించారు. ఎస్బీఐని అత్యుత్తమ బ్యాంక్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని.. చైర్మన్ బాధ్యతల స్వీకరణ అనంతరం ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. 50 కోట్లకు పైగా కస్టమర్లకు ఎస్బీఐ సగర్వంగా సేవలు అందిస్తోందని చెబుతూ.. వివిధ విభాగాల్లో మార్కెట్ అగ్రగామిగా ఉందని, అతిపెద్ద బ్యాలెన్స్ షీట్ పరంగా ఆస్తులపై ఒక శాతం రాబడి నిష్పత్తిని సాధించినట్టు వివరించారు. ‘‘అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా ఎదిగేందుకు కృషి చేయాలి. నికర లాభం నూతన మైలురాళ్లకు చేరుకోవాలి. ప్రతి భారతీయుడి బ్యాంకర్‌గా ఎస్బీఐ స్థానం బలోపేతం కావాలి. అత్యుత్తమ సేవలు అందించాలి. ఉద్యోగులకు ఇష్టమైన సంస్థగా తీర్చిదిద్దాలి’’అంటూ ఎస్బీఐ సిబ్బందికి శెట్టి సందేశం ఇచ్చారు. 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ లాభం రూ.61,077 కోట్లుగా ఉండడం గమనార్హం. బ్యాంక్ చరిత్రలో ఇదే గరిష్ట రికార్డు. ‘‘మాతృభూమి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ది దేశంగా మారుతున్న తరుణంలో మనం ఉండడం అదృష్టం. ఆర్థిక వ్యవస్థలో లోతైన నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు వేగంగా పరిణతి చెందుతున్నాయి. ఇది భారత్‌కు చెందిన దశాబ్దం. ఇది ఎస్బీఐ దశాబ్దం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను’’అని శెట్టి పేర్కొన్నారు. ఇప్పటి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన దినేష్ ఖరా పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. ఈ నెల మొదట్లో శెట్టి నియామకం జరిగిన సంగతి తెలిసిందే.తెలుగుతేజం.. అపార అనుభవం.. కొత్త చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా, మానవపాడు మండలంలోని ఓ మారుమూల గ్రామం పెద్దపోతులపాడులో జని్మంచారు. ఆయన బాల్యం పూర్తిగా ఇదే గ్రామంలో గడిచింది. 7వ తరగతి వరకూ గ్రామంలోనే విద్యనభ్యసించిన ఆయన, అనంతరం గద్వాల్లో పదవ తరగతి, ఇంటర్ పూర్తిచేశారు. అటు తర్వాత హైదరాబాద్ వచ్చి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తిచేశారు. ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభం.. 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్బీఐలో తన కెరీర్‌ను ప్రారంభించారు. గుజరాత్లో తొలుత పోస్టింగ్‌లో చేరిన ఆయనకు బ్యాంకింగ్‌లో మూడు దశాబ్దాల అపార అనుభవం ఉంది. ఎస్బీఐలో పలు బాధ్యతలను ఆయన నిర్వహించారు. ముఖ్యంగా నాలుగేళ్లపాటు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్స్‌లో భాగంగా ఎస్బీఐ ఓవర్సీస్ బాధ్యతలు స్వీకరించి అమెరికాలో పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచి్చన తర్వాత ఎస్బీఐ ఎండీగా పదోన్నతి పొందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్‌లో సరి్టఫైడ్ అసోసియేట్‌గా పనిచేశారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ టాస్‌్కఫోర్స్‌లు, కమిటీలకు నేతృత్వం వహించిన శెట్టి, ఎస్బీఐ మెనేజింగ్ డైరెక్టర్‌గా , బ్యాంక్ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షించారు. -
పవర్ కమిషన్ కొత్త చైర్మన్‌పై కొనసాగనున్న సస్పెన్స్
ఢిల్లీ, సాక్షి: తెలంగాణ విద్యుత్ కమిషన్‌కు కొత్త చైర్మన్ విషయంలో ఉత్కంఠ కొనసాగనుంది. చైర్మన్‌ను మార్చాల్సిందేనని సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు వెలువడిన కాసేపటికే కొత్త చైర్మన్ పేరును ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ, కాసేపటికే కొత్త పేరును సోమవారం ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు నివేదించింది.అయితే ప్రస్తుత చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి అప్పటిదాకా కొనసాగడానికి కూడా వీల్లేదని, ఆయన కమిటీలోని సభ్యులు కూడా కొనసాగకూడదని సుప్రీం కోర్టు తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. ఆ సమయంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు జస్టిస్ నర్సింహారెడ్డి ఆయన రాసిన లేఖ కాపీని సుప్రీంకోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు అందజేశారు. దీంతో కొత్త చైర్మన్‌ను నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు టైమిచ్చింది. అంతేకాదు.. కొత్త జడ్జి, కమిషన్ కాలపరిమితి విధానాలను కొత్త నోటిఫికేషన్లో వెల్లడించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతకు ముందు.. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ కొనసాగుతున్న టైంలోనే.. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది.సంబంధిత వార్త: పవర్ కమిషన్‌కు సుప్రీం షాక్బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో ఇరుపక్షాల తరఫున సీనియర్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా.. కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. వాదనల అనంతరం విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
సీబీడీటీ కొత్త చైర్మన్‌గా రవి అగర్వాల్
ఆదాయపు పన్ను శాఖ పరిపాలనా సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త చైర్మన్‌గా 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ 1986 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది.గుప్తా 2022 జూన్‌లో సీబీడీటీ చీఫ్‌గా నియమితులయ్యారు. గత ఏడాది సెప్టెంబరులోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా జూన్ వరకు తొమ్మిది నెలల పొడిగింపు ఇచ్చారు. కొత్త సీబీడీటీ చీఫ్ ప్రస్తుతం బోర్డులో మెంబర్ (అడ్మినిస్ట్రేషన్)గా వ్యవహరిస్తున్నారు.అగర్వాల్ 2025 జూన్ వరకు సీబీడీటీకి నేతృత్వం వహిస్తారని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అగర్వాల్ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, నియామక నిబంధనల సడలింపులో తిరిగి నియమితులైన కేంద్ర ప్రభుత్వ అధికారులకు వర్తించే సాధారణ నిబంధనలు, షరతుల ప్రకారం వచ్చే ఏడాది జూన్ 30 వరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పునర్నియామకం కొనసాగుతుందని ఆయన నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.సీబీడీటీకి చైర్మన్ నేతృత్వం వహిస్తుండగా, ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రగ్యా సహాయ్ సక్సేనా, హెచ్‌బీఎస్ గిల్, ప్రవీణ్ కుమార్, సంజయ్ కుమార్, సంజయ్ కుమార్ వర్మ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. జూన్ 30వ తేదీన వర్మ పదవీ విరమణ చేస్తున్నారు. -
తెలుగు అధికారికి ఎస్బీఐ పగ్గాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన చైర్మన్‌గా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిని ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) శనివారం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న దినేష్ కుమార్ ఖరా స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనివాసులు తెలుగువారు కావడం విశేషం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు ఆయన స్వస్థలం. ఎస్బీఐలో ప్రొబేషనరీ అధికారిగా 1988లో కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్ఎస్ఐబీ.. ఎస్బీఐ కొత్త చైర్మన్ కోసం జూన్ 29న ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి శ్రీనివాసులు పేరును ఖరారు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫార్సుపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
షార్ప్ ఇండియా చైర్మన్‌గా సుజయ్
న్యూఢిల్లీ: జపాన్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం షార్ప్ తమ భారత విభాగం చైర్మన్‌గా సుజయ్ కరమ్పురిని నియమించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచి్చందని సంస్థ తెలిపింది. డిస్ప్లే వ్యాపార విభాగానికి సారథ్యం వహిస్తూ భారత్‌లో షార్ప్ బ్రాండ్‌ను వృద్ధిలోకి తేవడం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు.. సొల్యూషన్స్ తయారీ, టెక్నాలజీ బదలాయింపునకు వ్యూహాత్మక భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడం తదితర బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సుజయ్ పలు కీలక హోదాల్లో పని చేశారు. -
బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు
లండన్: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జని్మంచారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన సమీర్ గతంలో బీబీసీ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. బీబీసీలో సమకాలీన, రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్‌గానూ పనిచేశారు. బ్రిటన్ రాజు చార్లెస్–3 ఈవారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేయడంతో గురువారం ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి నాలుగో తేదీ నుంచి నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే సమీర్ దాదాపు రూ.1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్ టెలివిజన్ రంగానికి చేసిన విశేష కృషికిగాను 2019లో దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 సమీర్‌ను కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్‌తో సత్కరించారు. 1998 నుంచి సొంతంగా జ్యూపిటర్ టీవీని ఈయన నడుపుతున్నారు. -
ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా అరవింద్ పనగరియా
న్యూఢిల్లీ: నీతీ ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రితి్వక్ రంజనం పాండేను ఆర్థికసంఘం కార్యదర్శిగా నియమించారు. పనగరియా గతంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలందించారు. నూతన ఆర్థిక సంఘం 2026–27 నుంచి 2030–31 కాలానికి సంబంధించిన ఐదేళ్ల నివేదికను 2025 అక్టోబర్ 31వ తేదీకల్లా రాష్ట్రపతికి నివేదించనుంది. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు, విధి విధానాలు, కార్యచరణను నవంబర్ నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం, రెవిన్యూ వాటా తదితరాలపై ఆర్థిక సంఘం సూచనలు, సలహాలు ఇవ్వనుంది. విపత్తు నిర్వహణ చట్టం,2005 కింద మంజూరైన నిధులు కేంద్ర, రాష్ట్రాల్లో ఏ మేరకు సది్వనియోగం అవుతున్నాయనే అంశాలపై సంఘం సమీక్ష చేపట్టనుంది. 14వ ఆర్థిక సంఘం సలహా మాదిరే 2021–22 నుంచి 2025–26 ఐదేళ్లకాలానికి కేంద్రం పన్ను రాబడుల్లో 41 శాతం వాటా రాష్ట్రాలకు దక్కాలని ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుచేయడం తెల్సిందే. ఫైనాన్స్ కమిషన్ కేంద్ర,రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ. -
పీటీఐ చైర్మన్‌గా శాంత్ కుమార్
న్యూఢిల్లీ: ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)చైర్మన్‌గా ది ప్రింటర్స్(మైసూర్)కు చెందిన కేఎన్ శాంత్ కుమార్(62) ఎన్నికయ్యారు. పీటీఐ వైస్ చైర్మన్‌గా హిందుస్తాన్ టైమ్స్ సీఈవో ప్రవీణ్ సోమేశ్వర్ ఎన్నికయ్యారు. అవీక్ సర్కార్ స్థానంలో శాంత్ కుమార్ బాధ్యతలు చేపడతారు. శుక్రవారం ఢిల్లీలోని పీటీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీటీఐ బోర్డు సభ్యుల వార్షిక సమావేశం కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గం ఏడాదిపాటు కొనసాగుతుంది. శాంత్ కుమార్ 1983 నుంచి ది ప్రింటర్స్ (మైసూర్) ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. -
నాస్కామ్ చైర్‌పర్సన్‌గా రాజేశ్ నంబియార్
ముంబై: కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజేశ్ నంబియార్‌ను తన చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్ చైర్‌పర్సన్‌గా మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి బాధ్యతలు నిర్వహిస్తుండగా, నంబియార్ వైస్ చైర్పర్సన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనంత్ మహేశ్వరి నుంచి నంబియార్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నాస్కామ్ భారత్‌కు సంబంధించి ఐటీ, టెక్ ట్రేడ్ సంస్థ. ప్రభుత్వం, ఐటీ పరిశ్రమ మధ్య సమన్వయం పెంపొందడానికి ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. ‘‘నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా నియమితులు కావడాన్ని గౌరవప్రదమైన అంశంగా భావిస్తున్నాను. ప్రపంచానికి అత్యంత విశ్వసనీయమైన సాంకేతిక భాగస్వామిగా భారతదేశ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి సంబంధిత అన్ని వర్గాలతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అని తన నియామకం సందర్భంగా నంబియార్ పేర్కొన్నారు. -
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కొత్త చైర్మన్‌గా ప్రొ.అశోక్
రాయదుర్గం (హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ అశోక్ ఝన్‌ఝన్‌వాలా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన పాలక మండలి ప్రత్యేక సమావేశంలో ఒక ప్రకటన చేశారు. 1998లో ఆరంభం నుంచి ట్రిపుల్ఐటీ హైదరాబాద్ చైర్మన్‌గా కొన సాగిన ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలిలో ట్రిపుల్ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త చైర్మన్ అశోక్ ఝన్‌ఝన్‌వాలా, పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్, ఇతర ప్రొఫెసర్లతో కలసి నూతనంగా రూపొందించిన సిల్వర్‌జూబ్లీ శిల్పాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ అశోక్ ఝన్‌ఝన్ వాలా మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో మంచి గుర్తింపు పొందేలా తీర్చిదిద్దు తానని తెలిపారు. ప్రొఫెసర్ పీజే నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ఐటీ హైదరా బాద్.. దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. -
సెయిల్ చైర్మన్‌గా ప్రకాష్ బాధ్యతలు స్వీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు సంస్థ సెయిల్ కొత్త చైర్మన్‌గా అమరేందు ప్రకాష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఉన్న సోమ మోండల్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో నూతన నియామకం చోటు చేసుకుంది. మే 31 నుంచి సెయిల్ చైర్మన్‌గా ప్రకాష్ బాధ్యతలు స్వీకరించినట్టు స్టాక్ ఎక్స్చేంజ్లకు కంపెనీ సమాచారం ఇచ్చింది. బిట్ సింద్రి నుంచి మెటలర్జీలో బీటెక్ చేసిన ఆయన 1991లో సెయిల్‌లో చేరారు. ఈ రంగంలో ఆయనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. -
ఎల్ఐసి కొత్త చైర్మన్‌గా సిద్ధార్థ మహంతి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ నూతన సారథిగా సిద్ధార్థ మహంతిని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) గురువారం ఎంపిక చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లు, సారథుల ఎంపికను ఎఫ్ఎస్ఐబీ చూస్తుంటుంది. నిబంధనల ప్రకారం నలుగు మేనేజింగ్ డైరెక్టర్ల నుంచి చైర్మన్‌ను ఎంపిక చేస్తారు. మొత్తం మీద అనుభవం, ఇతర అంశాల ఆధారంగా ఎల్ఐసీ చైర్పర్సన్ పదవికి సిద్ధార్థ మహంతిని సిఫారసు చేసినట్టు ఎఫ్ఎస్ఐబీ ప్రకటన విడుదల చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫారసుపై తుది నిర్ణయాన్ని ప్రధాని అధ్యక్షతన గల కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తీసుకుంటుంది. ఒకవేళ మహంతి నియామకం ఖరారు కాకపోతే ఆయన ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎల్ఐసీ చైర్మన్‌గా ఎంపికైతే 62 ఏళ్లు వచ్చే వరకు కొనసాగొచ్చు. ఇతర ఉన్నత ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. -
బీపీసీఎల్ చైర్మన్‌గా కృష్ణకుమార్ బాధ్యతలు
న్యూఢిల్లీ: బీపీసీఎల్ నూతన చైర్మన్, ఎండీగా జి.కృష్ణకుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు వరకు సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2025 ఏప్రిల్ వరకు బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. గత డిసెంబర్లో ప్రభుత్వరంగ సంస్థల నియామక మండలి కృష్ణకుమార్‌ను ఈ పదవికి ఎంపిక చేయడం గమనార్హం. బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా అరుణ్‌కుమార్ సింగ్ గతేడాది అక్టోబర్‌తో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సంస్థ చైర్మన్ బాధ్యతలను ఫైనాన్స్ డైరెక్టర్ వెస్టా రామకృష్ణ గుప్తా చూశారు. ఎన్ఐటీ తిరుచ్చిరాపల్లి నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, జమ్నాలాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ను కృష్ణకుమార్ పూర్తి చేశారు. -
పీఎఫ్ఆర్డీఏ చైర్మన్‌గా దీపక్ మొహంతీ
న్యూఢిల్లీ: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్‌గా దీపక్ మొహంతీను ప్రభుత్వం నియమించింది. జనవరిలో పదవీకాలం ముగిసిన సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ స్థానంలో ఆయన నియామకం జరిగింది. ప్రస్తుతం పీఎఫ్ఆర్డీఏ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు. మొహంతీ ఆగస్టు 2020లో మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) గతంలో నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అపార అనుభవం కూడా ఆయనకు ఉంది. తాజా నియామకానికి సంబంధించి వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఇళ్లు, కారు సౌకర్యం లేకుండా మొహంతీ నెలకు రూ.4.50 లక్షల కన్సాలిడేటెడ్ వేతనం పొందుతారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతల్లో ఆయన పనిచేస్తారు. మెంబర్‌గా...మమతా శంకర్ మొహంతీ తాజా నియామకం నేపథ్యంలో ఆయన స్థానంలో పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) మమతా శంకర్ నియమితులయ్యారు. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (1993)లో ఉన్న ఆమె ప్రస్తుతం ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖలో సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందుగా అయితే) ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రత్యేక నోటిఫికేషన్ పేర్కొంది. పెన్షన్ నిధులు ఇలా... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అలాగే అటల్ పెన్షన్ యోజన కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 2023 మార్చి 4వ తేదీ నాటికి రూ. 8.81 లక్షల కోట్లు. దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. -
నాబార్డ్ చైర్మన్‌గా షాజి కేవీ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: నాబార్డ్ చైర్మన్‌గా షాజి కేవీ ఈ నెల 7న బాధ్యతలు స్వీకరించినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి సుచీంద్ర మిశ్రా అదనపు బాధ్యతల కింద చూస్తుండగా, ఆయన నుంచి స్వీకరించినట్టు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు ఇచ్చారు. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) కరోనా తర్వాత, 2020 ఏప్రిల్ నుంచి 2022 నవంబర్ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాల ఏర్పాటుకు బ్యాంకులు రూ.12 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 86,996 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏటీఎంలలో మోసాలు 2019-20లో రూ.116 కోట్ల మేర ఉంటే, 2020-21లో రూ.76 కోట్లకు తగ్గినట్టు చెప్పారు. ఇవీ చదవండి: టెక్ మహీంద్రా నుంచి క్లౌడ్ బ్లేజ్‌టెక్ ప్లాట్‌ఫాం వింటర్ జోరు: హీటింగ్ ఉత్పతుల హాట్ సేల్! ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి -
శాంసంగ్‌కు వారసుడొచ్చాడు...కొత్త సవాళ్లు
సియోల్: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌లో మూడో తరం వారసుడు లీ జే–యాంగ్ (54) చైర్మన్ పగ్గాలు చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయన అధికారికంగా నియమితులైనట్లు కంపెనీ వెల్లడించింది. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్) శాంసంగ్ వ్యవస్థాపకుడైన లీబియుంగ్-చుల్ మనవడైన జే-యాంగ్ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్–హైకి లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై 2017లో అరెస్టయ్యారు. గతేడాది ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. రెండు నెలల క్రితమే ఆయనకు అధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టడంతో శిక్ష నుంచి విముక్తి లభించినట్లయింది. 2014లో ఆయన వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. (Hero MotoCorp ఫిలిప్పైన్స్‌లో హీరో మోటోకార్ప్ ఎంట్రీ, కీలక డీల్ ) 2020లో ఆయన తండ్రి లీ కున్-హీ మరణించినప్పటికీ కేసుల కారణంగా జే-యాంగ్‌ను చైర్మన్‌గా నియామకం సాధ్యపడలేదు. తాజాగా ఆయనకు క్షమాభిక్ష లభించడంతో చైర్మన్‌గా నియమించేందుకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయంగా అనిశ్చితితో టెక్నాలజీ డివైజ్‌ల కొనుగోళ్లు మందగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీని సమర్ధంగా ముందుకు నడిపించడం జే-యాంగ్ ముందున్న ప్రధాన సవాలు అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఏబీసీ నూతన చైర్మన్‌గా ప్రతాప్ పవార్
న్యూఢిల్లీ: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) నూతన చైర్మన్‌గా ప్రతాప్ పవార్ ఎన్నికయ్యారు. మరాఠీ దినపత్రిక ‘సకల్’ను ప్రచురించే సకల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. 2022–23 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో మహ్రాత్తా చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్(పుణే) అధ్యక్షుడిగా సేవలందించారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ప్రతాప్ పవార్‌ను భారత ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా శ్రీనివాసన్ కె.స్వామి ఎన్నికయ్యారు. -
డీఆర్డీవో చీఫ్‌గా సమీర్ వి కామత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(డీడీఆర్‌డీ) సెక్రటరీగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, ప్రస్తుత డీఆర్డీవో చీఫ్ జి.సతీశ్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కామత్ డీఆర్డీవోలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామత్, సతీశ్‌రెడ్డిల నియామకాలను కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు కామత్ నూతన బాధ్యతల్లో కొనసాగుతారని కూడా వివరించింది. డీఆర్డీవో చీఫ్‌గా జి.సతీశ్‌రెడ్డి రెండేళ్ల పదవీ కాలానికి గాను 2018లో నియమితులయ్యారు. 2020 ఆగస్ట్‌లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. తాజాగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు బాధ్యతలు అప్పగించింది. -
నష్టాల్లోనే వొడాఫోన్ ఐడియా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టం నామమాత్రంగా తగ్గి రూ. 7,297 కోట్లకు చేరాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,319 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 10,410 కోట్లను తాకింది. ప్రస్తుత సమీక్షా కాలంలో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 104 నుంచి రూ. 128కు మెరుగుపడింది. టారిఫ్‌ల పెంపు ఇందుకు సహకరించింది. మార్చి నుంచి జూన్‌కల్లా మొత్తం వినియోగదారుల సంఖ్య 24.38 కోట్ల నుంచి 24.04 కోట్లకు వెనకడుగు వేసింది. అయితే 10 లక్షల మంది 4జీ కస్టమర్లు జత కలవడంతో వీరి సంఖ్య 11.9 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. కొత్త చైర్మన్.. ఈ నెల(ఆగస్ట్) 19 నుంచి చైర్మన్‌గా రవీందర్ టక్కర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ నెల 18కల్లా హిమాన్షు కపానియా నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నట్లు తెలియజేసింది. వొడాఫోన్ గ్రూప్ నామినీ అయిన టక్కర్ ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. టెలికం పరిశ్రమలో మూడు దశాబ్దాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కీలక మార్కెట్లలో 5జీ సేవలను అందించేందుకు తగిన స్పెక్ట్రమ్‌ను తాజాగా సొంతం చేసుకున్నట్లు సీఈవో టక్కర్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 9.10 వద్ద ముగిసింది. -
రామ్‌కో సిమెంట్స్ చైర్మన్‌గా ఎంఎఫ్ ఫారూఖి
హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్ చైర్మన్‌గా ఎంఎఫ్ ఫారూఖిని నియమించుకుంది. చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులు రెండింటినీ ఒక్కరే నిర్వహించకుండా, మరింత మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ కోసం వీటిని వేరు చేయాలంటూ సెబీ లోగడ నిబంధనలు తీసుకొచ్చింది. నూతన నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్ బోర్డు చైర్మన్, ఎండీ పదవులను వేరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఎంఎఫ్ ఫారూఖిని ఎంపిక చేసినట్టు సంస్థ ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు చైర్మన్, ఎండీగా సేవలు అందించిన కంపెనీ వ్యవస్థాపకుడు పీఆర్ వెంకట్రామ రాజా ఎండీగా కొనసాగుతారని కంపెనీ ప్రకటించింది. ఎండీగా ఆయన పదవీకాలం ఈ ఏడాది జూన్ 3తో ముగియనుంది. అయితే, ఆ తదుపరి మరో ఐదేళ్ల కాలానికి ఎండీగా నియమించినట్టు రామ్‌కో సిమెం ట్స్ తెలిపింది. ఈ నిర్ణయాలకు రానున్న కంపెనీ ఏజీఎంలో వాటాదారుల ఆమోదం తీసుకోనుంది. -
ఏబీసీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ
న్యూఢిల్లీ: 2021–2022 ఏడాదికిగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్యులేషన్స్(ఏబీసీ) చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనరల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, సేల్స్ ఆపరేషన్స్, బిజినెస్ స్ట్రాటజీ, ఇన్నోవేషన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకు 27 ఏళ్లకుపైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఏబీసీ కౌన్సిల్ పబ్లిషర్ సభ్యులైన ప్రతాప్ జి. పవార్.. ఏబీసీ డెప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అడ్వటైజర్స్ రిప్రజెంటేటివ్స్‌గా ఐటీసీ సంస్థ తరఫున కరుణేశ్ బజాజ్, టీవీఎస్ మోటార్ కంపనీ తరఫున అనిరుద్ధ హల్దార్, మారుతి సుజుకీ ఇండియా తరఫున శశాంక్ శ్రీవాస్తవ ఉన్నారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ పబ్లిషర్స్ రిప్రజెంటేటివ్స్‌గా సకల్ పేపర్స్ సంస్థ తరఫున ప్రతాప్ పవార్, మలయాళ మనోరమ తరఫున రిషద్ మాథ్యూ, లోక్మత్ మీడియా తరఫున దేవేంద్ర వి. దర్దా, ది బాంబే సమాచార్ తరఫున హర్ముస్జీ ఎన్. కామా, జాగరణ్ ప్రకాశన్ తరఫున శైలేశ్ గుప్తా, హెచ్‌టీ మీడియా తరఫున ప్రవీణ్ సోమేశ్వర్, బెన్నెట్,కోల్మన్ అండ్ కో తరఫున మోహిత్ జైన్, ఏబీపీ తరఫున ధ్రువ ముఖర్జీ ఉన్నారు. అడ్వటైజింగ్ ఏజెన్సీల రిప్రజెంటేటివ్స్‌గా మ్యాడిసన్ కమ్యూనికేషన్స్ తరఫున విక్రమ్ సఖూజా, ఐపీజీ మీడియాబ్రాండ్స్ తరఫున శశిధర్ సిన్హా, ఆర్కే స్వామి బీబీడీవో తరఫున శ్రీనివాసన్ కె. స్వామి, డెంట్సు ఏగిస్ నెట్వర్క్ కమ్యూనికేషన్స్ ఇండియా సంస్థ తరఫున ఆశిశ్ భాసిన్ ఉన్నారు. సెక్రటరీ జనరల్‌గా హార్ముజ్ మాసాని కొనసాగనున్నారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన -
బీపీసీఎల్ చైర్మన్‌గా అరుణ్‌కుమార్ సింగ్ బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అరుణ్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టులో డీ రాజ్‌కుమార్ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో ఈ ఏడాది మేనెల్లో సింగ్ నియామకం జరిగింది. బీపీసీఎల్ ప్రైవేటీకరణ జరిగి, కొత్త యాజమాన్యం వచి్చన తర్వాతే చైర్మన్ నియామకం జరగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తొలుత వర్తా లు వచ్చాయి. రాజ్‌కుమార్ గత ఏడాది పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో కే పద్మాకర్ (మానవ వనరుల విభాగం డైరెక్టర్) సంస్థ సీఎండీ అదనపు బాధ్యతలు నిర్వహించారు. బీపీసీఎల్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్ సింగ్‌ను చైర్మన్‌గా ఎంపికచేస్తూ మే 10న ప్రభుత్వ రంగ సంస్థల నియామక వ్యవహారాల బోర్డ్ నిర్ణ యం తీసుకుంది. ఈవారం మొదట్లో ఆయన ని యామకానికి కేబినెట్ కమిటీ (నియామకాలు) ఆ మోదముద్ర వేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమ లో సింగ్‌కు 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఫైనాన్స్ డైరెక్టర్‌గా రామకృష్ణ గుప్తా దేశంలో అతిపెద్ద రెండవ ఇంధన మార్కెటింగ్ కంపెనీ కొత్త డైరెక్టర్ (ఫైనాన్స్)గా వేత్స రామకృష్ణ గుప్తా పదోన్నతి పొందారు. ప్రస్తుతం బీపీసీఎల్ సీఎఫ్ఓగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న పదవీ విరమణ చేసిన ఎన్. విజయగోపాల్ స్థానంలో ఈ నియామకం జరిగింది. బీపీసీఎల్‌లో తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. అనిల్ అగర్వాల్‌సహా మూడు గ్రూప్‌లు కొనుగోలుకు ‘‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్’’ దాఖలు చేశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే వాటా అమ్మకాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ, కరోనా వల్ల ఈ ప్రయత్నాలు ఆలస్యం అయ్యాయి. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ నూతన చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా మెకాన్ సీఎండీ అతుల్ భట్ ఎంపికయ్యారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్ మే 31న పదవీ విరమణ చేయడంతో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) ఆధ్వర్యంలో నూతన సీఎండి ఎంపిక కోసం శుక్రవారం న్యూఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో అతుల్ భట్ ఎంపికైనట్టు పీఈఎస్బీ వెబ్సైట్లో పొందుపరిచారు. 1986లో టాటా స్టీల్‌లో కెరీర్ ప్రారంభించిన భట్‌కు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్ధలో పనిచేసిన విశేష అనుభవం ఉంది. 2002 నుంచి 2007 వరకు ఇరాన్‌లోని మిట్టల్ స్టీల్‌లో కంట్రీ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. 2007 నుంచి 2008 వరకు లండన్‌లోని ఆర్సిలరీ మిట్టల్లో మెర్జర్స్, ఎక్విజిషన్స్ విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. 2009 నుంచి 2010 వరకు యూరప్‌లోని మెటలక్స్ వరల్డ్ సంస్థలో కమర్షియల్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 2016 నుంచి ప్రభుత్వ రంగ ‘మెకాన్’కు సీఎండిగా ఉన్నారు. -
అమరరాజా బ్యాటరీస్ నాయకత్వ మార్పు
రేణిగుంట (చిత్తూరు జిల్లా): అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు చైర్మన్ హోదా నుంచి తప్పుకోనున్నారు. ఆయన తనయుడు గల్లా జయదేవ్ కొత్త చైర్మన్‌గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. జయదేవ్ ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. రామచంద్రనాయుడు .. చైర్మన్‌గా పునర్నియామకాన్ని కోరరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆగస్టులో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) దాకా ఆయన డైరెక్టర్, చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా జయదేవ్ బాధ్యతలు చేపడతారు. 36 సంవత్సరాల పాటు కంపెనీకి సారథ్యం వహించి, అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు సంతృప్తినిచ్చిందని రామచంద్రనాయుడు పేర్కొన్నారు. అటు, నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి గౌరినేని రమాదేవి రాజీనామాను బోర్డు ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య.. స్వతంత్ర డైరెక్టర్‌గా అనుష్ రామస్వామి నియామకాలకు ఆమోదం తెలిపింది. మరోవైపు, పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు జయదేవ్ వెల్లడించారు. ఇందుకోసం లిథియం అయాన్ బ్యాటరీలు, ఈవీ చార్జర్లు మొదలైన వాటికోసం కొత్తగా ’ఎనర్జీ ఎస్‌బీయూ’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి సీడబ్ల్యూసీ ఉత్తర్వులిచ్చింది. ఎంపీ సింగ్ ఇటీవల వరకు ఎన్‌టీబీవో (నర్మదా తపతి బేసిన్ ఆర్గనైజేషన్) సీఈవోగా పనిచేయగా.. జూన్ 1న ఆయనకు అదనపు కార్యదర్శిగా పదోన్నతి లభించింది. ఎంïపీ సింగ్ సర్థార్ సరోవర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఎస్‌సీఏసీ) చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు చైర్మన్‌గా పనిచేసిన పరమేశం మే 31న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కేఆర్ఎంబీ ఇన్చార్జి చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ (గ్రూప్–ఏ) సర్వీసెస్ (సీడబ్ల్యూఈఎస్) హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ (హెచ్ఏజీ)గా పదోన్నతి పొందిన ఎంపీ సింగ్‌ను సీడబ్ల్యూఎస్ హెచ్‌ఏజీగా పరిగణిస్తూ.. ఈ నెల 1 నుంచి బాధ్యతలు స్వీకరించే వరకు జీతభత్యాలు కేఆర్ఎంబీ చెల్లించాలని పేర్కొంది. చదవండి: Andhra Pradesh: ఇన్ని లక్షల ఇళ్ల నిర్మాణం ప్రపంచంలోనే అరుదు 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగింది -
సెయిల్ చైర్మన్‌గా సోమ మండల్
ముంబై: దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్‌గా శుక్రవారం సోమ మండల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటన ద్వారా తెలిపింది. అంతకు ముందు ఆమె ఇదే కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–రూర్కెలా నుంచి 1984లో పట్టభద్రురాలైన మండల్ నాల్కో సంస్థలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ నాల్కో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి 2017లో సెయిల్ కంపెనీలో చేరారు. తాజాగా చైర్మన్ పదవికి ఎన్నికయ్యారు. గురువారం పదవీ విరమణ చేసిన అనిల్ కుమార్ చౌదరీ స్థానంలో మండల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల్ మాట్లాడుతూ ... కంపెనీ లాభాదాయకతకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. షేర్ హోల్డర్ల విలువలను మెరుగుపరచడంతో పాటు సంస్థను నిర్మాణాత్మకంగా మరింత బలోపేతం చేస్తామనున్నారు. -
రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్ నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేబోర్డు నూతన ఛైర్మన్, సీఈఓగా సునీత్ శర్మను నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. దీంతో పునర్నిర్మించిన బోర్డు తొలిసీఈవోగా సునీత్ వర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ పదవీ కాలం నేటితో (2020 డిసెంబరు 31) ముగియనుంది. దీంతో తాజా నియామకం జరిగింది. ఇప్పటికే వినోద్ కుమార్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించిన సంగతి తెలిసిందే. కాగా 1978 బ్యాచ్‌కు చెందిన సునీత్ శర్మ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఆఫీసర్. ఇంతకుముందు రాయబరేలి, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గాను, పూణే, సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్‌గా విధులు నిర్వహించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు కొత్త చైర్మన్!
ముంబై, సాక్షి: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త ఏడాదిలో కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసుకోనుంది. ప్రస్తుతం పార్ట్‌టైమ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న శ్యామలా గోపీనాధ్ పదవీకాలం 2021 జనవరి 1తో ముగియనుంది. దీంతో సోమవారం సమావేశమైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు బోర్డు ఇందుకు అర్హులైనవారి పేరును రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదించినట్లు తెలియజేసింది. అయితే పేరును వెల్లడించలేదు. ఆర్బీఐ అనుమతించిన వెంటనే బ్యాంక్ బోర్డు కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు పేర్కొంది. (హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. శశిధర్ ఎంపిక వెనుక!) 2015 నుంచీ ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామలా గోపీనాధ్ 2015 జనవరి 2 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చిన వెంటనే కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమాచారమిచ్చింది. కాగా.. కొత్త అభ్యర్థికి బాధ్యతలు అప్పగించేటంత వరకూ తాత్కాలిక చైర్మన్‌గా విధులు నిర్వహించేందుకు బోర్డు నుంచి స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరిని ఎంపిక చేసుకోనున్నట్లు బ్యాంకు వర్గాలు తెలియజేశాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో కొత్త సీఈవోగా శశిధర్ జగదీశన్ బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. 25 ఏళ్లుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకును ముందుండి నడిపించిన ఆదిత్య పురీ స్థానే శశిధర్ ఎంపికయ్యారు. పురీ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేశారు. -
గుప్కార్ అలయెన్స్ చైర్మన్‌గా ఫరూఖ్
శ్రీనగర్: కశ్మీర్లో ఇటీవల ఏర్పడిన ఏడు పార్టీల పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ)కి చైర్మన్‌గా నేషనల్ కాన్ఫరెన్స్‌కి చిందిన ఫరూఖ్ అబ్దుల్లా, ఉపాధ్యక్షురాలిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఎంపికయ్యారు. ఈ వేదికకు సీపీఎం నేత ఎం.వై.తరీగామీ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజ్జాద్ గనీ లోనె వ్యవహరిస్తారు. ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ కూటమి జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణకోసం పోరాడుతుందని, ఇది బీజేపీ వ్యతిరేక వేదిక అని, ఇది జాతి వ్యతిరేక వేదిక కాదని ఆయన అన్నారు. ఈ కూటమి పాత కశ్మీర్ జెండాని తమ పార్టీ చిహ్నంగా ఎంపిక చేసుకుంది. ఈ కూటమిలో సీపీఐ కశ్మీర్ నేత ఏఆర్ ట్రుక్రూ చేరారు. కూటమికి కాంగ్రెస్ దూరంగా ఉంది. దుర్గానాగ్ దేవాలయాన్ని దర్శించిన ఫరూఖ్ అబ్దుల్లా ఫరూఖ్.. దుర్గాష్టమి, మహానవమి సందర్భం గా పురాతన దుర్గానాగ్ దేవాలయాన్ని సందర్శించారు. మానవాళికి మంచి జరగాలని, శాంతి చేకూరాలని ప్రార్థనలు చేసినట్లు ఫరూఖ్ తెలిపారు. దేవాలయానికి ఎంతో ప్రాశçస్త్యం ఉంది. ‘హిందూ సోదర, సోదరీమణులకు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. పండగ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చా’ అని అన్నారు. కశ్మీర్ నుంచి వెళ్ళిపోయిన కశ్మీరీ పండిట్లు తొందరగా తమ ప్రాంతాలకు తిరిగిరావాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. దుర్గానాగ్ దేవాలయం 700 సంవత్సరాల పురాతనమైనది. 2013లో ఈ దేవాలయ ప్రాంగణంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. -
రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రతకే ప్రాధాన్యం
ముంబై: రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రత, కస్టమర్ల ప్రయోజనాలే బ్యాంక్ తొలి ప్రాధాన్యతలని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన దినేష్ కుమార్ మూడేళ్ల కాలానికి చైర్మన్‌గా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అనంతరం బుధవారం చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► కోవిడ్–19 నేపథ్యంలో పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అయితే ఆర్బీఐ నిర్దేశిస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కంపెనీలకు తగిన మద్దతు అందించడానికి బ్యాంక్ ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. ► రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పలు ప్రతిపాదనలు అందాయి. అయితే ఇక్కడ రుణ పునర్వ్యవస్థీకరణను కోరుతున్న కస్టమర్ల సంఖ్యను చూస్తే, బ్యాంక్ నిర్వహించదగిన స్థాయిలోనే ఈ పరిమాణం ఉంది. ► మూలధనం విషయంలో బ్యాంక్ పరిస్థితి పటిష్టంగా కొనసాగుతోంది. ► ఎస్బీఐ డిజిటల్ సేవల వేదిక అయిన ‘యోనో’ను ప్రత్యేక సబ్సిడరీ (పూర్తి అనుబంధ సంస్థ)గా వేరు చేయాలన్న అంశంపై పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. తగిన సమయంలో ఆయా అంశలను వెల్లడిస్తాం. -
ట్రాయ్ చైర్మన్‌గా వఘేలా
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ పి.డి. వఘేలా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం మూడేళ్ల పాటు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే దాకా (ఏది ముందైతే అది) ఉంటుంది. ప్రస్తుత చైర్మన్ ఆర్ఎస్ శర్మ పదవీకాలం సెప్టెంబర్ 30తో తీరిపోనుంది. గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన వఘేలా ప్రస్తుతం ఫార్మా విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో వఘేలా కూడా ఉన్నారు. మరోవైపు, టెలికం రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పదవీ విరమణ చేయనున్న శర్మ తెలిపారు. సర్వీసులకు గట్టి డిమాండ్‌తో పాటు కొత్త మార్పులకు అనుగుణంగా సర్దుకుపోగలిగే సామర్థ్యం టెల్కోలకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
ఐటీ క్వీన్.. రోష్ని!
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగంలో కొత్త క్వీన్ అరంగేట్రం చేసింది. పురుషాధిక్యత అధికంగా ఉన్న ఐటీ రంగంలో తొలిసారిగా ఒక ఐటీ కంపెనీ పగ్గాలు ఒక మహిళ చేతికి వచ్చాయి. దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చైర్‌పర్సన్‌గా రోష్ని నాడార్ మల్హోత్ర నియమితులయ్యారు. హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ స్థానంలో ఆయ న ఏకైక సంతానం, రోష్ని నాడార్ చైర్పర్సన్ బాధ్యతలను శుక్రవారమే స్వీకరించారు. కాగా కంపెనీ ఎమ్డీ(చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్)గా శివ్ నాడార్ కొనసాగుతారు. దేశంలోనే అత్యధిక సంపద ఉన్న మహిళగా రికార్డులకు ఎక్కిన ఈమె. స్టాక్మార్కెట్లో లిస్టైన ఐటీ కంపెనీ చైర్‌పర్సన్‌గా పగ్గాలు చేపట్టిన తొలి మహిళ అనే ఘనతను కూడా సాధించారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ: శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన రోష్ని నాడార్ 2013లోనే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. హెచ్‌సీఎల్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తున్న హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ వసంత్ వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించిన రోష్ని నాడార్ ఢిల్లీలో కమ్యూనికేషన్స్ విభాగంలో డిగ్రీ చదివారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎమ్బీఏ పట్టా పొందారు. 2009లో హెచ్‌సీఎల్ కార్ప్‌లో చేరారు. ఏడాదిలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎదిగారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ అయ్యారు. మహిళా కుబేరుల్లో టాప్ రోష్ని నాడార్ 2010లో హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రను వివాహమాడారు. వారికి ఆర్మాన్, జాహాన్... ఇద్దరు కుమారులు. హురున్ సంస్థ తాజా కుబేరుల జాబితాలో రూ.36,800 కోట్ల సంపదతో రోష్ని నాడార్ భారత్‌లోనే అత్యధిక సంపద గల మహిళగా అగ్రస్థానంలో నిలిచారు. -
ఏబీసీ చైర్మన్‌గా మధుకర్
ముంబై: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) నూతన చైర్మన్‌గా మధుకర్ కామత్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో కామత్‌ను 2019–20 కాలానికిగానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోక్మత్ మీడియా సంస్థకు చెందిన దేవేంద్ర.వి.దర్దా ఏడాది కాలానికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక ఏబీసీ మండలిలో శశిధర్ సిన్హా(మీడియా బ్రాండ్స్), శ్రీనివాసన్.కె.స్వామి(ఆర్కే స్వామి బీబీడీవో), హార్ముష్‌జీ ఎన్.కమా(బాంబే సమాచార్), రియద్ మాథ్యూ(మలయాళ మనోరమ) విక్రమ్ సఖూజా(మాడిసన్ కమ్యూనికేషన్) తదితరులు ఉన్నారు. పబ్లిషర్లు, యాడ్ ఏజెన్సీలు, ప్రకటనదారులు సభ్యులుగా ఉండే ఏబీసీ వార్తాపత్రికలు, మ్యాగజీన్ల సర్క్యులేషన్లను మదింపు చేస్తుంది. -
కొత్త బాధ్యతలు స్వీకరించిన సతీశ్ రెడ్డి
న్యూఢిల్లీ: డీఆర్డీఓ (రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ) చైర్మన్‌గా ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, తెలుగు తేజం జి.సతీశ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో డీఆర్డీఓ వెల్లడించింది. ఆయన రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి విభాగానికి కూడా కార్యదర్శిగా పనిచేస్తారు. 1985లో డీఆర్డీఓలో తన ప్రస్థానం ప్రారంభించిన సతీశ్‌రెడ్డి 1986–94 మధ్యకాలంలో క్షిపణి నేవిగేషన్(దిక్సూచి) వ్యవస్థలో అనేక మైలురాళ్లను ఆధిగమించారు. శాస్త్ర సలహాదారుగా, క్షిపణి వ్యవస్థలు, గైడెడ్ వెపన్స్, ఎవియానిక్స్ టెక్నాలజీలు, దేశంలోని ఎయిరోస్పేస్ టెక్నాలజీ, పరిశ్రమల అభ్యున్నతికి సతీశ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఇంతవరకూ ఆయన రక్షణ శాఖ మంత్రి శాస్త్ర సలహాదారుగా పనిచేశారు. -
స్వదేశీ టెక్నాలజీకే ఓటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దేశ రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం వాడకాన్ని మరింతగా పెంచడంతో పాటు దేశీయంగా పరికరాల తయారీకి ప్రాధాన్యం ఇస్తామని డీఆర్డీఓ కొత్త చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. మన సాంకేతిక పరిజ్ఞానంతోనే సైన్యానికి కావాల్సిన పరికరాల్ని సమర్ధంగా తయారు చేయడమే ప్రధాన ఎజెండా అని, ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. డీఆర్డీఓ చైర్మన్‌గా తన ప్రాధాన్యతలు, దేశానికి తనవంతు చేయాల్సిన కర్తవ్యాలను, క్షిపణి రంగం స్థితిగతులు తదితర అంశాలపై ఆయ న ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. భవిష్యత్ భారత్ కోసం.. మోదీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో ముందుకు సాగుతోంది. దానికి అనుగుణంగా అన్ని రంగాల్లో దేశీయ పరిజ్ఞానంతో వస్తు ఉత్పత్తులు జరగాలనేది ప్రభుత్వ సంకల్పం. దేశ రక్షణ రంగంలోనూ ఆ దిశగా సాగడమే నా ముందున్న ప్రధాన బాధ్యత. రానున్న కాలంలో స్వదేశీ ప్రయోగాల ద్వారా దేశ సైన్యానికి కావాల్సిన అన్ని పరికరాలను తయారు చేయటంలో డీఆర్డీఓ కీలకంగా వ్యవహరిస్తుంది. తద్వారా దేశ సైన్యాన్ని సర్వం సన్నద్ధంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంగా డీఆర్డీఓ పనిచేయనుంది. ప్రస్తుతం భారత సైన్యం దిగుమతుల పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీనిని తగ్గించి మన కాళ్లపైన మనం నిలబడే స్థాయికి ఎదిగే దిశగా దేశంలో పలు ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహించి కొత్త పరికరాలను, పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తాం. క్షిపణి ప్రయోగాల్లో అగ్రగామిగా... క్షిపణి ప్రయోగాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. 30 ఏళ్ల నుంచి చేసిన పరిశోధనలు, కృషి వల్లే అది సాధ్యమైంది. మరింత స్వయం సమృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. ఇప్పటికే ఆగ్ని, ఆకాష్, తిశ్రూల్ ఇలా అనేక ప్రయోగాలు విజయవంతంగా చేపట్టాం. భవిష్యత్‌లో క్షిపణి రంగంలో దిగుమతుల అవసరం లేకుండా చూస్తాం. క్షిపణి, రక్షణ రంగంలో అగ్రదేశాలకు ధీటుగా పోటీపడుతున్నాం. దేశం కోసం పని చేయడమే ప్రాధాన్యం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రక్షణ రంగంలో వెనుకంజలో ఉన్న విభాగాలపై పూర్తిగా దృష్టి పెట్టి.. వాటికి ప్రాధాన్యం ఇస్తాం. రక్షణ రంగంలో దేశాన్ని సమున్నత స్థాయిలో ఉంచడమే నా లక్ష్యం. దేశం కోసం పనిచేయడానికే నా ప్రథమ ప్రాధాన్యత. స్టారప్ట్లను బలోపేతం చేసి వారికి సహకారం అందిస్తాం. అలాగే పరిశ్రమ రంగంలోనూ అభివృద్ధికి సహకరించి వారి భాగస్వామ్యంతో ముందుకు సాగుతాం. విద్యా సంస్థల్లో పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తాం. -
అస్త్రశస్త్రాల సృష్టికర్త...!
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగంలో ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త , తెలుగు తేజం గుండ్రా సతీశ్ రెడ్డి(55) నియమితులయ్యారు. ఆ పదవికి ఎంపిౖకైన పిన్న వయస్కుడిగా, మొదటి తెలుగు వ్యక్తిగా సతీష్ రెడ్డి నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా మహిమలూరు గ్రామంలో జన్మించిన ఆయన స్వయం కృషితో రక్షణ, క్షిపణి రంగంలో భారత దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రికి శాస్త్ర సలహాదారుగా, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. డీఆర్డీఓ చైర్మన్ బాధ్యతలతో పాటు రక్షణ శాఖ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కార్యదర్శిగానూ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సతీశ్ రెడ్డి నియమకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపగా.. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ శనివారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చేవారం ఆయన డీఆర్డీఓ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత మూడు నెలలుగా డీఆర్డీఓ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. చైర్మన్ ఎస్.క్రిస్టోఫర్ పదవీకాలం పూర్తికావడంతో మే నుంచి ఆ బాధ్యతల్ని రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రాకు అప్పగించారు. క్షిపణి పరిశోధనల్లో భాగస్వామి.. సైంటిఫిక్ అడ్వయిజర్‌గా, క్షిపణి వ్యవస్థలు, గైడెడ్ వెపన్స్, ఎవియానిక్స్ టెక్నాలజీలు, దేశంలోని ఎయిరోస్పేస్ టెక్నాలజీ, పరిశ్రమల అభ్యున్నతికి సతీశ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. క్షిపణుల రంగంలో దేశం çస్వయం సమృద్ధిని సాధించేందుకు అవసరమైన పరిశోధనల్లో, దేశీయ విధానాల రూపకల్పనలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. క్షిపణులు, స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్‌గా దేశ రక్షణ పరిశోధన కేంద్రాలైన ఏఎస్ఎల్, డీఆర్డీఎల్, ఆర్సీఐ, ఐటీఆర్, టీబీఆర్ఎల్ను సాంకేతికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లారు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించడంతోపాటు æ సైనికదళాల కోసం స్వదేశీ సాంకేతికతతో ఆయుధాల తయారీకి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించారు. సుదూర లక్ష్యాలను చేధించే అగ్ని–5 క్షిపణికి అవసరమైన సాంకేతికతను తయారుచేశారు. ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా భూమి పై నుంచి ఆకాశంలోకి ప్రయోగించే మధ్యంతర శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేశారు. ప్రాజెక్టు డైరెక్టర్‌గా దేశీయంగా గైడెడ్ బాంబును అభివృద్ధిచేయడంతో పాటు సుదూర లక్ష్యాల చేధనకు ‘స్మార్ట్ గైడెడ్ ఆయుధాల్ని’ రూపొందించారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక ఫెలో ఆఫ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్, యూకేలోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, రష్యాలోని ఫారెన్ మెంబర్ ఆఫ్ ద అకాడమి ఆఫ్ నేవిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ సభ్యుడిగా ఉన్నారు. దేశ, విదేశాల్లోని ప్రాధాన్యత గల వివిధ సంస్థల్లో ఆయన సేవలకు గుర్తింపుగా ఫెలోషిప్‌లు, సభ్యత్వాలు లభించాయి. ఎన్నో అవార్డులు, డాక్టరేట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రతిష్టాత్మక అవార్డుల్ని సతీశ్ రెడ్డి అందుకున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ హోమీ జె.బాబా స్మారక బంగారు పతకం, నేషనల్ ఏరోనాటిక్స్ బహుమతి, నేషనల్ డిజైన్ అవార్డు, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్‌మెడల్, ఇంజినీరింగ్ ఎక్స్‌లెన్స్‌కు ఇచ్చే ఐఈఐ–ఐఈఈఈ (అమెరికా) మొదటి జాయింట్ అవార్డు, లండన్ రాయల్ ఏరోనాటిక్స్ సొసైటీ వెండిపతకం వంటివి ఉన్నాయి. ప్రఖ్యాత డా.బీరెన్‌రాయ్ స్పేస్ సైన్స్ డిజైన్ అవార్డు, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రాకెట్రీ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ అవార్డును పొందారు. దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. రక్షణ, క్షిపణి పరిశోధన రంగంలో చేసిన విశేష కృషికి గాను 2015 ఏడాదికిగాను ఆయన ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకున్నారు. మహిమలూరు నుంచి డీఆర్డీవోకు.. .సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఆత్మకూరు రూరల్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో గుండ్రా సీతారామిరెడ్డి, రంగమ్మ దంపతులకు 1963, జూలై 1న రెండో సంతానంగా సతీశ్ రెడ్డి జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదవగా.. నెల్లూరు వీఆర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 1984లో అనంతపురం జేఎన్టీయూలో ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. మరుసటి ఏడాదే 1985లో భారత రక్షణ శాఖలో క్షిపణి రంగ పరిశోధకుడిగా చేశారు. తర్వాత కలామ్ మానసపుత్రిక ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’(ఆర్సీఐ)లోకి మారారు. కఠోర శ్రమతో నేవిగేషన్ విభాగంలో విజయాలు అందుకున్నారు. తన అసాధారణ పరిశోధనలతో ఆగిపోకుండా 2008లో ఎంఎస్ చేశారు. 2014లో డాక్టరేట్ పట్టా పొందారు. 1986 నుంచి నేవిగేషన్ విభాగంలో అవుట్‌స్టాండింగ్ శాస్త్రవేత్తగా, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా, అవుట్‌స్టాండింగ్ డైరెక్టర్‌గా, శాస్త్రవేత్తగా, డైరెక్టర్ జనరల్‌గా, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా అనేక హోదాల్లో పనిచేశారు. రక్షణ విభాగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విశేషకృషి చేశారు. ఎన్నో అస్త్రశస్త్రాలను సృష్టించిన ఆయన పలువురు రాష్ట్రపతులు, ప్రధానుల నుంచి అవార్డులు పొందారు. 2014లో విశిష్ట శాస్త్రవేత్తగా, 2015లో రక్షణ మంత్రి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. తాను ఏ స్థాయిలో ఉన్నా పుట్టిన ఊరిని మర్చిపోకుండా మహిమలూరును దత్తత తీసుకొని అన్ని రంగాల్లో ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. 14 ఏళ్ల క్రితమే గ్రామంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి తన దార్శనికతను చాటుకున్నారు. భార్య పద్మావతి, అన్న గుండ్రా శ్రీనివాసుల రెడ్డి, సేవాదృక్పథం కలిగిన మరికొందరి గ్రామస్తుల సహకారంతో గ్రామంలో విద్య, వైద్య, మౌలిక రంగాల్లో పరిపూర్ణ అభివృద్ధి సాధించేందుకు పాటుపడుతున్నారు. కుమార్తె సిగ్ధ ఎలక్ట్రానిక్ ఇంజనీరుగా పనిచేస్తుండగా.. కొడుకు అనూష్ బీటెక్ చదువుతున్నారు. రక్షణ మంత్రి సలహదారుగా బిజీగా ఉండే ఆయన సమయం దొరికినప్పుడల్లా మహిమలూరులో అభివృద్ది పనుల్ని పరిశీలించటంతో పాటు యువతకు కెరీర్లో సలహలు సూచనలిస్తుంటారు. డీఆర్డీఓ చైర్మన్‌గా సతీశ్ ఎంపికతో నెల్లూరు జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ నుంచి ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకుంటున్న సతీశ్ రెడ్డి. చిత్రంలో ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతి (ఫైల్) జేఎన్టీయూ–కాకినాడ నుంచి గౌరవడాక్టరేట్‌ను అందుకుంటున్న సతీశ్ రెడ్డి(ఫైల్) -
ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఛైర్మన్‌గా మాల్యా?
ముంబై : వీడియోకాన్ గ్రూప్‌కు రుణాల జారీ కేసులో సీఈవో చందాకొచర్‌కు సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ వివాదంపై బ్యాంక్ బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించడంతో, చందాకొచర్ సెలవుపై ఇంటికి వెళ్లారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలోనే బ్యాంక్, కొత్త ఛైర్మన్ ఎంపికను కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుత ఛైర్మన్ ఎం.కె.శర్మ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తుండటంతో, ఆయన స్థానంలో కొత్త వారిని బ్యాంక్ నియమించబోతుంది. బ్యాంక్‌కు కొత్త ఛైర్మన్‌గా ఎం.డి మాల్యా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకు బోర్డు జూన్ మొదటి వారంలోనే తదుపరి ఛైర్మన్‌గా మాల్యా పేరును ఎంపిక చేసి ఆర్బీఐ అనుమతుల కోసం పంపినట్లు సమాచారం. మాల్యా అంతకముందు బ్యాంక్ ఆఫ్ బరోడా ఛైర్మన్‌గా పనిచేశారు. మే29న ఆయన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. బోర్డుతో చర్చించిన అనంతరం ఈ ప్రతిపాదనను ఆర్బీఐకు పంపించినట్టు ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో మెజార్టీ సభ్యులు మాల్యాకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. కానీ, ఆర్బీఐ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. సాధారణంగా ఇటువంటి అంశాల్లో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డుతోనే ఆర్బీఐ కూడా ఏకీభవిస్తుందని తెలిసింది. అయితే ఈ విషయంపై ఆర్బీఐ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తుందో తెలియరాలేదు. ఇప్పటికే బ్యాంకు సీఈవో చందాకొచర్ సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను కొత్త సీవోవో సందీప్ బక్షికి అప్పగించారు. ఐసీఐసీఐ బ్యాంక్ త్వరలోనే కొత్త ఛైర్మన్‌ను నియమిస్తుందని తెలియగానే బ్యాంక్ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 2 శాతానికి పైగా పైకి ఎగిశాయి. -
కొత్త చైర్మన్ వేటలో ఐసీఐసీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ రెండో అతిపెద్ద బ్యాంక్ ‘ఐసీఐసీఐ’ తాజాగా నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకానికి కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ హోదాలో ఉన్న ఎం.కె.శర్మ పదవీ కాలం జూన్ 30తో ముగియనుండటంతో బ్యాంక్ ఈ ప్రక్రియను షురూ చేసింది. ఇండిపెండెంట్ డైరెక్టర్ల నుంచి ఒకరిని లేదా బయటి వారిని ఈ పోస్టులో నియమించనుంది. కాగా శర్మ స్థానాన్ని ఇండిపెండెంట్ డైరెక్టరుగా ఉన్న బ్యాంక్ బరోడా మాజీ సీఎండీ ఎం.డి.మాల్యాను భర్తీ చేసే అవకాశముందని సమాచారం. మాల్యా గతనెల 29న ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా చేరారు. ఉదయ్ చితేల్, దిలీప్ చోక్సి, నీలం ధావన్, రాధాకృష్ణన్ నాయర్, వి.కె.శర్మ (ఎల్ఐసీ చైర్మన్), లోక్ రంజన్ (కేంద్ర ప్రభుత్వ నామినీ డైరెక్టర్) వంటి వారు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు. వీడియోకాన్ గ్రూప్‌కు రుణ మంజూరీ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచర్ క్విడ్‌ప్రొకో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై బ్యాంక్ స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది కూడా. -
అరుంధతీ కాదు: కొత్త చైర్మన్ ఈయనే
సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంకు బోర్డు ఆఫ్ బ్యూరో (బీబీబీ)కి చైర్మన్‌గా భాను ప్రతాప్ శర్మను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం బీబీబీ మొట్టమొదటి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వినోద్ రాయ్ స్థానంలో డిపార్ట్మెంట్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మాజీ డిప్యూటీ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మను ఎంపిక చేసింది. ఆయన పదివీకాలం రెండు సంవత్సరాలని ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సీనియర్ లెవల్ నియామకాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదనే మాటకుతాము కట్టుబడి ఉన్నామంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో టాప్ మేనేజ్మెంట్ను ఎంపిక చేసేందుకు కొత్త బీబీబీలో విభిన్న నైపుణ్యాలతో కూడిన నిపుణులున్నారన్నారు. బీబీబీలో ఇతర సభ్యులు: వేదికా భండార్కర్ (మాజీ ఎండీ క్రెడిట్ సూయిస్ ఇండియా), పి ప్రదీప్ కుమార్ (మాజీ ఎండీ.ఎస్బీఐ), ప్రదీప్ పి.షా (వ్యవస్థాపకుడు, ఎండీ క్రిసిల్). కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనా వ్యవహారాలను మెరుగుపర్చేందుకు 2016లో ఈ బీబీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ పదవికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఎంపిక కానున్నారని ఇటీవలి పలు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. -
అందరం భగవంతుడి సేవ చేద్దాం – మోహన్‌బాబు
‘‘నేను ఎప్పుడూ గుడి చైర్మన్ అవ్వాలనుకోలేదు. మా సంస్థలు, చిత్రాలతో బిజీగా ఉన్న నాకు ఈ అదనపు బాధ్యత ఎందుకనుకున్నా. పైగా నిజాన్ని నిర్భయంగా చెప్పడం నాకు అలవాటు. కానీ, ఆ మహాశివుడు టి.సుబ్బరామిరెడ్డి గారి స్వరూపంలో బాధ్యతలు స్వీకరించమన్నాడు’’ అని నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో 12 మంది పాలక మండలి కొత్త సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘కమ్మ, కాపు, రెడ్డి కులాల వలే బ్రాహ్మణులలో కూడా శాఖలుంటాయి. అందరూ కలిసి ఆ భగవంతుడి సేవ చేద్దాం. నా అల్లుడు కూడా బ్రాహ్మణుడే. దేవుడి డబ్బు పైసా ముట్టుకోకుండా అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సన్నిధానంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పిస్తున్నా. సన్నిధానంలోని దేవుళ్ల ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు చేపడతామని ఆశిస్తున్నా’’ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వీరే.. నటుడు గిరిబాబు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామల, చిరంజీవి సతీమణి సురేఖ, చాముండేశ్వరీ నాథ్, వి. రామ్‌ప్రసాద్ ఉన్నారు. కార్యదర్శిగా ఖాజా సూర్య నారాయణ కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎం.పి, ‘కళాబంధు’ టీయస్సార్, రాజమండ్రి ఎం.పి. మురళీమోహన్, హీరోలు విష్ణు, మనోజ్, నటి–నిర్మాత లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
పీడీసీసీబీ కొత్త చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం..!
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (పీడీసీసీబీ) కొత్త చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈదర మోహన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 11న ఈదర తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 12న సహకార శాఖ రిజిస్ట్రార్ ఈదర రాజీనామాను ఆమోదించారు. చైర్మన్ రాజీనామా నేపథ్యంలో నిబంధనల మేరకు 15 రోజుల్లో కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈదర రాజీనామాతో ఈ నెల 13న వైస్ చైర్మన్ కండె శ్రీనివాసులు తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు. 15 రోజుల్లో కొత్త చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల అథారిటీని నియమించాలని ఆర్‌సీఎస్‌ను కోరాలని సోమవారం సమావేశమైన పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఆర్‌సీఎస్‌కు లేఖ పంపనున్నారు. అనంతరం ఆర్సీఎస్ ఎన్నికల అథారిటీని నియమించే అవకాశం కనిపిస్తోంది. దీంతో 15 రోజుల లోపు కొత్త చైర్మన్ ఎంపికకు ఆర్సీఎస్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 20నే కొత్త చైర్మన్ ఎన్నిక ఉంటుందని విశ్వసనీయ సమాచారం. కొత్త చైర్మన్‌గా మస్తానయ్య..? కొత్త చైర్మన్ ఎన్నికకు సహకార శాఖ సిద్ధమైన నేపథ్యంలో డైరెక్టర్లలో చైర్మన్ పదవి కోసం పోటీ నెలకొంది. గతంలో వైస్ చైర్మన్‌గా చేసిన అధికార పార్టీకి చెందిన బల్లికురవ పీఏసీఎస్ అధ్యక్షుడు మస్తానయ్య చైర్మన్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు జె.వి.పాలెం పీఏసీఎస్ అధ్యక్షుడు యలమందరావు, కారుమంచి పీఏసీఎస్ అధ్యక్షుడు ఆర్.వెంకట్రావులు సైతం చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పీడీసీసీబీ వ్యవహారంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈయన ఆది నుంచి పాత చైర్మన్ ఈదర మోహన్‌తో విభేధించారు. ఇరువురి మధ్య గొడవ రోడ్డెక్కింది. ఈదర మోహన్‌ను దించేందుకు అప్పట్లో వైస్ చైర్మన్‌గా ఉన్న మస్తానయ్య గట్టిగా ప్రయత్నించారు. మెజార్టీ డైరెక్టర్లు ఈదర మోహన్‌కు మద్ధతు పలకడంతో ఆయన పోరాటం ఫలించలేదు. చివరకు మెజార్టీ డైరెక్టర్లు మోహన్‌కు వ్యతిరేకంగా మారడంతో ఎట్టకేలకు ఆయన పదవీచ్యుతుడయ్యారు. ప్రస్తుతం మస్తానయ్యకు దామచర్ల మద్ధతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్లు కూడా ఎమ్మెల్యే సూచనల మేరకు మస్తానయ్యను చైర్మన్‌ను చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చైర్మన్ ఎన్నికకు తేదీ ఖరారైతే ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి. -
టీటీడీ చైర్మన్‌గా సుధాకర్ యాదవ్?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ పాలక మండలి కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. పార్టీలోని కీలక నేతలతో సమావేశమై నూతన ట్రస్ట్ బోర్డుపై చర్చిస్తున్నారు. దసరాలోపే పాలక మండలిని ప్రకటించాలని మొదట నిర్ణయించినా పలు కారణా లతో అది సాధ్యంకాలేదు. దీంతో ట్రస్ట్‌బోర్డు లేకుండానే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారంతో ఇవి కూడా ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల లోపు పాలకమండలి నియామకం పూర్తయితే బ్రహ్మోత్సవాల సంబరం మరింత వేడుకగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తంకావడంతో సీఎం శుక్రవారం నుంచి దృష్టిసారించారు. తాజాగా వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ పేరు వినిపిస్తోంది. టీటీడీ ట్రస్ట్ బోర్డు నూతన చైర్మన్‌గా సుధాకర్‌యాదవ్ పేరు ఖరారైనట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రసార మాధ్యమాల ద్వారా సీఎంకి సుధాకర్‌యాదవ్ ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే శుక్రవారం నుంచి మళ్లీ మదనపల్లికి చెందిన రవిశంకర్ పేరు వినిపిస్తోంది. కాగా, సుధాక ర్యాదవ్ పేరు ఖరారు విషయంలో మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం దగ్గర వ్యూహాత్మకంగా చక్రం తిప్పారని వినికిడి. దీనికితోడు డీఎల్ రవీంద్రా రెడ్డికి మైదుకూరులో స్థానం కల్పించాలంటే సుధాకర్‌యాదవ్‌ను మరోచోటికి పంపించాలన్న ఆలోచన కూడా కారణమని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి నలుగురికి..: ఈసారి ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో నలుగురు తెలం గాణ నేతలకు కూడా చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. చింతల రామచం ద్రారెడ్డి, సండ్ర వీరయ్యతో పాటు రేవంత్‌రెడ్డి, మరో నేత పేర్లు తెరమీదికొ స్తున్నాయి. అక్టోబర్ 2.. లేదా 5న నూతన పాలక మండలిని సీఎం అధికారి కంగా ప్రకటించే వీలుందని తెలుస్తోంది. -
సెబీ కొత్త చైర్మన్‌గా అజయ్ త్యాగి
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కొత్త చైర్మన్‌గా అజయ్ త్యాగి నియమితులయ్యారు. వచ్చే నెల 1న పదవీ విరమణ చేయనున్న యు.కె. సిన్హా స్థానంలో ఆయన ఎంపిక జరిగింది. 1984 బ్యాచ్ హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 58 సంవత్సరాల త్యాగి ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శి(ఇన్వెస్ట్మెంట్)గా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అథ్యక్షతన గల కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ త్యాగి ఎంపికకు ఆమోదం తెలిపింది. ఐదేళ్లకు మించకుండా లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకూ ఆయన పదవిలో కొనసాగుతారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన త్యాగి ఆర్బీఐ డైరెక్టర్‌గా కొంత కాలం ఉన్నారు. సెబీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తికి నెలకు రూ.4.5 లక్షల వేతనం(కన్సాలిడేటెడ్ పే) లభిస్తుంది. ఇక 1976 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సిన్హా 2011, ఫిబ్రవరి 18న సెబీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక
-
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక
ముంబై: టాటా- మిస్త్రీ బోర్డ్ వార్ అనంతరం కీలక పరిణామం చేసుకుంది. టాటా సన్స్ బోర్డ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం గురువారం టాటా సన్స్ బోర్డ్ కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం బోర్డ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీసీఎస్ చీఫ్ నటరాజన్ చంద్రశేఖరన్ ను టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా ఎంపిక చేశారు. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 21 నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే దీనిపై టాటా గ్రూపు అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ కొత్త చీఫ్ గా రాజేష్ గోపీనాథ్ ఎంపిక ఖాయమైనట్టు తెలుస్తోంది. టాటా సన్స్ మధ్యంతర ఛైర్మన్ రతన్ టాటా, టీవీఎస్ గ్రూపు చైర్మన్ వేణు శ్రీనివాసన్, బైన్ కేపిటల్ అమిత్ చంద్ర, రోనన్ సేన్ ,లార్డ్ కుమార్ భట్టాచార్యలతో కూడిన ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ సమావేశంలో కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ బాస్ ను ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే ఎన్. చంద్రశేఖరన్ టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా ఎంపిక కానున్నారనే అంచనాలపై పలువురు పారిశ్రామికవేత్తలు, మార్కెట్ నిపుణులు ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి స్పందిస్తూ టాటా సన్స్ చైర్మన్ గా ఆయన సక్సెస్ అవుతారనే దానిపై ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి అని, చంద్రశేఖరన్ ను ఎంపిక చేస్తే ఐటీ రంగానికి మంచిదేనంటూ వ్యాఖ్యానించారు. చంద్రశేఖరన్ ఎంపిక అంచనాలపై మరో ఐటీ మేజర్ విప్రోతోపాటు, బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా , టైటన్ ఎండీ భాస్కర్ భట్ కూడా హర్షం వ్యక్తం చేశారు. -
రామదురైకి టాటా పగ్గాలు?
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ పదవులకు దురై రాజీనామా... ♦ ఆమోదించిన ప్రధాని మోదీ; టాటాల అభ్యర్థనతోనేనా? ♦ మిస్త్రీ తొలగింపు నేపథ్యంలో సారథ్యం ఇవ్వొచ్చని ఊహాగానాలు ♦ టీసీఎస్ మాజీ చీఫ్‌గా, పలు సంస్థల చైర్మన్‌గా అపార అనుభవం... న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీపై వేటు... తదనంతర పరిణామాలతో తీవ్ర అలజడిలో ఉన్న టాటా గ్రూప్‌ను చక్కదిద్దే బాధ్యతను బయటి వ్యక్తులకు కాకుండా... సంస్థతో బాగా అనుబంధం ఉన్నవారికే అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా సంస్థలోని కొందరితో పాటు బయటి వ్యక్తుల పేర్లను కూడా పరిశీలించిన టాటా గ్రూప్... చివరికి తమ గ్రూప్‌తో విడదీయరాని అనుబంధంతో పాటు అపారమైన అనుబంధం ఉన్న సుబ్రమణియన్ రామదురై విషయంలో సానుకూలత కనబరుస్తున్నట్లు తెలియవస్తోంది. ఎందుకంటే రామదురై ప్రస్తుతం నరేంద్ర మోదీ సర్కారులో కేబినెట్ హోదాతో కీలకమైన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ), నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎన్ఎస్డీసీ)లకు చైర్మన్‌గా ఉన్నారు. సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్కిల్ ఇండియాకు ఈ రెండూ ఊతమిస్తున్నాయి. అలాంటి కీలకమైన పదవికి రామదురై రాజీనామా చేయటం... దాన్ని సర్కారు ఆమోదించటం కూడా వెనువెంటనే జరిగిపోయినట్లు సమాచారం. ఇదంతా టాటా గ్రూప్ అభ్యర్థనతోనే జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కొత్త చైర్మన్‌ను నియమించేవరకూ స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, ఈ ఎజెన్సీలకు వైస్ చైర్మన్‌గా ఉన్న రోహిత్ నందన్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టీసీఎస్‌తో ఎడతెగని అనుబంధం... టాటా గ్రూప్‌లో కీలకమైన పదవులను సమర్థంగా నిర్వర్తించిన అపారమైన అనుభవం 71 ఏళ్ల రామదురై సొంతం. దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్‌ను గ్లోబల్ ఐటీ దిగ్గజంగా, మల్టీ బిలియన్ డాలర్లు ఆర్జించే దిగ్గజంగా తీర్చిదిద్దింది ఆయనే. 1996లో ఆయన టీసీఎస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిప్పుడు కంపెనీ ఆదాయం 155 మిలియన్ డాలర్లు మాత్రమే. 2004లో ఆయన హయాంలోనే టీసీఎస్ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయింది. 2009లో ఆయన టీసీఎస్ సారథ్య బాధ్యతల నుంచి విరమించే నాటికి కంపెనీ వార్షికాదాయం ఏకంగా 6 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. 2013-14లో ఈ ఆదాయం రెట్టింపై 13.4 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం. మొత్తంమీద టీసీఎస్‌తో 42 ఏళ్ల ఎడతెగని అనుబంధానికి తెరవేస్తూ.. ఇటీవలే కంపెనీ వైస్ చైర్మన్ పదవి నుంచి కూడా రామదురై రిటైర్ అయ్యారు. సైరస్ మిస్త్రీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఇటీవలే ఆయనను టాటా సన్స్(గ్రూప్ కంపెనీల హోల్డింగ్ సంస్థ) చైర్మన్ పదవి నుంచి డెరైక్టర్ల బోర్డు అర్ధంతరంగా తొలగించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్ నియామకానికి నాలుగు నెలల గడవునిస్తూ.. ఇందుకుగాను ఐదుగురు సభ్యులతో ఒక అన్వేషణ కమిటీని కూడా బోర్డు నియమించింది. కొత్త సారథి రేసులో ప్రస్తుత టీసీఎస్ చీఫ్ ఎన్.చంద్రశేఖరన్, నోయెల్ టాటా, పెప్సికో చీఫ్ ఇంద్రా నూయి తదితరుల పేర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో రామదురై కీలకమైన ప్రభుత్వ పదవులకు రాజీనామా చేయడంతో... అత్యంత అనుభవశాలి, టాటా గ్రూప్ సంస్కృతి, సాంప్రదాయాలతో మమేకమైన ఆయనకే టాటా నాయకత్వ బాధ్యతలు అప్పగించొచ్చని ఊహాగానాలు గుప్పుమన్నాయి. యూపీఏ హయాంలో నియామకం.. గత యూపీఏ ప్రభుత్వం రామదురైను 2011లో ప్రధాని నేతృత్వంలోని నేషనల్ కౌన్సిల్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్కు సలహాదారుగా కేబినెట్ మంత్రి ర్యాంకులో నియమించింది. ఆ తర్వాత 2013లో ఈ కౌన్సిల్‌ను ఎన్ఎస్డీఏలో విలీనం చేశారు. అయితే, ఆయన ఆరోగ్యపరమైన కారణాలతో ఇదివరకే రాజీనామా పత్రాలను సమర్పించారని.. దీన్ని ఇప్పుడు ప్రధాని ఆమోదించారని కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా యూపీఏ సర్కారు నియమించిన ఎన్ఎస్డీసీ ఎండీ, సీఈఓ దిలీప్ షెనాయ్; సీఓఓ అతుల్ భట్నాగర్‌లు కూడా గతేడాది తమ పదవుల నుంచి వైదొలిగారు. పరిశ్రమకు అవసరమైన రీతిలో నిపుణులను తయారు చేయడంలో ఎన్ఎస్డీసీ పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. 2022 కల్లా దేశంలో 20 కోట్ల మందికి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణను ఇవ్వాలన్న లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్కు మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పాత వాళ్లందరూ ఈ సంస్థల నుంచి వెళ్లిపోవడంతో ప్రభుత్వం వీటిలో సమూల మార్పులను తీసుకురానుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పలు సంస్థలకు చైర్మన్‌గా... టాటా గ్రూప్‌లోని పలు సంస్థలతో పాటు ఇతర కంపెనీల్లోనూ రామదురై స్వతంత్ర డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. టాటాల జాయింట్ వెంచర్ ఎయిర్ ఏషియా(ఇండియా), టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలకు చైర్మన్‌గా ఉన్నారు. హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ డెరైక్టర్ల బోర్డుల్లోనూ కొనసాగుతున్నారు. రామదురైను పద్మ భూషణ్, కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్(సీబీఈ) పురస్కారాలు కూడా వరించాయి. -
APPSC చైర్మన్‌గా ఉదయభాస్కర్?
-
ఆంధ్రా బ్యాంక్...కొత్త చైర్మన్ ఖరారు!
బి. సాంబమూర్తి ఎంపిక! 9 పీఎస్‌యూ బ్యాంకుల చైర్మన్ల తుది జాబితా సిద్ధం ఎండీ సీఈవో పోటీలో 50 మంది బ్యాంకు ఉన్నతాధికారులు రెండు రోజుల్లో పావు శాతం తగ్గనున్న ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కష్టాల ఊబిలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ను గట్టెక్కించడానికి బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న వ్యక్తికి చైర్మన్ బాధ్యతలను అప్పచెప్పనున్నారా? అత్యంత విస్వశనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం బ్యాంకింగ్ రంగంలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న బులుసు సాంబమూర్తిని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఎంపిక చేసినట్లు తెలియవచ్చింది. ఈయన్ను బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. 1976లో సిండికేట్ బ్యాంకుతో వృత్తిని ప్రారంభించిన ఈ చార్టర్డ్ అకౌంటెంట్‌కు ఆ తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ సీఎండీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. భారీగా పెరిగిపోయిన ఎన్పీఏలతో సతమతవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను తెలుగువాడైన సాంబ మూర్తి గట్టెక్కించగలడని ఆర్థిక శాఖ గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాబ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్ రాజేంద్రన్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయటం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్రం సీఎండీ పదవిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో పేరుతో రెండుగా విభజించింది. ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.కె కల్రాను మూడు నెలలపాటు తాత్కాలిక ఎండీ,సీ ఈవోగా నియమించారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న చైర్మన్ పోస్టు భర్తీపై దృష్టి సారించారు. దీంతో పాటు మరో ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ల ఎంపిక పూర్తి చేసిందని, త్వరలోనే ఈ జాబితాకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోద ముద్ర వేస్తారని తెలుస్తోంది. ఎండీ పోస్ట్‌కు డిమాండ్ వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో పోస్ట్‌లకు పోటీ చాలా అధికంగా ఉంది. సుమారు అయిదు పీఎస్‌యూ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఎండీ, సీఈవో పోస్టుల కోసం 50 మందికిపైగా పోటీపడుతున్నారు. వీరిని ఎంపిక చేసే బాధ్యతను ఆర్బీఐ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ హే గ్రూపునకు అప్ప చెప్పింది. ప్రస్తుతం ఈడీగా ఉంటూ ఎండీ, సీఈవోగా అదనపు బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కల్రా వారం రోజుల్లో జరిగే ఇంటర్వ్యూలో పాల్గొననున్నారని, అందులో ఎంపికైతే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తగ్గింపుపై నేడోరేపో నిర్ణయం ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు తగ్గింపుపై గురువారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్బీఐ రెపో రేట్లను 75 బేసిస్ పాయింట్లకు తగ్గించినా ఇంత వరకు ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు చేరవేయలేదు. గురువారం సమావేశంలో బేస్ రేటును పావు శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు 10.25 శాతంగా ఉంది. ప్రచారంలో ఉన్న చైర్మన్ల జాబితా బ్యాంకు పేరు ప్రతిపాదిత చైర్మన్ ఆంధ్రాబ్యాంక్ బి.సాంబమూర్తి పంజాబ్ నేషనల్ సుమిత్ బోస్ ఓబీసీ జి.సి.చతుర్వేది కెనరా టి.ఎన్.మనోహరన్ బ్యాంక్ ఆఫ్ బరోడా రవి వెంకటేశన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జి.పద్మనాభన్ ఇండియన్ ఓవర్సీస్ ఎం.బాలచంద్రన్ విజయా బ్యాంక్ జి.నారాయణన్ ఇండియన్ బ్యాంక్ టి.సి.వి సుబ్రమణియన్ -
జీఎస్టీ సాధికార కమిటీ కొత్త చైర్మన్ మణి
న్యూఢిల్లీ: వస్తు సేవ ల పన్ను (జీఎస్టీ) వ్యవహా రాల రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ చైర్మన్‌గా కేఎం మణి నియమితులయ్యారు. కేరళ ఆర్థికశాఖ సహా న్యాయ, గృహ వ్యవహారాల శాఖల మంత్రిగా కూడా మణి విధులు నిర్వహిస్తున్నారు. కొత్త పరోక్ష పన్ను వ్యవస్థగా ఆవిర్భవిస్తున్న జీఎస్టీ ‘అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే’ 2016 ఏప్రిల్ నుంచి దేశంలో అమల్లోకి వస్తుందని అంచనా. ఈ పన్ను విధానాల కు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను, ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రులతో ఏర్పాటయ్యిందే జీఎస్టీ సాధికార కమిటీ. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో విస్తృత చర్చల తర్వాత ఈ నియామకం జరిగిందనిఆర్థిక శాఖ తెలిపింది. నేపథ్యం: జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అబ్దుల్ రహీమ్ రత్తేర్ జీఎస్టీ చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఎన్సీ ఓటమి నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎంపిక అవసరం ఏర్పడింది. చైర్మన్ పదవికి సాధారణంగా ప్రతిపక్ష పాలక రాష్ట్ర ఆర్థికమంత్రి నియమితులవుతుంటారు. మణి కేరళకాంగ్రెస్ (ఎం)కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో సైతం ఆయనకు అపార అనుభవం ఉంది. -
‘విద్యుత్ మండలి’ చైర్మన్‌గా భవానీ ప్రసాద్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ జెన్కో, ట్రాన్స్ కో ఎండీ విజయానంద్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు కొత్త చైర్మన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా భవానీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై గురుతర బాధ్యత పెట్టిందని, అందరి సహకారంతో ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. విద్యుత్ చార్జీల భారం లేకుండా ఉండేలా కృషి చేస్తానని అన్నారు.