Ankapur village
-
అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అంకాపూర్ చికెన్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆ దేశీ చికెన్ అంటే తెలియనివాళ్లు ఉండరు. దీన్ని తినేందుకు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజూ పలువురు వస్తుంటారు. దేశవిదేశాలకు సైతం ఆంకాపూర్ దేశీ చికెన్ పార్శిళ్లుగా వెళుతున్న విషయం తెలిసిందే. చికెన్‌తో పాటు పశువుల గడ్డిని పెంచేందుకు వినియోగించే ఎర్రజొన్న విత్తనానికి కూడా ఇటీవల ఈ ప్రాంతం ఫేమస్ అయింది. అంకాపూర్‌లో ఎర్రజొన్న విత్తనాన్ని బైబ్యాక్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు సైతం ఎగుమతి చేసే కంపెనీలు 40 వరకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చికెన్, ఎర్రజొన్న విత్తనంతో పాటు మరో విషయంలోనూ అంకాపూర్ ప్రత్యేకతను సాధిస్తోంది. అదే అంకాపూర్ ‘మక్క వడలు’. ఈ ఒక్క ప్రాంతంలోనే ఆ మక్క వడలు లభ్యమవుతాయి. ప్రతి ఏటా జూన్ నెల నుంచి జనవరి నెలలోపు ఈ వడలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దేశీ చికెన్‌తో మక్క వడలను నంజుకుని తింటే.. ఆ రుచే అద్భుతం అంటూ భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. మక్క వడల పార్సిళ్లు సైతం భారీగా తీసుకెళుతున్నారు. ఈ రహదారిలో వెళ్లేవారు కచ్చితంగా మక్క వడల రుచి చూడడం ఆనవాయితీగా మారింది. రోహిణి కార్తెలోనే... అంకాపూర్ గ్రామ రైతులు రోహిణి కార్తెలోనే మొక్కజొన్న విత్తడమనేది ప్రత్యేకం. బోర్లలో నీరు సమృద్ధిగా ఉన్న రైతులు మే నెల మొదటి వారంలోనే మొక్కజొన్న వేస్తారు. సుమారు 500 ఎకరాల్లో పంట వేస్తారు. జూలైలో పంట వస్తుంది. ఈ రైతులు నేరుగా పచ్చి కంకులను అమ్ముతారు. దీంతో ప్రతి ఏటా జూలై నుంచి మక్క వడలు ఇక్కడ తయారు చేస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న వానాకాలం పంటను జూన్‌లో నాటడం ప్రారంభిస్తారు. అదేవిధంగా పసుపులో అంతరపంటగానూ మొక్కజొన్న వేస్తారు. ఇలా వేసే పంట ప్రతి ఏటా మొత్తం కలిపి జిల్లాలో 30,800 ఎకరాలు ఉంటోంది. అంకాపూర్ మక్క మార్కెట్ నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్ వరకు మొక్కజొన్న ఎగుమతి చేస్తున్నారు. మధ్యవర్తులు ఎకరం లెక్కన పంట కొనుగోలు చేస్తారు. లేనిపక్షంలో ట్రాలీ ఆటోల లెక్కన కొనుగోలు చేస్తారు. మొక్కజొన్న సీజన్ జనవరి వరకు ఉంటుంది. దీంతో అంకాపూర్‌లో 7 కుటుంబాల వారు ప్రత్యేకంగా మక్క వడలను ఈ సీజన్లో తయారు చేస్తున్నారు. సీజన్లో మక్క వడలు మాత్రమే.. 15 ఏళ్ల క్రితం నుంచే మా ఊళ్లో మక్క వడలు చేసి అమ్మడం ప్రారంభమైంది. గతంలో మేము టిఫిన్ సెంటర్ నడిపేవాళ్లం. మక్క వడలు చేయడం ప్రారంభించాక వీటికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గిరాకీ విపరీతంగా ఉంటోంది. దీంతో సీజన్లో 7 నెలల (జూన్ నుంచి జనవరి వరకు) పాటు పూర్తిగా మక్క వడలు మాత్రమే చేసి అమ్ముతున్నాం. –రెగుల్వార్ సిద్ధు, కపిల దంపతులు -
అంకాపూర్ దేశానికే ఆదర్శం
పెర్కిట్(ఆర్మూర్): వ్యవసాయంలో ప్రసిద్ధిగాంచిన అంకాపూర్ దేశానికే ఆదర్శమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. అంకాపూర్‌లో రైతులు సాగు చేస్తున్న పసుపు, శ్రీచందనం, ఆపిల్ మొక్కలను పరిశీలించారు. అలాగే లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వ్యవసాయంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ అంకాపూర్ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని న్యాయమూర్తి ప్రశంసించారు. అంకాపూర్ చికెన్ హైదరాబాద్‌లో సైతం ఫేమస్ అయిందన్నారు. ఈ గ్రామాన్ని సందర్శించాలన్న తన 20 ఏళ్ల కల ఈ రోజు తీరిందని చెప్పారు. తెలంగాణ మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత, కామారెడ్డి జిల్లా అడిషనల్ న్యాయమూర్తి రమేశ్‌బాబు, డీఏవో గోవింద్, ఆర్డీవో శ్రీనివాసులు, లాలన వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు గడ్డం రాజారెడ్డి, సర్పంచ్ పూజిత, ఎంపీటీసీ ఎంసీ గంగారెడ్డి పాల్గొన్నారు. -
అంకాపూర్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు
పసుపు సాగుపై అధ్యయనం ఆర్మూర్ టౌన్: వ్యవసాయరంగ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని జపాన్ ప్రభుత్వ రంగ సంస్థ జపనీస్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజన్సీ(జైకా) అధ్యయన ప్రతినిధి బృందం సందర్శించింది. సోమవారం గ్రామంలో పర్యటించి పసుపు పంట సాగు విధానాన్ని అధ్యయనం చేసింది. జైకా డెరైక్టర్ మామియా, కన్సల్టెంట్లు ఇకె గయా, తజీషు, వతానాబే, జైకా భారత ప్రతినిధి ప్రకాష్ పి దేశాయ్, ఆర్ ప్రకాష్ బృందం పసుపు పంట సాగు, శుద్ధి, విక్రయం, తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పండరి నాథ్ నేతృత్వంలో అంకాపూర్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం గ్రామంలో పసుపు మూ ల విత్తనాల సేకరణ, విత్తే విధానం, సాగు విధా నం, కాల వ్యవ ధి, పండిస్తున్న పసుపు రకాలు, తవ్వి ఉడికించే విధానం, ఉత్పత్తి శుద్ధి చేసే విధానం, మార్కెట్ విక్రయం, ఇందుకు ప్రభుత్వం రైతులకు అం దిస్తున్న సహకారం, తదితర అంశాలపై రైతులతో చర్చించారు. పసుపు సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు గురెడి రెడ్డి రైతు సంఘంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బృందం ప్రతినిధులు మాట్లాడుతూ జపాన్ ప్రభుత్వం అనేక రంగా ల్లో భారత దేశంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. విద్యుత్ ఉత్పాదన, నీటి పారుదల, పారిశ్రామిక విధానం, రవాణా, జాతీ య రహదారుల విస్తరణతో పాటు స్పైసెస్ కూడా ఉం దన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పసుపు, మామిడి పంటలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పా రు. పసుపు పంటను వివిధ ఔషధాల తయారీ, కాస్మోటిక్స్‌లో వాడతారన్నారు. పసుపు కొమ్ములోని లోపని భాగం కురుకుమిన్(గుజ్జు) భాగం ప్రధానమైం దని చెప్పారు. రైతులు పం డించే విధానంపై కురుకుమిన్ నాణ్యత శాతం ఆధారపడి ఉంటుందన్నారు. దీన్ని వాల్యూ చైన్ టర్మరిక్ అని పిలుస్తారని పేర్కొన్నారు. ఆయా అంశాలపై అధ్యయనం చేసి జపాన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు చెప్పా రు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పండరి నాథ్ మాట్లాడుతూ అంకాపూర్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్న దృష్ట్యా ఈ బృందం పర్యటన వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. వీరి వెంట గురెడి రెడ్డి రైతు సంఘం అధ్యక్షుడు ఎంసీ గంగారెడ్డి, కార్యదర్శి అంక్సాపూర్ దేవేందర్ రెడ్డి, ప్రతినిధులు కెకె భాజన్న తదితరులు ఉన్నారు.