అంకాపూర్‌లో పంటలను పరిశీలిస్తున్న జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి
పెర్కిట్(ఆర్మూర్): వ్యవసాయంలో ప్రసిద్ధిగాంచిన అంకాపూర్ దేశానికే ఆదర్శమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. అంకాపూర్‌లో రైతులు సాగు చేస్తున్న పసుపు, శ్రీచందనం, ఆపిల్ మొక్కలను పరిశీలించారు. అలాగే లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.
వ్యవసాయంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ అంకాపూర్ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని న్యాయమూర్తి ప్రశంసించారు. అంకాపూర్ చికెన్ హైదరాబాద్‌లో సైతం ఫేమస్ అయిందన్నారు. ఈ గ్రామాన్ని సందర్శించాలన్న తన 20 ఏళ్ల కల ఈ రోజు తీరిందని చెప్పారు. తెలంగాణ మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత, కామారెడ్డి జిల్లా అడిషనల్ న్యాయమూర్తి రమేశ్‌బాబు, డీఏవో గోవింద్, ఆర్డీవో శ్రీనివాసులు, లాలన వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు గడ్డం రాజారెడ్డి, సర్పంచ్ పూజిత, ఎంపీటీసీ ఎంసీ గంగారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment