రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు
-
వ్యవసాయం, పరిశ్రమలకు సరిపడా కరెంట్‌ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించాలి
-
హరితహారంలో లక్షా 20వేల మొక్కలు నాటుతాం
-
జెన్‌కో, ట్రాన్స్‌క సీఎండి ప్రభాకర్‌రావు
జనగామ : స్వరాష్ట్రం సాధించుకోగానే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ విద్యుత్ వెలుగులతో నిండిపోయిందని జెన్‌కో, ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్‌రావు తెలిపారు. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) ఆధ్వర్యంలో శనివారం జనగామలో ని ర్వహించిన హరితహారం కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరై ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణతో కలిసి ఆయన మొక్కలు నా టారు. అనంతరం ప్రభాకర్‌రావు మాట్లాడు తూ రాష్ట్రం అవతరించిన తర్వాత వ్యవసాయానికి తొమ్మిది, గృహాలకు, పరిశ్రమలకు 24 గం టల విద్యుత్తు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల పా టు కోత విధిస్తూ పరిశ్రమలు మూతబడేలా చే శారన్నారు. చీకట్లు కమ్ముకుంటాయని ప్రచా రం చేసిన నాటి ఉమ్మడి రాజకీయ పార్టీలు నా ణ్యమైన విద్యుత్ సరఫరాను చూసి తలదించు కుంటున్నారన్నా రు. రైతులు వెంటనే అటోమేటిక్ స్టార్టర్లను తీసేయాలని సూచించారు. ఎన్పీడీసీఎల్ పరిధి లో లక్ష మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకో గా.. 20వేల మొక్కలు అదనంగా నాటామన్నా రు. విద్యుత్ తీగల కింద మొక్కలు నాట కుండా ముందే జాగ్రత్త తీసుకోవాలని, ఒక్కో సమయంలో లైన్ల కింద ఉన్న వృక్షాలను తొల గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జెన్‌కో డైరెక్టర్లు నర్సింగారావు, మోహన్‌రావు, సీజీఎంలు సదాలాల్, ఎస్‌ఈ శివరాం, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు సంధ్యారాణి, వేణుగోపాలాచారి, మధుసూధన్‌రావు, తిరుపతిరావు, అశోక్, మోహన్‌రావు, డీఈ రాంబా బు, ఏడీఈ రవి, ఏఈలు కనకయ్య, రవికుమార్ పాల్గొన్నారు.