PRS services
-
కొత్త అసెంబ్లీల్లో పెరిగిన మహిళా ప్రాతినిథ్యం
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఎంఎల్ఏల ప్రాతినిథ్యం పెరిగింది. గత అసెంబ్లీలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మహిళా ఎంఎల్ఏల సంఖ్య పెరిగిందని పీఆర్ఎస్ రిసెర్చ్ సంస్థ తెలిపింది. 2017లో యూపీ అసెంబ్లీలో 42 మంది మహిళా ఎంఎల్ఏలు ఉండగా ప్రస్తుతం వీరి సంఖ్య 47కు పెరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో మహిళా ఎంఎల్ఏల సంఖ్య 5 నుంచి 8కి, మణిపూర్‌లో 4 నుంచి 8కి పెరిగింది. ఎంఎల్ఏలుగా ఎన్నికైన వారిలో 55 సంవత్సరాలు నిండినవారి సంఖ్య పెరిగింది. మరోవైపు యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో వయసులో పెద్దవారైన ఎంఎల్ఏల సంఖ్య పెరిగింది. 55 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఎంఎల్ఏల సరాసరి 2017లో 64.7 శాతం ఉండగా, 2022కు 59.5 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. కనీసం డిగ్రీ అర్హత ఉన్న ఎంఎల్ఏల వాటా యూపీలో 72.7 నుంచి 75.9 శాతానికి పెరగ్గా, ఉత్తరాఖండ్‌లో 77 నుంచి 68 శాతానికి, మణిపూర్‌లో 76 నుంచి 68 శాతానికి తగ్గిందని సంస్థ వెల్లడించింది. -
2.5 గంటల పాటు రైలు టిక్కెట్ల బుకింగ్ రద్దు
న్యూఢిల్లీ : నగర ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఆర్ఎస్)లో రైల్వే సర్వీసులు రద్దు కానున్నాయి. రెండున్నర గంటల పాటు ఢిల్లీ పీఆర్ఎస్ రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది. దీంతో 139 ఎంక్వైరీ సర్వీసులు, టిక్కెట్ల బుకింగ్ ఏమీ అందుబాటులో ఉండవని తెలిపింది. మే 18న రాత్రి 11.45 గంటల నుంచి మే 19 అర్థరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల వరకు ఢిల్లీ కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ను అప్‌గ్రేడ్ చేయనున్నామని, ఈ క్రమంలో రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెలలో ఇలా పీఆర్ఎస్ సర్వీసులను రద్దు చేయడం ఇది రెండో సారి. అంతకముందు ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, ఈశాన్య రైల్వే, వాయువ్య రైల్వేలు కూడా మే 5న ఇదే మాదిరి కొన్ని గంటల పాటు తమ సర్వీసులను రద్దు చేశాయి. మే 5న రాత్రి 10.30 గంటల నుంచి మే 6న అర్థరాత్రి 12.15 గంటల వరకు, మళ్లీ అదే రోజు ఉదయం 5.15 నుంచి 6.25 వరకు సర్వీసులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సాధారణ విద్యుత్ నిర్వహణ కార్యకలాపాల కారణంగా తమ సర్వీసులను రద్దు చేసినట్టు పేర్కొన్నాయి. తాజాగా ఢిల్లీ కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ను అప్‌గ్రేడ్ చేయడం కోసం రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది. -
20న రైల్వే రిజర్వేషన్‌కు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) ఆధునీకరణ పనుల దృష్ట్యా ఈ నెల 20వ తేదీన పీఆర్ఎస్ సేవలను రెండున్నర గంటలపాటు నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20న ఉదయం 11.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 వరకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ నిలిచిపోనుందని చెప్పారు. దీని వల్ల దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని రిజర్వేషన్ కేంద్రాల వద్ద టికెట్ బుకింగ్ సేవలు ఆగిపోతాయి. అలాగే ద.మ.రైల్వే, సదరన్ రైల్వే, నైరుతి రైల్వే జోన్ల పరిధిలో ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ సేవలు, పీఎన్ఆర్ సంబంధమైన సేవలు కూడా నిలిచిపోతాయి. కరెంట్ బుకింగ్ కూడా ఉండదు. పీఆర్ఎస్ ద్వారా జరిగే టికెట్ రద్దు, రిఫండ్ సేవలు కూడా ఉండవు. రిఫండ్ కోసం కౌంటర్ల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేస్తారు.