Additional Secretary
-
ఏపీ సీఎం అడిషనల్ సెక్రటరీగా కార్తికేయ మిశ్రా
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కార్తికేయ మిశ్రా కేంద్ర ఆర్థికశాఖలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన్ను ఏపీ సర్వీసుకు పంపించాలని సీఎం కేంద్రానికి లేఖ రాయగా, ఏపీ క్యాడర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకుంది. -
ప్రజా ప్రతినిధులకే కుచ్చుటోపి
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శినంటూ ప్రజా ప్రతినిధులనే మోసం చేస్తున్న ఘరానా మోసగాణ్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎస్ మట్టం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి/ దాసరి అనిల్ కుమార్ మై నేత.కామ్ వెబ్సైట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వారికి ఫోన్ చేసి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పరిచయం చేసుకునేవాడు. ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుందని, గ్రాంట్‌ను విడుదల చేయనుందని వివరించేవాడు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరేవాడు. నిజమేనని నమ్మిన ప్రజా ప్రతినిధులు బాలాజీ నాయుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేసేవారు. ఆ తర్వాతి నుంచి ఫోన్ స్విఛాఫ్ చేసేవాడు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. కొత్త ప్రభుత్వం రుణ పథకాన్ని ప్రారంభిస్తుందని, తనతో పాటు వంద మంది సభ్యులు పాల్గొనాల్సి ఉంటుందని సూచించాడు. నిజమేనని నమ్మిన సదరు శాసనసభ సభ్యుడు రూ.3.60 లక్షలు నిందితుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. నగదు విత్‌డ్రా చేసిన తర్వాత నిందితుడు కాల్స్ చేయడం మానేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన ఎమ్మెల్యే సూచన మేరకు తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు బాలాజీని అరెస్టు చేశారు.లంచం కేసులో దొరికే, జాబ్ పోయే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు 2008లో రామగుండంలోని ఎనీ్టపీసీలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు. చేరిన ఏడాది కాలంలోనే 2009 ఫిబ్రవరిలో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటుండగా.. సీబీఐ చేతికి చిక్కాడు. దీంతో బాలాజీని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించారు. దీంతో ఎనీ్టపీసీ సంస్థ బాలాజీని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. జైలు నుంచి బయటికి వచ్చిన కొంత కాలం తర్వాత బాలాజీ మళ్లీ విశాఖ పరవాడ సింహాద్రీ పవర్ ప్లాంట్‌లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. కానీ, అతని ప్రవృత్తిలో మార్పు రాకపోవడంతో 2009లో అతన్ని సరీ్వస్ నుంచి తొలగించారు. ఇక అక్కడ్నుంచి మోసాలకు పాల్పడటే వృత్తిగా ఎంచుకున్నాడు. బాలాజీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 37 కేసులున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతని చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. -
గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోతుల కన్నుమూత
సాక్షి, గోపాలపురం: జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోతుల రామతిరుపతిరెడ్డి (72) శుక్రవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతిచెందారు. సీనియర్ నాయకుడిగా పార్టీలకతీతంగా అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా గుర్తింపు ఉన్న తిరుపతిరెడ్డి మృతిచెందిన వార్తను ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో పెద్దాయనగా గుర్తింపు కలిగిన వ్యక్తిగా, పార్టీలో తగిన ప్రాధాన్యం ఉన్న వ్యక్తిగా తిరుపతిరెడ్డికి పేరుంది. ఈయన మృతిపట్ల గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుపతిరెడ్డి నివాసానికి చేరుకుని ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. -
జీఎస్టీ కౌన్సిల్ అదనపుకార్యదర్శిగా అరుణ్ గోయల్
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ అదనపు కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి అరుణ్ గోయల్ నియమితులయ్యారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలుకోసం కొత్తగా సృష్టించిన కౌన్సిల్ అడిషనల్ సెక్రటరీ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందనీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గోయల్, కేంద్ర పాలిత ప్రాంతాలు కేడర్‌కు కు చెందిన 1985 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. చెందిన ప్రస్తుత ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ లో పని అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో కౌన్సిల్ పన్ను రేటు, మినహాయింపు వస్తువులు మరియు ప్రారంభ పరిమితిని నిర్ణయించడంక తప్పనిసరి. ఏకీకృత పన్ను వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన జీఎస్టీ అమలు కోసం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కౌన్సిల్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ సీఎం పేషీలో నియామకాలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో అధికారులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం అడిషనల్ పీఎస్‌గా వెంకట్ నారాయణ, అజిత్ కుమార్ రెడ్డి, పరమేశ్, ఓఎస్డీగా రషీద్ నియమితులయ్యారు. కాగా ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న స్మితా సబర్వాల్ తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓఎస్డీగా డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి నియామకం అయ్యారు. -
బాధ్యతలు స్వీకరించిన స్మిత సబర్వాల్
హైదరాబాద్ : మెదక్ జిల్లా కలెక్టర్ స్మిత సబర్వాల్ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అనంతరం ఆమె సీఎం అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలన వ్యవహారాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న స్మిత సబర్వాల్ రెండుసార్లు ఉత్తమ కలెక్టర్‌గా అవార్డులు అందుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయండి.. నానో కారు గెలుచుకోండి అంటూ వినూత్న తరహా ప్రచారం చేపట్టి ఓటు శాతాన్ని పెంచి సంచలనం సష్టించారు. లాటరీలో గెలుపొందిన లచ్చవ్మ అనే మహిళకు నానో కారు బహుకరించారు. కాగా స్మితసబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
సీఎం పేషీలోకి స్మితా సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేషీలో ఐఏఎస్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు తొలి పోస్టింగ్ లభించింది. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించి నాలుగు రోజులవుతున్నా.. ఇప్పటి వరకు పేషీలో ఎవరూ లేరు. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నర్సింగ్రావును నియమించాలని నిర్ణయించినా.. ఆయన కేంద్ర సర్వీసుల నుంచి ఇంకా రాలేదు. అలాగే మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి, హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న గోపాలరెడ్డి కూడా ఇంకా రిలీవ్ కాలేదు. నాలుగు రోజులుగా కేసీఆర్ తన కార్యాలయానికి రోజూ వస్తున్నా.. ఆయనకు అవసరమైన సమాచారాన్ని బ్రీఫింగ్ చేసే యంత్రాంగం ఏదీ ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు మెదక్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. సీసీఎల్ఏగా రాజీవ్‌శర్మ: తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.