Railway services
-
విడతలుగా విమాన సర్వీసులు?
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత దశలవారీగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత 21 రోజుల కరోనా లాక్డౌన్ ముగియనుంది. ఆ తర్వాత దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను దశలవారీగా ప్రారంభించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘దేశంలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 14వ తేదీ తర్వాత దశల వారీగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నాం. ఏప్రిల్ 14 తర్వాత ప్రయాణాలకు విమానయాన సంస్థలు టికెట్లు చేసుకోవచ్చు’అని ఓ అధికారి తెలిపారు. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తే మాత్రం ఆ మేరకు టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఎయిరిండియా మినహా ఇప్పటికే ప్రముఖ విమానయాన సంస్థలు 14వ తేదీ నుంచి జరిగే దేశీయ ప్రయాణాలకు టికెట్ల బుకింగ్స్ మొదలుపెట్టగా ఎయిరిండియా మాత్రం ఈ నెల 30 తర్వాత ప్రయాణాలకు మాత్రమే బుకింగ్స్ ప్రారంభించింది. దెబ్బతిన్న విమానయాన రంగం లాక్డౌన్ కారణంగా ఆదాయం పడిపోవడంతో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఎయిర్ డెక్కన్ సంస్థ అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి ఉద్యోగులంతా ఇళ్లలోనే ఉండాలని కోరింది. 14 తర్వాత రైళ్లు ! దేశంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రయాణికులు కనీస ముందు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటూ విడతల వారీగా సర్వీసులను ప్రారంభించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ప్రయాణికులు వ్యక్తిగత దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఆరోగ్య సేత్ యాప్ వాడుతూ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వారిని అనుమతించాలని భావిస్తోంది. తద్వారా కోవిడ్ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఆశిస్తోంది. -
రద్దైన 2,400 రైల్వే సర్వీసులు
-
ఒక్క కాల్‌తో సమస్యలకు పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: అపరిశుభ్రమైన బోగీలు. మంచినీళ్లు రాని కుళాయిలు.. తిరగని ఫ్యాన్లు, వెలగని లైట్లు.. పనిచేయని ఏసీ.. ట్రైన్లో ప్రయాణికులకు సాధారణంగా ఎదురయ్యే సమస్యలివి. గంటల తరబడి ప్రయాణం చేయవలసిన రైల్లో ఏ ఒక్క సదుపాయం లేకపోయినా ఇబ్బందిగానే ఉంటుంది. శుచి, రుచి లేని ఆహారం, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చితి వంటి ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు, సహాయ కేంద్రాలు ఉన్నప్పటికీ సకాలంలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో రైల్వే సేవలపైన ప్రజల్లో నమ్మకం సడలుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు దక్షిణమధ్య రైల్వే వారం క్రితం ప్రవేశపెట్టిన ‘ట్రైన్ కెప్టెన్’వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారంలో ట్రైన్ కెప్టెన్లు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫిర్యాదులపై అప్రమత్తమైన రైల్వే ఇటీవల కేటరింగ్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రైల్వే అప్రమత్తమైంది. శుచి, రుచి లేని ఆహారపదార్థాలను అందజేయడం పట్ల ప్రయాణికుల నుంచి తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని ప్రధాన రైళ్లలో ఆన్‌బోర్డు హౌస్ కీపింగ్ సిబ్బంది, ప్యాంట్రీ కారు, తదితర అన్ని సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ సత్వర పరిష్కారం లభించకపోవడం వల్ల రైల్వేలు పెద్ద ఎత్తున అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వచ్చింది. కాగ్ నివేదిక సైతం రైల్వే సేవల్లోని డొల్లతనాన్ని కడిగి పారేసింది. దీంతో రైల్వే అధికారుల్లో చలనం వచ్చింది. ఏడు రైళ్లలో ‘కెప్టెన్’సేవలు ప్రయాణికుల సదుపాయాల్లో పారదర్శకతను పెంచేందుకు ‘ట్రైన్ కెప్టెన్’సేవలకు శ్రీకారం చుట్టారు. రైళ్లలో విధులు నిర్వహించే టికెట్ ఎగ్జామినర్లు, కమర్షియల్ సిబ్బంది, కేటరింగ్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది తదితర అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ట్రైన్ కెప్టెన్ సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. ప్రయాణికుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తాడు. వారు కోరుకున్న సేవలకు అనుగుణంగా సిబ్బందిని పంపిస్తాడు. దీంతో జాప్యానికి తావు లేకుండా ప్రయాణికుల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తోందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ప్రతి ట్రైన్లో సుమారు 2,000 మంది ప్రయాణికులకు ట్రైన్ కెప్టెన్ అందుబాటులో ఉంటారు. దక్షిణమధ్య రైల్వే ప్రస్తుతం ఏడు రైళ్లలో కెప్టెన్ సేవలను అమలు చేస్తోంది. దశలవారీగా అన్ని రైళ్లలో కెప్టెన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు ట్రైన్ ఎక్కడానికి ముందు బోగీ డోర్ వద్ద అతికించిన చార్ట్ లిస్టులో ట్రైన్ కెప్టెన్ పేరు, ఫోన్ నంబర్ ఉంటాయి. ప్రస్తుతానికి కెప్టెన్ ఉండే రైళ్లు ఇవీ.. - హైదరాబాద్ –న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (12723) - చిత్తూరు–కాచిగూడ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12798) - నాందేడ్–అమృత్సర్ సచ్కండ్ ఎక్స్‌ప్రెస్ (12715) - విజయవాడ–విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718) - గుంటూరు–వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్ (12747) - తిరుపతి–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12731) - తిరుపతి–నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (12793) కెప్టెన్ పరిష్కరించగల సమస్యలివీ.. - టికెట్ కన్ఫర్మేషన్పై సందేహాల నివృత్తి - బోగీల్లో నీళ్లు లేకపోవడం. - బోగీలు అపరిశుభ్రంగా ఉండటం - రైళ్లలో భద్రత లేకపోవడం. సెల్ఫోన్లు, బ్యాగులు చోరీకి గురికావడం - ఆహారపదార్థాల్లో నాణ్యత, రుచి, శుచిపై.. - ట్రైన్ ఎక్కినప్పటి నుంచి దిగేవరకు అన్ని ఫిర్యాదులకు పరిష్కారంగా నిలుస్తారు. స్పందన బాగుంది: ప్రమీల బెర్తులు తెలుసుకోవడంలో ఇబ్బందైంది. ఫోన్ చేయగానే సిబ్బంది వెంటనే వచ్చారు. సెక్యూరిటీ గురించి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాం. అధికారుల స్పందన చాలా బాగుంది. ఎదురు చూడాల్సి వచ్చేది: రాజేశ్ గతంలో ట్రైన్ ఎక్కి నప్పుడు ఫిర్యాదు చేస్తే దిగి వెళ్లిపోయే వరకు కూడా వచ్చే వాళ్లు కాదు. పైగా ఏ సమస్యకు ఎవరిని సంప్రదిం చా లో తెలిసేది కాదు. ఇప్పుడు అన్నింటికీ ఒకే నంబర్‌తో పరిష్కారం లభిస్తుంది. అడిగి తెలుసుకుంటున్నారు: సరోజిని సాధారణంగా ఫిర్యాదు చేసినప్పుడే వస్తారు. కానీ ట్రైన్ ఎక్కగానే ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని వాళ్లే అన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. చాలా సంతోషం. -
2.5 గంటల పాటు రైలు టిక్కెట్ల బుకింగ్ రద్దు
న్యూఢిల్లీ : నగర ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఆర్ఎస్)లో రైల్వే సర్వీసులు రద్దు కానున్నాయి. రెండున్నర గంటల పాటు ఢిల్లీ పీఆర్ఎస్ రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది. దీంతో 139 ఎంక్వైరీ సర్వీసులు, టిక్కెట్ల బుకింగ్ ఏమీ అందుబాటులో ఉండవని తెలిపింది. మే 18న రాత్రి 11.45 గంటల నుంచి మే 19 అర్థరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల వరకు ఢిల్లీ కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ను అప్‌గ్రేడ్ చేయనున్నామని, ఈ క్రమంలో రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెలలో ఇలా పీఆర్ఎస్ సర్వీసులను రద్దు చేయడం ఇది రెండో సారి. అంతకముందు ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, ఈశాన్య రైల్వే, వాయువ్య రైల్వేలు కూడా మే 5న ఇదే మాదిరి కొన్ని గంటల పాటు తమ సర్వీసులను రద్దు చేశాయి. మే 5న రాత్రి 10.30 గంటల నుంచి మే 6న అర్థరాత్రి 12.15 గంటల వరకు, మళ్లీ అదే రోజు ఉదయం 5.15 నుంచి 6.25 వరకు సర్వీసులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సాధారణ విద్యుత్ నిర్వహణ కార్యకలాపాల కారణంగా తమ సర్వీసులను రద్దు చేసినట్టు పేర్కొన్నాయి. తాజాగా ఢిల్లీ కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ను అప్‌గ్రేడ్ చేయడం కోసం రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఎం ఆకస్మిక తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన వినోద్‌కుమార్ యాదవ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ అంతా తిరుగుతూ వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. క్లీనింగ్ యూనిట్, ఫుడ్ ప్లాజా తదితర యూనిట్లను తనిఖీ చేశారు. ప్రయాణికుల ఏసీ, జనరల్ వెయిటింగ్ హాళ్లు, బుకింగ్ కౌంటర్లను పరిశీలించారు. రైల్వే సేవలు అందుతున్న తీరు గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్లో బోయగూడ వైపున్న ప్రవేశంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అక్కడ అభివృద్ధికి అవకాశముందా అని ఆరా తీశారు. ఆయన వెంట డివిజినల్ రైల్వే మేనేజర్ ఆశీష్ అగర్వాల్ తదితరులు ఉన్నారు. -
వర్షం గుప్పిట ముంబై
♦ స్తంభించిన రైల్వే సేవలు.. ♦ బిహార్‌లో 25 మంది మృతి ముంబై: ఎడతెరపిలేని వానలకు ముంబై నగరం, పరిసర ప్రాంతాలు అతలాకుతం అయ్యాయి. శుక్రవారం పొద్దున్నుంచీ కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. రవాణాలో ఇబ్బందులేర్పడ్డాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కొన్నిచోట్ల్ల పట్టాలపైకి నీరు చేరడంతో శివార్లలో రైల్వే సేవలకు అంతరాయం కలిగింది. విమాన సేవలను కూడా తాత్కాలికంగా నిలివేశారు. బస్సులు తిరిగే మార్గాల్లో పలు మార్పులు చేశారు. సాయంత్రం వరకు సుమారు 100 మీ.మీల వర్షపాతం నమోదైనట్లు అంచనా. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చనివాతావరణ శాఖ అంచనా వేసింది. నగరవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. థానేను కూడా భారీ వ ర్షాలు ముంచె త్తాయి. సావిత్రి నదిపై వంతెన కూలిన దుర్ఘటనలో శుక్రవారం మరో 8 మృతదేహాలను గాలింపు బృందాలు క నుగొన్నాయి. దీంతో ఇప్పటి వరకు దొరికిన మృతదేహాల సంఖ్య 22కు పెరిగింది. మరోపక్క.. బిహార్‌లో వరద మృతుల సంఖ్య 89కి చేరింది. వర్ష సంబంధ ఘటనల్లో శుక్రవారం ఒక్క రోజే 25 మంది చనిపోయారు. -
రైల్వే సేవలపై ఫిర్యాదుకు మొబైల్ యాప్
సాక్షి, హైదరాబాద్: రైల్వే సేవలపై ప్రయాణి కులు తమ ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తెలిపేందుకు మొబైల్ అప్లికేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (కమ్స్) మొబైల్ యాప్‌ను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వెబ్ ఆధారిత ఫిర్యాదులను స్వీకరించేందుకు ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఓఎంఎస్.ఇండియన్‌రైల్వేస్.జీఓవి.ఇన్’’కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ రెండు కాకుండా ఎస్సెమ్మెస్ ఆధారిత సేవల కోసం ప్రయాణికులు 97176 30982 నంబర్‌కు ఫిర్యాదులు ఎస్సెమ్మెస్ చేయవచ్చు. ప్రయాణికుల నుంచి సమాచారం అందిన వెంటనే ఒక యునిక్ ఐడీ నంబర్ కేటాయిస్తారు. ఫిర్యాదులు పరిష్కారం అయ్యేవరకు సమస్య పురోగతిపై ప్రయాణికులకు సమాచారం అందజేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.