venkat narayana
-
ఏ క్షణంలో.. ఏమి జరుగుతుందో..
అనుమసముద్రంపేట: వింజమూరు మండలంలోని చంద్రపడియలో ఉన్న వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రేడియంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రుల పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా ముగ్గురు విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో ఏఎస్‌పేట మండలానికి చెందిన ఇద్దరు కార్మికులు ఉన్నారు. మండలంలోని పెద్దబ్బీపురం గ్రామానికి రజనీకాంత్ చెన్నై ఆస్పత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రజనీకాత్ తండ్రి రమణయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం కాగా, తల్లి కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన రజనీకాంత్ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు చంద్రపడియలోని కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. రజనీకాంత్‌కు గతేడాది వివాహమైంది. అతని భార్య నిండు గర్భిణి. దీంతో ఈ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. నిలకడగా.. ఇదే మండలం చిన్నబ్బీపురం గ్రామానికి చెందిన భాస్కర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిది పేద కుటుంబం. భాస్కర్ తండ్రి వృద్ధాప్యంతో మంచానికే పరిమితం కాగా, భార్య కూలి పనులు చేసుకుంటూ కుటుంంబానికి ఆదరువుగా ఉంది. భాస్కర్ ఇటీవలే ఫ్యాక్టరీలో పనికి చేరాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 30 శాతానికి పైగా శరీరం కాలింది. -
కుటుంబ కలహాలతో ఇద్దరి ఆత్మహత్య
తలుపుల : మండల పరిధిలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు వెంకటనారాయణ(40) కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఓబులరెడ్డిపల్లికి చెందిన వెంకటనారాయణ తన అత్తగారి ఊరైన చెర్వుమోరపల్లి సమీప పొలాల్లో పరుగుల మందు తాగి ఇంటికి వచ్చారు. బంధువులు వైద్యసేవల నిమిత్తం కదిరికి, అక్కడి నుంచి అనంతపురం తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మరణించాడు. ఆయనకు భార్య రాధమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బెళుగుప్పలో మహిళ బెళుగుప్ప : మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కుటుంబ కలహాలతో లక్ష్మి(22) అనే మహిళ శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి రామాంజినేయులు ఫిర్యాదు మేరకు... రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన రామాంజినేయులు పెద్ద కూతురైన లక్ష్మిని ఆరు సంవత్సరాల క్రితం బెళుగుప్ప బీసీ కాలనీలోని శివకు ఇచ్చి వివాహం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో దినసరి కాంట్రాక్టు కార్మికుడిగా జీవనం సాగించే శివ కొంతకాలంగా జీతం సక్రమంగా ఇంట్లో ఇచ్చేవాడు కాదు. ఈ విషయమై వారి మధ్య వచ్చిన వివాదం ముదిరింది. శుక్రవారం సాయంత్రం గొడవ పెద్దదవడంతో లక్ష్మి మనస్థాపానికి గురైంది. ఆ రాత్రి చీర దూలానికి వేలాడదీసి ఉరి వేసుకుని మతి చెందింది. వీరికి నాలుగు సంవత్సరాల కుమారుడు, తొమ్మిది నెలల కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జి స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ విజయ్‌నాయక్, తహశీల్దార్ వెంకటాచలపతి శనివారం మతురాలి ఇంటికెళ్లి పరిశీలించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు
వ్యవసాయం, పరిశ్రమలకు సరిపడా కరెంట్ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించాలి హరితహారంలో లక్షా 20వేల మొక్కలు నాటుతాం జెన్కో, ట్రాన్స్క సీఎండి ప్రభాకర్‌రావు జనగామ : స్వరాష్ట్రం సాధించుకోగానే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ విద్యుత్ వెలుగులతో నిండిపోయిందని జెన్కో, ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్‌రావు తెలిపారు. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) ఆధ్వర్యంలో శనివారం జనగామలో ని ర్వహించిన హరితహారం కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరై ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణతో కలిసి ఆయన మొక్కలు నా టారు. అనంతరం ప్రభాకర్‌రావు మాట్లాడు తూ రాష్ట్రం అవతరించిన తర్వాత వ్యవసాయానికి తొమ్మిది, గృహాలకు, పరిశ్రమలకు 24 గం టల విద్యుత్తు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల పా టు కోత విధిస్తూ పరిశ్రమలు మూతబడేలా చే శారన్నారు. చీకట్లు కమ్ముకుంటాయని ప్రచా రం చేసిన నాటి ఉమ్మడి రాజకీయ పార్టీలు నా ణ్యమైన విద్యుత్ సరఫరాను చూసి తలదించు కుంటున్నారన్నా రు. రైతులు వెంటనే అటోమేటిక్ స్టార్టర్లను తీసేయాలని సూచించారు. ఎన్పీడీసీఎల్ పరిధి లో లక్ష మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకో గా.. 20వేల మొక్కలు అదనంగా నాటామన్నా రు. విద్యుత్ తీగల కింద మొక్కలు నాట కుండా ముందే జాగ్రత్త తీసుకోవాలని, ఒక్కో సమయంలో లైన్ల కింద ఉన్న వృక్షాలను తొల గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జెన్కో డైరెక్టర్లు నర్సింగారావు, మోహన్‌రావు, సీజీఎంలు సదాలాల్, ఎస్ఈ శివరాం, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు సంధ్యారాణి, వేణుగోపాలాచారి, మధుసూధన్‌రావు, తిరుపతిరావు, అశోక్, మోహన్‌రావు, డీఈ రాంబా బు, ఏడీఈ రవి, ఏఈలు కనకయ్య, రవికుమార్ పాల్గొన్నారు. -
తెలంగాణ సీఎం పేషీలో నియామకాలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో అధికారులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం అడిషనల్ పీఎస్‌గా వెంకట్ నారాయణ, అజిత్ కుమార్ రెడ్డి, పరమేశ్, ఓఎస్డీగా రషీద్ నియమితులయ్యారు. కాగా ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న స్మితా సబర్వాల్ తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓఎస్డీగా డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి నియామకం అయ్యారు. -
గ్రామసభల ద్వారా ప్రజల మెప్పు పొందండి
కోట, న్యూస్‌లైన్ : గ్రామసభల నిర్వహణలో రాజకీయాలు తావులేకుండా ప్రజాసమస్యలను పరిష్కరించి వారి మెప్పు పొందాలని కలెక్టర్ శ్రీకాంత్ అధికారులకు సూచించారు. మండలంలోని చిట్టేడులో ఆదివారం నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. సర్పంచ్ రాము అధ్యక్షతన జరిగిన సభలో మొత్తం 29 అంశాలపై చర్చించారు. విద్య, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, ఉపాధిహామీ పనులు, అంతర్గత రోడ్లు, బ్యాంక్ రుణాలు, వ్యవసాయం, వైద్యసేవలు, పక్కా ఇళ్ల నిర్మాణం తదితర సమస్యలపై అధికారుల సమక్షంలో ప్రజలు చేతులెత్తి అంగీకారం తెలిపి తీర్మానాలు చేశారు. చిట్టేడు పంచాయతీ పరిధిలో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, దానిని భూమిలేని నిరుపేదలకు పంచాలని కలెక్టర్ సమక్షంలో తీర్మానించారు. చిట్టేడు సమీపంలోని ఉన్న జీవీఆర్ రొయ్యల కర్మాగారం నుంచి కాలుష్యం వస్తుండటంతో ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారన్నారు. శ్మశానానికి దారి చూపాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. ఇక్కడ తీర్మానించిన ప్రతి అంశాన్ని మినిట్స్ బుక్‌లో నమోదు చేస్తామన్నారు. ఓటింగ్ ద్వారా మెజారిటీ ప్రజలు అమోదించిన తీర్మానాలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ మధుసూదన్‌రావు, ఎంపీడీఓ వెంకటనారాయణ, తహశీల్దార్ చెన్నయ్య, అన్ని శాఖల మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. అక్కడ వెలవెల మండలంలో ఆదివారం చిట్టేడు, ఊనుగుంటపాలెం,తిమ్మనాయుడుపాలెం గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి. చిట్టేడు గ్రామసభకు కలెక్టర్ హాజరవడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మిగతా చోట్ల గ్రామసభలు వెలవెలబోయాయి. తిమ్మనాయుడుపాలెం గ్రామసభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా అధికారులు రాకపోవడంతో 4 గంటలకు కూడా ప్రారంభం కాలేదు. దీంతో వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన స్థానికులు వెనుదిరిగారు. కార్యదర్శి రేణుకమ్మ తీరుపై ప్రజలు విమర్శలు గుప్పించారు. చివరకు ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో మొక్కుబడిగా గ్రామసభను నిర్వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.