సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జీఎం ఆకస్మిక తనిఖీలు | GM surprise inspection in Secunderabad railway station | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జీఎం ఆకస్మిక తనిఖీలు

Published Mon, Jan 16 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జీఎం ఆకస్మిక తనిఖీలు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జీఎం ఆకస్మిక తనిఖీలు

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన వినోద్‌కుమార్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌ అంతా తిరుగుతూ వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. క్లీనింగ్‌ యూనిట్, ఫుడ్‌ ప్లాజా తదితర యూనిట్లను తనిఖీ చేశారు.

ప్రయాణికుల ఏసీ, జనరల్‌ వెయిటింగ్‌ హాళ్లు, బుకింగ్‌ కౌంటర్లను పరిశీలించారు. రైల్వే సేవలు అందుతున్న తీరు గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్‌లో బోయగూడ వైపున్న ప్రవేశంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అక్కడ అభివృద్ధికి అవకాశముందా అని ఆరా తీశారు. ఆయన వెంట డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ ఆశీష్‌ అగర్వాల్‌ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement