
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొత్త చైర్మన్‌గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 54 సంవత్సరాల సాహ్నీ ప్రస్తుతం ఐఓసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్‌మెంట్– పెట్రోకెమికల్స్)గా విధులు నిర్వహిస్తున్నారు.
ఆగస్టులోనే ఈ బాధ్యతలకు ఎంపికైన ఆయన, అటు తర్వాత కొద్ది నెలల్లోనే సంస్థ చైర్మన్‌గా నియమితులు కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా పదవీ విరమణ పొందే వరకూ లేదా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ (ఏది ముందైతే అది) సాహ్నీ ఐఓసీ చైర్మన్‌గా ఉంటారు.
శ్రీకాంత్ మాధవ్ వైద్య తన పొడిగించిన పదవీకాలాన్ని ఈ ఏడాది ఆగస్టు 31న పూర్తి చేసుకున్న నాటి నుంచి ఈ ఫారŠూచ్యన్ 500 కంపెనీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. 2014 జూలైలో బీ అశోక్ తర్వాత బోర్డు అనుభవం లేకుండానే కంపెనీ ఉన్నత ఉద్యోగానికి పదోన్నది పొందిన రెండవ వ్యక్తి సాహ్ని.