న్యూఢిల్లీ : నగర ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఆర్‌ఎస్)లో రైల్వే సర్వీసులు రద్దు కానున్నాయి. రెండున్నర గంటల పాటు ఢిల్లీ పీఆర్‌ఎస్ రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది. దీంతో 139 ఎంక్వైరీ సర్వీసులు, టిక్కెట్ల బుకింగ్ ఏమీ అందుబాటులో ఉండవని తెలిపింది. మే 18న రాత్రి 11.45 గంటల నుంచి మే 19 అర్థరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల వరకు ఢిల్లీ కంప్యూటరైజ్డ్ పీఆర్‌ఎస్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నామని, ఈ క్రమంలో రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెలలో ఇలా పీఆర్‌ఎస్ సర్వీసులను రద్దు చేయడం ఇది రెండో సారి.
అంతకముందు ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, ఈశాన్య రైల్వే, వాయువ్య రైల్వేలు కూడా మే 5న ఇదే మాదిరి కొన్ని గంటల పాటు తమ సర్వీసులను రద్దు చేశాయి. మే 5న రాత్రి 10.30 గంటల నుంచి మే 6న అర్థరాత్రి 12.15 గంటల వరకు, మళ్లీ అదే రోజు ఉదయం 5.15 నుంచి 6.25 వరకు సర్వీసులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సాధారణ విద్యుత్ నిర్వహణ కార్యకలాపాల కారణంగా తమ సర్వీసులను రద్దు చేసినట్టు పేర్కొన్నాయి. తాజాగా ఢిల్లీ కంప్యూటరైజ్డ్ పీఆర్‌ఎస్‌ను అప్‌గ్రేడ్ చేయడం కోసం రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment