ప్రజయ్ నుంచి మెగాక్లబ్
హైదరాబాద్: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనూ కొనుగోలుదారుల ఆనందమే తమ ధ్యేయమంటున్నారు ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి. హైటెక్‌సిటీకి చేరువలో నిర్మిస్తున్న మెగాపొలిస్ ప్రాజెక్ట్‌లో ఇటీవలే ‘ప్రజయ్ మెగాక్లబ్’కు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు.
{Vౌండ్+4 అంతస్తుల్లో లక్ష చ.అ.ల్లో అత్యాధునిక క్లబ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాం. ఏడాదిలోగా వినియోగంలోకి తీసుకొస్తాం. ఇందులో మినీ సినిమా హాలు, బౌలింగ్ అల్లీ, స్క్వాష్ కోర్ట్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్, అతిథి గదులు, సూపర్ మార్కెట్, బ్యాంక్వెట్ హాల్, రిటైల్ అవుట్‌లెట్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన జిమ్, హెల్త్ స్పా, స్విమ్మింగ్ పూల్ వంటివెన్నో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం.
మెగాపొలిస్‌లో మొత్తం 1,113 ఫ్లాట్లు. ఇందులో 9 టవర్లు ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసి కొనుగోలుదారుల చేతికి తాళాలందిస్తాం. 12,17, 18 టవర్లను ఆగస్టులో, 13, 16, 19 టవర్లను నవంబర్‌లో, 15, 20 టవర్లను డిసెంబర్‌లో, 14వ టవర్‌ను వచ్చే ఏడాది జనవరిలోగా పూర్తి చేస్తాం.
అధిక శాతం మంది కస్టమర్లు సకాలంలో డబ్బులు చెల్లింపులు చేయకపోవడంతో నిర్మాణ పనులు మందగించాయి. దీంతో సంస్థ సీఎండీనే స్వయంగా ముందుకొచ్చి 11 రోజుల పాటు కొనుగోలుదారులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. కస్టమర్లలో నెలకొన్న సందేహాల్ని నివృత్తి చేశారు. సకాలంలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సంస్థ ఎలా ముందడుగు వేసిందో వివరించారు. దీంతో కొనుగోలుదారులు బకాయిలను చెల్లిస్తామని ఒప్పుకోవటం మంచి పరిణామమని ఆయన చెప్పుకొచ్చారు.