SAIL Chairman
-
సెయిల్ చైర్మన్‌గా ప్రకాష్ బాధ్యతలు స్వీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు సంస్థ సెయిల్ కొత్త చైర్మన్‌గా అమరేందు ప్రకాష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఉన్న సోమ మోండల్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో నూతన నియామకం చోటు చేసుకుంది. మే 31 నుంచి సెయిల్ చైర్మన్‌గా ప్రకాష్ బాధ్యతలు స్వీకరించినట్టు స్టాక్ ఎక్స్చేంజ్లకు కంపెనీ సమాచారం ఇచ్చింది. బిట్ సింద్రి నుంచి మెటలర్జీలో బీటెక్ చేసిన ఆయన 1991లో సెయిల్‌లో చేరారు. ఈ రంగంలో ఆయనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. -
సెయిల్ మాజీ ఛైర్మన్ వీ.కృష్ణమూర్తి కన్నుమూత
బిజినెస్ వరల్డ్‌లో విషాదం చోటు చేసుకుంది. మాజీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్), మారుతి సుజుకి చైర్మన్ వీ.కృష్ణమూర్తి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో వి.కృష్ణమూర్తి మరణించినట్లు సెయిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కృష్ణమూర్తి సెయిల్‌లో 1985 నుంచి 1990 వరకు చైర్మన్‌గా విధులు నిర్వహించారు. "పద్మ విభూషణ్ డాక్టర్. వెంకట రామన్ కృష్ణమూర్తి మరణం పట్ల సెయిల్ కుటుంబం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుందంటూ" సెయిల్ విడుదల చేసిన ప్రటకనలో పేర్కొంది. ఆయన సేవలు మరువలేం! వెంకట రామన్ కృష్ణమూర్తి సెయిల్, బీహెచ్ఈఎల్ వంటి దిగ్గజ సంస్థలకు చైర్మన్‌గా వ్యవరించారు. వీటితో పాటు మారుతి ఉద్యోగ్(మారుతి సుజుకి), గెయిల్‌లో చైర్మన్‌గా ముఖ్య పాత్ర పోషించారు. కృష్ణ మూర్తి మరణంపై మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ. బార్గవ విచారం వ్యక్తం చేశారు. అవుట్ స్టాండింగ్ లీడర్, గొప్ప విజనరీ ఉన్న వ్యక్తి. ఆయన సారధ్యంలోనే మారుతి ఉద్యోగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. భారత్‌లో జపనీస్ వర్క్ కల్చర్‌ను పరిచయం చేసింది కృష్ణమూర్తేనని గుర్తు చేశారు. వ్యక్తి గతంగా సివిల్ సర్వీస్ నుంచి ఇండస్ట్రీలిస్ట్‌గా ఎదగడానికి కృష్ణమూర్తి ఎంతో తోడ్పడ్డారని చెప్పారు. కృష్ణమూర్తి గొప్ప దార్శానికుడు. నా గురువుగా..టీవీఎస్ మోటార్‌ను ఒక సామ్రాజ్యంగా విస్తరించడంలో చేసిన కృషి చిరస్మరణీయం. అంతేకాదు వ్యాపార రంగంలో దేశ ఎకానమీ వృద్ది కోసం పాటు పడిన వారిలో కృష్ణమూర్తి ఒకరని టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కొనియాడారు. -
సెయిల్ చైర్మన్‌గా సోమ మండల్
ముంబై: దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్‌గా శుక్రవారం సోమ మండల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటన ద్వారా తెలిపింది. అంతకు ముందు ఆమె ఇదే కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–రూర్కెలా నుంచి 1984లో పట్టభద్రురాలైన మండల్ నాల్కో సంస్థలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ నాల్కో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి 2017లో సెయిల్ కంపెనీలో చేరారు. తాజాగా చైర్మన్ పదవికి ఎన్నికయ్యారు. గురువారం పదవీ విరమణ చేసిన అనిల్ కుమార్ చౌదరీ స్థానంలో మండల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల్ మాట్లాడుతూ ... కంపెనీ లాభాదాయకతకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. షేర్ హోల్డర్ల విలువలను మెరుగుపరచడంతో పాటు సంస్థను నిర్మాణాత్మకంగా మరింత బలోపేతం చేస్తామనున్నారు. -
కోవిడ్-19 బారిన సెయిల్ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) చైర్మన్ అనిల్ కుమార్ చౌధరి, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సహా 40 మంది సంస్థ ఉద్యోగులకు నిర్వహించిన పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్‌గా వెల్లడైంది. లోథి రోడ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే వీరిలో వ్యాధి లక్షణాలు లేని ఇద్దరిని హోం క్వారంటైన్లో ఉంచగా మిగిలిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా తమ సంస్ధలో ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకగా వారిని హోం క్వారంటైన్లో ఉండాలని కోరినట్టు సెయిల్ ఈనెల 3న ప్రకటించిన అనంతరం పెద్దసంఖ్యలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. ఇక ఈనెల 10న సెయిల్ డైరెక్టర్ అతుల్ శ్రీవాస్తవ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో మరణించగా, గుండెపోటుతో ఆయన మరణించారని కంపెనీ పేర్కొంది. శ్రీవాస్తవ శ్వాస సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరారని, కొద్దిరోజులు జ్వరంతో బాధపడ్డాడరని అయితే ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్‌గా రిపోర్ట్ వచ్చిందని సెయిల్ తెలిపింది. చదవండి : లాక్డౌన్ వారికి వరమే అయింది -
సెయిల్ ఛైర్మన్‌పై హత్యాయత్నం?
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) ఛైర్మన్ అనిల్ కుమార్ చౌదరి (58) పై హత్యాయత్నం వార్త కలకలం రేపింది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆయన కారును దుండగులో మరో కారుతో ఢీకొట్టారు. దీంతో అనిల్, ఆయన డ్రైవర్ కిందకు దిగి ప్రశ్నించారు. కారులో ఉన్న సాయుధులైన నలుగురు యువకులు ఇనుప రాడ్లతో ఒక్కసారిగా వీరిపై దాడికి తెగబడ్డారు. అయితే తృటిలో వారిరువురూ ప్రాణా పాయం నుంచి బయటపడ్డారు. బుధవారం రాత్రి దక్షిణ దిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సెయిల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. సెయిల్ అందించిన సమాచారం ప్రకారం కారుతో ఢీకొట్టిన నిందితుల్లో ఒకరు డ్రైవర్‌ను అతని మెడకు పట్టుకోగా, మిగతా ముగ్గురు అనిల్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో అనిల్ తల, మెడ, కాళ్లపై ఐరన్ రాడ్లతో తీవ్రంగా కొట్టారు. అటుగా వెళ్తున్న డిఫెన్స్ కాలనీకి చెందిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది దాడిని చూసి వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనిల్‌ను రక్షించి ఎయిమ్స్‌కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఛైర్మన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారనీ, డ్రైవర్కూడా క్షేమంగా ఉన్నాడని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఇది యాదృచ్ఛికంకా జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలనే ఛైర్మన్‌పై దాడి చేసి ఉంటారని పెరు చెప్పడానికి ఇష్టపడని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. -
నక్సలిజానికి విరుగుడు క్రీడా అకాడమీలు!
ఛత్తీసగడ్లోని నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లాలో యువత క్రీడా ప్రతిభాన్వేషణకు త్వరలో అర్చరీ, షూటింగ్ అకాడమీలు ఏర్పాటుకానున్నాయి. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) సామాజిక బాధ్యత కార్యక్రమం(సీఎస్ఆర్) తోడ్పాడుతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. గిరిజన ప్రాబల్యమున్న ప్రాంతాల్లో యువతను నక్సలిజం వైపు మరలకుండా నిరోధించి వారిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ చొరవ తీసుకుందని అధికారి చెప్పారు. సెప్టెంబర్ 14న సెయిల్ చైర్మన్ పీకే సింగ్, ఉక్కు శాఖ కార్యదర్శి అరుణ శర్మతో సీఎం రమణ్‌సింగ్ సమావేశమైనపుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అకాడమీల తొలిదశ పనులు 2018 మార్చి నాటికి మొదలయ్యే అవకాశం ఉంది. బస్తర్ లో ప్రపంచస్థాయి అథ్లెటిక్ ట్రాక్‌ను నిర్మించాలని కూడా సీఎం ఎన్ఎండీసీని ఆదేశించారు. సెయిల్ అధీనంలోని భిలాయి ఉక్కు ప్లాంటు దుర్గ్ జిల్లా భిలాయ్‌లో టెన్నిస్ అకాడమీ, బాస్కెట్ బాల్ అకాడమీని ఏర్పాటుచేస్తుందని కూడా సమావేశంలో నిర్ణయించారు. వీటికి అదనంగా అక్కడే భిలాయ్ సామాజిక బాధ్యతా కార్యక్రమం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్‌ను కడతారు.