‘విద్యుత్ మండలి’ చైర్మన్‌గా భవానీ ప్రసాద్ ప్రమాణం | grandhi Bhavani Prasad to be Electricity Board Chairman | Sakshi
Sakshi News home page

‘విద్యుత్ మండలి’ చైర్మన్‌గా భవానీ ప్రసాద్ ప్రమాణం

Oct 12 2014 1:33 AM | Updated on Jun 2 2018 5:07 PM

‘విద్యుత్ మండలి’ చైర్మన్‌గా భవానీ ప్రసాద్ ప్రమాణం - Sakshi

‘విద్యుత్ మండలి’ చైర్మన్‌గా భవానీ ప్రసాద్ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ జెన్‌కో, ట్రాన్స్ కో ఎండీ విజయానంద్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు కొత్త చైర్మన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా భవానీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై గురుతర బాధ్యత పెట్టిందని, అందరి సహకారంతో ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. విద్యుత్ చార్జీల భారం లేకుండా ఉండేలా కృషి చేస్తానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement