northern railway
-
ఐఆర్సీటీసీ సీఎండీగా సంజయ్ కుమార్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంజయ్ కుమార్ జైన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్ కుమార్ జైన్ నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా సేవలు అందించారు. ‘‘సీఎండీగా సంజయ్ కుమార్ జైన్ తక్షణ నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తేదీ 2026 డిసెంబర్ 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు వెలవరించేంత వరకు.. వీటిల్లో ఏది ముందు అయితే అది అమలవుతుందని తెలిపింది. ఈ నెల 13న నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్న జైన్, మరుసటి రోజు ఐఆర్సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సరీ్వసెస్, 1990 బ్యాచ్ అధికారి అయిన జైన్, చార్టర్ అకౌంటెంట్ ఉత్తీర్ణులు. లోగడ భారత ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల వాణిజ్య వెంచర్లు, విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. -
యూట్యూబర్ పైత్యం: మండిపడుతున్న నెటిజనులు
యూట్యూబ్‌లో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది వింత విన్యాసాలు, ప్రమాదకర ఫీట్స్‌తో సోషల్‌మీడియా యూజర్లకు చిరాకు తెప్పించడం ఈ మధ్య కాలంలో రొటీన్‌గా మారి పోయింది. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై పటాకులు కాల్చిన వీడియో నెటిజనులకు ఆగ్రహం తెప్పింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై యూట్యూబర్ నిర్భయంగా పటాకులు స్నేక్ క్రాకర్స్ కాల్చుతున్న వీడియో ట్విటర్లో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియా క్రియేటర్లకు, యూట్యూబర్ల అతి చేష్టలకు హద్దు పద్దూ లేకుండా పోతోందంటూ ఆగ్రహం పెల్లుబుకింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దీంతో ర్వైల్వే శాఖ స్పందించింది. ఫూలేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా స్టేషన్ సమీపంలో ఈ వీడియోను షూట్ చేసినట్టు తెలుస్తోంది.ఇందులో రైలు పట్టాలపై కుప్పగా పోసిన పాము బిళ్లల్ని ఒక్కసారిగా వెలిగించాడు. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది.33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్రైన్స్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై అవసరమైన చర్యలు తీసుకోండి అనే క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేసింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి...ప్రాణాలతో చెలగాటాలా అంటూ ఒకరు, అసలే దేశమంతా కాలుష్యంతో మండిపోతోంది. దీపావళి సందర్భంగా పిల్లలు ఎక్కువగా ఇష్ట పడే ఈ పాము బిళ్ళలు ఎక్కువ కార్బన్‌ను రిలీజ్ చేస్తాయంటూ మరొకరు మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా? పర్యావరణం కలుషితమవుతోంది. రైలు పట్టాల దగ్గర ఇలాంటి ప్రయోగాలు ప్రమాదకరం అంటూ తీవ్రంగా స్పందించడం గమనార్హం. అంతేకాదు ఇది పెను ప్రమాదానికి దారి తీయవచ్చు..చర్యలు తీసుకోండి అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వీడియోపై నార్త్ వెస్ట్రన్ రైల్వే స్పందించింది. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా డివిజనల్ రైల్వే మేనేజర్, జైపూర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆదేశించింది. ప్రస్తుతం వీడియోపై ఆర్పీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటే స్నేక్ క్రాకర్స్ అనేవి అత్యధిక మోతాదులో PM2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ పర్టిక్యులేట్ మ్యాటర్)ను విడుదల చేస్తాయని 2016నాటి చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ (CRF), పూణే విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. YouTuber bursting crackers on Railway Tracks!! Such acts may lead to serious accidents in form of fire, Please take necessary action against such miscreants. Location: 227/32 Near Dantra Station on Phulera-Ajmer Section.@NWRailways @rpfnwraii @RpfNwr @DrmAjmer @GMNWRailway pic.twitter.com/mjdNmX9TzQ — Trains of India 🇮🇳 (@trainwalebhaiya) November 7, 2023 -
సోనూసూద్.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్ రైల్వే ఆగ్రహం
రీయల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై ఉత్తర రైల్వే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌బోర్డుపై ట్రావేల్ చేయడం ప్రమాదకరమైన మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దంటూ ఆయనను హెచ్చరించింది. అసలు ఏమైందంటే.. ఇటీవల సోనూసూద్ రైలులో ప్రయాణిస్తున్న వీడియో షేర్ చేశాడు. ఇందులో ఆయన కదులుతున్న రైలులో ఫుట్‌బోర్డు వద్ద కూర్చుని బయటకు చూస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నార్త్ రైల్వే అధికారులు ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి: ఇండియన్ నెంబర్ వన్ మూవీగా జాన్వీ కపూర్ చిత్రం! ‘డియర్ సోనూసూద్.. మీరు దేశంలోనే కాదు ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలకు రోల్ మోడల్. రైలు ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం ప్రమాదకరం. ఈ రకమైన వీడియో మీ అభిమానులకు తప్పుడు సందేశాన్ని పంపవచ్చు. దయచేసి ఇలా చేయకండి! సాఫీగా, సురక్షితమైన ప్రయాణం ఆనందించండి’ అని ఉత్తర రైల్వే ట్వీట్ చేసింది. అలాగే ముంబై రైల్వే కమిషనర్ కూడా ఇది ప్రమాదకరమని పేర్కొంది. నిజ జీవితంలో ఇలాంటి స్టంట్ చేయొద్దని కోరింది. ‘’మీరు(సోనుసూద్) ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం మీ సినిమాలోని ఎంటర్టైన్మెంట్లో ఓ భాగం కావచ్చు. చదవండి: అవికా గోర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నాగ్ కానీ నిజ జీవితంలో కాదు. అన్ని భద్రత మార్గదర్శకాలను పాటించి అందరికి ‘హ్యాపీ న్యూ ఇయర్‌ని అందిద్దాం’’ అని జీఆర్పీ ముంబై తమ ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా సోనుసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లాక్డౌన్లో ఎంతోమంది నిరాశ్రయులకు, ముంబైలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలకు ఆయన చేయూతను అందించారు. కూలీల కోసం స్పెషల్‌గా బస్సులు కేటాయించి వారి వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు. అంతేకాదు ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని సైతం స్పెషల్ ఫ్లైట్స్‌లో భారత్‌కు తీసుకువచ్చారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు సోనుసూద్ నిరాంతరాయంగా సామాజిక సేవలు అందిస్తూనే ఉన్నారు. प्रिय, @SonuSood देश और दुनिया के लाखों लोगों के लिए आप एक आदर्श हैं। ट्रेन के पायदान पर बैठकर यात्रा करना खतरनाक है, इस प्रकार की वीडियो से आपके प्रशंसकों को गलत संदेश जा सकता है। कृपया ऐसा न करें! सुगम एवं सुरक्षित यात्रा का आनंद उठाएं। https://t.co/lSMGdyJcMO — Northern Railway (@RailwayNorthern) January 4, 2023 -
Wrestler Sushil Kumar: ఉద్యోగం కూడా పాయే..
న్యూఢిల్లీ: సాగర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న 2008 బీజింగ్ ఒలింపిక్ కాంస్య పతక విజేత సుశీల్ కుమార్‌ను ఇటీవలే ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి అతన్ని రైల్వే ఉద్యోగం నుంచి తొలగించాలని ఉత్తర రైల్వే నిర్ణయించినట్లు ఆ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం సుశీల్ కుమార్ ఉత్తర రైల్వేస్ లో ఆఫీసర్ ఆన్ డ్యూటీగా విధులు నిర్వహిస్తున్నాడు. హత్య కేసుకు సంబంధించిన రిపోర్టు ఢిల్లీ ప్రభుత్వం నుంచి రైల్వే బోర్డుకు అందిన నేపథ్యంలో అతనిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఉత్తర రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ పీటీఐకి తెలిపారు. రెండు రోజుల్లో సుశీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. కాగా, నెల రోజుల క్రితం ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ అనే యువకుడిపై సుశీల్ కుమార్ దాడి చేశాడు. ఈ దాడిలో సాగర్ మరణించడంతో అతనిపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యానేరం కేసు నమోదైంది. -
అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే
కౌరి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌కి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం సోమవారం పూర్తయిందని భారతీయ రైల్వేస్ ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, ఒక్క ఏడాదిలో వంతెన నిర్మాణం సంపూర్ణమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు రూ. 1486 కోట్లు ఖర్చయ్యాయి. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో భాగంగా 1.315 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తికానుందని ఉత్తర రైల్వే జీఎం అశుతోష్ గంగల్ చెప్పారు. తాజాగా పూర్తి చేసిన ఆర్చ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతమన్నారు. ప్రధాని మోదీ విజన్‌తో స్ఫూర్తి పొందిన రైల్వేస్ తాజా నిర్మాణంతో భారత్‌ను అత్యున్నతంగా నిలిపిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక అద్భుతమన్నారు. వంతెన ప్రత్యేకతలు ► పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ 35 మీటర్ల ఎత్తులో ఉంది. చీనాబ్ నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ► 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యలో 2009లో నిలిచిపోయాయి. ► 2017 నుంచి వంతెనపై ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ ఆర్చ్ పొడవు 467 మీటర్లు, బరువు 10619 మెట్రిక్ టన్నులు. ► 28660 మెట్రిక్ టన్నుల ఇనుము, 66వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు. ► 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. ► నిర్మాణంలో ‘టెక్లా’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిటైలింగ్ చేశారు. నిర్మాణంలో వినియోగించిన స్టీల్ –10 నుంచి + 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు. -
అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే
కౌరి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌కి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం సోమవారం పూర్తయిందని భారతీయ రైల్వేస్ ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, ఒక్క ఏడాదిలో వంతెన నిర్మాణం సంపూర్ణమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు రూ. 1486 కోట్లు ఖర్చయ్యాయి. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో భాగంగా 1.315 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తికానుందని ఉత్తర రైల్వే జీఎం అశుతోష్ గంగల్ చెప్పారు. తాజాగా పూర్తి చేసిన ఆర్చ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతమన్నారు. ప్రధాని మోదీ విజన్‌తో స్ఫూర్తి పొందిన రైల్వేస్ తాజా నిర్మాణంతో భారత్‌ను అత్యున్నతంగా నిలిపిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక అద్భుతమన్నారు. A moment of pride for 🇮🇳! The arch of Chenab bridge, connecting Kashmir to Kanyakumari has been completed. With an arch span of 467m, it is the world’s highest railway bridge. PM @NarendraModi ji’s vision to connect India has inspired the Railway family to scale new heights pic.twitter.com/GEDEBIb9nE — Piyush Goyal (@PiyushGoyal) April 5, 2021 వంతెన ప్రత్యేకతలు ►పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ 35 మీటర్ల ఎత్తులో ఉంది. చీనాబ్ నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ►2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యలో 2009లో నిలిచిపోయాయి. ►2017 నుంచి వంతెనపై ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ ఆర్చ్ పొడవు 467 మీటర్లు, బరువు 10619 మెట్రిక్ టన్నులు. ►28660 మెట్రిక్ టన్నుల ఇనుము, 66వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు. ►266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. ►నిర్మాణంలో ‘టెక్లా’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిటైలింగ్ చేశారు. నిర్మాణంలో వినియోగించిన స్టీల్ –10 నుంచి + 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు. -
పార్లమెంటు క్యాంటీన్ల ఖర్చు రూ.16 కోట్లు
ఇండోర్: పార్లమెంటులో 2017–18 ఆర్థిక సంవత్సరానికి క్యాంటీన్లను నిర్వహించినందుకు గానూ రూ.16.43 కోట్లు చెల్లించాలని ఉత్తర రైల్వే లోక్‌సభ సెక్రటేరియట్‌ను డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పార్లమెంటు హౌస్ ప్రాంగణం, పార్లమెంటు రిసెప్షన్, లైబ్రరీ బిల్డింగ్ వద్ద క్యాంటీన్ ఔట్లెట్లను ఏర్పాటు చేసినట్లు ఉత్తర రైల్వే తెలిపింది. వీటి నిర్వహణకు 2017–18 కాలానికి రూ.16,43,90,598 ఖర్చయిందనీ, దీన్ని వెంటనే చెల్లించాలని బిల్లును పంపింది. 2019, జనవరి 16 నాటికి కూడా ఈ మొత్తాన్ని చెల్లించలేదని పేర్కొంది. ఈ మొత్తం ఖర్చును ఉత్తర రైల్వే ‘సబ్సిడీ క్లెయిమ్–సిబ్బంది ఖర్చుల’ కింద చూపింది. కాగా, ఈ బిల్లును పరిశీలించేందుకు నోట్‌ను కేంద్ర ఆర్థికశాఖకు పంపినట్లు తేలింది. -
301 రైళ్ల సమయాల్లో మార్పులు : రేపటినుంచే అమలు
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వేశాఖరైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది. ఉత్తరరైల్వేకు చెందిన పలు రైళ్ల బయలుదేరే సమయాలను ముందుకు మరికొన్ని రైళ్లలో డిపార్చర్ సమయాలను మార్చింది. ఆగస్టు 15 బుధవారం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఉత్తరరేల్వే రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, 301 రైళ్ల సమయాలను మార్చారు. ఈ మార్పులు అయిదు నిమిషాలనుంచి రెండున్నర గంటల మధ్య ఉంటుందని రైల్వే ప్రకటించింది. 57 రైళ్ళలో బయలు దేరే సమయాలను ముందుకు జరిపింది. అలాగే 58 రైళ్లు గమ్యానికి చేరే సమయాన్ని పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా 102 రైళ్ల ఎరైవల్ సమాయాన్ని ముందుకు జరిపగా, మరో 84 రైళ్ళ బయలుదేరే సమయం పెరిగింది. ఉత్తర రైల్వే ఈ న్యూ టైం టేబుల్‌ను ప్రజలకు అందుబాటులోఉంచామని ఉత్తర రైల్వే తెలిపింది. ఆగష్టు 15నుంచి అమలులోకి వస్తున్న ఈ మార్పులను ప్రజలు గమనించాలని కోరింది. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైల్వే ఎంక్వైరీ ద్వారా రైళ్ల రాకపోకల సమాచారాన్ని పొందాలని చెప్పింది. అమృత్ సర్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్, తేజాస్ ఎక్స్‌ప్రెస్, హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ తదితర రైళ్లు ప్రస్తుతం సమయంకంటే ఐదు నిమిషాల ముందు బయలుదేరతాయి. అలాగే నీలాచల్ ఎక్స్‌ప్రెస్, డెహ్రాడూన్-అమృతసర్, జన శతాబ్ది తదితర ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా గమ్యానికి చేరనున్నాయి. -
2.5 గంటల పాటు రైలు టిక్కెట్ల బుకింగ్ రద్దు
న్యూఢిల్లీ : నగర ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఆర్ఎస్)లో రైల్వే సర్వీసులు రద్దు కానున్నాయి. రెండున్నర గంటల పాటు ఢిల్లీ పీఆర్ఎస్ రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది. దీంతో 139 ఎంక్వైరీ సర్వీసులు, టిక్కెట్ల బుకింగ్ ఏమీ అందుబాటులో ఉండవని తెలిపింది. మే 18న రాత్రి 11.45 గంటల నుంచి మే 19 అర్థరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల వరకు ఢిల్లీ కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ను అప్‌గ్రేడ్ చేయనున్నామని, ఈ క్రమంలో రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెలలో ఇలా పీఆర్ఎస్ సర్వీసులను రద్దు చేయడం ఇది రెండో సారి. అంతకముందు ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, ఈశాన్య రైల్వే, వాయువ్య రైల్వేలు కూడా మే 5న ఇదే మాదిరి కొన్ని గంటల పాటు తమ సర్వీసులను రద్దు చేశాయి. మే 5న రాత్రి 10.30 గంటల నుంచి మే 6న అర్థరాత్రి 12.15 గంటల వరకు, మళ్లీ అదే రోజు ఉదయం 5.15 నుంచి 6.25 వరకు సర్వీసులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సాధారణ విద్యుత్ నిర్వహణ కార్యకలాపాల కారణంగా తమ సర్వీసులను రద్దు చేసినట్టు పేర్కొన్నాయి. తాజాగా ఢిల్లీ కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ను అప్‌గ్రేడ్ చేయడం కోసం రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది. -
రైతుకు శతాబ్ది రైలును ఇచ్చేసిన కోర్టు!
-
రైతుకు శతాబ్ది రైలును ఇచ్చేసిన కోర్టు!
రైతు భూమిని తీసుకుని అతనికి తగిన నష్టపరిహారం చెల్లించని ఉత్తరరైల్వేకు లుథియానాలోని జిల్లా అడిషనల్ కోర్టు షాక్ ఇచ్చింది. అమృతసర్-న్యూఢిల్లీల మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రైతుకు ఇవ్వాలని సంచలన తీర్పు చెప్పింది. లూథియానా-చండీఘడ్ రైల్వే లైను ఏర్పాటు కోసం ఉత్తర రైల్వే 2007లో భూ సేకరణ చట్టం కింద లూథియానాకు చెందిన సంపూరణ్ సింగ్ అనే రైతుకు చెందిన భూమిని తీసుకుంది. ఇందుకు గాను రూ.కోటికిపైగా నష్ట పరిహారం చెల్లించాల్సివుంది. కానీ, రూ.42 లక్షలు మాత్రమే సంపూరణ్‌కు చెల్లించింది ఉత్తర రైల్వే. దీంతో తనకు న్యాయం చేయాలంటూ 2012లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సంపూరణ్. కేసును విచారించిన కోర్టు 2015 జనవరిలో పిటిషనర్‌కు రైల్వే ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేయాలని తీర్పు చెప్పింది. అప్పటికీ రైల్వే శాఖ స్పందించకపోవడంతో మరో మారు కోర్టు మెట్లె క్కాడు సింగ్. కేసును విచారించిన లూథియానా జిల్లా కోర్టు జడ్జి జస్పాల్ వర్మ ట్రెయిన్ నెం-12030(స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్)ను రైతుకు ఇస్తున్నట్లు తీర్పు చెప్పారు. దీంతో లూథియానా రైల్వే స్టేషన్‌కు కోర్టు ఆర్డర్‌తో చేరుకున్న సంపూరణ్ రైలును తనకు అప్పజెప్పాలని కోర్టు ఆర్డర్లను డ్రైవర్‌కు చూపించాడు. ఇంతలో అక్కడికి చేరుకున్ సెక్షన్ ఇంజినీర్ ప్రదీప్‌కుమార్ రైలును కోర్టుకు స్వాధీనం చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణీకులు ఉండటంతో సమస్యగా మారుతుందని రైలును ఆపలేదని సంపూరణ్ తెలిపారు. ఇంటికి తీసుకెళ్తారా? కోర్టు తీర్పుపై డివిజినల్ రైల్వే మేనేజర్ అనుజ్ ప్రకాశ్ మాట్లాడారు. నష్టపోయిన వారికి పరిహారాలు చెల్లించడంలో కొన్ని సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను కేంద్ర న్యాయశాఖ చూసుకుంటుందని చెప్పారు. రైలును రైతుకు ఇస్తే అతనేం చేసుకుంటాడని ప్రశ్నించారు. కనీసం దాన్ని ఇంటికి తీసుకెళ్లగలరా? అని అన్నారు. -
ప్లాట్‌ఫారమ్ టికెట్ల విక్రయాలు నిలిపివేత:ఉత్తర రైల్వే
న్యూఢిల్లీ:ఈ నెల పది వరకు నగరంలోని ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టికెట్ల విక్రయాలని నిలిపివేయాలని ఉత్తర రైల్వే గురువారం నిర్ణయించింది. దీపావళి, ఛట్‌పూజ పండుగల నేపథ్యంలో భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని అధికారులను ఆదేశించింది. వీటిలో న్యూఢిల్లీ, ఢిల్లీ, హజ్రాత్ నిజాముద్దీన్, ఢిల్లీ సరై రోహిల్లా, ఆనంద్ విహర్ టెర్మినల్ స్టేషన్లు ఉన్నాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే వృద్ధులు, వికలాంగులు, ఆనారోగ్యం బారిన పడినవారు, ఒంటరిగా, పిల్లలతో కలిసి వెళుతున్న మహిళలను రైల్లోకి ఎక్కించేందుకు సహాయంగా వచ్చే వారి సంఖ్య వల్ల ప్లాట్‌ఫారమ్ టికెట్లకు డిమాండ్ పెరిగిందన్నారు. అయితే స్టేషన్లలోని భారీ రద్దీని తప్పించడంతో పాటు ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆ టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించామని వివరించారు. -
ఢిల్లీ-భువనేశ్వర్ రైళ్లు రద్దు
ఫైలిన్ తుపాన్ కారణంగా ఢిల్లీ-భువనేశ్వర్ మధ్య రైళ్లను రద్దు చేశారు. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్లే రైళ్లను అలాగే భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వచ్చే రైళ్లను నిలిపివేసినట్టు ఉత్తరాది రైల్వే శనివారం ప్రకటించింది. ఆదివారం బయల్దేరాల్సిన న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (నెంబర్ 22812)ను, ఈ నెల 14వ తేదీ ఉన్న న్యూఢిల్లీ-పూరి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 12802), న్యూఢిల్లీ-పూరినందన్ కణ్నన్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 12816), న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 22806)ను రద్దు చేశారు. 15న బయల్దేరాల్సిన హరిద్వార్-పూరి ఎక్స్‌ప్రెస్‌ను ఆపివేశారు.