ముంబై: కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజేశ్ నంబియార్‌ను తన చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్ చైర్‌పర్సన్‌గా మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి బాధ్యతలు నిర్వహిస్తుండగా, నంబియార్ వైస్ చైర్‌పర్సన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనంత్ మహేశ్వరి నుంచి నంబియార్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.
నాస్కామ్ భారత్‌కు సంబంధించి ఐటీ, టెక్ ట్రేడ్ సంస్థ. ప్రభుత్వం, ఐటీ పరిశ్రమ మధ్య సమన్వయం పెంపొందడానికి ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. ‘‘నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా నియమితులు కావడాన్ని గౌరవప్రదమైన అంశంగా భావిస్తున్నాను. ప్రపంచానికి అత్యంత విశ్వసనీయమైన సాంకేతిక భాగస్వామిగా భారతదేశ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి సంబంధిత అన్ని వర్గాలతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అని తన నియామకం సందర్భంగా నంబియార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment