తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో సోమవారం అధికారుల నియామకాలు జరిగాయి.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో అధికారులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం అడిషనల్ పీఎస్గా వెంకట్ నారాయణ, అజిత్ కుమార్ రెడ్డి, పరమేశ్, ఓఎస్డీగా రషీద్ నియమితులయ్యారు. కాగా ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్గా ఉన్న స్మితా సబర్వాల్ తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓఎస్డీగా డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి నియామకం అయ్యారు.