CMD
-
నేడు స్టీల్ ప్లాంట్ సీఎండీని కలవనున్న పోరాట కమిటీ నేతలు
-
యాజమాన్యానికి షాకిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
-
ప్రైవేటీకరణ వైపు స్టీల్ ప్లాంట్ నిజాలు బయటపెట్టిన CMD
-
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ, కార్మిక సంఘాల నేతల మధ్య సమావేశం
-
ఆరేళ్లలో రూ.30 లక్షల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: భారత్ విధించుకున్న కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి వచ్చే ఆరు ఆర్థిక సంవత్సరాల్లో (2024–2030) రూ.30 లక్షల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఇరెడా’ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ అన్నారు. దేశంలో సగం విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని భారత్ ఏర్పాటు చేసుకోగా, 2070 నాటికి నికరంగా సున్నా కర్బన ఉద్గారాల స్థితికి చేరుకోనున్నట్టు ప్రకటించడం తెలిసిందే. దీంతో సోలార్ పరికరాలు, ఎలక్ట్రోలైజర్లు, పవన విద్యుత్ టర్బయిన్లు, వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ సామర్థ్యాల ఏర్పాటుపై పెట్టుబడులు అవసరమవుతాయని దాస్ చెప్పారు. ప్రపంచబ్యాంక్ నిర్వహించిన ఒక వెబినార్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. పీఎం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించారు. దీని కింద కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఇందు కోసం కేంద్ర సర్కారు రూ.75,000 కోట్లను ఖర్చు చేయనుంది. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా దీన్ని చేపట్టనున్నారు. ఈ పథకం వల్ల గణనీయమైన ప్రయోజనాలకు తోడు, ప్రజల్లో పునరుత్పాదక ఇంధనం పట్ల పెద్ద ఎత్తున అవగాహన ఏర్పడుతుందని దాస్ అభిప్రాయపడ్డారు. దేశ కర్బన ఉద్గారాల లక్ష్యాలకు సాయపడుతుందన్నారు. ‘‘వచ్చే మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని భారత్ విధించుకుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఇంధన డిమాండ్‌ను చేరుకోవాల్సి ఉంటుంది. ఇందులో 90 శాతం పునత్పాదక ఇంధన వనరుల రూపంలోనే సమకూరనుంది’’అని దాస్ చెప్పారు. -
Poaching Row: ఐటీ కంపెనీల్లో అక్రమ వలసలు.. పెదవి విప్పిన కాగ్నిజెంట్ సీఎండీ
న్యూఢిల్లీ: ఇతర సంస్థల నుంచి అక్రమంగా అత్యున్నత అధికారులను ఆకట్టుకోవడం(పోచింగ్)వల్ల కంపెనీ బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం పడబోదని ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల దేశీ ఐటీ కంపెనీల మధ్య అత్యున్నత అధికారుల అక్రమ వలస(పోచింగ్)లపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో నంబియార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడేందుకు నిరాకరించిన నంబియార్ ఉద్యోగులతో గల కాంట్రాక్టు అమలుకు కంపెనీలు పట్టుబట్టడాన్ని సమర్ధించారు. ఇందుకు ఆయా కంపెనీలకు అధికారముంటుందని వ్యాఖ్యానించారు. అయితే నాన్పోచింగ్పై పరిశ్రమవ్యాప్తంగా వర్తించే నిబంధనలకు ఆస్కారంలేదని స్పష్టం చేశారు. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీ అధికారులను లేదా నిపుణులను తీసుకోవడాన్ని నివారించేందుకు నిబంధనలు వర్తింపచేయలేమని అభిప్రాయపడ్డారు. ఐటీ పరిశ్రమ ప్రధానంగా నైపుణ్య ఆధారితంకావడమే దీనికి కారణమని తెలియజేశారు. నిపుణులతోనే నిర్మితమైన సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఉద్యోగ వలసలకు చెక్ పెట్టేందుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేమని వివరించారు. అయితే ఉపాధి కల్పనకు సంబంధించి పరిశ్రమవ్యాప్తంగా వర్తించే మార్గదర్శకాలకు వీలున్నట్లు తెలియజేశారు. పోచింగ్ సమస్య తమ కంపెనీపై ప్రభావాన్ని చూపబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా పరిశ్రమపైన సైతం ప్రభావాన్ని చూపబోదని అభిప్రాయపడ్డారు. గత కొన్ని వారాలుగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాల మధ్య పోచింగ్ వివాదాలు తలెత్తిన విషయం విదితమే. దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల.. తమ అధికారులను కాగ్నిజెంట్ అనైతిక పద్ధతుల్లో విధుల్లోకి తీసుకుంటున్నట్లు విమర్శించడంతో పరిశ్రమలో అలజడి తలెత్తింది. గతంలో ఇన్ఫోసిస్‌లో పనిచేసి ప్రస్తుతం కాగ్నిజెంట్ సీఈవోగా వ్యవహరిస్తున్న రవి కుమార్ ఇతర సంస్థల నుంచి 20 మంది సీనియర్ లీడర్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు ఇన్ఫోసిస్, విప్రోలో బాధ్యతలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఉద్యోగులతో కనీసం ప్రాథమిక స్థాయిలో నియామకాలలో సైతం ఎలాంటి సర్వీసు ఒప్పందాలు లేదా బాండ్లకు తెరతీయడంలేదని నంబియార్ వివరించారు. క్యాంపస్‌ల నుంచి ప్రధానంగా ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇది స్వేచ్చా ప్రపంచమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
బీహెచ్ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి
న్యూఢిల్లీ: బీహెచ్ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీహెచ్ఈఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. మూర్తిని సీఎండీగా నియమించే ప్రతిపాదనకు అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపిన విషయమై భారీ పరిశ్రమల శాఖ నుంచి బీహెచ్ఈఎల్కు సమాచారం అందింది. దీంతో సోమవారం సమావేశమైన బీహెచ్ఈఎల్ బోర్డు ఇందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సదాశివ మూర్తి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ‘‘సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి నియామకం నవంబర్ 1 తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు అమల్లోకి వస్తుంది. పదవీ విమరణ తేదీ 2027 ఫిబ్రవరి 28 వరకు లేదంటే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) ఈ నియామకం అమల్లో ఉంటుంది’’అని బీహెచ్ఈఎల్ తెలిపింది. -
కోటక్ మహీంద్రా సీఎండీగా ఉదయ్ కోటక్ రాజీనామా
Uday Kotak resigns: కొటాక్ మహీంద్రా బ్యాంక్ సీఎండీ ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. షెడ్యూల్ కంటే 3 నెలల ముందుగానే తన పదవికి రాజీనామా చేయడం వార్తల్లో నిలిచింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లోవెల్లడించింది. ఆయనను బ్యాంక్ సీఎండీ బాధ్యతలనుంచి వైదొలిగినట్టు పేర్కొంది. ఈ రాజానామాను బ్యాంక్ బోర్డు ఆమోదం మేరకు సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి వచ్చిందని తెలిపింది. అటు సీఎండీగా స్వచ్ఛందంగా వైదొలగుతున్నట్టు ఉదయ్ కోటక్ కూడా ట్విటర్లో వెల్లడించారు. విశ్వసనీయత , పారదర్శకత ప్రాథమిక సిద్ధాంతాలతో తాము విశిష్ట సేవలందించామనీ, లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించామని పేర్కొన్నారు. 1985లో రూ. 10వేల మొదలైన తమ ప్రస్తానం ఈరోజు దాదాపురూ. 300 కోట్లకు చేరిందన్నారు. తమ సంస్థ సామాజిక , ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. వ్యవస్థాపకుడిగా, కోటక్ బ్రాండ్‌తో చాలా అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) Succession at Kotak Mahindra Bank has been foremost on my mind, since our Chairman, myself and Joint MD are all required to step down by year end. I am keen to ensure smooth transition by sequencing these departures. I initiate this process now and step down voluntarily as CEO.… — Uday Kotak (@udaykotak) September 2, 2023 చాలా కాలం క్రితం, JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి పేర్లు ఆర్థిక ప్రపంచంలో ఆధిపత్యం చూశాను . దేశంలో అలాంటి సంస్థను సృష్టించాలని కలతోనే నేను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రాను ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో 3 మంది ఉద్యోగులతో ప్రారంభించా. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగినన్నారు.వ్యవస్థాపకులు వెళ్ళిపోతారు, కానీ సంస్థ శాశ్వతంగా వర్ధిల్లుతుందంటూ ట్వీట్ చేశారు. -
పీఎఫ్సీ సీఎండీగా పర్మిందర్ చోప్రా బాధ్యతలు
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఎన్బీఎఫ్సీ, ప్రభుత్వరంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) చైర్మన్, ఎండీగా (సీఎండీ) పర్మిందర్ చోప్రా బాధ్యతలు స్వీకరించారు. సంస్థకు తొలి పూర్తి స్థాయి మహిళా చైర్మన్ అని పీఎఫ్సీ తెలిపింది. జూన్ 1 నుంచి పీఎఫ్సీ సీఎండీగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వహిస్తుండగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ బాధ్యతల్లోకి వచ్చారు. అంతక్రితం వరకు పీఎఫ్సీ డైరెక్టర్ (ఫైనాన్స్)గా పనిచేశారు. డైరెక్టర్ (ఫైనాన్స్)గా పర్మిందర్ చోప్రా ఎన్పీఏలను కనిష్టానికి తగ్గించి, సంస్థ లాభదాయకతను పెంచడంలో, మహారత్న హోదా పొందడంలో కీలకంగా పనిచేశారు. విద్యుత్, ఫైనాన్షియల్ రంగాల్లో 35 ఏళ్ల అనుభవం ఉంది. -
ఎన్ఎండీసీ తాత్కాలిక సీఎండీగా అమితవ ముఖర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ తాత్కాలిక సీఎండీగా సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలలు లేదా కొత్త సీఎండీ నియామకం పూర్తి అయ్యే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్‌కు చెందిన ముఖర్జీ 2017లో ఎన్ఎండీసీలో చేరారు. ఎన్ఎండీసీ సీఎండీ పదవి కోసం పోటీపడుతున్న ఏడుగురిలో ముఖర్జీ కూడా ఉన్నారు. -
ఇన్ఫోసిస్‌కి షాకిచ్చిన టెక్ఎం కొత్త సీఎండీ, రోజు సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ , టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా సీఎండీగా మోహిత్ జోషి ఎంపికైన సంగతి తెలిసిందే. భారతీయ ఐటీ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పదివిని వరించిన ఈ నేపథ్యంలో ఆయన విద్యార్హతలు, టెక్ ప్రపంచంలో అనుభవం, వార్షికవేతన తదితర అంశాలు చర్చకు దారి తీసాయి. మోహిత్ జోషి ఎవరు? టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 22 సంవత్సరాల అనుభవజ్ఞుడైన మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఇప్పటివరకు ఆయన ఒక్క రోజు వేతనం రూ. 9.5 లక్షలు. రెండు దశాబ్దాల అనుభవంతో ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్,కన్సల్టింగ్ రంగంలో నిపుణుడు. ఇన్ఫోసిస్ కంటే ముందు అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో పనిచేశారు. (ఇదీ చదవండి: జాక్‌పాట్ అంటే ఇదే! నిమి...రతన్ టాటాను మించిపోయాడు!) 1974 ఏపప్రిల్13న జన్మించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం నుండి పాఠశాల విద్య పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో తన గ్రాడ్యుయేషన్, తరువాత ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (FMS) నుండి MBA చేసాడు. అమెరికా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుండి ప్రపంచ నాయకత్వం , పబ్లిక్ పాలసీని కూడా అధ్యయనం చేశాడు. 2000లో ఇన్ఫోసిస్‌లో చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. మోహిత్ తన కెరీర్లో ఆసియా, అమెరికా,యూరప్, మెక్సికోలో పనిచేశారు. జోషికి భార్య ఇద్దరు కుమార్తెలతో లండన్‌లో నివసిస్తున్నారు. 2021 సంవత్సరంలో, మోహిత్ జీతం రూ. 15 కోట్ల నుండి రూ. 34. 82 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఫైలింగ్ ప్రకారం, అతను 2021-2022లో రూ. 34,89,95,497 (రూ. 34.89 కోట్లు) జీతం పొందారు. ఇన్ఫోసిస్‌కి పెద్ద దెబ్బే ఇటీవలి కాలంలో ఇన్ఫోసిస్‌కి ఇది రెండో అతిపెద్ద నిష్క్రమణ. ఇటీవలే రవికుమార్ ఎస్ ఇన్ఫోసిస్‌కి గుడ్‌బై చెప్పి కాగ్నిజెంట్‌కు సీఈఓగా చేరారు. జోషిని బోర్డులో ఉంచడానికి ఇన్ఫోసిస్ చివరి నిమిషం దాకా ప్రయత్నించింది విఫలమైందట. జోషి నిష్క్రమణ ఇన్ఫోసిస్‌కి పెద్ద లోటేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్ఫీ సీఎండీ సలీల్ పరేఖ్ తరువాత అత్యధిక పే అందుకున్నవారు జోషి మాత్రమే. (మైక్రోసాఫ్ట్‌లో మూడో రౌండ్ తీసివేతలు, ఈసారి ఎవరంటే?) గుర్నానీకి సరైన ప్రత్యామ్నాయం టెక్ మహీంద్రా సీఎండీ గుర్నానీ పదవీ విరమణ చేస్తున్న తరుణంలో ఆయనకు సరైన ప్రత్యామ్నాయంగా టెక్ఎం భావించడం విశేషం. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సమాచారంలోశనివారం ప్రకటించింది. అయితే టెక్ఎం సీఎండీగా జోషి వేతనం, ఇతర ప్రయోజనాలపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. మోహిత్ జోషి గురించి మరిన్ని విషయాలు మోహిత్ జోషి ఇన్ఫోసిస్ మాజీ సీఈవొ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా సేవలు అవివా Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా రిస్క్ & గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడు CBI (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్ 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ యంగ్ గ్లోబల్ లీడర్ (YGL)గా ఎంపిక -
ఇన్ఫోసిస్‌కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు
సాక్షి, ముంబై: దేశీయ ఆరో అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్త సీఈవోగా మోహిత్ జోషి ఎంపికయ్యారు. ప్రస్తుత సీఎండీ సీపీ గుర్నానీ స్థానంలో ఆయన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరనున్నారు. డిసెంబర్ 20నుంచి మోహిత్ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్ మహీంద్ర ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో శనివారం ప్రకటించింది. గుర్నానీ పదవీ కాలం డిసెంబర్ 19న ముగియనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి ప్రత్యర్థి టెక్ మహీంద్రాలో చేరడానికి కంపెనీకి రాజీనామా చేసినట్లు రెండు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపాయి. 2000 నుండి ఇన్ఫోసిస్‌లో భాగమైన మోహిత్ జోషి 2023,మార్చి 11రాజీనామా చేశారు.జోషి మార్చి 11 నుండి సెలవులో ఉంటారని, జూన్ 9 చివరి తేదీ అని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి ఒక ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. అలాగే మోహిత్ జోషి డిసెంబర్ 2023 నుండి 5 (ఐదు) సంవత్సరాలపాటు 2028 వరకు పదవిలో ఉంటారని టెక్ ఎం వెల్లడించింది. ఇన్పీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపార హెడ్‌గా పనిచేసిన జోషికి ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ మరియు కన్సల్టింగ్ స్పేస్‌లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఇన్ఫోసిస్‌లో, జోషి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ & హెల్త్‌కేర్, సాఫ్ట్వేర్ బిజినెస్‌కు నాయకత్వం వహించారు. అలాగే ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌తో పాటు, ABN AMRO, ANZ Grindlays వంటి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడా పనిచేశారు. సీబీఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్‌గా సేవలందించారు. Aviva Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను, రిస్క్ అండ్ గవర్నెన్స్ నామినేషన్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్‌కు ఆహ్వానితుడు కూడా. మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఎంబీఏ, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
విచారణ పేరుతో వేధించడం మానుకోండి!
న్యూఢిల్లీ: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) వంటి ఒక కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ అధికారులను ఆషామాషీగా పిలవడం (సమన్స్ జారీ), వారిని అరెస్ట్ చేయడం వంటి విధానాలను విడనాడాలని క్షేత్రస్థాయి కార్యాలయాలను జీఎస్టీ (వస్తు సేవల పన్ను) ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఆదేశించింది. జీఎస్టీ చట్టం కింద యాంత్రిక పద్ధతిలో అరెస్టు చేసే విధానాలకు పాల్పడవద్దని స్పష్టం చేసింది. ప్రత్యక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) పర్యవేక్షణలో పనిచేసే ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఈ మేరకు ఫీల్డ్ ఆఫీసర్లకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వీటికి సంబంధించి కొన్ని కీలకాంశాలను చూస్తే.. ►ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛ అరెస్టు వల్ల దెబ్బతింటుంది. అటువంటి చర్య విశ్వసనీయమైన అంశాల ఆధారంగా ఉండాలి. అరెస్టును మామూలుగా, యాంత్రికంగా చేయకూడదు. ►జీఎస్టీ ఎగవేత ఆరోపణలకు సంబంధించి నేరస్థుడిని అరెస్టు చేయాలనుకుంటే, సంబంధిత అధికారుల కోసం మార్గదర్శకాల చెక్లిస్ట్ను కూడా ఫీల్డ్ ఆఫీసర్లు పరిగణనలోకి తీసుకోవాలి. నేరస్థుడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా లేదా సాక్షులను బెదిరించే అవకాశం ఉందా, నేరానికి ఆ వ్యక్తి సూత్రధారా? వంటి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు సరిచేసుకోవాలి. ►చట్టపరమైన అవసరాలను నెరవేర్చడమే కాకుండా, ఒక వ్యక్తిని అరెస్టు చేయాలని నిర్ణయించే ముందు సంబంధిత అంశాలు తప్పనిసరిగా సరైన దర్యాప్తుతో నిర్ధారించుకోవాలి. సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సాక్షులను బెదిరించడం లేదా ప్రభావితం చేయడం వంటి అవకాశాలను నిరోధించడానికి, ఆ అవసరం ఏర్పడినప్పుడే అరెస్టులు జరగాలి. ►ఏదైనా కంపెనీ లేదా పీఎస్‌యూ (ప్రభుత్వ రంగ సంస్థ) సీఎండీ, ఎండీ, సీఈఓ, సీఎఫ్ఓ వంటి సీనియర్ మేనేజ్మెంట్ అధికారులకు సాధారణంగా మొదటి సందర్భంలోనే సమన్లుజారీ చేయకూడదు. ఆదాయాన్ని కోల్పోవడానికి దారితీసిన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారి ప్రమేయంపై జరిగిన దర్యాప్తులో వారి ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే వారిని పిలిపించాలి. ►మెటీరియల్ ఎవిడెన్స్, సంబంధిత పత్రాల కోసం ఫీల్డ్ ఆఫీసర్లు కంపెనీల ఉన్నతాధికారులను ‘ఏదో ఆషామాషీగా’ పిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, జీఎస్టీ పోర్టల్‌లో ఆన్లైన్లో అందుబాటులో ఉండే జీఎస్టీఆర్–3బీ, జీఎస్టీఆర్–వంటి చట్టబద్ధమైన రికార్డుల కోసం సైతం కంపెనీ అధికారులకు సమన్లు పంపుతున్నట్లు సమాచారం. జీఎస్టీ పోర్టల్‌లో డిజిటల్‌గా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన పత్రాల కోసం సమన్ల జారీ చేయడం ఎంతమాత్రం తగదు. సుప్రీంకోర్టు రూలింగ్‌కు అనుగుణంగా... అరెస్టుకు సంబంధించిన జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇటీవలి ఇచ్చిన ఒక తీర్పును పరిగణనలోకి రూపొందాయి. ‘‘చట్టబద్ధమైన రీతిలోనే, దీనిని అనుగుణంగా నడుచుకోలేదని స్పష్టమైన ఆధారాలతోనే ఒక అరెస్ట్ జరగాల్సి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు తన రూలింగ్‌లో పేర్కొంది. అరెస్టు చేసే అధికారం– దానిని అమలు చేయడానికి గల సమర్థనకు మధ్య తేడాను గుర్తించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకర్షణీయం వివిధ సందర్భాల్లో సాధారణ విషయాల కోసం కంపెనీల సీనియర్ అధికారులకు సమన్లు జారీ అవుతున్నాయి. కంపెనీ పన్ను విభాగంతో పరిష్కారమయ్యే అంశాలకు సైతం సీనియర్ అధికారులకు సమన్లు తగవు. ఈ నేపథ్యంలో జీఎస్టీ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ మార్గదర్శకాలు హర్షణీయం. – అభిషేక్ జైన్, కేపీఎంజీ వేధింపులకు అడ్డుకట్ట తాజా మార్గదర్శకాలు కింది స్థాయి జీఎస్టీ అధికారుల విపతీరమైన విధింపులను అరికట్టడానికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాం. రజత్ మోహన్,ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ -
ప్రత్యేక కంపెనీగా స్పైస్‌ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: కార్గో, లాజిస్టిక్స్ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బ్యాంకులు, వాటాదారులు అనుమతించినట్లు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ తాజాగా వెల్లడించింది. వచ్చే నెల(ఆగస్ట్) తొలి వారంలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను విడదీయనున్నట్లు స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. కార్గో, లాజిస్టిక్స్ సర్వీసులను స్లంప్ సేల్ ప్రాతిపదికన అనుబంధ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేస్తున్నట్లు గతేడాది ఆగస్ట్ 17న స్పైస్‌జెట్ తెలియజేసింది. తద్వారా సంస్థకు స్వతంత్రంగా నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలు చిక్కనున్నట్లు వెల్లడించింది. కాగా.. జూన్ 19 మొదలు కంపెనీ విమానాలలో ఎనిమిదిసార్లు సాంకేతిక సమస్యలు నమోదుకావడంతో గత వారం డీజీసీఏ నుంచి స్పైస్‌జెట్‌కు షోకాజ్ నోటీసు జారీ అయిన సంగతి తెలిసిందే. భద్రత, సమర్థత, విశ్వసనీయ విమానయాన సర్వీసులు అందించడంలో స్పైస్‌జెట్ వైఫల్యం చెందిందంటూ డీజీసీఏ పేర్కొంది. -
సింగరేణి సీఎండీ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో ఏడాది పాటు శ్రీధర్‌ను ఆ పదవిలో కొనసాగిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 జనవరి1 నుంచి శ్రీధర్ ఆ పదవిలో కొనసాగుతుండగా, ఇప్పటికే ఐదుసార్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పటికే ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న శ్రీధర్‌కు మళ్లీ పొడిగింపు ఇవ్వడం గమనార్హం. -
Alka Mittal: డాక్టర్ అల్కా మిట్టల్... ఈ పేరే ఓ రికార్డు... తొలి మహిళగా
Alka Mittal Successful Journey: అది 1956. భారత ప్రభుత్వం ఓఎన్జీసీకి రూపకల్పన చేసింది. ఆ సంస్థ 65 ఏళ్ల మహోన్నత చరిత్రను రాసుకుంది. ఇప్పుడు... ఆ చరిత్రను ఓ మహిళ తిరగరాసింది. ఇప్పుడు దేశమంతా ఆమెనే చూస్తోంది. ఆమె ఓఎన్జీసీ సీఎండీ డాక్టర్ అల్కా మిట్టల్. డాక్టర్ అల్కా మిట్టల్... ఈ పేరే ఓ రికార్డు. ప్రసిద్ధ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు సీఎండీగా నియమితులయ్యారామె. ఓఎన్జీసీ చరిత్రలో ఒక మహిళ సీఎండీ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గత రెండు రోజులుగా వార్తల్లో ప్రధానవ్యక్తిగా నిలిచారామె. ఎవరీ అల్కా మిట్టల్ అని, ఆమె వయసెంత అని, ఇంత పెద్ద బాధ్యతలు చేపట్టగలగడానికి ఆమె ఏం చదువుకున్నారు అనే ప్రశ్నలు గూగుల్‌ని శోధిస్తున్నాయి. ఆమె ఈ నెల ఒకటవ తేదీన అల్కా మిట్టల్‌ను సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించినట్లు సోమవారం ఆ సంస్థ ట్విటర్లో ప్రకటించింది. అదేరోజు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఆమె ఆ బాధ్యతల్లో ఆరునెలల పాటు ఉంటారు. ఒకవేళ ఈలోపు పూర్తిస్థాయిలో సీఎండీ నియామకం జరిగినట్లయితే అప్పటి వరకు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. చదవడం హాబీ డాక్టర్ అల్కా మిట్టల్ వయసు 56. పర్యటనలు, పుస్తక పఠనం, రాయడం అల్కామిట్టల్ హాబీలు. అలా హాబీగా చాలా చదివేశారామె. డెహ్రాడూన్‌లోని ఎంకేపీ పీజీ కాలేజ్ నుంచి 1983లో ఎకనమిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రాజ్‌గురు మహావిద్యాలయ నుంచి ఎంబీఏ (హెచ్ఆర్), ఆ తర్వాత ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా నుంచి బిజినెస్, కామర్స్, కార్పొరేట్ గవర్నెన్స్‌లో 2001లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. అదీ రికార్డే ప్రస్తుతం ఓఎన్జీసీ సంస్థ చైర్పర్సన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కొత్త బాధ్యతలు చేపట్టడానికి మునుపు 2018 నుంచి ఆమె ఆ సంస్థలో హెచ్ఆర్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ సంస్థలో పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితమైన రికార్డు కూడా ఆమెదే. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ రంగంలో ప్రసిద్ధ సంస్థ ఓఎన్జీసీకి సీఎండీగా ఒక మహిళ బాధ్యతలు చేపట్టడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ స్థాయి ఆమెకు ఏ ఒక్కరోజులోనో వచ్చి వాలిన హోదా కాదు. గ్రాడ్యుయేట్ ట్రైనీగా 1985లో ఓఎన్జీసీలో చేరిన అల్కామిట్టల్ మూడున్నర దశాబ్దాలుగా రకరకాల విధులు నిర్వర్తించారు. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఓఎన్జీసీ మంగుళూరు పెట్రో కెమికల్స్‌లో బోర్డు మెంబర్‌గా క్రియాశీలకంగా వ్యవహరించారు. అల్కా మిట్టల్ ఉత్తరాది రీజియన్‌కు చెందిన ‘ఫోరమ్ ఫర్ ఉమెన్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్’ ప్రెసిడెంట్‌గా మహిళలకు క్షేమకరమైన పని వాతావరణం కల్పించడానికి అవసరమైన సూచనలు చేశారు. వడోదర, ముంబయి, ఢిల్లీ, జోర్హాత్లలో హెచ్ఆర్ విధులు నిర్వర్తించి ఉన్నారు. ఓఎన్జీసీలో ఆమె చీఫ్ స్కిల్ డెవలప్మెంట్ (సీఎస్డీ)గా అత్యంత క్రియాశీలకంగా పని చేశారు. దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ‘నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్’ ద్వారా స్కిల్ ట్రైనింగ్ ఇప్పించారు. దేశంలో ఉన్న అన్ని ఓఎన్జీసీ శాఖల్లో పని చేసే వాళ్లకు ఒకేరకమైన తర్ఫీదు అవసరం అనే ఉద్దేశంతో ఆమె ఈ ప్రత్యేక ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేశారు. ఆఫ్‌షోర్ (చమురు నిక్షేపాలను తవ్వి వెలికి తీయడానికి సముద్ర గర్భంలోకి వెళ్లడం) బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించారామె. తొలి తరం మహిళ అల్కా మిట్టల్‌ను సీఎండీగా నియమించడానికి ముందు ఆ సంస్థ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఇద్దరు విధుల్లో ఉన్న ఐఏఎస్‌లు కూడా ఉండడం విశేషం. మహిళలు అన్ని రంగాల్లో విశేషమైన సేవలందిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు. కానీ కంపెనీ హెడ్ హోదాలో మాత్రం నూటికి తొంబై కంపెనీల్లో మగవాళ్లే ఉంటున్నారనేది కాదనలేని సత్యం. మహిళలు ఉద్యోగులుగా సేవలందించడానికే పరిమితమవుతున్నారనే నివేదికలను కాదనలేం. అయితే గ్లాస్ సీలింగ్‌ను బ్రేక్ చేసిన అతికొద్ది మంది మహిళల జాబితాలో చేరారు అల్కామిట్టల్. మహిళలు పెద్దగా ఆసక్తి చూపించని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అడుగుపెట్టిన తొలితరం మహిళగా ఆమెను చెప్పుకోవచ్చు. అలాగే సీఎండీగా అల్కా మిట్టల్ నియామకం ద్వారా ఆ కంపెనీ మహిళలు, మగవాళ్లకు సమాన అవకాశాలు కల్పించే ‘ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్’ అనే గౌరవాన్ని దక్కించుకుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో...తొలి మహిళలు ►విక్కీ హోలబ్, సీఈవో, యూఎస్‌లోని ఆక్సిడెంటల్ పెట్రోలియమ్ ఆయిల్ కంపెనీ ►లిండా కుక్, సీఈవో, నార్త్ సీ ఆయిల్.. ప్రొడ్యూసర్ ప్రీమియర్ ఆయిల్ క్రెసోర్ హోల్డింగ్ ►కేథరీన్ రో, సీఈవో, వెంట్వర్త్ రీసోర్సెస్, టాంజానియా ►మారియానా జార్జ్, సీఈవో, దక్షిణ, తూర్పు యూరప్‌లో అతి పెద్ద ఎనర్జీ కంపెనీ ఓఎమ్వీ పెట్రోమ్ ఆఫ్ ఆస్ట్రియా ►మనదేశంలో అల్కామిట్టల్కంటే ముందు ఈ రంగంలో నిషి వాసుదేవ రికార్డు సృష్టించారు. ఆమె 2014 మార్చిలో హిందూస్థాన్ పెట్రోలియమ్ కంపెనీలో కీలక బాధ్యతలను స్వీకరించారు. చదవండి: మంచు ఖండంలో మెరిసిన వజ్రం -
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాకు సుచిరిండియా సీఎండీ రూ.లక్ష ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: లయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్సహించేందుకు లక్ష రూపాయలను అందించారు. జూబ్లీహిల్స్‌లోని సుచిరిండియా కార్యలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సుచిరిండియా సీఎండి లయన్ కిరణ్ కుమార్ లక్ష రూపాయల చెక్కును ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా భారత్ తరుపున పోటీపడి పతకాలు సాధించి వారు ప్రపంచ స్థాయిలో భారత్‌కు గుర్తింపు తీసుకొస్తారన్నారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లుగా క్రికెట్ నుంచి మొదలుకొని అన్ని రకాల క్రీడాకారులకు సుచిరిండియా తరుపున అవసరమైన సామాజిక ఆర్థిక సహాకారాన్ని అందిస్తున్నామని అన్నారు. యువ క్రీడాకారలను గుర్తించి వారికి అవసరమైన సాయాన్ని అందించడం ద్వారావారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారన్నారు. కెయూరాకు మున్ముందు అవసరమైన మరింత సాయాన్ని అందిస్తామన్నారు. ఇప్పటికే సుచిరిండియా తరుపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు అవసరమైన సాయాన్ని అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని, అంతేకాకుండా రన్ ఫర్ హైదరాబాద్, రన్ ఫర్ హ్యాపినెస్ కార్యక్రమాలను నిర్వహించామని కిరణ్‌కుమార్ తెలిపారు. కెయూరా మాట్లాడుతూ.. ఆల్ ఇండియా కేటగిరిలో 12వ ర్యాంకును, ఇంటర్నేషనల్ టోర్నీలలో 240 ర్యాంకులో ఉన్న తాను తాజాగా ఐరిష్ ఓపెన్ చాలెంజ్‌లో బ్రాంజ్ పతకం సాధించానని అన్నారు. జనవరిలో ఇండియా ఓపెన్‌తోపాటు మరో రెండు టోర్నీల్లో పాల్గొంటున్నానని అన్నారు. తన తల్లిదండ్రలు తనకు ఎంతో స్పూర్తి అని, వారి కారణంగానే తాను ఇంత దూరం వచ్చానన్నారు. తన తండ్రి ఉద్యోగాన్ని వదిలి అయిదేళ్లుగా తన క్రీడా భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారన్నారు. తప్పనిసరిగా దేశం కోసం పతకాలు సాధిస్తామని, సుచిరిండియా అందిస్తున్న సాయానికి పతకాలు సాధించి తగిన ఫలితం చూపుతానని అన్నారు. ఇగ్నోలో బీకాం మొదటి సంవత్సరం పూర్తి చేశాను. చదువు, ఆటకు సమప్రాధాన్యం ఇస్తున్నట్లు కెయూరా వివరించారు. -
ఏపీలో డిస్కంల పనితీరు భేష్
సాక్షి, అమరావతి: ఏపీలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసించారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) సీఎండీ సంజయ్ మల్హోత్రా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఆర్ఎస్ థిల్లాన్ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. అనంతరం సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. కేంద్రం ఆర్డీఎస్ఎస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీనిపై సీఎంతో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. వెంటనే తెలంగాణ విద్యుత్ బకాయిలు ఇప్పించండి.. తెలంగాణ చెల్లించాల్సిన రూ.6,283.88 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాలని కేంద్ర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం బలవంతం చేయడం వల్లే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశామని గుర్తు చేసింది. ఆర్ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా, పీఎఫ్సీ సీఎండీ ఆర్ఎస్ థిల్లాన్ బుధవారం సీఎస్ సమీర్‌శర్మ, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ‘మీకు చెల్లించాల్సిన బకాయి కంటే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలే ఎక్కువ. ముందు వాటిని ఇప్పించండి’ అని కోరారు. ఏపీ జెన్కో చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆర్థిక పరంగా ఏపీకి రావాల్సిన వాటిని వెంటనే వచ్చేలా సహకరించాలని కోరారు. -
ఇన్చార్జ్ సీఎండీల పాలనలో ట్రాన్స్‌కో, జెన్కో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో ఇన్చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. ట్రాన్స్‌కో సీఎండీగా ఆ సంస్థ జేఎండీ సి.శ్రీనివాస రావు, తెలంగాణ జెన్కో సీఎండీగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వీరు అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎండీగా ప్రభాకర్‌రావు కొనసాగింపుపై అస్పష్టత...: ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలకు 2014 అక్టోబర్ నుంచి డి.ప్రభాకర్‌రావు ఉమ్మడి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో గత ఆగస్టు 19 నుంచి 31 వరకు సెలవుపై వెళ్లారు. అనంతరం సెప్టెంబర్ 22 వరకు ప్రభాకర్‌రావు సెలవు పొడిగించుకున్నారు. అక్టోబర్ 1న విధుల్లో చేరి... ఆరు వరకు కొనసాగారు. ఆ తర్వాత నుంచి మళ్లీ ఆయన విధులకు హాజరు కాలేదు. సెలవు మంజూరు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. దీంతో ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలకు సీఎండీలుగా జె.శ్రీనివాసరావు, ఎన్.శ్రీధర్‌లను అదనపు బాధ్యతల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఉత్తర్వుల్లో ప్రభాకర్‌రావు సెలవుల పొడిగింపు అంశం ప్రస్తావించకపోవడంతో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ పదవుల్లో ఆయన కొనసాగుతారా? లేదా? అన్నది విద్యుత్ సౌధలో చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్‌రావు సీఎండీ పదవికి రాజీనామా చేసి ఉండవచ్చని చర్చ జరుగుతుండగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన కొనసాగుతారా? లేదా ? అన్న అంశంపై సీఎంఓ వర్గాలు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
విశాఖ స్టీల్ సీఎండీగా అతుల్ భట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ నియమితులయ్యారు. గతంలో ఆయన టాటా స్టీల్‌తో పాటు పలు స్టీల్ప్లాంట్లలో పనిచేశారు. ఈ నియామకంతో ఆయన విశాఖకు సీఎండీగా జులై 1 నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి -
విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ నూతన చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా మెకాన్ సీఎండీ అతుల్ భట్ ఎంపికయ్యారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్ మే 31న పదవీ విరమణ చేయడంతో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) ఆధ్వర్యంలో నూతన సీఎండి ఎంపిక కోసం శుక్రవారం న్యూఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో అతుల్ భట్ ఎంపికైనట్టు పీఈఎస్బీ వెబ్సైట్లో పొందుపరిచారు. 1986లో టాటా స్టీల్‌లో కెరీర్ ప్రారంభించిన భట్‌కు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్ధలో పనిచేసిన విశేష అనుభవం ఉంది. 2002 నుంచి 2007 వరకు ఇరాన్‌లోని మిట్టల్ స్టీల్‌లో కంట్రీ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. 2007 నుంచి 2008 వరకు లండన్‌లోని ఆర్సిలరీ మిట్టల్లో మెర్జర్స్, ఎక్విజిషన్స్ విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. 2009 నుంచి 2010 వరకు యూరప్‌లోని మెటలక్స్ వరల్డ్ సంస్థలో కమర్షియల్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 2016 నుంచి ప్రభుత్వ రంగ ‘మెకాన్’కు సీఎండిగా ఉన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ.18 వేల కోట్లు
విశాఖపట్టణం: విశాఖ స్టీల్‌ప్లాంట్ 2020–21లో రూ.18 వేల కోట్లు టర్నోవర్ సాధించింది. స్టీల్‌ప్లాంట్ ప్రారంభించిన నాటి నుంచి ఇదే రెండో అత్యధిక టర్నోవర్ కావడం విశేషం. గురువారం స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారుల వర్చువల్ సమావేశంలో సీఎండీ పి.కె.రథ్ గత ఏడాది ప్లాంట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ వ్యవధిలో 4.45 మిలియన్ టన్నులు అమ్మకాల ద్వారా 13 శాతం వృద్ధి సాధించామన్నారు. గత నాలుగు నెలల్లో రూ. 740 కోట్లు నికర లాభం సాధించామన్నారు. మార్చి నెలలో ఎన్నడూ లేని విధంగా 7.11 లక్షల టన్నులు అమ్మకాలతో రూ.3,300 కోట్లు టర్నోవర్ జరిగిందన్నారు. గత ఏడాది మార్చి నెలలో రూ. 2,329 కోట్లు అమ్మకాలు చేయగా ఈ ఏడాది 42 శాతం వృద్ధి సాధించడం జరిగిందన్నారు. 2020 డిసెంబర్ నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కంపెనీ ప్రగతికి ముఖ్య కారణమన్నారు. అదే విధంగా ఈ ఏడాది 1.3 మిలియన్ టన్నులు విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా గత ఏడాది కంటే 261 శాతం వృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా కోవిడ్–19 సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చిన రూ.5 కోట్లతో పాటు మొత్తం రూ.10 కోట్లు వ్యయం చేశామన్నారు. రాయబరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ఈ వారంలో ప్రారంభం కానుందన్నారు. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాల కోసం విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను ఆయన అభినందించారు. డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మొహంతి, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)కె.కె.ఘోష్, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె. సక్సేనా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) కె.వి.ఎన్. రెడ్డి పాల్గొన్నారు. -
టాటా మోటార్స్ కొత్త బాస్ ఎవరంటే?
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్ కొత్త బాస్‌ను ఎన్నుకుంది. ప్రస్తుత సీఎండీ పదవిని వీడనున్న తరుణంలో 2021 జూలై 1 నుండి మార్క్ లిస్టోసెల్లాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు టాటా మోటార్స్ శుక్రవారం (నిన్న) ప్రకటించింది. ప్రస్తుత ఎండీ, సీఈవో గుంటర్ బషెక్ స్థానంలో ఈ కొత్త నియామకం జరగింది. బషెక్ వ్యక్తిగత కారణాలతో జర్మనీకి మారనున్న సంగతి తెలిసిందే. మార్క్ నియామకంపై టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలో విస్తృతమైన కార్యాచరణ వాణిజ్య వాహనాల్లో అపార అనుభవం, నైపుణ్యంతో మార్క్ ఆటోమోటివ్ బిజినెస్ లీడర్‌గా ఉన్నారన్నారు. మార్క్ సారధ్యంలో సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తన నూతన బాధ్యతలపై మార్క్ స్పందిస్తూ భారత్‌తో తనకున్న అనుబంధంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమంటూ ఆనందాన్ని ప్రకటించారు. సంస్థ సామర్థ్యాన్ని సంయుక్తంగా మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. గతంలో మార్క్ ఫ్యుజో ట్రక్, బస్ కార్పొరేషన్ సీఈవోగా, డెమ్లర్ ట్రక్స్ ఆసియా హెడ్‌గా ఉన్నారు. 2016లో సీఎండీగా ఎంపికైన గుంటర్ బషెక్ నేతృత్వంలో టాటా మోటార్స్ దూసుకెళ్లింది.వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ చివరిలో జర్మనీకి మకాం మార్చాలని గుంటెర్ నిర్ణయించున్నారు. అయితే 2021, జూన్ 30 వరకు పదవిలో కొనసాగాలని టాటా బోర్డు చేసిన అభ్యర్థనను మన్నించారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కాగా కరోనా, లాక్డౌన్ సంక్షోభాలనుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న టాటా మోటార్స్ డిసెంబర్ త్రైమాసికంలో గత 33 త్రైమాసికాలలో లేని అత్యధిక లాభాలను గడించింది. వార్షిక ప్రాతిపదికన 67.2 శాతం పెరిగి 2,906 కోట్ల లాభాలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 5.5 శాతం పుజుకుని 75,654 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏడాది క్రితం ఇది 71,676 కోట్ల రూపాయలు. -
జీ మీడియాకు పునీత్ గోయెంకా రాజీనామా
సాక్షి, ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) సీఎండీ పునిత్ గోయెంకా జీ మీడియా నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ డైరెక్టర్ పదవికి గోయెంకా రాజీనామా చేశారని, తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని జీ మీడియా ఎక్స్ఛేంజ్ సమాచారంలో బుధవారం తెలిపింది. 2010 జనవరి నుంచి జీల్ ఎండీ గా ఉన్న గోయెంకా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర పెద్ద కుమారుడు. గోయెంకా జనవరి 1, 2010 నుండి జీ ఎంటర్టైన్మెట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరోవైపు జీ మీడియా కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 11.14 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ 86.66 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం 18.42 శాతం తగ్గి 138.15 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 169.35 కోట్లుగా ఉంది. మల్టీ బిలియన్ డాలర్ల ఎస్సెల్ గ్రూపులో జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ (గతంలో జీ న్యూస్ లిమిటెడ్) ఒకభాగం. -
కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజీనామా
కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్ట్ రామ్‌కుమార్ రామ్మూర్తి తన పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయం సీఈవో బ్రియాన్ హంప్రీస్ శుక్రవారం వెల్లడించారు. కాగ్నిజెంట్ ఇండియా కంపెనీలో రామ్మూర్తి సుమారు 23 ఏళ్లపాటు పనిచేశారు. ఈయన 2019లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి వందలాది మంది సీనియర్ ఉద్యోగులు కాగ్నిజెంట్ నుంచి వైదొలిగారు. ఇదే కంపెనీలో 24ఏళ్ల పాటు సేవలు అందించిన కాగ్నిజెంట్ గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే కూడా సెప్టెంబర్ 30న వైదొలగనున్నారు. ఆయన స్థానంలో యాక్సెంచర్ ఎగ్జిక్యూటివ్ ఆండీ స్టాఫోర్డ్‌ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ సమయంలో మీరు క్లయింట్ లకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచదేశాలకు మరిన్ని సేవలు అందిచాల్సిన బాధ్యత కాగ్నిజెంట్‌పై ఉంది. ఇప్పటికే సంస్థ అనేక దేశాల్లో సేవలందిస్తున్నది. ప్రపంచంలో తమ కంపెనీ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరిగింది’’ అని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో సీఈవో బ్రియాన్ పేర్కొన్నారు. ఇదే విధంగా రామ్మూర్తి కంపెనీకి అందించిన సేవలు మరువలేనివని, సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని బ్రియాన్ కొనియాడారు.