3 ఏళ్లలో 15 వేల 2బీహెచ్కే గృహాలు! | 15thousend twobhk houses in three years | Sakshi
Sakshi News home page

3 ఏళ్లలో 15 వేల 2బీహెచ్కే గృహాలు!

Published Sat, Dec 10 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

3 ఏళ్లలో 15 వేల 2బీహెచ్కే గృహాలు!

3 ఏళ్లలో 15 వేల 2బీహెచ్కే గృహాలు!

‘సాక్షి రియల్టీ’తో ప్రజయ్ ఇంజనీర్స్ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి
షామీర్‌పేటలో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ-2 ప్రారంభం

140 గజాల్లో రూ.15.30 లక్షలకే సొంతిల్లు

 సాక్షి, హైదరాబాద్ : నిర్మాణ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం.. వంద కోట్ల చ.అ.ల్లో వంద ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన ఘనత.. నిర్మాణంలో నాణ్యత, అందుబాటు ధరల్లో సొంతింటి కలను సాకారం చేసే ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ తొలిసారిగా రెండు పడక గదుల గృహాల వైపు దృష్టిసారించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), రాష్ట్ర ప్రభుత్వ 2 బీహెచ్‌కే పథకాలను ఆదర్శంగా తీసుకొని పలు 2 బీహెచ్‌కే ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. జూబ్లీహిల్స్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్-2 బ్రోచర్‌ను విడుదల చేసిన సందర్భంగా ప్రజయ్ ఇంజినీర్స్ సిండికేట్ లిమిటెడ్ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలివిగో..

షామీర్‌పేటలోని బయోటెక్ పార్క్ (జీనోమ్ వ్యాలీ) కంటే ముందు 27.18 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్-2 ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 140 గజాల్లో 750 చ.అ. బిల్టప్ ఏరియా, 645 చ.అ. కార్పెట్ ఏరియాలో మొత్తం 483 రెండు పడక గదుల గృహాలొస్తారుు. 2017 ఏప్రిల్‌లో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభిస్తాం. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు అందిస్తాం. ధర విషయానికొస్తే.. తొలి 50 మంది కస్టమర్లకు రూ.15.30 లక్షలకే గృహాలను అందించనున్నాం. ఆ తర్వాత రూ.20 లక్షలకు పెంచుతాం.

రూ.5.44 లక్షలు ఆదా కూడా..
2 బీహెచ్‌కే గృహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలు, పన్ను రారుుతీలు కూడా కస్టమర్లకు మరింత ప్రోత్సాహకంగా నిలుస్తారుు. ఇంకా చెప్పాలంటే రూ.15.30 లక్షల ధరలోనూ రూ.5.44 లక్షలు ఆదా అవుతారుు కూడా. అదెలాగంటే.. 4.5 శాతం సర్వీస్ ట్యాక్స్ మినహారుుంపు ఉంటుంది. అంటే రూ.70 వేలు ఆదా. పీఎంఈవై పథకం కింద రూ.6 లక్షల వరకు వడ్డీ 9.3 శాతంలో 6.5 శాతం సబ్సిడీ ఉంటుంది. అంటే 2.58 శాతం మాత్రమే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మరో రూ.3.70 లక్షలు ఆదా అవుతుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం తొలి ఇళ్లు కొనుగోలుదారులకు రూ.50 వేలు మినహారుుంపు ఉంటుంది. 2 బీహెచ్‌కే నిర్మాణానికి గాను నిర్మాణదారులకు 80 ఐబీఏ ప్రకారం 100 శాతం పన్ను రారుుతీలుంటారుు. వీటిని కూడా కస్టమర్లకే బదిలీ చేస్తాం. అంటే ఇక్కడ సుమారు రూ.55-60 వేలు ఆదా అవుతారుు. ఇలా మొత్తంగా కలిపి సుమారు రూ.5.44 లక్షలు ఆదా అవుతాయన్నమాట.

రెండేళ్లలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 15 వేల 2 బీహెచ్‌కే గృహాలను నిర్మించాలని లక్ష్యం గా పెట్టుకున్నాం. మహేశ్వరంలో వర్జిన్ కౌంటీ ప్రాజెక్ట్‌లో 1,500, కుంట్లూరులో గుల్మోర్ ప్రాజెక్ట్‌లో 150 గృహాలు, ఘట్‌కేసర్‌లో విన్సర్‌పాక్ ప్రాజెక్ట్‌లో 1,200 గృహాలు, మూసాపేటలోనూ కొన్ని గృహాలను నిర్మించనున్నాం.

స్థానికంగా ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులు, సామాన్యులకు కూడా సొంతింటిని అందించాలనే లక్ష్యంతో పాతికేళ్ల క్రితం విజయవంతంగా నడిపించిన ప్రజయ్ చిట్ ఫండ్ కంపెనీని తిరిగి అదే ప్రాంతంలో జనవరిలో పునః ప్రారంభించనున్నాం. ఇందులో 60, 100 నెలలుండే దీర్ఘకాలిక చిట్స్‌తో పాటూ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (ఎఫ్‌డీ) పథకాలను కూడా తీసుకొస్తున్నాం. ఈ చిట్స్‌ను 2 బీహెచ్‌కే స్కీమ్‌కు లింక్ చేస్తాం. దీంతో నెలవారీ వారుుదా పద్ధతుల్లో (ఈఎంఐ) గృహాలను పొందే వీలుంటుంది.

మా అన్న కూతురు, నా ఇద్దరు పిల్లలు కూడా ప్రజయ్ సంస్థలో భాగస్వాములయ్యారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఐఎస్‌ఈ గ్రాడ్యుయేట్ నయనికా రెడ్డి ఆపరేషన్‌‌స విభాగంలో, ఆర్కిటెక్ట్ అరుున సరోజిని రెడ్డి డిజైన్ విభాగంలో, పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ నుంచి సివిల్ ఇంజనీర్ అరుున రోహిత్ రెడ్డి ఎక్స్‌క్లూషన్ బృందంలో విధులు నిర్వర్తిస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రెండు పడక గదుల కంటే ఈ గృహాలు నిర్మాణంలో, నాణ్యతలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నాం. హాలు, వంట గది, బెడ్ రూముల్లో 252 వర్టిఫైడ్ టైల్స్, బాత్‌రూముల్లో యాంటి స్కిడ్ సిరామిక్ టైల్స్, గ్రానైట్ కిచెన్ ఫ్లాట్‌ఫాం, స్టీల్ సింక్, యూపీవీసీ కిటికీల వంటివి ఉంటారుు. ఎలక్ట్రిక్ వైర్లు, స్విచ్చులు, ఫ్రేం వర్క్స్ వంటివి అన్ని ఉత్పత్తులను బ్రాండెడ్‌లనే వినియోగిస్తాం.

ప్రతి ఫ్లాట్‌కు కామన్‌గా ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ పైప్‌లైన్‌‌స ద్వారా ప్రతి ఇంటికి ప్రత్యేక నీటి సరఫరా ఏర్పాట్లుంటారుు. అండర్ గ్రౌండ్ పైప్‌లైన్‌‌స ద్వారా మురుగు నీటి వ్యవస్థను, ఎస్‌టీపీకి అనుసంధానం చేస్తాం.

వసతుల విషయానికొస్తే.. పార్క్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, యోగా సెంటర్, జిమ్, ఇండోర్, అవుట్ డోర్ ప్లే ఏరియా, టెన్నిస్, బాస్కెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, క్రికెట్, ఫుట్ బాల్ మైదానాలు, ప్రాజెక్ట్‌లోనే షాపింగ్ కాంప్లెక్స్, స్కూలు, ఆసుపత్రి కూడా ఉంటారుు.

ఇప్పటికే అక్కడ సిమెంట్ రోడ్లు, ఎస్‌టీపీ, ల్యాండ్ స్కేపింగ్, పార్క్, టెన్నిస్ కోర్ట్ వసతుల ఏర్పాట్లు పూర్తయ్యారుు. 45 వేల చ.అ. క్లబ్ హౌస్ నిర్మాణ దశలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement