Vijaysen Reddy
-
అంకాపూర్ దేశానికే ఆదర్శం
పెర్కిట్(ఆర్మూర్): వ్యవసాయంలో ప్రసిద్ధిగాంచిన అంకాపూర్ దేశానికే ఆదర్శమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. అంకాపూర్‌లో రైతులు సాగు చేస్తున్న పసుపు, శ్రీచందనం, ఆపిల్ మొక్కలను పరిశీలించారు. అలాగే లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వ్యవసాయంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ అంకాపూర్ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని న్యాయమూర్తి ప్రశంసించారు. అంకాపూర్ చికెన్ హైదరాబాద్‌లో సైతం ఫేమస్ అయిందన్నారు. ఈ గ్రామాన్ని సందర్శించాలన్న తన 20 ఏళ్ల కల ఈ రోజు తీరిందని చెప్పారు. తెలంగాణ మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత, కామారెడ్డి జిల్లా అడిషనల్ న్యాయమూర్తి రమేశ్‌బాబు, డీఏవో గోవింద్, ఆర్డీవో శ్రీనివాసులు, లాలన వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు గడ్డం రాజారెడ్డి, సర్పంచ్ పూజిత, ఎంపీటీసీ ఎంసీ గంగారెడ్డి పాల్గొన్నారు. -
‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత’
సాక్షి, హైదరాబాద్: ‘పర్యావరణం ప్రతి ఒక్కరి హక్కు. అయితే, దాని పరిరక్షణ బాధ్యత కూడా అందరిది’అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి పేర్కొన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, ధర్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతిని దేవుడిగా భావించాలని సూచించారు. నదులు, నదీ జలాలను కాలుష్యం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ ఖాదర్ వలి మాట్లాడుతూ.. జీవనశైలిలో వస్తున్న మార్పులను విశదీకరించారు. తృణధాన్యాల వినియోగంతో జీవనశైలి వ్యాధులను అరికట్టవచ్చని, వాతావరణ మార్పుల సమస్యలను కూడా అధిగమించవచ్చని పేర్కొన్నారు. పారిశ్రామిక ఆహార సంస్కృతి పోవాలని, సాత్విక జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బొల్లంపల్లి విజయ్‌సేన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయాధికారులు, జస్టిస్ విజయసేన్‌రెడ్డి కుటుంబసభ్యులు హాజరయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో వీరంతా మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కోర్టు హాల్లోకి ప్రవేశించారు. తొలుత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, జస్టిస్ విజయసేన్‌రెడ్డి నియామక ఉత్తర్వులను చదివి వినిపించారు. జస్టిస్ విజయసేన్ రెడ్డి 12 ఏళ్లపాటు న్యాయమూర్తిగా కొనసాగే సర్వీస్ ఉంది. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి ప్రమాణస్వీకారాన్ని యూట్యూబ్ ఆన్లైన్ ద్వారా వీక్షించే సౌకర్యం కల్పించడంతో వెయ్యి మంది ప్రత్యక్షంగా చూశారు. ప్రధాన న్యాయమూర్తితో కలిపి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది. మరో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చదవండి: కామన్ పేపర్.. ఎక్కువ చాయిస్‌లు -
హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బొల్లంపల్లి విజయ్‌సేన్‌రెడ్డి నియమితుల య్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్.. విజయసేన్ రెడ్డితో న్యాయమూర్తిగా ప్రమాణం చేయించ నున్నారు. విజయ్‌సేన్‌రెడ్డిని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ గత నెల 20న సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. విజయ్‌సేన్‌రెడ్డి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది. ఇదీ ఆయన నేపథ్యం.. విజయ్‌సేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరా బాద్‌లో జన్మించారు. తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి, తల్లి రత్న. జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయ మూర్తిగా, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా, ఉమ్మడి ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా, తెలంగాణ, ఏపీ లోకా యుక్తగా బాధ్యతలు నిర్వర్తించారు. విజయ్‌సేన్‌రెడ్డి పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. అన్ని స్థాయి కోర్టుల్లోనూ కేసులు వాదించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాజ్యాంగపరమైన కేసులతోపాటు సివిల్, క్రిమినల్ కేసుల్ని వాదించడంలో పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన వద్ద 20 మంది జూనియర్లు ఉన్నారు. క్రీడలపట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం -
హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సోమవారం సిఫారసు చేసింది. న్యాయవాదుల కోటా నుంచి ఆయన పేరును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేసి 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు. ఉమ్మడి ఏపీ మానవహక్కుల కమిషన్ తొలి చైర్మన్‌గా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాలకు లోకాయుక్తగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పనిచేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డికి విజయ్‌సేన్‌రెడ్డి మేనల్లుడు. న్యాయవాదిగా విజయ్‌సేన్‌రెడ్డికి మంచి పేరుంది. అన్ని స్థాయి కోర్టుల్లోనూ కేసుల్ని వాదించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో రాజ్యాంగపరమైన కేసులతో పాటు సివిల్, క్రిమినల్ కేసులను వాదించడంలో మంచిపేరు సంపాదించారు. ఆయన వద్ద ఎంతోమంది న్యాయవాదులు జూనియర్లుగా చేశారు. ప్రస్తుతం ఆయన వద్ద 20 మంది జూనియర్లు ఉన్నారు. క్రీడల పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. టేబుల్‌టెన్నిస్, టెన్నిస్, స్విమ్మింగ్ పోటీల్లో పలు బహుమతులు సాధించారు. న్యాయ శాస్త్రాన్నే కాకుండా ఇంగ్లిష్, తెలుగు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. పుస్తక పఠనం ఆయన అభిరుచి. కాగా, విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి కేంద్రం సమ్మతి తెలిపి రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత న్యాయమూర్తిగా నియమితులవుతారు. ప్రస్తుతం హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల పోస్టులకు గాను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 12 మంది ఉన్నారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకం అయితే ఇంకా 11 పోస్టులు ఖాళీగా ఉంటాయి. 2019 మే 1న జస్టిస్ సుభాషణ్‌రెడ్డి కన్నుమూశారు. విజయ్నేన్రెడ్డికి తాత 104 ఏళ్ల బి.ఆగారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. న్యాయవాదులు.. బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారిల పేర్లకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. వీరి ముగ్గురి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు మొత్తం ఆరుగురి పేర్లను హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ జాబితాలో కృష్ణమోహన్, సురేష్ రెడ్డి, లలితకుమారి, వి.మహేశ్వర్‌రెడ్డి, జీఎల్ నర్సింహారావు, కె.మన్మథరావులు ఉన్నారు. తాజాగా ఈ జాబితాపై చర్చించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు.. జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన కొలీజియం ముగ్గురి పేర్లను కేంద్రానికి పంపింది. ఈ ముగ్గురిలో లలితకుమారి పిన్న వయస్కురాలు. ప్రస్తుతం ఆమె వయసు 48 ఏళ్ల 11 నెలలు. వీరి పేర్లకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే, రాష్ట్రపతి నియామక ఉత్తర్వులిస్తారు. -
3 ఏళ్లలో 15 వేల 2బీహెచ్‌కే గృహాలు!
• ‘సాక్షి రియల్టీ’తో ప్రజయ్ ఇంజనీర్స్ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి • షామీర్‌పేటలో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ-2 ప్రారంభం • 140 గజాల్లో రూ.15.30 లక్షలకే సొంతిల్లు సాక్షి, హైదరాబాద్ : నిర్మాణ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం.. వంద కోట్ల చ.అ.ల్లో వంద ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన ఘనత.. నిర్మాణంలో నాణ్యత, అందుబాటు ధరల్లో సొంతింటి కలను సాకారం చేసే ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ తొలిసారిగా రెండు పడక గదుల గృహాల వైపు దృష్టిసారించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), రాష్ట్ర ప్రభుత్వ 2 బీహెచ్‌కే పథకాలను ఆదర్శంగా తీసుకొని పలు 2 బీహెచ్‌కే ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. జూబ్లీహిల్స్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్-2 బ్రోచర్‌ను విడుదల చేసిన సందర్భంగా ప్రజయ్ ఇంజినీర్స్ సిండికేట్ లిమిటెడ్ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలివిగో.. ⇔ షామీర్పేటలోని బయోటెక్ పార్క్ (జీనోమ్ వ్యాలీ) కంటే ముందు 27.18 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్-2 ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 140 గజాల్లో 750 చ.అ. బిల్టప్ ఏరియా, 645 చ.అ. కార్పెట్ ఏరియాలో మొత్తం 483 రెండు పడక గదుల గృహాలొస్తారుు. 2017 ఏప్రిల్‌లో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభిస్తాం. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు అందిస్తాం. ధర విషయానికొస్తే.. తొలి 50 మంది కస్టమర్లకు రూ.15.30 లక్షలకే గృహాలను అందించనున్నాం. ఆ తర్వాత రూ.20 లక్షలకు పెంచుతాం. రూ.5.44 లక్షలు ఆదా కూడా.. 2 బీహెచ్‌కే గృహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలు, పన్ను రారుుతీలు కూడా కస్టమర్లకు మరింత ప్రోత్సాహకంగా నిలుస్తారుు. ఇంకా చెప్పాలంటే రూ.15.30 లక్షల ధరలోనూ రూ.5.44 లక్షలు ఆదా అవుతారుు కూడా. అదెలాగంటే.. 4.5 శాతం సర్వీస్ ట్యాక్స్ మినహారుుంపు ఉంటుంది. అంటే రూ.70 వేలు ఆదా. పీఎంఈవై పథకం కింద రూ.6 లక్షల వరకు వడ్డీ 9.3 శాతంలో 6.5 శాతం సబ్సిడీ ఉంటుంది. అంటే 2.58 శాతం మాత్రమే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మరో రూ.3.70 లక్షలు ఆదా అవుతుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం తొలి ఇళ్లు కొనుగోలుదారులకు రూ.50 వేలు మినహారుుంపు ఉంటుంది. 2 బీహెచ్‌కే నిర్మాణానికి గాను నిర్మాణదారులకు 80 ఐబీఏ ప్రకారం 100 శాతం పన్ను రారుుతీలుంటారుు. వీటిని కూడా కస్టమర్లకే బదిలీ చేస్తాం. అంటే ఇక్కడ సుమారు రూ.55-60 వేలు ఆదా అవుతారుు. ఇలా మొత్తంగా కలిపి సుమారు రూ.5.44 లక్షలు ఆదా అవుతాయన్నమాట. ⇔ రెండేళ్లలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 15 వేల 2 బీహెచ్‌కే గృహాలను నిర్మించాలని లక్ష్యం గా పెట్టుకున్నాం. మహేశ్వరంలో వర్జిన్ కౌంటీ ప్రాజెక్ట్‌లో 1,500, కుంట్లూరులో గుల్మోర్ ప్రాజెక్ట్‌లో 150 గృహాలు, ఘట్కేసర్లో విన్సర్పాక్ ప్రాజెక్ట్‌లో 1,200 గృహాలు, మూసాపేటలోనూ కొన్ని గృహాలను నిర్మించనున్నాం. ⇔ స్థానికంగా ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులు, సామాన్యులకు కూడా సొంతింటిని అందించాలనే లక్ష్యంతో పాతికేళ్ల క్రితం విజయవంతంగా నడిపించిన ప్రజయ్ చిట్ ఫండ్ కంపెనీని తిరిగి అదే ప్రాంతంలో జనవరిలో పునః ప్రారంభించనున్నాం. ఇందులో 60, 100 నెలలుండే దీర్ఘకాలిక చిట్స్‌తో పాటూ ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్డీ) పథకాలను కూడా తీసుకొస్తున్నాం. ఈ చిట్స్‌ను 2 బీహెచ్‌కే స్కీమ్‌కు లింక్ చేస్తాం. దీంతో నెలవారీ వారుుదా పద్ధతుల్లో (ఈఎంఐ) గృహాలను పొందే వీలుంటుంది. ⇔ మా అన్న కూతురు, నా ఇద్దరు పిల్లలు కూడా ప్రజయ్ సంస్థలో భాగస్వాములయ్యారు. బిజినెస్ మేనేజ్మెంట్లో ఐఎస్ఈ గ్రాడ్యుయేట్ నయనికా రెడ్డి ఆపరేషన్స విభాగంలో, ఆర్కిటెక్ట్ అరుున సరోజిని రెడ్డి డిజైన్ విభాగంలో, పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ నుంచి సివిల్ ఇంజనీర్ అరుున రోహిత్ రెడ్డి ఎక్స్క్లూషన్ బృందంలో విధులు నిర్వర్తిస్తారు. ⇔ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రెండు పడక గదుల కంటే ఈ గృహాలు నిర్మాణంలో, నాణ్యతలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నాం. హాలు, వంట గది, బెడ్ రూముల్లో 252 వర్టిఫైడ్ టైల్స్, బాత్రూముల్లో యాంటి స్కిడ్ సిరామిక్ టైల్స్, గ్రానైట్ కిచెన్ ఫ్లాట్‌ఫాం, స్టీల్ సింక్, యూపీవీసీ కిటికీల వంటివి ఉంటారుు. ఎలక్ట్రిక్ వైర్లు, స్విచ్చులు, ఫ్రేం వర్క్స్ వంటివి అన్ని ఉత్పత్తులను బ్రాండెడ్లనే వినియోగిస్తాం. ⇔ ప్రతి ఫ్లాట్‌కు కామన్‌గా ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ పైప్లైన్స ద్వారా ప్రతి ఇంటికి ప్రత్యేక నీటి సరఫరా ఏర్పాట్లుంటారుు. అండర్ గ్రౌండ్ పైప్లైన్స ద్వారా మురుగు నీటి వ్యవస్థను, ఎస్టీపీకి అనుసంధానం చేస్తాం. ⇔ వసతుల విషయానికొస్తే.. పార్క్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, యోగా సెంటర్, జిమ్, ఇండోర్, అవుట్ డోర్ ప్లే ఏరియా, టెన్నిస్, బాస్కెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, క్రికెట్, ఫుట్ బాల్ మైదానాలు, ప్రాజెక్ట్‌లోనే షాపింగ్ కాంప్లెక్స్, స్కూలు, ఆసుపత్రి కూడా ఉంటారుు. ⇔ ఇప్పటికే అక్కడ సిమెంట్ రోడ్లు, ఎస్టీపీ, ల్యాండ్ స్కేపింగ్, పార్క్, టెన్నిస్ కోర్ట్ వసతుల ఏర్పాట్లు పూర్తయ్యారుు. 45 వేల చ.అ. క్లబ్ హౌస్ నిర్మాణ దశలో ఉంది. -
ప్రజయ్ నుంచి మెగాక్లబ్
హైదరాబాద్: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనూ కొనుగోలుదారుల ఆనందమే తమ ధ్యేయమంటున్నారు ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి. హైటెక్‌సిటీకి చేరువలో నిర్మిస్తున్న మెగాపొలిస్ ప్రాజెక్ట్‌లో ఇటీవలే ‘ప్రజయ్ మెగాక్లబ్’కు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. {Vౌండ్+4 అంతస్తుల్లో లక్ష చ.అ.ల్లో అత్యాధునిక క్లబ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాం. ఏడాదిలోగా వినియోగంలోకి తీసుకొస్తాం. ఇందులో మినీ సినిమా హాలు, బౌలింగ్ అల్లీ, స్క్వాష్ కోర్ట్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్, అతిథి గదులు, సూపర్ మార్కెట్, బ్యాంక్వెట్ హాల్, రిటైల్ అవుట్‌లెట్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన జిమ్, హెల్త్ స్పా, స్విమ్మింగ్ పూల్ వంటివెన్నో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. మెగాపొలిస్లో మొత్తం 1,113 ఫ్లాట్లు. ఇందులో 9 టవర్లు ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసి కొనుగోలుదారుల చేతికి తాళాలందిస్తాం. 12,17, 18 టవర్లను ఆగస్టులో, 13, 16, 19 టవర్లను నవంబర్‌లో, 15, 20 టవర్లను డిసెంబర్లో, 14వ టవర్‌ను వచ్చే ఏడాది జనవరిలోగా పూర్తి చేస్తాం. అధిక శాతం మంది కస్టమర్లు సకాలంలో డబ్బులు చెల్లింపులు చేయకపోవడంతో నిర్మాణ పనులు మందగించాయి. దీంతో సంస్థ సీఎండీనే స్వయంగా ముందుకొచ్చి 11 రోజుల పాటు కొనుగోలుదారులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. కస్టమర్లలో నెలకొన్న సందేహాల్ని నివృత్తి చేశారు. సకాలంలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సంస్థ ఎలా ముందడుగు వేసిందో వివరించారు. దీంతో కొనుగోలుదారులు బకాయిలను చెల్లిస్తామని ఒప్పుకోవటం మంచి పరిణామమని ఆయన చెప్పుకొచ్చారు. -
ఆక్షన్‌లోకి ప్రజయ్ మెగాపొలిస్!
హైదరాబాద్: ఫ్లాట్ల వేలం అంటే బ్యాంకులో.. ఆర్థిక సంస్థలో నిర్వహించడం మనకు తెలిసిందే. కానీ, స్థిరాస్తి రంగంలో తొలిసారిగా నిర్మాణ సంస్థే ముందుకొచ్చి ఆక్షన్‌ను నిర్వహిస్తోంది. ప్రజయ్లో పెట్టుబడులు పెట్టిన కస్టమర్లకు లాభం చేకూరేలా కూకట్‌పల్లిలో 21.5 ఎకరాల్లో నిర్మిస్తున్న మెగాపొలిస్ ఫేజ్-2లోని దాదాపు 90 ఫ్లాట్లను ఆదివారం ఆక్షన్‌లో పెట్టనున్నట్లు ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఏమన్నారంటే.. 9 టవర్లలో ఉండే ప్రజయ్ మెగాపొలిస్ ఫేజ్-1లో మొత్తం 1,113 ఫ్లాట్లుంటాయి. ఇందులో 850 ఫ్లాట్లు గతంలోనే అమ్ముడుపోయాయి. మరో 168 ఫ్లాట్లు ఇప్పటికే ఫేజ్-2 నుంచి ఫేజ్-1కి మారాయి. మిగిలిన ఫ్లాట్లను అక్షన్‌లో పెట్టనున్నాం. అది కూడా అమ్మేవారికి, కొనేవారికి ఇద్దరికీ లాభం చేకూరేలా. ఉదాహరణకు మీ ఫ్లాట్ నంబర్.000 అనుకోండి. చ.అ. ధర రూ.2,700. మీ ఫ్లాట్ ఏరియా 1,567. అంటే ఫ్లాట్ విలువ రూ.42,30,900. ఇందులో 20 శాతం సొమ్మును కొనుగోలుదారులు చెల్లించారు. అంటే రూ.8,46,180. ఇప్పుడు ఆక్షన్‌లో చ.అ. రూ.3,300లకు అమ్ముడుపోయిందనుకుంటే.. ఫ్లాట్ విలువ 51,71,100 అవుతుంది. 20 శాతం సొమ్మంటే రూ.10,34,220. అంటే గతంలో చెల్లించిన దానికంటే రూ.1,88,040 లాభమన్నమాటేగా. ఇక కొనే వారికి చూస్తే.. ఇప్పుడక్కడ చ.అ. ధర రూ.3,700 ఉంది. అంటే ఫ్లాట్ విలువ 57,97,900 అవుతుంది. అంటే రూ.6,26,800 తక్కువకొచ్చిందన్నట్టేగా. ఒకవేళ మీరు పెట్టిన ధరకు ఆక్షన్‌లో ఎవరూ కొనకపోతే గతంలో మీరు పెట్టిన సొమ్మును ఎలాంటి వడ్డీ, పెనాల్టీ లేకుండా పీడీసీ చెక్‌ను అక్కడికక్కడే సంస్థే ఇస్తుంది. మెగాపొలిస్లో ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో ప్రజయ్ సంస్థ హైదరాబాద్ నిర్మించే ఏ ప్రాజెక్ట్‌లోనైనా 10 శాతం రాయితీని అందిస్తాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఫేజ్-1ని పూర్తి చేసి కొనుగోలుదారులకు అందిస్తాం. నిర్మాణం వేగవంతం చేసేందుకు అవసరమైన నిర్మాణ సామగ్రిని పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేశాం. నిర్మాణంలో నాణ్యత ఏమాత్రం తగ్గనివ్వం కూడా.