అంకాపూర్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు
పసుపు సాగుపై అధ్యయనం
ఆర్మూర్ టౌన్: వ్యవసాయరంగ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని జపాన్ ప్రభుత్వ రంగ సంస్థ జపనీస్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజన్సీ(జైకా) అధ్యయన ప్రతినిధి బృందం సందర్శించింది. సోమవారం గ్రామంలో పర్యటించి పసుపు పంట సాగు విధానాన్ని అధ్యయనం చేసింది. జైకా డెరైక్టర్ మామియా, కన్సల్టెంట్‌లు ఇకె గయా, తజీషు, వతానాబే, జైకా భారత ప్రతినిధి ప్రకాష్ పి దేశాయ్, ఆర్ ప్రకాష్ బృందం పసుపు పంట సాగు, శుద్ధి, విక్రయం, తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పండరి నాథ్ నేతృత్వంలో అంకాపూర్‌లో పర్యటించింది.
ఈ సందర్భంగా ప్రతినిధి బృందం గ్రామంలో పసుపు మూ ల విత్తనాల సేకరణ, విత్తే విధానం, సాగు విధా నం, కాల వ్యవ ధి, పండిస్తున్న పసుపు రకాలు, తవ్వి ఉడికించే విధానం, ఉత్పత్తి శుద్ధి చేసే విధానం, మార్కెట్ విక్రయం, ఇందుకు ప్రభుత్వం రైతులకు అం దిస్తున్న సహకారం, తదితర అంశాలపై రైతులతో చర్చించారు. పసుపు సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు గురెడి రెడ్డి రైతు సంఘంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బృందం ప్రతినిధులు మాట్లాడుతూ జపాన్ ప్రభుత్వం అనేక రంగా ల్లో భారత దేశంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
విద్యుత్ ఉత్పాదన, నీటి పారుదల, పారిశ్రామిక విధానం, రవాణా, జాతీ య రహదారుల విస్తరణతో పాటు స్పైసెస్ కూడా ఉం దన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పసుపు, మామిడి పంటలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పా రు. పసుపు పంటను వివిధ ఔషధాల తయారీ, కాస్మోటిక్స్‌లో వాడతారన్నారు. పసుపు కొమ్ములోని లోపని భాగం కురుకుమిన్(గుజ్జు) భాగం ప్రధానమైం దని చెప్పారు. రైతులు పం డించే విధానంపై కురుకుమిన్ నాణ్యత శాతం ఆధారపడి ఉంటుందన్నారు.
దీన్ని వాల్యూ చైన్ టర్మరిక్ అని పిలుస్తారని పేర్కొన్నారు. ఆయా అంశాలపై అధ్యయనం చేసి జపాన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు చెప్పా రు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పండరి నాథ్ మాట్లాడుతూ అంకాపూర్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్న దృష్ట్యా ఈ బృందం పర్యటన వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. వీరి వెంట గురెడి రెడ్డి రైతు సంఘం అధ్యక్షుడు ఎంసీ గంగారెడ్డి, కార్యదర్శి అంక్సాపూర్ దేవేందర్ రెడ్డి, ప్రతినిధులు కెకె భాజన్న తదితరులు ఉన్నారు.