
ముంబై: దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్‌గా శుక్రవారం సోమ మండల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటన ద్వారా తెలిపింది. అంతకు ముందు ఆమె ఇదే కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–రూర్కెలా నుంచి 1984లో పట్టభద్రురాలైన మండల్ నాల్కో సంస్థలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ నాల్కో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి 2017లో సెయిల్ కంపెనీలో చేరారు. తాజాగా చైర్మన్ పదవికి ఎన్నికయ్యారు. గురువారం పదవీ విరమణ చేసిన అనిల్ కుమార్ చౌదరీ స్థానంలో మండల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల్ మాట్లాడుతూ ... కంపెనీ లాభాదాయకతకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. షేర్ హోల్డర్ల విలువలను మెరుగుపరచడంతో పాటు సంస్థను నిర్మాణాత్మకంగా మరింత బలోపేతం చేస్తామనున్నారు.