Nambiar
-
స్పెయిన్‌లో భర్తతో కలిసి చిల్ అవుతున్న మౌనీ రాయ్ (ఫొటోలు)
-
హబ్బీతో మౌనీరాయ్ విషు సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నాస్కామ్ చైర్‌పర్సన్‌గా రాజేశ్ నంబియార్
ముంబై: కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజేశ్ నంబియార్‌ను తన చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్ చైర్‌పర్సన్‌గా మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి బాధ్యతలు నిర్వహిస్తుండగా, నంబియార్ వైస్ చైర్పర్సన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనంత్ మహేశ్వరి నుంచి నంబియార్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నాస్కామ్ భారత్‌కు సంబంధించి ఐటీ, టెక్ ట్రేడ్ సంస్థ. ప్రభుత్వం, ఐటీ పరిశ్రమ మధ్య సమన్వయం పెంపొందడానికి ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. ‘‘నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా నియమితులు కావడాన్ని గౌరవప్రదమైన అంశంగా భావిస్తున్నాను. ప్రపంచానికి అత్యంత విశ్వసనీయమైన సాంకేతిక భాగస్వామిగా భారతదేశ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి సంబంధిత అన్ని వర్గాలతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అని తన నియామకం సందర్భంగా నంబియార్ పేర్కొన్నారు. -
రఫేల్... గేమ్ చేంజర్
న్యూఢిల్లీ: చైనా అండదండలతో జిత్తులమారి పాకిస్తాన్ కూడా కయ్యానికి కాలుదువ్వుతుందన్న అంచనాలున్న నేపథ్యంలో భారత్ అమ్ములపొదిలోకి రఫేల్ చేరడంతో భారత్ వాయుసేన సామర్థ్యం మరింతగా పెరిగింది. సరిహద్దుల్లో చైనా ఆటలు ఇక సాగవని, రఫేల్ ఒక గేమ్ చేంజర్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా యుద్ధవిమానం చెంగ్డూ జే–20 కంటే రఫేల్ అత్యంత శక్తిమంతమైనదని చెబుతున్నారు. ‘‘జే–20 కంటే రఫేల్ అత్యంత శక్తిసామర్థ్యాలు కలిగినది. జే–20 అయిదో తరానికి చెందిన యుద్ధవిమానమని చైనా చెబుతున్నప్పటికీ దాని ఇంజిన్ మూడో జనరేషన్‌కి చెందినది. సుఖోయ్ యుద్ధ విమానం తరహా ఇంజిన్ అందులో ఉంది’’ అని రఫేల్ యుద్ధ విమానాన్ని పరీక్షించి చూసిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ నంబియార్ చెప్పారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దగ్గరున్న జే–20 అత్యంత ఆధునికమైనదైతే ఆ దేశం రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలను కొనాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. గగనతలం నుంచి గగనతలం లక్ష్యాలను ఛేదించే మీటియోర్ క్షిపణి వ్యవస్థ, ఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగిన స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ కలిగి ఉన్న రఫేల్ యుద్ధ విమానం దరిదాపుల్లోకి కూడా చైనా జే–20 రాలేదని బాలా కోట్ దాడుల వ్యూహకర్త, మాజీ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనూవా అభిప్రాయపడ్డారు. -
కార్గిల్ యుద్ధ హీరోకు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ : భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్ యుద్ధ హీరో ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్‌ను.. ఐఏఎఫ్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్(డబ్ల్యూఏసీ) చీఫ్‌గా నియమించింది. ఇన్నాళ్లుగా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పనిచేసిన నంబియార్ శుక్రవారం నుంచి పశ్చిమ వాయుదళంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా భారత వైమానిక దళంలోని దాదాపు 40 ఎయిర్‌బేస్‌లు డబ్ల్యూఏసీ నియంత్రణలోనే ఉంటాయి. తద్వారా రాజస్తాన్‌లోని బికనీర్ నుంచి సియాచిన్ గ్లేసియర్ వరకు గల గగనతలాన్ని డబ్ల్యూఏసీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇక కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై తన విమానం ద్వారా ఐదు లేసర్ గైడెడ్ బాంబులను విసిరిన నంబియార్.. భారత్ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా ఎయిర్ మార్షల్‌గా మిరాజ్-2000లో సుమారు 2300 గంటల పాటు ప్రయాణించిన ఘనత ఆయన సొంతం. అదేవిధంగా ఐఏఎఫ్ నంబర్ స్క్వాడ్రాన్‌కు నంబియార్ నేతృత్వం వహించారు. మిరాజ్‌తో పాటు తొలి రాఫెల్ ఫైటర్ జెట్‌ను కూడా నడిపిన ఆయన సీనియర్ టెస్టు పైలట్, కమాండింగ్ ఆఫీసర్‌గా కీర్తి గడించారు. లైట్ కమంబాట్ ఎయిర్‌క్రాఫ్టులను పరీక్షించినందుకు గానూ 2002లో వాయుసేన మెడల్ పొందారు. -
‘రాఫెల్’ను నడిపిన ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్
న్యూఢిల్లీ: భారత్ కోసం ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ తయారుచేసిన తొలి రాఫెల్ ఫైటర్ జెట్‌ను ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్, ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్ నడిపారు. రాఫెల్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదు రోజుల క్రితం ఫ్రాన్స్‌కు చేరుకున్న నంబియార్ గురువారం రాఫెల్ జెట్ సమర్థత, పనితీరును పరీక్షించడంలో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపారు. ఈ పర్యటనలో భాగంగా రాఫెల్ ఫైటర్ జెట్ల తయారీ పనుల్లో పురోగతిని సమీక్షించారు. భారత అవసరాలకు తగ్గట్లుగా రాఫెల్ జెట్‌లో మార్పులు సూచించేందుకు ఐఏఎఫ్ బృందం డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీతో కలసి పనిచేస్తోంది. భారత్‌కు రాఫెల్ ఫైటర్ జెట్ల సరఫరా 2019 నుంచి మొదలుకానుంది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఫైటర్ జెట్లను(ఆయుధాలతో కలిపి) రూ.58,000 కోట్లకు కొంటోంది. -
నిజంగానే మద్యం తాగి నటిస్తా !
తమిళసినిమా: మందు కొట్టి నటించే సన్నివేశాలప్పుడు నిజంగానే మద్యం తాగుతానన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్‌ఆంటోని. తొలుత సంగీత రంగంలోకి దూసుకొచ్చి, ఆ తరువాత నటుడిగా వరుస విజయాలు సాధిస్తున్న ఈ బహుముఖ ప్రతిభాశాలి నటుడు శ్రీకాంత్ హీరోగా నటించి, నిర్మించిన నంబియార్ చిత్రానికి సంగీతాన్ని అందించడం విశేషం. నటి సునైనా నాయకిగా నటించిన ఈ చిత్రంలో ప్రస్తుతం కథానాయకుడిగా హిట్ మీద హిట్ కొడుతున్న నటుడు సంతానం హాస్య పాత్రలో నటించడం ప్రస్తావనార్హం. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నంబియార్ చిత్రానికి సంగీతం అందించడంతో పాట ఒక పాటలో చిన్నగా చిందులేసిన విజయ్‌ఆంటోనితో చిన్న భేటీ.. ప్ర: నంబియార్ చిత్రం గురించి? జ: బాహ్య ప్రపంచంలో మనం అంతా మంచి వాళ్లుగా నటిస్తున్నాం. నిజం చెప్పాలంటే సినిమాల్లో నంబియార్లా మనలోనూ చె డ్డవాడు ఉంటాడు. అలాంటి వాడికి ఒక రూపం ఇచ్చి మనతో పయనించేలా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు తెరరూపం నంబియార్ చిత్రం. ప్ర: చిత్రంలో శ్రీకాంత్ నటన గురించి? జ: ఆయన చాలా బాగా నటించారు. ప్ర: సంతానం పాత్ర గురించి? జ: ఆ పాత్రను ఆయన మాత్రమే చేయగలరు.సంతానం పాత్ర నంబియార్ చిత్రానికి చాలా సపోర్టుగా నిలుస్తుంది. ఆయన చిత్రాల్లో పాడాలన్న ప్రయత్నాన్ని చేయలేదు. ఈ చిత్రంలో సంతానంతో ఒక పాట పాడించాం. శ్రీకాంత్‌తో ఉన్న స్నేహం కారణంగానే ఆయన ఇందులో పాడారు. మద్యం తాగి ఆడి పాడే ఐటమ్ గీతం అది. సంతానం నిజంగా మందు తాగినట్లే నటించారు. నిజం చెప్పాలంటే తాను సలీమ్ చిత్రంలో మందు పాటలో నటించాను. అందుకు నిజంగానే మద్యం సేవించి నటించాను. సంతానం అలాకాదు. చాలా రియలిస్టిక్‌గా నటించారు. వెరైటీగా ఉంటుందని పాటకు కాస్త స్లో బాణీలు కట్టాను. ప్ర: మందు పాటలో మీరు చిందేశారటగా? జ: నిజం చెప్పాలంటే నాకు డ్యాన్స్ అసలు రాదు. వారు అడిగారని వెళ్లి పాటలో నిలబడి వచ్చానంతే. ప్ర: సంతానంతో పాడించిన అనుభవం? జ: చెబితే నమ్మరు గానీ సంతానం ఆ ఐటమ్ సాంగ్‌ను 45 నిమిషాల్లో పూర్తి చేశారు. ఆయనతో పాడించడం నిజంగా నాకు మంచి అనుభవం. ప్ర: సాధారణంగా మీరు మెలోడీకి ప్రాముఖ్యతనిస్తారు. మరి ఈ చిత్రంలో? జ: నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం. నంబియార్ చిత్రంలోనూ మూడు మెలోడి పాటలున్నాయి. చిత్రాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. కథలోని భావాన్ని తెలిపేది నేపథ్య సంగీతమే. ఈ చిత్రంలో అది బాగుంటుంది.