Chairman and Managing Director
-
హెచ్ఏఎల్ చైర్మన్, ఎండీగా డాక్టర్ డీకే సునీల్
ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ డీకే సునీల్ నియమితులయ్యారు. ఆయన నియామకం సెప్టెంబర్ 9 నుంచి అమలులోకి వస్తుందని హెచ్ఏఎల్ పేర్కొంది.హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో 2022 సెప్టెంబర్ 29 నుండి డైరెక్టర్ (ఇంజనీరింగ్, ఆర్&డీ)గా పనిచేస్తున్న డాక్టర్ సునీల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్, ఎండీగా ఆయన పదవీకాలం 2026 ఏప్రిల్ 30 వరకు లేదా రక్షణ శాఖ నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందుగా అయితే అది కొనసాగుతుంది.ఉస్మానియా పూర్వ విద్యార్థిడాక్టర్ సునీల్ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. మద్రాస్ ఐఐటీ నుండి ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేశారు. 2019లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎలక్ట్రానిక్స్ సైన్స్‌లో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు.హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో సుమారు 37 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ సునీల్ 1987లో సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరారు. తర్వాత ఇప్పటి వరకు వివిధ పాత్రలలో పనిచేశారు. డిజైన్, ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో సేవలు అందించారు. సునీల్ నాయకత్వంలో హై పవర్ రాడార్ విద్యుత్ సరఫరా, వాయిస్ యాక్టివేటెడ్ కంట్రోల్ సిస్టమ్, కంబైన్డ్ ఇంటరాగేటర్ ట్రాన్స్‌పాండర్ వంటి కొత్త సాంకేతికతలు అభివృద్ధి చేశారు. ఇవి కంపెనీకి కొత్త వృద్ధి ప్రాంతాలుగా మారాయి. -
ఐఆర్సీటీసీ సీఎండీగా సంజయ్ కుమార్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంజయ్ కుమార్ జైన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్ కుమార్ జైన్ నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా సేవలు అందించారు. ‘‘సీఎండీగా సంజయ్ కుమార్ జైన్ తక్షణ నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తేదీ 2026 డిసెంబర్ 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు వెలవరించేంత వరకు.. వీటిల్లో ఏది ముందు అయితే అది అమలవుతుందని తెలిపింది. ఈ నెల 13న నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్న జైన్, మరుసటి రోజు ఐఆర్సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సరీ్వసెస్, 1990 బ్యాచ్ అధికారి అయిన జైన్, చార్టర్ అకౌంటెంట్ ఉత్తీర్ణులు. లోగడ భారత ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల వాణిజ్య వెంచర్లు, విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. -
నాస్కామ్ చైర్‌పర్సన్‌గా రాజేశ్ నంబియార్
ముంబై: కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజేశ్ నంబియార్‌ను తన చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్ చైర్‌పర్సన్‌గా మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి బాధ్యతలు నిర్వహిస్తుండగా, నంబియార్ వైస్ చైర్పర్సన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనంత్ మహేశ్వరి నుంచి నంబియార్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నాస్కామ్ భారత్‌కు సంబంధించి ఐటీ, టెక్ ట్రేడ్ సంస్థ. ప్రభుత్వం, ఐటీ పరిశ్రమ మధ్య సమన్వయం పెంపొందడానికి ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. ‘‘నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా నియమితులు కావడాన్ని గౌరవప్రదమైన అంశంగా భావిస్తున్నాను. ప్రపంచానికి అత్యంత విశ్వసనీయమైన సాంకేతిక భాగస్వామిగా భారతదేశ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి సంబంధిత అన్ని వర్గాలతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అని తన నియామకం సందర్భంగా నంబియార్ పేర్కొన్నారు. -
రూ. 97 కోట్లు పెట్టి ఖరీదైన అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసిన బజాజ్ ఫ్యామిలీ
దేశంలో పేరెన్నికగల బజాజ్ గ్రూపు ఫ్యామిలీ మెంబర్స్ ముంబైలో ఖరీదైన అపార్ట్మెంట్లను గత నెలలో కొనుగోలు చేశారు. బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బజాజ్ కుటుంబ సభ్యుల పేరిట ఈ అపార్ట్మెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ముంబైలో పోష్ ఏరియాలో ఉన్న కార్మికైల్ రెసిడెన్సీలోని ఈ ఆపార్ట్మెంట్లు ఉన్నాయి. శేఖర్ బజాబ్ సతీమణి కిరణ్ బజాజ్ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ 8వ అంతస్థులో 3,183 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్మెంట్ కోసం రూ. 47 కోట్లు వెచ్చించారు. రూ.2.82 కోట్ల స్టాంప్ డ్యూటీ కట్టారు. శేఖర్ బజాజ్ కోడలు పూజా బజాజ్ ఇదే అంతస్థులో మరో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయగా దాని ఖరీదు రూ.47 కోట్లుగా ఉంది. స్టాంప్ డ్యూటీ రూ.2.82 కోట్లు చెల్లించారు. మొత్తంగా బజాజ్ కుటుంబ సభ్యులు మొత్తంగా రూ. 97 కోట్ల రూపాయలు వెచ్చించి రెండు అపార్ట్మెంట్లను సొంతం చేసుకున్నారు. ఈ డీల్ 2022 ఏప్రిల్ 28న జరిగింది. ప్రతీ అపార్ట్మెంట్కి నాలుగు కార్ పార్కింగ్ స్లాట్స్ లభించాయి. చదవండి: విలాస ఇళ్లకు భారీ డిమాండ్ -
వైజాగ్ స్టీల్ సీఎండీగా అతుల్ భట్
ఉక్కునగరం(గాజువాక): వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన ఉప కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.ఇంతకుముందు సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్ ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత అప్పటి డైరెక్టర్ (పర్సనల్) కె.సి.దాస్ ఇన్చార్జి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మహంతి ఇన్చార్జ్ సీఎండీ బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ఆదేశాలు అందుకున్న నూతన సీఎండీ అతుల్ భట్ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది. -
ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సాల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు సీఎండీగా సీనియర్ ప్రభుత్వ అధికారి రాజీవ్ బన్సాల్‌ను ప్రభుత్వం గురువారం నియమించింది. నాగాలాండ్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ బన్సాల్.. గతంలో విజయవంతంగా సంస్థను నడిపించారు. 2017లో మూడు నెలలపాటు మధ్యంతర సీఎండీగా సేవలందించారు. ఆ సమయంలో వ్యయాలను గణనీయంగా తగ్గించి, సమయానికి విమానాలు నడిచేలా చేశారు. దీంతో ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను గాడిలో పెట్టేందుకు ఆయన్ని మళ్లీ నియమించింది. -
సిహగ్కు ఎన్ఎండీసీ
♦ సీఎండీగా అదనపు బాధ్యతలు న్యూఢిల్లీ: ఉక్కు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహ రిస్తున్న భారతీ ఎస్. సిహగ్ తాజాగా ప్రభుత్వ రంగ అతిపెద్ద ఐరన్ ఓర్ కంపెనీ ఎన్ఎండీసీ సీఎండీ (చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్)గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఎన్ఎండీసీ బీఎస్ఈకి నివేదిస్తూ వెల్లడిం చింది. భారతీ సిహగ్ ఈ పదవిలో మూడు నెలలపాటు లేదా కొత్తవారిని నియమించే వరకు లేదా ప్రభుత్వపు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (వీటిల్లో ఏది ముందైతే అది) కొనసాగుతారని ఎన్ఎండీసీ పేర్కొంది. ఇది వరకు ఎన్ఎండీసీ చైర్మన్‌గా వ్యవహరించిన నరేంద్ర కొఠారి డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఎస్ఈబీ) ఎన్ఎండీసీ చైర్మన్ పదవికి గోపాల్ సింగ్ పేరు సిఫార్సు చేసింది. కానీ దానిపై కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ నియామకాల కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. గోపాల్ సింగ్ ప్రస్తుతం సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్)కు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. -
భెల్ సీఎండీగా అతుల్ సోబ్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అతిపెద్ద విద్యుత్ యంత్రాల తయారీ సంస్థ భెల్ సీఎండీగా అతుల్ సోబ్టి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం భెల్ సీఎండీ (చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్)గా అతుల్ సోబ్టి నియామకానికి పచ్చజెండా ఊపింది. ఈయన ఐదేళ్లపాటు తన సేవలను భెల్‌కు అందించనున్నారు. ఈ నియామకానికి ముందు అతుల్ సోబ్టి.. భెల్ బోర్డులో డెరైక్టర్‌గా ఉన్నారు. -
డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ విస్తరణ
2020 నాటికి మరో 140 కేంద్రాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటి వైద్య రంగంలో ఉన్న డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ భారీగా విస్తరిస్తోంది. భారత్‌తోపాటు విదేశాల్లో 2020 నాటికి కొత్తగా 140 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం సంస్థకు భారత్‌లో 47, ఆఫ్రికాలో 12, కంబోడియాలో ఒక ఆసుపత్రి ఉంది. విస్తరణలో భాగంగా తొలి దశలో రూ.200 కోట్లకుపైగా వెచ్చిస్తామని సంస్థ సీఎండీ అమర్ అగర్వాల్ సోమవారం తెలిపారు. ఇక్కడి సంతోష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని సినీ నటుడు దగ్గుబాటి రాణా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మీడియాతో మాట్లాడుతూ ఆఫ్రికాలో 15-20 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వియత్నాం, ఫిలిప్పైన్స్‌లో అడుగు పెడతామని వివరించారు. సంతోష్ నగర్ శాఖతో కలిపి హైదరాబాద్‌లో అయిదు ఆసుపత్రులను సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.30-40 కోట్లతో మూడేళ్లలో 30 కేంద్రాలను నెలకొల్పుతామని వెల్లడించారు. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నెలకు 7-10 వేల శస్త్ర చికిత్సలను నిర్వహిస్తోంది. -
సెయిల్ తాత్కాలిక సీఎండీగా స్టీల్ సెక్రటరీ రాకేశ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) తాత్కాలిక సీఎండీగా స్టీల్ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన సీఎస్ వర్మ బుధవారం పదవీ విరమణ నేపథ్యంలో రాకేశ్ సింగ్ ఈ బాధ్యతలను చేపట్టినట్లు సెయిల్ గురువారం బీఎస్ఈకి పంపిన ఒక ఫైలింగ్‌లో తెలిపింది. సంస్థ సీఎండీగా కొత్త నియామకం జరిగే వరకూ రాకేశ్ సింగ్ ఈ బాధ్యతలను నిర్వహిస్తారని పేర్కొంది. -
ప్రజయ్ నుంచి మెగాక్లబ్
హైదరాబాద్: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనూ కొనుగోలుదారుల ఆనందమే తమ ధ్యేయమంటున్నారు ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి. హైటెక్‌సిటీకి చేరువలో నిర్మిస్తున్న మెగాపొలిస్ ప్రాజెక్ట్‌లో ఇటీవలే ‘ప్రజయ్ మెగాక్లబ్’కు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. {Vౌండ్+4 అంతస్తుల్లో లక్ష చ.అ.ల్లో అత్యాధునిక క్లబ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాం. ఏడాదిలోగా వినియోగంలోకి తీసుకొస్తాం. ఇందులో మినీ సినిమా హాలు, బౌలింగ్ అల్లీ, స్క్వాష్ కోర్ట్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్, అతిథి గదులు, సూపర్ మార్కెట్, బ్యాంక్వెట్ హాల్, రిటైల్ అవుట్‌లెట్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన జిమ్, హెల్త్ స్పా, స్విమ్మింగ్ పూల్ వంటివెన్నో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. మెగాపొలిస్లో మొత్తం 1,113 ఫ్లాట్లు. ఇందులో 9 టవర్లు ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసి కొనుగోలుదారుల చేతికి తాళాలందిస్తాం. 12,17, 18 టవర్లను ఆగస్టులో, 13, 16, 19 టవర్లను నవంబర్‌లో, 15, 20 టవర్లను డిసెంబర్లో, 14వ టవర్‌ను వచ్చే ఏడాది జనవరిలోగా పూర్తి చేస్తాం. అధిక శాతం మంది కస్టమర్లు సకాలంలో డబ్బులు చెల్లింపులు చేయకపోవడంతో నిర్మాణ పనులు మందగించాయి. దీంతో సంస్థ సీఎండీనే స్వయంగా ముందుకొచ్చి 11 రోజుల పాటు కొనుగోలుదారులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. కస్టమర్లలో నెలకొన్న సందేహాల్ని నివృత్తి చేశారు. సకాలంలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సంస్థ ఎలా ముందడుగు వేసిందో వివరించారు. దీంతో కొనుగోలుదారులు బకాయిలను చెల్లిస్తామని ఒప్పుకోవటం మంచి పరిణామమని ఆయన చెప్పుకొచ్చారు. -
పదేళ్లలో 90 వేల మెగావాట్ల సామర్థ్యం
ఎన్టీపీసీ లక్ష్యం ఇది కంపెనీ సీఎండీ అరూప్ రాయ్ చౌదరి న్యూఢిల్లీ: వచ్చే పదేళ్లలో రెట్టింపు విద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించనున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ సీఎండీ అరూప్ రాయ్ చౌదరి చెప్పారు. ప్రస్తుతం 44,398 మెగావాట్ల(మె.వా) విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా దీన్ని 90,000 మె.వా.కు పెంచుకోగలమని తెలిపారు. ప్రస్తుతం 23,000 మె.వా. ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, వచ్చే అయిదేళ్లలో ఇవి పూర్తి కాగలవని చెప్పారు. మరో 15,000 మె.వా. ఏడేళ్లలో, ఇంకో 8,000 మె.వా. ప్రాజెక్టులు పదేళ్లలో అందుబాటులోకి రాగలవని చౌదరి తెలిపారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తి కోసం ఎక్కువగా బొగ్గుపై ఆధారపడుతున్న ఎన్టీపీసీ.. భవిష్యత్‌లో సౌర విద్యుత్‌పై మరింతగా దృష్టి పెట్టాలని యోచిస్తోంది. ఈ ప్లాంట్ల నిర్వహణ చాలా సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ సోలార్ పవర్ ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నట్లు చౌదరి తెలిపారు. సౌర విద్యుత్‌కి సంబంధించి జాతీయ, ప్రాంతీయ గ్రిడ్ల అనుసంధానం, స్థల లభ్యత మొదలైనవి ప్రధానమైన సమస్యలని ఆయన పేర్కొన్నారు. పైగా ఇతర సంప్రదాయ వనరులతో పోలిస్తే సౌర విద్యుత్‌పై రాబడి కూడా తక్కువేనన్నారు. అయితే, దేశీయంగా అతి పెద్ద విద్యుదుత్పత్తి సంస్థ అయినందున ఎన్టీపీసీ ఎంతో కొంత సౌర విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని చౌదరి తెలిపారు. దీనికి అనుగుణంగానే 1,000 మె.వా. సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గతేడాదే ఎన్టీపీసీ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు, నిల్చిపోయిన ప్రభుత్వ, ప్రైవేట్ పవర్ ప్రాజెక్టుల్లో కొన్నింటిని కొనుగోలు చేయాలని ఎన్టీపీసీ యోచిస్తోన్నట్లు చౌదరి తెలిపారు. జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాజెక్టులను గుర్తించామని, వాటి కొనుగోలు సాధ్యాసాధ్యాలపై మదింపు జరుగుతోందని చౌదరి పేర్కొన్నారు. -
కడప అంటే కడుపు మంట!
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్పార్ జిల్లాకు ఎంత చేసినా తమ పార్టీకి ఉపయోగం లేదనుకున్నారో ఏమో... ఏదైతేనేం నాటి సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు వైఎస్సార్ జిల్లా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. జిల్లా పారిశ్రామికాభివద్ధికి కిరణ్ నేతత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డుపెట్టింది. బీడీఎల్ నుంచి ఫార్మా కంపెనీల వరకూ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని కంపెనీలు ముందుకు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. దాంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కలలుకన్న ‘కొప్పర్తి పారిశ్రామికవాడ’ కలగానే మిగిలిపోయింది. కడప గడపలో డీఆర్డీఓ నెలకొల్పుతామని ముందుకొచ్చినా సీఎం చంద్రబాబు చిత్తూరుకు తరలించుకెళ్లారు. ఓట్లు-సీట్లు ఆధారంగా నిర్ణయాలు, పర్యటనలు ఖరారవుతున్నాయి. కడప అంటేనే కడపుమంట స్పష్టంగా కన్పిస్తోంది. తుదకు జిల్లాల పర్యటనలోనూ చిట్టచివర్న వైఎస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పర్యటిస్తున్నారు. వైఎస్ కృషికి తూట్లు... ఆయా ప్రాంతాల సమగ్రాభివద్ధికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండుకళ్లు లాంటివి. వ్యవసాయరంగం అభివద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అపార కషి చేశారు. సమగ్రాభివద్ధి కోసం పారిశ్రామిక ప్రగతిపై దష్టి సారించారు. అందుకోసం జిల్లా కేంద్రమైన కడప నగరానికి సమీపంలో 6,464.5 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది. ఈ పారిశ్రామిక వాడకు ‘సోమశిల మంచినీటి పథకం’ ద్వారా నీరందించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. వైఎస్ మరణానంతరం వచ్చిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించాయి. ఆ పథకాన్ని పట్టించుకోలేదు. అదేబాటలో ప్రస్తుత తెలుగుదేశం పయనిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ఊసేలేదు వైఎస్సార్ జిల్లాలో రూ. 20వేల కోట్లు వ్యయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో బ్రహ్మణి ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ పరిశ్రమకు రాజకీయ కోణం ముడిపెట్టి గ్రహణం పట్టించి చివరకు రద్దు చేశారు. ఆస్థానంలో సెయిల్ నేతత్వంలో ఉక్కుపరిశ్రమ నెలకొల్పాలని ప్రజలు, వివిధ పార్టీలు ఉద్యమం చేపట్టినా. నిష్ర్పయోజనమే అయ్యింది. గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ (జీఓఎం) నిర్ణయంలో పేర్కొన్న ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తడం లేదు. ఎయిర్ పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా నేతత్వంలో కడప గడపలో పూర్తిచేసిన విమానాశ్రయాన్ని సైతం ప్రారంభించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అలాగే కడప కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనాలు 95శాతం పూర్తి అయ్యాయి. తక్కిన పనుల పట్ల ఎంతకాలమైనా శ్రద్ధ చూపడం లేదు. -
ఆంధ్రా బ్యాంక్ సీఎండీగా రాజేంద్రన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు మూడున్నర నెలల విరామం తర్వాత ఆంధ్రాబ్యాంక్‌కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న సి.వి.ఆర్. రాజేంద్రన్‌ని సీఎండీగా నియమిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే పుణేలోని ఆంధ్రా బ్యాంక్ కార్యాలయంలో రాజేంద్రన్ సీఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం. సీఎండీ హోదాలో ఆయన తొలిసారిగా శనివారం హైదరాబాద్ రానున్నట్లు ఆంధ్రాబ్యాంక్ అధికారి ఒకరు చెప్పారు. సీవీసీ అనుమతుల్లో జాప్యం... రెండు నెలల క్రితమే రాజేంద్రన్ నియామకం ఖరారైనప్పటికీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నుంచి క్లియరెన్స్ రావడంలో ఆలస్యం జరిగింది. కార్పొరేషన్ బ్యాంక్‌లో కెరీర్ ప్రారంభించిన రాజేంద్రన్‌కి అంతర్జాతీయ బ్యాంకింగ్, ఇన్వెస్ట్, మర్చెంట్ బ్యాంకింగ్ రంగాల్లో విశేష అనుభవం ఉంది.