
న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంజయ్ కుమార్ జైన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్ కుమార్ జైన్ నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా సేవలు అందించారు. ‘‘సీఎండీగా సంజయ్ కుమార్ జైన్ తక్షణ నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
పదవీ విరమణ తేదీ 2026 డిసెంబర్ 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు వెలవరించేంత వరకు.. వీటిల్లో ఏది ముందు అయితే అది అమలవుతుందని తెలిపింది. ఈ నెల 13న నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్న జైన్, మరుసటి రోజు ఐఆర్‌సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సరీ్వసెస్, 1990 బ్యాచ్ అధికారి అయిన జైన్, చార్టర్ అకౌంటెంట్ ఉత్తీర్ణులు. లోగడ భారత ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల వాణిజ్య వెంచర్లు, విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు.