సాక్షి, హైదరాబాద్: రైల్వే సేవలపై ప్రయాణి కులు తమ ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తెలిపేందుకు మొబైల్ అప్లికేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (కమ్స్) మొబైల్ యాప్‌ను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే వెబ్ ఆధారిత ఫిర్యాదులను స్వీకరించేందుకు ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఓఎంఎస్.ఇండియన్‌రైల్వేస్.జీఓవి.ఇన్’’కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ రెండు కాకుండా ఎస్సెమ్మెస్ ఆధారిత సేవల కోసం ప్రయాణికులు 97176 30982 నంబర్‌కు ఫిర్యాదులు ఎస్సెమ్మెస్ చేయవచ్చు.
ప్రయాణికుల నుంచి సమాచారం అందిన వెంటనే ఒక యునిక్ ఐడీ నంబర్ కేటాయిస్తారు. ఫిర్యాదులు పరిష్కారం అయ్యేవరకు సమస్య పురోగతిపై ప్రయాణికులకు సమాచారం అందజేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.