సాక్షి, న్యూఢిల్లీ : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) చైర్మన్ అనిల్ కుమార్ చౌధరి, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సహా 40 మంది సంస్థ ఉద్యోగులకు నిర్వహించిన పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్‌గా వెల్లడైంది. లోథి రోడ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే వీరిలో వ్యాధి లక్షణాలు లేని ఇద్దరిని హోం క్వారంటైన్‌లో ఉంచగా మిగిలిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా తమ సంస్ధలో ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకగా వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరినట్టు సెయిల్ ఈనెల 3న ప్రకటించిన అనంతరం పెద్దసంఖ్యలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం.
ఇక ఈనెల 10న సెయిల్ డైరెక్టర్ అతుల్ శ్రీవాస్తవ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో మరణించగా, గుండెపోటుతో ఆయన మరణించారని కంపెనీ పేర్కొంది. శ్రీవాస్తవ శ్వాస సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరారని, కొద్దిరోజులు జ్వరంతో బాధపడ్డాడరని అయితే ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్‌గా రిపోర్ట్ వచ్చిందని సెయిల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment