రోజూ సరాసరి కోటిమంది హాజరయ్యే అవకాశం ఉన్న మహా కుంభమేళా ప్రాంతంలో సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారం ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో సైతం మొత్తం 11 భాషల్లో వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా కుంభమేళా సమాచారం భక్తులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. వాట్సాప్‌లో 88878–47135 ఫోన్ నంబర్‌కు హెచ్‌ఐ (హాయ్) అని మెసేజ్ చేసి 11 భాషల్లో తమకు నచ్చిన బాషను ఎంపిక చేసుకుని ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో తమకు కావాల్సిన కుంభమేళా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
భక్తుని ఫోన్ నంబర్ ‘కుంభ్ సహాయక్ యాప్’ (kumbh sahayak app) ద్వారా భక్తులు తాము వెళ్లదలుచుకున్న పుష్కర ఘాట్‌లతో పాటు ఆ ప్రాంతంలో ఉండే ఆలయాలకు ఎలా వెళ్లాలో సూచించే ఏర్పాట్లను సైతం యాప్‌లో పొందుపరిచారు. యాప్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ సమాచారం సైతం సుదూర ప్రాంతాల్లో ఇంటి వద్దనే ఉండే సామాన్య భక్తులకు సైతం తెలిసేలా ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం తమ ఫోన్ నంబర్ యాప్‌లో నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే యాప్ ద్వారా సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment